రంగారెడ్డి రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన కరీంనగర్‌ | TG20 2026: Karimnagar Diamonds won by 58 runs | Sakshi
Sakshi News home page

TG20 2026: రంగారెడ్డి రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన కరీంనగర్‌

Jul 2 2026 5:48 PM | Updated on Jul 2 2026 5:59 PM

TG20 2026: Karimnagar Diamonds won by 58 runs

తెలంగాణ ప్రీమియ‌ర్ లీగ్‌-2026లో క‌రీంన‌గ‌ర్ హ్యాట్రిక్ విజ‌యాల‌ను న‌మోదు చేసింది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో రంగారెడ్డి రైజ‌ర్స్‌ను 58 ప‌రుగుల తేడాతో క‌రీంన‌గ‌ర్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క‌రీంన‌గ‌ర్ నిర్ణీత  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

మరోసారి వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రాహుల్‌ రాదేష్‌(37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు హెచ్‌కే సింహా(60), చందన్‌ సహనీ(7 బంతుల్లో 17) రాణించారు. రంగారెడ్డి బౌలర్లలో తన్మయ్‌ జడ్డూ రెండు, త్యాగరాజన్‌, నితిన్‌ తలా వికెట్ సాధించారు. 

అనంతరం 231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఆధిత్య జవ్వాజీ(48), కరియప్ప(30) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్‌ స్పిన్నర్‌ నారయణ తేజ మూడు వికెట్లు పడగొట్టగా.. శుభమ్‌ శర్మ, దినేష్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement