'వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ద్దు.. అత‌డినే జ‌ట్టులో కొన‌సాగించాలి' | Sanju Samson Would Be Thinking, Why Is Everyone Pointing Gun At Me? | Sakshi
Sakshi News home page

IND vs ENG: 'వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ద్దు.. అత‌డినే జ‌ట్టులో కొన‌సాగించాలి'

Jul 3 2026 3:27 PM | Updated on Jul 3 2026 3:56 PM

Sanju Samson Would Be Thinking, Why Is Everyone Pointing Gun At Me?

యూకే ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ పేల‌వ ఫామ్ కొన‌సాగుతోంది. ఐర్లాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మైన సంజూ.. ఇప్పుడు ఇంగ్లండ్‌లో అదే తీరును క‌న‌బ‌రుస్తున్నాడు. వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన తొలి టీ20లో శాంస‌న్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేశాడు.

దీంతో అత‌డిని ప‌క్క‌న పెట్టి బెంచ్‌పై ఉన్న యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీకి అవ‌కాశమివ్వాల‌ని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సంజూకు మ‌ద్ద‌తుగా భారత మాజీ క్రికెటర్ సబా కరీం నిలిచాడు. ఫామ్ కోల్పోయినప్పటికీ శాంస‌న్‌నే టాప్ ఆర్డ‌ర్‌లో కొన‌సాగించాల‌ని కరీం అభిప్రాయ‌ప‌డ్డాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026తో పాటు ఐపీఎల్‌లో దుమ్ములేపిన ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌.. యూకే గ‌డ్డ‌పై త‌న మార్క్ చూపించ‌లేక‌పోతున్నాడు. సంజూ తన చివరి 10 విదేశీ టీ20లలో ఐదుసార్లు డకౌట్, రెండుసార్లు వందకు పైగా స్కోర్లు సాధించాడు. మ‌రో మూడుసార్లుసింగిల్ డిజిట్ స్కోర్లు న‌మోదు చేశాడు. ఏదేమైన‌ప్ప‌టికి శాంస‌న్ త‌న టీ20 కెరీర్‌లో మాత్రం నిల‌క‌డ‌గా రాణించ‌లేక‌పోతున్నాడ‌నే చెప్పాలి.

సంజూ శాంస‌న్‌ను ప్ర‌స్తుతానికి జ‌ట్టు నుంచి త‌ప్పించే సాహ‌సం మేనెజ్‌మెంట్ చేయ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే అత‌డొక అద్భుత‌మైన ప్లేయ‌ర్‌. సంజూకి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే స‌త్తా ఉంది. అత‌డు ఐపీఎల్‌లో కూడా అద‌ర‌గొట్టాడు. అంత‌కుముందు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు.

ఒక‌ట్రెండు మ్యాచ్‌ల‌లో విఫ‌ల‌మైనంత మాత్రాన అత‌డి విమ‌ర్శించ‌డం స‌రికాదు. సంజూ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. వైభ‌వ్ ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికి సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోని చాలా విష‌యాలు నేర్చుకుంటున్నాడు. అత‌డికి టాలెంట్ ఉన్న‌ప్ప‌టికి ప్ర‌స్తుత పోటీలో అవ‌కాశం ఎదురు చూడ‌క త‌ప్ప‌దు అని స‌బా క‌రీం స్టార్ స్పోర్ట్స్ డిబేట్‌లో పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement