తెలంగాణ ప్రీమియర్ లీగ్-2026లో మరో సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో రాదేశ్ తన విరోచిత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెదక్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు.


