టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ ఇ-చాంపియన్స్‌ | TG20 League-Hyderabad E Champions Choose Fielding Vs Nalgonda Knights | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ ఇ-చాంపియన్స్‌

Jul 6 2026 6:52 PM | Updated on Jul 6 2026 7:10 PM

TG20 League-Hyderabad E Champions Choose Fielding Vs Nalgonda Knights

టీజీ20 లీగ్‌లో భాగంగా సోమ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా హైద‌రాబాద్ ఈ చాంపియ‌న్స్‌, అనురాగ్ న‌ల్గొండ నైట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన హైద‌ర‌బాద్ ఇ-చాంపియన్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన ఆరింటిలోనూ విజ‌యాలు సాధించిన హైద‌రాబాద్ ఇ-చాంపియన్స్‌ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో టాప్‌లో కొన‌సాగుతోంది. 

మ‌రోవైపు న‌ల్గొండ నైట్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజ‌యాల‌తో 8 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి న‌ల్గొండ నైట్స్ రెండో స్థానానికి చేరుకోవాల‌ని భావిస్తుండ‌గా, హైద‌రాబాద్ ఇ-చాంపియన్స్‌ మాత్రం త‌మ చివ‌రి మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాప‌ర్‌గా నిలవాలని భావిస్తోంది.

తుదిజట్లు:
నల్గొండ నైట్స్‌: జశ్వత్ మోతే, గౌరవ్ రెడ్డి, పి నితీష్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్‌), అనికేత్ రెడ్డి, హర్షవర్ధన్ సింగ్ (వికెట్ కీపర్‌), అర్ఫాజ్ అహ్మద్, దివేష్ సింగ్, ఇల్యాన్ సతాని, ఏలగాని వరుణ్ గౌడ్, శరణు నిశాంత్
హైదరాబాద్ ఇ చాంపియన్స్‌: అభిరత్ రెడ్డి (కెప్టెన్‌), వికాస్ రెడ్డి , వైష్ణవ్ రెడ్డి (వికెట్‌ కీపర్‌), గడుగు గణేష్‌ న్విత్ రెడ్డి, ప్రణవ్ వర్మ, పి అరవింద్, అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement