ఐపీఎల్‌ టూ ఇంగ్లండ్‌.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్‌ | Delhi Capitals Ashutosh Sharma to play for Hampshire in One-Day Cup 2026 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ టూ ఇంగ్లండ్‌.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్‌

Jul 21 2026 3:17 PM | Updated on Jul 21 2026 4:08 PM

Delhi Capitals Ashutosh Sharma to play for Hampshire in One-Day Cup 2026

ఢిల్లీ క్యాపిటల్స్ ఫినిషర్ అశుతోష్ శర్మ ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ 'వన్డే కప్ 2026'లో ఆడనున్నాడు. ఈ మేరకు హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది.

వన్డేకప్ కోసం అశుతోష్ మా జట్టుతో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది. అతడొక అద్భుతమైన ఆటగాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. కాబట్టి అతడు 50 ఓవర్ల క్రికెట్‌లో అతడు రాణిస్తాడని ఆశిస్తున్నాము. అతడికి హాంప్‌షైర్ జట్టులోకి స్వాగతం పలుకుతున్నామని ఆ క్రికెట్ క్రికెట్ డైరెక్టర్ గైల్స్ వైట్ పేర్కొన్నారు.

కాగా హాంప్‌షైర్ యాజమాన్యమైన జిఎంఆర్  గ్రూప్.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా సహ యజమానిగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ చారిత్రత్మక క్లబ్ తరపున ఆడేందుకు అశుతోష్ మార్గం సుగమమైంది. కాగా 27 ఏళ్ల అశుతోష్‌కు ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.

అతను గతంలో మిడిల్‌సెక్స్ టైటాన్స్ (2017), గ్రేవ్‌సెండ్ (2022, 2023), అలాగే లివర్‌పూల్ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ కాంపిటీషన్‌లో విగన్ (2025) జట్లకు ఆడాడు. ఇప్పుడు మరోసారి ఇంగ్లీష్ గడ్డపై రాణించేందుకు అతడు సిద్దమయ్యాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అశుతోష్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అశుతోష్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. ఇక ఈ వన్డే కప్‌లో అశుతోష్ శర్మతో పాటు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా భాగం కానున్నాడు.  చాహల్  నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement