కరీంనగర్‌పై నల్గొండ గెలుపు
టీజీ20 లీగ్ 2026లో నల్గొండ నైట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్ 24) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కరీంనగర్ డైమండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో).
లక్ష్యం దిశగా సాగుతున్న నల్గొండ
వరుణుడు అంతరాయం కలిగించడంతో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. 10 ఓవర్ల తర్వాత నల్గొండ స్కోర్ 76-3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే మరో 42 బంతుల్లో 41 పరుగులు చేయాలి.
చెలరేగిన రక్షణ్, వరుణ్.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన కరీంనగర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు.. నల్గొండ బౌలర్లు వరున్ గౌడ్ (2-0-8-3), రక్షణ్ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ్ ఖాన్ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. షరన్ (15), షుభమ్ శర్మ (20), హరిశ్ ఠాకూర్ (21) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
కష్టాల్లో కరీంనగర్
వర్షం అంతరాయం తర్వాత మ్యాచ్ తిరిగి మొదలైంది. వర్షానికి ముందే 9వ ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. అదే ఓవర్ చివరి బంతికి, మరుసటి ఓవర్ తొలి బంతికి మరో రెండు వికెట్లు కోల్పోయింది.
ఆతర్వాత 14 ఓవర్ వరకు జాగ్రత్తగా ఆడిన కరీంనగర్.. 15వ ఓవర్ మూడో బంతికి మరో వికెట్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. రక్షణ్ రెడ్డి బౌలింగ్‌లో షుభమ్ శర్మ (20) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 102-6గా ఉంది.
ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన కరీంనగర్
కరీంనగర్ జట్టు 9వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. వరుణ్ గౌడ్ బౌలింగ్‌లో తొలుత సాత్విక్ రెడ్డి (1), ఆతర్వాత షరణ్ (15) ఔటయ్యారు.
తొలి వికెట్ కోల్పోయిన కరీంనగర్.. 8 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?
7.1వ ఓవర్- 61 పరుగుల వద్ద కరీంనగర్ తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న తన్మయ్ అగర్వాల్ (46) అర్ఫాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 62-1గా ఉంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నల్గొండ
టీజీ20 లీగ్ 2026లో భాగంగా ఇవాళ (జూన్ 23) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నల్గొండ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
నల్గొండ నైట్స్:రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, అనికేత్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను.
కరీంనగర్ డైమండ్స్:తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), సాయి శరణ్ రావూరి, సాత్విక్ రెడ్డి, రాహుల్ రాదేశ్, చందన్ సహాని, నారాయణ తేజ టీవీఎస్, హరీశ్ ఠాకూర్, శుభమ్ శర్మ, సతీశ్ కుమార్, ఆశిష్ శ్రీవాస్తవ్, దినేశ్ రాథోడ్


