ఖమ్మంపై హైదరాబాద్‌ ఇ-చాంపియన్స్‌ విజయం | Hyderabad-E-Champions won-by-56 runs Vs-Khammam Aces | Sakshi
Sakshi News home page

ఖమ్మంపై హైదరాబాద్‌ ఇ-చాంపియన్స్‌ విజయం

Jun 29 2026 10:52 PM | Updated on Jun 29 2026 11:33 PM

Hyderabad-E-Champions won-by-56 runs Vs-Khammam Aces

టీజీ20 లీగ్‌లో భాగంగా సోమ‌వారం ఉప్ప‌ల్ వేదికగా అన్వితా ఖ‌మ్మం ఏసెస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ ఇ-చాంప్స్ 56 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. టోర్నీలో వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న హైద‌రాబాద్ ఇ-చాంప్స్ పట్టిక‌లో అగ్ర‌స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. 

212 ప‌రుగుల భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన అన్వితా ఖ‌మ్మం జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. కొడిదెల హిమ‌తేజ (64) అర్ధ‌సెంచ‌రీ మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో శ్రీనికేత్ మూడు వికెట్లు తీయ‌గా, అజ‌య్ దేవ్‌గౌడ్‌, ష‌ణ్ముక అశ్విన్‌, అన్విత్ రెడ్డి త‌లా ఒక వికెట్ తీశారు. 

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ ఇ-చాంప్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 211  ప‌రుగులు చేసింది. కెప్టెన్ అభిర‌త్ రెడ్డి (59) హ‌ఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా, గుడుగు గ‌ణేశ్ (21 బంతుల్లో 44) రాణించాడు. అన్వితా ఖ‌మ్మం బౌల‌ర్ల‌లో వేద్ రెడ్డి, స‌హేంద్ర మ‌లు, సాకేత్ దాత్ర‌క్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement