శతక్కొట్టిన హిమతేజ | TG20 League AKA Vs MDF: Himateja Slams Century Khammam Score is | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన హిమతేజ

Jul 6 2026 4:31 PM | Updated on Jul 6 2026 4:56 PM

TG20 League AKA Vs MDF: Himateja Slams Century Khammam Score is

PC: TG20

మెదక్‌ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌ స్టార్‌ కొడిమెల హిమతేజ శతక్కొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 

కాగా తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌- మెదక్‌ ఫాల్కన్స్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన ఖమ్మం తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

ఓపెనర్లలో వాఫీ కచ్చి 14 పరుగులు చేయగా.. జీఎస్‌కే రెడ్డి డకౌట్‌ అయ్యాడు. ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ కొడిమెల హిమతేజ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న హిమతేజ 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మిగిలిన వారిలో మికిల్‌ జైస్వాల్‌ 15 పరుగులు చేయగా.. ప్రతీక్‌ రెడ్డి 32 పరుగులతో రాణించాడు. ఆఖర్లో కెప్టెన్‌ సీవీ మిలింద్‌ 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఖమ్మం ఏసెస్‌ 190 పరుగులు చేసింది. మెదక్‌ బౌలర్లలో రవితేజ రెండు, మధుకర్‌ మన్నె, అర్జున్‌ గొర్రపల్లి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

తుదిజట్లు
ఖమ్మం
సీవీ మిలింద్‌ (కెప్టెన్‌), వాఫీ కచ్చి, జీఎస్‌కే రెడ్డి, హిమతేజ కొడిమెల, మికిల్‌ జైస్వాల్‌, సహేంద్ర మల్లు, హర్షిత్‌ సాయి, షేక్‌ అజర్‌, వేద్‌ రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డి ఎల్లాల.

మెదక్‌
రవితేజ (కెప్టెన్‌), నమన్‌ అగర్వాల్‌, శృంజిత్‌ రెడ్డి, ఇషాన్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), విక్రమ్‌ నాయక్‌, సాయి వరుణ్‌ యెర్రం, అర్జున్‌ గొర్రపల్లి, ఎన్‌ సూర్యతేజ, కార్తికేయ కాక్‌, మధుకర్‌ మన్నె, శశాంత్‌ బూడిది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement