‘బ్యాటింగ్‌ మా ప్రధాన బలం.. సీక్రెట్‌ వెపన్‌ అతడే!’ | TG20 League Anvita Khammam Aces Interview With Sakshi | Sakshi
Sakshi News home page

TG20 League: ‘బ్యాటింగ్‌ మా ప్రధాన బలం.. సీక్రెట్‌ వెపన్‌ అతడే!’

Jun 19 2026 2:24 PM | Updated on Jun 19 2026 2:35 PM

TG20 League Anvita Khammam Aces Interview With Sakshi

ఆదివారం నుంచి ఉప్ప‌ల్ వేదిక‌గా టీజీ 20 లీగ్ టోర్నీ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అన్వితా ఖ‌మ్మం ఏసెస్ జ‌ట్టుతో సాక్షి మీడియా ముచ్చ‌టించింది. ఈ నేప‌థ్యంలో జ‌ట్టు బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌పై ఖ‌మ్మం ఏసెస్‌ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలను పంచుకుంది. అన్ని జ‌ట్ల‌తో పోలిస్తే బ్యాటింగ్ త‌మ ప్ర‌ధాన‌ బ‌ల‌మ‌ని ఖ‌మ్మం కోచ్ అభిజీత్ పేర్కొన్నారు. అయితే జ‌ట్టులో ఉన్న‌ ఒక సీక్రెట్ ఆయుధాన్ని గ్రౌండ్‌లోనే వాడనున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే ఆ సీక్రెట్ ప్లేయ‌ర్ ఎవ‌ర‌నేది మాత్రం తాము రివీల్ చేయ‌బోవ‌వ‌డం లేద‌ని పేర్కొన్నారు.

 ఖ‌మ్మం జ‌ట్టు కెప్టెన్ సీవీ మిలింద్ మాట్లాడుతూ.. టీ20 20లీగ్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వ‌చ్చే ఆట‌గాళ్ల‌కు రంజీల్లోకి వెళ్ల‌డానికి ఇదొక‌ మంచి అవ‌కాశంగా ఉప‌యోగ‌పడుతుంద‌ని పేర్కొన్నాడు. ఐపీఎల్ స‌హా ఇత‌ర లీగ్స్‌కు కూడా ఆడేందుకు ఇలాంటి లీగ్‌లు త‌మ లాంటి ఆట‌గాళ్ల‌కు కీల‌కంగా మారుతుంద‌ని తెలిపాడు. 

త‌మ జ‌ట్టులో లెగ్ స్పిన్న‌ర్‌గా వేద్‌రెడ్డి అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా ఉన్నాడ‌ని, అత‌డు త‌న స్పిన్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్ప‌తిప్ప‌లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపాడు. కార్య‌క్ర‌మంలో కెప్టెన్ సీవీ మిలింద్‌తో పాటు వైస్ కెప్టెన్ హిమ‌తేజ‌, లెగ్ స్పిన్న‌ర్ వేద్ రెడ్డి, ఓపెనర్‌ ప్రతీక్‌రెడ్డి పాటు ఇత‌ర క్రికెట‌ర్లు పాల్గొన్నారు. ఇక ఖ‌మ్మం ఏసెస్ జ‌ట్టును అన్వితా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక ఖ‌మ్మం ఏసెస్ జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 21న పాల‌మూరు స్ట్రైక‌ర్స్‌తో ఆడ‌నుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement