హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ టీ20 లీగ్ (TG20) తొలి సీజన్ అట్టహాసంగా మొదలైంది.
ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీ టీ20 లీగ్ మంచి అవకాశమని ఈ సందర్భంగా విక్రమార్క పేర్కొన్నారు.
టీజీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.
సంగీత దర్శకుడు తమన్ తన మ్యూజికల్ పెర్ఫార్మెన్స్‌తో స్టేడియంలో జోష్ నింపారు. ఉర్రూతలూగించే పాటలతో సాగిన డిజిటల్ లేజర్ షో,. సాంస్కృతిక ప్రదర్శనలు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశాయి.


