టీజీ టి20 లీగ్‌కు ఎనిమిది టీమ్‌లు సిద్ధం | HCA Unveils 8 Franchise Owners for Inaugural TG20 League | Sakshi
Sakshi News home page

టీజీ టి20 లీగ్‌కు ఎనిమిది టీమ్‌లు సిద్ధం

May 24 2026 6:21 AM | Updated on Jun 18 2026 3:39 PM

HCA Unveils 8 Franchise Owners for Inaugural TG20 League

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ టి20 లీగ్‌ (టీజీ టి20) ఫ్రాంచైజీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. బిడ్‌ ద్వారా అధిక మొత్తాలు దాఖలు చేసిన టాప్‌–8 టీమ్‌ యాజమాన్యాలను హెచ్‌సీఏ శనివారం ప్రకటించింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతితో తొలిసారి టీజీ టి20 లీగ్‌ను జరుపుతున్నారు. వచ్చే నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనుండగా, ఆ తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. 

లీగ్‌లో అత్యధికంగా రూ.7 కోట్ల 50 లక్షలకు హైదరాబాద్‌ టీమ్‌ను ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకుంది. రంగారెడ్డి జట్టును బూరుగు ఇన్‌ఫ్రా/ ప్రణవ (రూ.7.20 కోట్లు), వరంగల్‌ జట్టును బెయిన్‌ గ్లోబల్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రూ.6.55 కోట్లు), మెదక్‌ టీమ్‌ను బృంద ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రూ.6.33 కోట్లు), నల్గొండ టీమ్‌ను కిషోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రూ.5.06 కోట్లు) గెలుచుకున్నాయి. 

కరీంనగర్‌ జట్టును ఈఐపీఎల్‌ గ్రూప్‌ అండ్‌ టిబరుమల్‌ (రూ.4.57 కోట్లు), మహబూబ్‌నగర్‌ జట్టును వీరభద్ర స్టీల్స్‌ (రూ.4.50 కోట్లు), ఖమ్మం టీమ్‌ను అన్విత గ్రూప్‌ (రూ.4.44 కోట్లు) సొంతం చేసుకున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement