హైదరాబాద్: తెలంగాణ గౌరవానికి బోనాల పండుగ చాలా ప్రత్యేకమైనదని, అటువంటి బోనాల పండుగకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. లాల్ దర్వాజాలో సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్.. బోనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నాకు రాజకీయాలు ముఖ్యం కాదు.. సనాతన ధర్మమే ముఖ్యం. నన్ను విమర్శించే అన్ని పార్టీలలో ఉన్న నాయకులు ఆలోచించండి. హిందువులు నిధుల కోసం ప్రభుత్వం దగ్గర బిక్షం ఎత్తుకోవాల్సిన రోజు వచ్చింది. లాల్ దర్వాజా బోనాలకు ప్రభుత్వం కేవలం ఐదు లక్షల నిధులు మాత్రమే ఇచ్చింది.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం. 2029లో వచ్చేది మా ప్రభుత్వమే’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.


