ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న భారత స్పిన్నర్‌ | CHAHAL HAS TAKEN 15 WICKETS IN JUST 7 GAMES IN ENGLAND ONE DAY CUP | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న భారత స్పిన్నర్‌

Aug 10 2026 12:08 PM | Updated on Aug 10 2026 12:32 PM

CHAHAL HAS TAKEN 15 WICKETS IN JUST 7 GAMES IN ENGLAND ONE DAY CUP

source: X

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే కప్‌లో భారత లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ మరోసారి సత్తా చాటాడు. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్న అతడు.. ఆదివారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సోమర్‌సెట్ బ్యాటర్లను చహల్ తన స్పిన్‌ మాయాజాలంతో కట్టడి చేశాడు. తొలుత ఆర్చీ వాన్‌ను ఔట్ చేసిన చహల్.. ఆ తర్వాత జాక్ లీచ్, జేక్ బాల్ వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు మాత్రమే ఇచ్చి 3/35 గణాంకాలు నమోదు చేశాడు. చహల్ ధాటికి సోమర్‌సెట్ 47 ఓవర్లలో కేవలం 185 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం లూక్‌ పాక్టర్‌ (85), నాథన్‌ మెక్‌స్వీని (69 నాటౌట్‌) రాణించడంతో నార్తంప్టన్‌షైర్ 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు
ఈ టోర్నీలో చహల్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుత వన్డే కప్‌లో చహల్‌ తీసిన వికెట్లు
- తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు
- రెండో మ్యాచ్‌లో 2 వికెట్లు
- మూడో మ్యాచ్‌లో 1 వికెట్‌
- నాలుగగో మ్యాచ్‌లో 1 వికెట్‌
- ఐదో మ్యాచ్‌లో 4 వికెట్లు
- ఆరో మ్యాచ్‌లో 2 వికెట్లు
- ఏడో మ్యాచ్‌లో 3 వికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement