నల్గొండ నామమాత్రపు స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే? | TG20 League 2026 RRR vs ANK: Singhs Shine Nalgonda Score 189 | Sakshi
Sakshi News home page

నల్గొండ నామమాత్రపు స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?

Jun 22 2026 4:01 PM | Updated on Jun 23 2026 12:49 PM

TG20 League 2026 RRR vs ANK: Singhs Shine Nalgonda Score 189

PC: TG20 X

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో రెండో మ్యాచ్‌లో భాగంగా రంగారెడ్డి రైజర్స్‌- నల్గొండ నైట్స్‌ సోమవారం ముఖాముఖి ఎదురుపడ్డాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.

నల్గొండ స్కోరెంతంటే?
ఈ క్రమంలో రంగారెడ్డి బౌలింగ్‌ ధాటికి నల్గొండ ఓపెనర్లు గౌరవ్‌ రెడ్డి (0), ప్రణవ్‌ సూర్యదేవర (7) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీశ్‌ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్‌ రాహుల్‌ బుద్ధి మెరుపులు (19 బంతుల్లో 30) మెరిపించాడు.

మిగిలిన వారిలో వరుణ్‌ గౌడ్‌ (26) రాణించగా.. అర్ఫాజ్‌ (7), అనికేత్‌ రెడ్డి (0) ఇలా వచ్చి.. అలా వెళ్లారు. ఇలాంటి దశలో దివేశ్‌ సింగ్‌, హర్షవర్దన్‌ సింగ్‌ నల్గొండ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. 

దివేశ్‌ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా..  హర్షవర్ధన్‌ సింగ్‌ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. 

రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు వికెట్లతో చెలరేగగా.. కరియప్ప, నితిన్‌ సాయి యాదవ్‌ చెరో రెండు, కెప్టెన్‌ తనయ్‌ త్యాగరాజన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

తుదిజట్లు
రంగారెడ్డి రైజర్స్‌
తనయ్‌ త్యాగరాజన్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ వర్గిస్‌, అవినాశ్‌ రావు (వికెట్‌ కీపర్‌), అలంకృద్‌ రాపోల్‌, జ్ఞాన ప్రకాశ్‌ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్‌ సాయి యాదవ్‌, నానావత్‌ రాకేశ్‌, అరుణ్‌ కుమార్‌, భువనగిరి పున్నయ్య, ఆర్యన్‌ కరియప్ప

నల్గొండ నైట్స్‌
రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), ప్రణవ్‌ సూర్యదేవర, గౌరవ్‌ రెడ్డి, పి. నితీశ్‌ రెడ్డి, వరుణ్‌ గౌడ్‌, ఎండీ అర్ఫాజ్‌ అహ్మద్‌, టి. హర్షవర్దన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), దివేశ్‌ సింగ్‌, చిన్నట్ల ర‍క్షణ్‌ రెడ్డి, నివాంత్‌ శరణు.  
Update: తనయ్‌ కెప్టెన్‌ ఇన్నిం గ్స్‌.. రంగారెడ్డి ఘన విజయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement