రాణించిన జైస్వాల్‌, హిమతేజ.. ఖమ్మం భారీ స్కోరు | Mickil Jaiswal-Himateja Half-Centuries Big Score For Khammam Vs Karimnagar | Sakshi
Sakshi News home page

రాణించిన జైస్వాల్‌, హిమతేజ.. ఖమ్మం భారీ స్కోరు

Jun 26 2026 8:57 PM | Updated on Jun 26 2026 9:02 PM

Mickil Jaiswal-Himateja Half-Centuries Big Score For Khammam Vs Karimnagar

టీజీ20 లీగ్‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్‌ వేదికగా కరీంనగర్ డైమండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ (34 బంతుల్లో 64 నాటౌట్‌) అజేయ ఫిఫ్టీతో మెరిశాడు. అంతకముందు కొడిమెల హిమతేజ (56) అర్ధశతకంతో మెరవగా, జీఎస్‌కే రెడ్డి (43) రాణించాడు. 

ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో ఖమ్మం ఏసెస్ 200 పరుగులు మార్క్‌ను దాటింది. ఆఖర్లో జైస్వాల్ ‍కూడా భారీ సిక్సర్లు బాది భారీ స్కోరుకు బాటలు వేశాడు. కరీంనగర్ డైమ​ండ్స్ బౌలర్లలో హరీష్ ఠాకూర్ 3 వికెట్లు, రత్లావత్‌, ఆశిష్‌, నారాయణ తేజ తలా ఒక వికెట్ తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement