మెదక్‌ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్‌ గెలుపు | T20 League 2026: Pranav Rangareddy Risers vs Medak Falcons Match Updates and Highlights | Sakshi
Sakshi News home page

మెదక్‌ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్‌ గెలుపు

Jun 23 2026 7:18 PM | Updated on Jun 23 2026 10:28 PM

T20 League 2026: Pranav Rangareddy Risers vs Medak Falcons Match Updates and Highlights

PC: TG20 X

మెదక్‌ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్‌ గెలుపు
తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ ఫాల్కన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. రంగారెడ్డి రైజర్స్‌ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

గెలుపు దిశగా రంగారెడ్డి రైజర్స్‌
165 పరుగుల లక్ష్య ఛేదనలో రంగారెడ్డి రైజర్స్‌ గెలుపు దిశగా సాగుతోంది. 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన ఆ జట్టు.. మరో 36 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. 

సత్తా చాటిన త్యాగరాజన్‌.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన ఫాల్కన్స్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ ఫాల్కన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తనయ్‌ త్యాగరాజన్‌ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్‌ పట్టి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

ఫాల్కన్స్‌ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన విక్రమ్‌ నాయక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్‌ అగర్వాల్‌ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్‌
5 బంతుల వ్యవధిలో ఫాల్కన్స్‌ 2 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్‌మూడో బంతికి త్యాగరాజన్‌  నమన్‌ అగర్వాల్‌ను (37) ఔట్‌ చేయగా. 16వ ఓవర్‌ తొలి బంతికే వరుణ్‌ను (1) అరుణ్‌ కుమార్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

కోలుకున్న ఫాల్కన్స్‌
5 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఫాల్కన్స్‌ తిరిగి కోలుకుంది. 12 ఓవర్లలో ఆ జట్టు మూడే వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. విక్రమ్‌ నాయక్‌ (31), నమన్‌ అగర్వాల్‌ (21) ఫాల్కన్స్‌ను ఆదుకున్నారు. 

3 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న మెదక్‌ ఫాల్కన్స్‌ కష్టాలు ఎదుర్కొంటుంది. 55 ఓవర్లలో ఆ జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత తనయ్‌ త్యాగరాజన్‌ బౌలింగ్‌లో శృన్జిత్‌ రెడ్డి క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. ఆతర్వాత రవితేజ (6), పూర్ణచంద్‌ రావ్‌ (38) పెవిలియన్‌కు చేరారు. రవితేజను తనయ్‌ జడ్డూ ఔట్‌ చేయగా.. త్యాగరాజన్‌ పూర్ణచంద్‌ ఆట కట్టించాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఫాల్కన్స్‌
2.3వ ఓవర్‌- 26 పరుగుల వద్ద మెదక్‌ ఫాల్కన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తనయ్‌ త్యాగరాజన్‌ బౌలింగ్‌లో శృన్జిత్‌ రెడ్డి (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో భాగంగా ప్రణవ్‌ రంగారెడ్డి రైజర్స్‌- మెదక్‌ ఫాల్కన్స్‌ మంగళవారం రాత్రి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో మెదక్‌ ఫాల్కన్స్‌ బ్యాటింగ్‌కు దిగింది.

తుది జట్లు..
రంగారెడ్డి రైజర్స్‌: తనయ్‌ త్యాగరాజన్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ వర్ఘీస్‌, అవనీశ్‌ రావ్‌ (వికెట్‌కీపర్‌), అలంక్రిథ్‌ రాపోల్‌, జ్ఞానప్రకాశ్‌ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితీశ్‌ సాయి యాదవ్‌, నానావత్‌ రాకేశ్‌, అరుణ్‌ కుమార్‌, తనయ్‌ జడ్డూ, ఆర్యన్‌ కరియప్ప

మెదక్‌ ఫాల్కన్స్‌: రవితేజ (కెప్టెన్‌), సాయి పూర్ణానంద్‌ రావ్‌, శృన్జిత్‌ రెడ్డి, విక్రమ్‌ నాయక్‌ (వికెట్‌కీపర్‌), సూర్య తేజ, సాయి వరుణ్‌, జంగం బన్ని, అశ్వినన్‌ రామ్‌, నమన్‌ అగర్వాల్‌, సయ్యద్‌ ఘజా అబ్బాస్‌, మధుకర్‌ మన్నే
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement