వికాస్‌, అభిరథ్‌ విధ్వంసం.. హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ | TG20 League 2026: Hyderabad E Champions beat Medak Falcons by 46 runs | Sakshi
Sakshi News home page

వికాస్‌, అభిరథ్‌ విధ్వంసం.. హైదరాబాద్‌ హ్యాట్రిక్‌

Jun 27 2026 6:12 PM | Updated on Jun 27 2026 6:19 PM

TG20 League 2026: Hyderabad E Champions beat Medak Falcons by 46 runs

టీజీ20 లీగ్‌ 2026లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం​ సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు అభిరథ్‌ రెడ్డి (59), వికాస్‌ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో గడుగు గణేశ్‌ (22 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మెదక్‌ బౌలరల్లో విక్రమ్‌ నాయక్‌, ఘాజీ అబ్బాస్‌ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్‌, కార్తీకేయ, రవితేజ, అశ్విన్‌ రామ్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనను మెదక్‌ కూడా ధీటుగానే ప్రారంభించినప్పటికీ.. 12వ ఓవర్‌ తర్వాత ‍స్వల్ప విరామాల్లో 6 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. అజయ్‌ దేవ్‌ గౌడ్‌ (4-0-20-4), ప్రణవ్‌ వర్మ (4-0-35-2) అద్భుతంగా బౌలింగ్‌ చేసి మెదక్‌కు దెబ్బకొట్టారు. శ్రీనికేత్‌, నితన్‌ నాయక్‌ తలో వికెట్‌ తీశారు. 

మెదక్‌ బ్యాటర్లలో విక్రమ్‌ నాయక్‌ (75) ఒంటరిపోరాటం చేశాడు. వరుణ్‌ యెర్రమ్‌ (38), రవితేజ (31), ఇషాన్‌ శర్మ (27) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో హైదారాబాద్‌ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకొని పాయింట్ల పట్టికలో సోలోగా అగ్రస్థానంలో నిలిచింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement