రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌: పీఎస్ఆర్ ఆంజనేయులిపై మరో కేసు | Kutami Govt Revenge Politics, Another Case Filed Against PSR Anjaneyulu, More Details Inside | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌: పీఎస్ఆర్ ఆంజనేయులిపై మరో కేసు

Published Tue, Apr 29 2025 10:50 AM | Last Updated on Tue, Apr 29 2025 1:22 PM

Kutami Revenge Another Case against PSR Anjaneyulu

విజయవాడ, సాక్షి: వైఎస్సార్‌సీపీ హయాంలో పని చేసిన అధికారులపై కూటమి సర్కార్‌ రెడ్‌బుక్‌ ప్రయోగం మామూలుగా జరగడం లేదు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముంబై నటి జత్వానీ కేసులో ఆయనకు బెయిల్‌ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఆయన బయటకు రాకుండా ఉండేందుకు మరో కేసు నమోదు చేయించింది. 

గతంలో.. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్షలలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కొత్త అభియోగాలను తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో విజయవాడ సూర్యారావు పేట పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదు అయ్యింది.  సీఎస్‌తో ఆదేశాలు జారీ చేయించి మరీ విచారణ జరిపిస్తోంది. 

PSRపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు

ఆంజనేయులిపై కూటమి కుట్రలను వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ హయాంలో పని చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ మరీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇతర నేతలు ఖండిస్తూ వస్తున్నారు. 

ఇదీ చదవండి: ఫేక్‌న్యూస్‌ ఫ్యాక్టరీలతో చంద్రబాబు చేస్తోంది ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement