ఉత్కంఠ‌పోరులో ఖ‌మ్మం ఏసెస్‌దే గెలుపు | TG20 League-Khammam Aces Won By 8 Runs Thrilling Match Vs Karimnagar | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ‌పోరులో ఖ‌మ్మం ఏసెస్‌దే గెలుపు

Jun 26 2026 11:08 PM | Updated on Jun 26 2026 11:44 PM

TG20 League-Khammam Aces Won By 8 Runs Thrilling Match Vs Karimnagar

టీజీ20 లీగ్‌లో మ‌రో ఉత్కంఠ‌భ‌రిత పోరుకు వేదికైంది. శుక్ర‌వారం క‌రీంన‌గ‌ర్ డైమండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్‌ 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆద్యంతం థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో 214 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన క‌రీంన‌గ‌ర్ డైమండ్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల నష్టానికి 207 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ సాత్విక్ రెడ్డి (63) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, చివ‌ర్లో శుభ‌మ్ శ‌ర్మ (54 నాటౌట్‌) ఆఖ‌రి వ‌ర‌కు నిలిచిన‌ప్ప‌టికీ గెలిపించలేకపోయాడు. ఖ‌మ్మం ఏసెస్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ సీవీ మిలింద్ 4 వికెట్లతో చెల‌రేగ‌గా, సాహేంద్ర మ‌ల్లు రెండు వికెట్లు తీయ‌గా, వాఫీ క‌చ్చీ, వేద్ రెడ్డి చెరొక వికెట్ తీశారు.

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన‌ అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (30 బంతుల్లో 55 నాటౌట్‌) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్‌కే రెడ్డి (43) రాణించాడు. ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఖమ్మం ఏసెస్ 200 పరుగులు మార్క్‌ను దాటింది. ఆఖర్లో జైస్వాల్ ‍కూడా భారీ సిక్సర్లు బాది భారీ స్కోరుకు బాటలు వేశాడు. కరీంనగర్ డైమ​ండ్స్ బౌలర్లలో హరీష్ ఠాకూర్ 3 వికెట్లు, రత్లావత్‌, ఆశిష్‌, నారాయణ తేజ తలా ఒక వికెట్ తీశారు.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement