తీరు మారని మెదక్‌.. నల్గొండ చేతిలో ఘోర ఓటమి | TG20 2026: Anurag Nalgonda Knights won by 8 wkts | Sakshi
Sakshi News home page

TG20 2026: తీరు మారని మెదక్‌.. నల్గొండ చేతిలో ఘోర ఓటమి

Jul 3 2026 6:04 PM | Updated on Jul 3 2026 6:25 PM

TG20 2026: Anurag Nalgonda Knights won by 8 wkts

తెలంగాణ టీ20 లీగ్‌-2026లో మెదక్ ఫాల్కన్స్ తీరు ఏ మాత్రం మారలేదు. ఈ టోర్నీలో మెదక్ వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. శుక్రవారం ఉప్పల్ మైదానం వేదికగా నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో మెదక్ ఓటమి పాలైంది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నల్గొండ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

మెదక్‌ బ్యాటర్లలో విక్రమ్‌ నాయక్‌(48) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వరుణ్ యర్రం(44), రవితేజ(33), శ్రుంజిత్ రెడ్డి(30) రాణించారు. నల్గొండ బౌలర్లలో చింతల రక్షణ్‌, అనికేత్‌ రెడ్డి, ఇలియాన్ సతాని తలా వికెట్‌ సాధించారు.

అనంతరం మెదక్ ఫాల్కన్స్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. నల్గొండ ఓపెనర్‌ గౌరవ్‌ రెడ్డి(47 బంతుల్లో 101 నాటౌట్‌) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జశ్వంత్‌(34) రాణించాడు. 

మెదక్‌ బౌలర్లలో మధుకర్‌, అర్జున్ మాత్రమే తలా వికెట్ పడగొట్టారు. మెదక్‌ జట్టులో కెప్టెన్‌ తిలక్‌ వర్మ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మెదక్‌ జట్టు కేవలం తొలి మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఫాల్కన్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.
చదవండి: IND vs ENG: 'వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ద్దు.. అత‌డినే జ‌ట్టులో కొన‌సాగించాలి'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement