
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇది ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే పాక్ కాల్పుల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.
గత నాలుగు రోజుల్లో పూంచ్, రాజౌరి, జమ్మూ, బారాముల్లా సెక్టార్లలో 19 మంది గ్రామస్తులు మరణించారు. బుధవారం పూంచ్‌లో 12 మంది పౌరులు మరణించగా.. శుక్రవారం ఉరి, పూంచ్‌లో మరో ఇద్దరు మరణించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారితో సహా మరో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఘర్షణ సమయంలో జరిగిన అగ్నిప్రమాదాల వల్ల జరిగిన విస్తృతమైన నష్టాన్ని ఎత్తిచూపుతూ, నష్ట అంచనాలను ఖరారు చేయవలసిన ఆవశ్యకతను అబ్దుల్లా నొక్కి చెప్పారు. ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడం ప్రారంభించడానికి వీలుగా వెంటనే తుది సర్వేలు నిర్వహించి నివేదికలు పంపాలని డీసీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మా విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేయడం జరిగింది. కాల్పుల విరమణ తర్వాత అది తిరిగి ప్రారంభమవుతుందని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
#WATCH | On the India- Pakistan ceasefire agreement, Jammu and Kashmir CM Omar Abdullah says, "I welcome the ceasefire. If it had happened 2-3 days ago, the lives we lost would not have been lost. Pakistan's DGMO called our DGMO and the ceasefire was implemented. It is the… pic.twitter.com/uXxlTfnRzJ
— ANI (@ANI) May 10, 2025
కాల్పుల విరమణ
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విమరణ అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విమరణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు. పాకిస్తాన్ అభ్యర్థనతో.. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు చెప్పారు. కాగా ఎల్లుండి (సోమవారం, మే 12) మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల మిలటరీ జనరల్స్ మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.