తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)-2026లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి రైజర్స్- హైదరాబాద్ ఇ- చాంపియన్స్ గురువారం ఉప్పల్ వేదికగా తలపడుతున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా... రంగారెడ్డి రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది.
రంగారెడ్డి స్కోరెంతంటే?
ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ 35 పరుగులు చేయగా.. అవనీశ్ రావు మెరుపు అర్ధ శతకం (29 బంతుల్లో 53) సాధించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఆదిత్య జవ్వాజి సైతం హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 58) చేయగా.. త్యాగరాజన్ 22 బంతుల్లో 31 పరుగులు సాధించాడు.
మిగిలిన వారిలో సాయి యాదవ్ (10 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రంగారెడ్డి నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.
అభిరథ్ రెడ్డి ధనాధన్
లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ ఆదిలోనే ఓపెనర్ వికాస్ రెడ్డి (3).. వన్‌డౌన్ బ్యాటర్ అన్విత్ రెడ్డి (4) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్, కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదిన అభిరథ్ రెడ్డి.. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. రంగారెడ్డి కెప్టెన్ తనయ్ త్యాగరాజన బౌలింగ్‌లో హితేశ్‌కు మ్యాచ్ ఇచ్చి 99 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మిగిలిన వారిలో షణ్ముఖ 30, గణేశ్ 25, యశ్‌వీర్ 30 పరుగులతో రాణించారు.
ఫలితంగా 18 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. కాగా సీజన్‌లో రంగారెడ్డికి ఇది తొలి ఓటమి కాగా.. హైదరాబాద్‌కు రెండో గెలుపు
సంక్షిప్త స్కోర్లు
రంగారెడ్డి- 195/4
హైదరాబాద్- 198/4 (18)
ఫలితం- ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపు
తుదిజట్లు
రంగారెడ్డి
అవనీశ్ రావు అరవెల్లి (వికెట్ కీపర్), తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, అలంకృత్ రాపోల్, జ్ఞానప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, రాకేశ్, అరుణ్ కుమార్, పున్నయ్య భువనగిరి, ఆర్యన్ కరియప్ప.
హైదరాబాద్
అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్‌గౌడ్, అభిరథ్ రెడ్డి (కెప్టెన్), గణేశ్ గడుగు, సాయి వికాస్ రెడ్డి, ప్రణవ్ శర్మ, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, అఖిల్ రాథోడ్, యశ్‌వీర్ గౌడ్.


