ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ చేయని ఒకేఒక్క ‘తప్పు’ ఇదే.. | One mistake Trump hasnt made on Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ చేయని ఒకేఒక్క ‘తప్పు’ ఇదే..

Aug 6 2026 3:15 PM | Updated on Aug 6 2026 3:24 PM

One mistake Trump hasnt made on Iran

టెహ్రాన్‌: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరించినప్పటికీ ప్రస్తుత చిక్కు నుంచి బయటపడే మార్గం కనుక్కోలేకపోతున్నారు. ఇరాన్‌పై ట్రంప్‌ దాడులు చేయిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక పొరపాటును మాత్రం చేయలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అదే తన సామర్థ్యాన్ని దాటి ఘర్షణను అతి భారీ స్థాయికి తీసుకెళ్లకపోవడం. ఇరాన్‌పై పరిమిత దాడిని పూర్తి స్థాయి, అతి దీర్ఘకాల యుద్ధంగా మార్చలేదు ట్రంప్‌.

ట్రంప్‌ ఈ యుద్ధాన్ని పూర్తిస్థాయి భూతల యుద్ధంగా మార్చలేదు. తన ప్రతిష్ఠను కాపాడుకోవాలనే ఉద్దేశాలకు దూరంగానే ఉండి, అదనపు భారీ సైనిక చర్యలకు వెళ్లలేదు. అప్పట్లో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్థాన్ యుద్ధాల్లో అమెరికా మాజీ అధ్యక్షులు ఓటమిని అంగీకరించకుండా యుద్ధాన్ని నిరంతరం పెంచుకుంటూ వెళ్లారు. ట్రంప్‌ మాత్రం అటువంటి పని చేయడం లేదు.

మొదట ట్రంప్ చేసిన పెద్ద పొరపాటు యుద్ధంలోకి వెళ్లడమే కావొచ్చు. కానీ, ఇప్పటివరకు ఆయన చేయని ఒక ప్రమాదకరమైన తప్పు ఏమిటంటే యుద్ధాన్ని తన నియంత్రణ దాటేలా భారీగా విస్తరించకపోవడమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు లిండన్ బి. జాన్సన్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ డబ్ల్యూ బుష్ వారు చేసిన యుద్ధాలను మొదట పరిమిత సైనిక చర్యలతో ప్రారంభించి, తర్వాత క్రమంగా పెద్ద యుద్ధాల్లో చిక్కుకున్నారు. ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత వెనక్కి తగ్గడం కష్టమై, వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనినే slippery slope (చిన్న నిర్ణయం క్రమంగా పెద్ద సమస్యగా మారే పరిస్థితి) అంటారు.

సమీప భవిష్యత‍్తులో ఆ తప్పు చేస్తారా?
ట్రంప్ ఆ తప్పును ఇంకా చేయలేదు. కానీ, సమీప భవిష్యత్తులో ఇరాన్ యుద్ధాన్ని విస్తరిస్తే గత అధ్యక్షులలాగే అదే ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. చరిత్ర ఏమి చెబుతుందంటే, బయటపడే మార్గం వెతుకుతూ లేదా తమ ప్రతిష్ఠను, అమెరికా ప్రతిష్ఠను కాపాడాలనే ప్రయత్నంలో యుద్ధాలను తీవ్రతరం చేసిన అధ్యక్షులు ప్రమాదకర మార్గంలో జారిపోయారు.

ఒకసారి గీత దాటితే వెనక్కి తిరగలేని కీలక నిర్ణయాత్మక దశకు ట్రంప్‌ చేరుకుంటారా? అన్నదే సందేహాత్మకంగా ఉంది. ట్రంప్‌ ముందున్న మరో మార్గం నష్టాలను అంగీకరించి, ప్రధాన లక్ష్యాలు నెరవేరకపోయినా ఈ ఘర్షణ నుంచి వైదొలగడమే మంచిదని ఒప్పుకోవడం.

ట్రంప్‌ గెలవలేని, ఓడిపోలేని యుద్ధంలో చిక్కుకుపోయారు. అమెరికా ప్రభుత్వం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇరాన్‌ను ఎలా శిక్షించాలనే కొత్త ఐడియాలు ఇవ్వాలని పెంటగాన్ సైనిక విశ్లేషకుల బృందాన్ని కోరిందని అమెరికా మీడియా తెలిపింది. ఒకవేళ ట్రంప్‌ పూర్తిస్థాయి యుద్ధం చేయిస్తే పరిణామాలు అతి ఘోరంగా ఉంటాయి.

ఇరాన్‌కు హెచ్చరికల మీద హెచ్చరికలు
ఇరాన్ తన తాజా ప్రయత్నాన్ని తిరస్కరించిన తర్వాత ఇటీవల ట్రంప్ అసహనం ట్రూత్ సోషల్ ఖాతాలో.. ‘‘ఒప్పందం త్వరలో కుదిరే అవకాశం ఉంది’’ అని చెప్పారు. “ఇరాన్ నాయకత్వం నమ్మశక్యంకానంత మోసపూరితంగా ఉంది” అని కూడా ట్రంప్ ప్రకటించారు. బలవంతపు దౌత్యంపై ఇస్లామిక్ రిపబ్లిక్ చేసే విమర్శలనే ఆయన వ్యంగ్యంగా ప్రతిధ్వనించినట్టైంది. ఆ తర్వాత   ఆయన మళ్లీ మరో హెచ్చరిక చేశారు. “ఒప్పందంపై సంతకం చేయడానికి వారికి ఇదే చివరి అవకాశం” అని ఓవల్ ఆఫీస్‌లో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement