హైదరాబాద్‌ ఖాతాలో మరో గెలుపు | TG20 League 2026: Hyderabad E Champions vs Medak Falcons Updates | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఖాతాలో మరో గెలుపు

Jun 27 2026 2:16 PM | Updated on Jun 27 2026 6:03 PM

TG20 League 2026: Hyderabad E Champions vs Medak Falcons Updates

టీజీ20 లీగ్‌ 2026లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం​ సాధించి హ్యాట్రిక్‌ సాధించింది. ఇవాళ జరిగిన 12వ మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌పై 46 పరుగుల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 240 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో తడబడిన మెదక్‌ లక్ష్యానికి 47 పరుగుల దూరంలో (194-9) నిలిచిపోయింది. 

ధీటుగా బదులిస్తున్న మెదక్‌
241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెదక్‌ ఫాల్కన్స్‌ ధీటుగా బదులిస్తుంది. 11.3 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఫాల్కన్స్‌ గెలవాలంటే మరో 51 బంతుల్లో 114 పరుగులు చేయాలి. విక్రమ్‌ నాయక్‌ (70) విధంసాన్ని కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా రవితేజ (18) క్రీజ్‌లో ఉన్నాడు. 

హైదరాబాద్‌ భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు అభిరథ్‌ రెడ్డి (59), వికాస్‌ రెడ్డి (93) విధ్వంసకర అర్ద శతకాలతో విరుచుకుపడ్డారు. 

ఆఖర్లో గడుగు గణేశ్‌ (22 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మెదక్‌ బౌలరల్లో విక్రమ్‌ నాయక్‌, ఘాజీ అబ్బాస్‌ చెరో 2 వికెట్లు తీయగా.. వరుణ్‌, కార్తీకేయ, రవితేజ, అశ్విన్‌ రామ్‌ తలో వికెట్‌ తీశారు. 

సెంచరీ చేజార్చుకున్న వికాస్‌ రెడ్డి
15.1వ ఓవర్‌- వికాస్‌ రెడ్డి సెంచరీ చేజార్చుకున్నాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. 

సెంచరీకి చేరువలో వికాస్‌ రెడ్డి
ఓపెనర్‌ వికాస్‌ రెడ్డి సెంచరీ దిశగా సాగుతున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత హైదరాబాద్‌ స్కోర్‌ 180-2గా ఉంది. 

భారీ స్కోర్‌ దిశగా హైదరాబాద్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేస్తున్న హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 122-1గా ఉంది. అభిరథ్‌ రెడ్డి (27 బంతుల్లో 59; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఔట్‌ కాగా.. వికాస్‌ రెడ్డి 59, నితిన్‌ నాయర్‌ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అభిరథ్‌ రెడ్డి వికెట్‌ ఘాజీ అబ్బాస్‌కు దక్కింది. 

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న మెదక్‌
టీజీ20 లీగ్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 27) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌, హైదారాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..
మెదక్‌ ఫాల్కన్స్‌: శృంజిత్‌ రెడ్డి, నమన్‌ అగర్వాల్‌, సాయి వరుణ్‌ ఎర్రమ్‌, రవితేజ (కెప్టెన్‌), నౌమాన్‌ అహ్మద్‌, ఇషాన్‌ శర్మ, విక్రమ్‌ నాయక్‌ గుగులోత్‌, బన్నీ జగం​, అహ్వినన్‌ రామ్‌, సయ్యద్‌ ఘాజీ అబ్బాస్‌, కార్తికేయ కాక్‌

హైదరాబాద్‌ ఈ ఛాంప్స్‌: అభిరథ్‌ రెడ్డి (కెప్టెన్‌), సాయి వికాస్‌ రెడ్డి, అన్విత్‌ రెడ్డి, షణ్ముఖ అశ్విన్‌, గణేశ్‌ గడుగు, నితిన్‌ నాయక్‌, అర్వింద్‌, అజయ్‌ దేవ్‌ గౌడ్‌, ప్రణవ్‌ వర్మ, అఖిల్‌ రాథోడ్‌, శ్రీనికేత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement