
Bio-input Resource Centres (BRC) ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువులు, ద్రావణాలు, కషాయాలను ఏ రైతుకు ఆ రైతు స్వయంగా తయారు చేసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. నిన్నటి వరకు రసాయనిక వ్యవసాయంలో వాడే ఎరువులు, పురుగుమందులు వంటి ఉత్పాదకాలన్నీటినీ కొని వినియోగించడానికి అలవాటు పడిన రైతులు ఇప్పుడు అన్నీ ఎవరికి వారు తయారు చేసుకోవటం కష్టమే. ఈ ఇబ్బందిని అధిగమించకుండా ప్రకృతి సేద్యం విస్తరించడం అంత తేలిక కాదు. అందుకే ప్రకృతి సేద్యంలో వాడే ఘనజీవామృతం, జీవామృతం వంటి అన్ని రకాల ఉత్పాదకాలను తయారు చేసి విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం బయో–ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్స్ (బిఆర్‌సిలు) ఏర్పాటు చేయిస్తోంది. వీటిని సులువుగా ఉండటం కోసం ‘జీవామృత కేంద్రాలు’ అని చెప్పుకుందాం. తొలి విడద దేశవ్యాప్తంగా 10 వేల బిఆర్‌సిలు ఏర్పాటు చేయాలని 2023–24 బడ్జెట్‌లోనే పేర్కొన్నారు.
అయితే, వీటిని ఏర్పాటు చేయటానికి మార్గదర్శకాలను తాజాగా (ఏప్రిల్ 23న) విడుదల చేసింది. ఆ వివరాలు:
ప్రతి బిఆర్‌సి ఏర్పాటుకు ర. లక్ష చొప్పున (ర. 50 వేల చొప్పున రెండు విడతలుగా) ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవటంతో ΄ాటు వాటిని ఎలా ఉపయోగించాలో, ఎంత మోతాదులో వాడాలో కూడా ఈ జీవామృత కేంద్రాల నిర్వాహకులే రైతులకు తెలియజెప్పాల్సి ఉంటుంది. బయో–ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్(బిఆర్‌సి) లను నెలకొల్పే వ్యక్తులు / సంస్థలు / బృందాలు మొదట తాము ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఈ ఉత్పాదకాలను వారు వాడుతున్న అనుభవం కలిగి ఉండాలి.
స్థానిక రైతుల అవసరాలకు, స్థానిక భూములకు తగిన, స్థానికంగా సాగయ్యే పంటల సరళికి అవసరమైన రీతిలో ద్రావణాలు, కషాయాలను తయారు చెయ్యాలి.
వీటి ధరలు స్థానిక చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత రాష్ట్ర స్థాయి ప్రకృతి సేద్య విభాగం, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలపై ఉంది.
బీఆర్‌సి ఏర్పాటు కోసం ర. లక్షతో భూమిని, షెడ్డును, డ్రమ్ములు, ఇతరత్రా యంత్ర పరికరాలను సమకర్చుకోవటం ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
తూతూ మంత్రంగా కాకుండా.. దీర్ఘకాలంపాటు బిఆర్‌సిలకు వెన్నుదన్నుగా ఉండేలా ప్రభుత్వం ఆలోంనప్పుడే ఆశింన ప్రయోజనం నెరవేరుతుందని నిపుణులు సూస్తున్నారు.