నెల్లూరులో కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే వరాల, కోర్కెల రొట్టెల పండుగ (Rottela Panduga) శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ కోర్కెల రొట్టెలను మార్పిడి చేసుకున్నారు.


