ఖమేనీ విషయంలో కీలక ప్రకటన | us iran war live is mojtaba khamenei alive marco rubios | Sakshi
Sakshi News home page

ఖమేనీ విషయంలో కీలక ప్రకటన

Jun 2 2026 10:58 PM | Updated on Jun 2 2026 11:26 PM

us iran war live is mojtaba khamenei alive marco rubios

టెహ్రాన్‌: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  దేశాధినేత ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో  వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యవహారాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.

ఇరాన్ సుప్రీం లీడర్‌ విషయంలో ఆరోగ్యం విషయంలో తీవ్ర సందిగ్ధత నడుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కోమాలో ఉన్నారని ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా  విదేశాంగ శాఖ మంత్రి కీలక వాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మాట్లాడుతూ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత చురుగ్గా నిమగ్నమవుతున్నారని తెలిపారు. ఆ మేరకై ఆయనకు కొన్ని సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అదే దాడిలో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం, కొడుకు గాయపడటంతో ఇరాన్ నాయకత్వంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవగా, వాటన్నింటికీ తెరదించుతూ మొజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని అమెరికా ఇప్పుడు స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement