న‌ల్గొండ నైట్స్‌పై హైద‌రాబాద్ ఇ-చాంప్స్ విజ‌యం | Hyderabad E-Champions Beat Nalgonda Knights By-5 Wickets TG20 League | Sakshi
Sakshi News home page

న‌ల్గొండ నైట్స్‌పై హైద‌రాబాద్ ఇ-చాంప్స్ విజ‌యం

Jul 6 2026 10:53 PM | Updated on Jul 6 2026 11:04 PM

Hyderabad E-Champions Beat Nalgonda Knights By-5 Wickets TG20 League

వైష్ణ‌వ్ రెడ్డి (16 బంతుల్లో 41 నాటౌట్‌), అభిర‌థ్ రెడ్డి (39)

టీజీ20 లీగ్‌లో హైద‌రాబాద్ ఇ-చాంపియ‌న్స్ లీగ్ ద‌శ‌ను అజేయంగా ముగించింది. ఆడిన ఏడింటిలోనూ విజ‌యాలు సాధించి టేబుల్ టాప‌ర్‌గా క్వాలిఫ‌య‌ర్‌-1లో అడుగుపెట్టింది. సోమ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా న‌ల్గొండ నైట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ చాంపియ‌న్స్  5 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 

188 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ ఇ-చాంప్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అన్విత్ రెడ్డి (40), అభిర‌థ్ రెడ్డి (39) రాణించ‌గా, చివ‌ర్లో అజ‌య్ దేవ్ (34 నాటౌట్‌), వైష్ణ‌వ్ రెడ్డి (16 బంతుల్లో 41 నాటౌట్‌ , ఒక ఫోర్‌, 5 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల‌తో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. 

న‌ల్గొండ బౌల‌ర్ల‌లో శ‌ర‌ను నిశాంత్ 2 వికెట్లు తీయ‌గా, ఇయాన్ స‌తాని, అర్ఫాజ్ అహ్మ‌ద్‌, అనికేత్ రెడ్డి త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన న‌ల్గొండ నైట్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. న‌ల్గొండ బ్యాట‌ర్ల‌లో వ‌రుణ్ గౌడ్ (32 బంతుల్లో 53) అర్ధ‌సెంచ‌రీ చేయ‌గా, జ‌శ్వ‌త్ మోతె (36), గౌర‌వ్ రెడ్డి (25) రాణించారు. 

హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో ష‌న్ముక అశ్విన్ 4 వికెట్లు తీయ‌గా, అజ‌య్ దేవ్‌, ప్ర‌న‌వ్ వ‌ర్మ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. తొలి వికెట్‌కు జ‌శ్వ‌త్ మోతె, గౌర‌వ్ రెడ్డిలు 42 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత వ‌రుణ్ గౌడ్ నిల‌క‌డ‌గా ఆడ‌డంతో ర‌న్‌రేట్ ఎక్క‌డా తగ్గ‌లేదు. చివ‌ర్లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ సింగ్ (11 బంతుల్లో 23 నాటౌట్‌) మెరుపుల‌తో న‌ల్గొండ్ నైట్స్ 180 ప‌రుగుల మార్క్‌ను దాటింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement