తనయ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. రంగారెడ్డి ఘన విజయం | TG 20: Ranga Reddy Risers Won by 5 wickets | Sakshi
Sakshi News home page

TG 20: తనయ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. రంగారెడ్డి ఘన విజయం

Jun 22 2026 6:20 PM | Updated on Jun 23 2026 12:49 PM

TG 20: Ranga Reddy Risers Won by 5 wickets

PC: TG20 X

తెలంగాణ టీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజ‌ర్స్ శుభారంభం చేసింది. సోమ‌వారం ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా అనురాగ్ నల్గొండ నైట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజ‌యం సాధించింది. 

నల్గొండ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఊదిపడేసింది.  రైజర్స్ కెప్టెన్‌ తన్మయ్‌ త్యాగరాజన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 

అతడితో పాటు ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేశాడు. నల్గొండ బౌలర్లలో వరుణ్‌ గౌడ్‌, అనికేత్‌ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్‌ సాయి యాదవ్‌ చెరో రెండు, కెప్టెన్‌ తనయ్‌ త్యాగరాజన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement