బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments At YSRCP District Presidents Meeting Updates | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్‌ జగన్‌

Published Tue, Apr 29 2025 12:25 PM | Last Updated on Tue, Apr 29 2025 3:10 PM

YS Jagan Key Comments At YSRCP District Presidents Meeting Updates

గుంటూరు, సాక్షి:  సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు.  ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది.  విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. 



జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్‌ మీది
ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్‌సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్‌సీపీయే.  

మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలి
జూన్‌-జులైల్లో  గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్‌ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి.  జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. 
బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.

జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు
జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది.  మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్‌ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్‌ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.

LIVE: YSRCP జిల్లా అధ్యక్షులతో YS జగన్‌మోహన్‌రెడ్డి భేటీ

మనమంతా రాజకీయ నాయకులం
మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు.  ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.

రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి.  గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్‌ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది  ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.

మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు
వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement