ఖమేనీ అంత్యక్రియలకు భారీగా ఏర్పాట్లు | Iran prepares massive multicity funeral for Khamenei | Sakshi
Sakshi News home page

ఖమేనీ అంత్యక్రియలకు భారీగా ఏర్పాట్లు

Jul 4 2026 5:53 AM | Updated on Jul 4 2026 5:53 AM

Iran prepares massive multicity funeral for Khamenei

టెహ్రాన్‌: దివంగత సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను నిర్వహించేందుకు ఇరాన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. 86 ఏళ్ల మత పెద్ద మరణానికి దారితీసిన విధ్వంసకర యుద్ధం తర్వాత, దేశం కోసం ప్రజలంతా ఏకమవ్వాలని కోరుతూ టెహ్రాన్‌ అంతటా బ్యానర్లు వెలిశాయి. శనివారం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా జనం తరలివస్తారని భావిస్తున్నారు. 1989లో అప్పటి నేత అయతొల్లా రుహొల్లా ఖమేనీ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

టెహ్రాన్‌లోని గ్రాండ్‌ మొసల్లా వేదికపై ఖమేనీ భౌతిక కాయం ఉంచిన శవపేటికతోపాటు ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా జరిపిన బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబసభ్యుల మృతదేహాల శవపేటికలను కూడా అక్కడుంచారు. బాంబుదాడిలో ఖమేనీ అల్లుడు, ఆయన పెద్ద కుమార్తె, 14 నెలల మనవరాలు, ప్రస్తుతం సుప్రీం నేత మొజ్తబా భార్య చనిపోయారు. శుక్రవారం ఖమేనీ శవపేటిక వద్ద నివాళులరి్పంచిన ఇరాన్‌ నేతల్లో పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ ఘలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తదితరులున్నారు.

ఈకార్యక్రమాల్లో ఇరాన్‌ టాప్‌ సైనిక నేత జనరల్‌ అహ్మద్‌ వాహిది కూడా పాల్గొన్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి, అంటే యుద్ధం ప్రారంభంకాక ముందు నుంచే ఆయన ఎవరికీ కనిపించకుండాపోయారని పరిశీలకులు అంటున్నారు. కొత్త నేత మొజ్తబాకు ఆయన్ను అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. చర్చల్లో ఇరాన్‌ పైచేయి సాధించడంలో వాహిది కీలకమని చెబుతున్నారు. 5, 6, 7వ తేదీల్లో టెహ్రాన్, ఖోమ్‌ల్లో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయి. 9వ తేదీన ఖమేనీ సొంతూరు మషాద్‌లో ఖననం చేయనున్నారు.

నివాళులరి్పంచిన భారత ప్రతినిధులు
ఇరాన్‌ సుప్రీంనేత అయతొల్లా ఖమేనీకి భారత ప్రతినిధులు శుక్రవారం టెహ్రాన్‌లో నివాళుల     రి్పంచారు. బిహార్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌(రిటైర్డు) సయ్యద్‌ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్ఘెరిటా ఉన్నారు. వేరుగా కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ కూడా నివాళులర్పించారు. అదేవిధంగా, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, ఆర్మీ చీఫ్‌ మునీర్‌ కూడా ఖమేనీకి టెహ్రాన్‌లో నివాళులరి్పంచారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement