త్యాగరాజన్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఫాల్కన్స్‌పై రైజర్స్‌ ఘన విజయం | TG20 League 2026: Ranga reddy risers beat Medak Falcons by 5 wickets | Sakshi
Sakshi News home page

త్యాగరాజన్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఫాల్కన్స్‌పై రైజర్స్‌ ఘన విజయం

Jun 23 2026 10:48 PM | Updated on Jun 23 2026 10:48 PM

TG20 League 2026: Ranga reddy risers beat Medak Falcons by 5 wickets

PC: TG20 X

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస​్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రైజర్స్‌.. ఫాల్కన్స్‌ను 164 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. 

అనంతరం రైజర్స్‌ బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు (5 వికెట్ల నష్టానికి). కెప్టెన​ తనయ్‌ త్యాగరాజన్‌ బంతితో (4-0-36-3), బ్యాట్‌తో (11 బంతుల్లో 21) సత్తా చాటి రైజర్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

రాణించిన బౌలర్లు
తనయ్‌ త్యాగరాజన్‌ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్‌ పట్టి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్‌ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన విక్రమ్‌ నాయక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్‌ అగర్వాల్‌ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

శుభారంభం అందించిన ఓపెనర్లు
165 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్‌ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరోన్‌ జార్జ్‌ (27), అరవెల్లి అవనీశ్‌ (25) మెరుపు ఇన్నింగ్స్‌లతో గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ఆదిత్య (12), అలంక్రిత్‌ (9) నిరాశపరిచినా.. రాకేశ్‌ (38 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడి రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. అతనికి తనయ్‌ త్యాగరాజన్‌, నితిన్‌ యాదవ్‌ (28 నాటౌట్‌) సహకరించారు. ఫాల్కన్స్‌ బౌలర్లలో వరుణ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. రవితేజ, అబ్బాస్‌, అశ్విన్‌ రామ్‌ తలో వికెట్‌ దక్కి​ంచుకున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement