మోజ్తాబా ఖమేనీ లేఖ విడుదల.. ఏమన్నారంటే? | Mojtaba new message days after trump Claim | Sakshi
Sakshi News home page

మోజ్తాబా ఖమేనీ లేఖ విడుదల.. ఏమన్నారంటే?

Mar 30 2026 4:50 AM | Updated on Mar 30 2026 10:33 AM

 Mojtaba  new message days after trump Claim

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మోజ్తబా ఖమేనీ కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా చేస్తున్న దురాక్రమణ ఖండించి ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన పేరుతో ఒక లేఖ విడుదల చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ బ్రతికి ఉన్నారో లేదో తెలియదు అని అన్నారు. అమెరికా జరిపిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చు అని తెలిపారు. ఈ నేపథ్యంలో మోజ్తాబా ఖమేనీ ఇరాక్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు.

ఆ లేఖలో " అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో మా  దేశానికి మద్దతుగా నిలిచిన ఇరాక్ మత గురువు గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అలాగే ఇరాక్ ప్రజలకు ధన్యవాదాలు". అని లేఖలో పేర్కొన్నారు.  ఇరాన్‌పై జరుగుతున్న దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఇరాక్ స్పష్టమైన స్టాండ్ తీసుకోవడాన్ని అభినందించారు.

కాగా ఆయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ మూడవ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకూ  మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన కేవలం కొన్ని రాతపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేశారు. గతంలో జరిగిన వైమానిక దాడిలో ఆయన గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది.

 

Advertisement
 
Advertisement
Advertisement