మోజ్తాబా ఉంది అక్కడే? రష్యా సంచలన ప్రకటన | mojtaba Khamenei Russian envoy clears the air on iran supreme | Sakshi
Sakshi News home page

మోజ్తాబా ఉంది అక్కడే? రష్యా సంచలన ప్రకటన

Apr 1 2026 4:45 AM | Updated on Apr 1 2026 12:23 PM

 mojtaba  Khamenei Russian envoy clears the air on iran supreme

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ జాడపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కనిపించకపోవడం సైతం దానికి ఒక కారణం. ఈ నేపథ్యంలోనే రష్యా సైతం ఆయన ఆచూకీపై స్పందించింది. మోజ్తాబా ఎక్కడ ఉన్నారో ఇరాన్‌లోని రష్యా రాయబారి స్పష్టతనిచ్చారు.

మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం అమెరికా దాడుల్లో మోజ్తాబా తీవ్రంగా గాయపడి ఉండవచ్చునని అన్నారు. ఆయన అసలు బ్రతికున్నారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మోజ్తాబా రష్యాలో తలదాచుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దానిపై రష్యా స్పందించింది.

రష్యా రాయబారి స్థానిక మీడియాతో మాట్లాడుతూ " మొజ్తాబా ఖమేనీ దేశంలోనే ఉన్నారు, అయితే అర్థం చేసుకోదగిన కారణాల వల్ల బహిరంగంగా కనిపించడం మానుకుంటున్నారు" అని అన్నారు. యుద్ధంలో గాయపడిన ఖమేనీకి చికిత్స అందించేందుకు ఆయనను రష్యాకు విమానంలో తరలించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆయన తేల్చిచెప్పారు. 


కాగా అమెరికా-ఇరాన్ యుద్ధంలో రష్యా పాత్రను కూడా అమెరికా పర్యవేక్షిస్తోందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం ఒక ప్రకటనలో  తెలిపారు. ఇరాన్‌కు సహాయం చేస్తోందన్న వార్తలను మాస్కో ఖండించినప్పటికీ, హెగ్సెత్ ఇలా అన్నారు కాగా యుద్ధం మెుదలై నెల రోజులు గడిచింది. అయినప్పటికీ ఇరు వర్గాలు ఏ మాత్రం తగ్గడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement