తెలంగాణ టీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ రాదేశ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్.. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు చందన్(54), సాత్విక్(35) రాణించారు. మెదక్ బౌలర్లలో వరుణ్, కార్తికేయ, విక్రమ్ నాయక్, రవితేజ తలా వికెట్ సాధించారు.
కుప్పకూలిన మెదక్
అనంతరం 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్.. కరీంనగర్ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. మెదక్ బ్యాటర్లలో తెలకపల్లి రవితేజ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కరీంనగర్ బౌలర్లలో శ్రీవాస్తవ్, శుభమ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హారీష్, నారయణ్, సతీష్ కుమార్, సాత్విక్ రెడ్డి తలా వికెట్ సాధించారు.


