Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.! | Rakthashali or Red rice amazing health benefits | Sakshi
Sakshi News home page

Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!

Apr 30 2025 1:16 PM | Updated on Apr 30 2025 1:16 PM

Rakthashali or Red rice amazing health benefits

రక్తశాలి బియ్యం దాని ప్రత్యేకమైన ఎరుపు రంగు, గొప్ప పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యాభిలాషులైన వినియోగదారులకు దీని విలువ తెలుసు. సాంప్రదాయకంగా దీన్ని కేరళలోని వయనాడ్‌ జిల్లాలోని సహజమైన, జీవవైవిధ్య వాతావరణంలో పెంచుతారు. ఇది తరచుగా ఈ ప్రాంతపు వ్యవసాయ వారసత్వానికి హ్నంగా చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ప్రకృతి వ్యవసాయ దారులు పండిస్తున్నారు. రక్తశాలి అనే పేరు సంస్కృత పదం నుం వచ్చింది. ‘రక్త’ అంటే రక్తం. ‘శాలి’ అంటే బియ్యం. రక్తశాలి జిగురు లేనిది. గ్లూటెన్‌ సెన్సిటివ్‌ వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. దాని అధిక  పోషక, ఔషధ లక్షణాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాభిలాషులకు ఇది చాలా విలువైనది.

విశేష పోషకాలు
రక్తశాలి పోషకాలతో కూడిన ఆహారం. వంద గ్రాముల ముడి బియ్యం.. 363.49 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. ్ర΄ోటీన్‌ (8.96 గ్రా.), పిండి పదార్ధం (71.18 గ్రా.), కొవ్వు (4.77 గ్రా.), జింక్‌ 15.75 మి.గ్రా., ఐరన్‌ (0.99 మి.గ్రా.) కలిగి ఉంటుంది. ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాల నిపుణులు చెబుతున్నారు.

రక్తశాలి బియ్యాన్ని పాలిష్‌ చేయకుండా ముడి బియ్యం వండుకొని తింటారు. ఇది ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటుంటే రక్తం హెచ్చుతగ్గులను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.

అంకితభావంతో కూడిన సేంద్రియ/ప్రకృతి రైతుల సంరక్షణలో సాగవుతున్న అరుదైన రకాల్లో ఇదొకటి. ఆయుర్వేదంలో శరీర త్రిదోషాల(వాత, పిత్త, కఫ) సమతుల్యం చేయగలదన్న గుర్తింపు  పొందింది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని, క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీన్ని సిఫార్సు చేస్తున్నారు.

110 రోజుల ఖరీఫ్‌ పంట
రక్తశాలి వరి పంట ప్రధానంగా కేరళలో వర్షాధార వ్యవసాయంలో సాగవుతోంది. సేంద్రియ పద్ధతుల్లో, పర్యావరణహిత పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జూన్‌/జూలై నుండి నవంబర్‌/డిసెంబర్‌ వరకు ‘శాలి’ సీజన్‌లో పండిస్తారు. దాదాపు 110 రోజుల పంట. జాగ్రత్తగా నీటి నిర్వహణ అవసరం. అయితే, అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని దిగుబడి నిస్తుంది. సారవంతమైన ఎర్ర ఒండ్రు నేలల్లో రక్తశాలి వరి బాగా పెరుగుతుంది. తగినంత వర్షపాతంతో కూడిన ఉష్ణమండల తేమ వాతావరణం దీనికి అనువైనది. అధిక నాణ్యత గల స్థానికంగా సాగయ్యే రక్తశాలి విత్తనాలను ఎంచుకుంటే మంచి దిగుబడి రావటంతో పాటు తెగుళ్ళు, పురుగుల బెడద ఉండదు. 

ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి

ఔషధ విలువలు,  పోషకాల కారణంగా రక్తశాలి బియ్యానికి మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దీని సాగు విస్తృతం కాక΄ోవటానికి అనేక సవాళ్లు ఆటకంగా ఉన్నాయి.  

రక్తశాలి సాగు, వినియోగం పెరగడానికి ఎదురవుతున్న సవాళ్లు...

  •  ఈ సవాళ్లలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఒకటి. విత్తన బ్యాంకులు లేదా కమ్యూనిటీ విత్తన నిధుల ఏర్పాటు ద్వారా రక్తశాలి వంటి అపురూప దేశీ విత్తనాల లభ్యతను పెంచవచ్చు. 

  •  ఖర్చులు తగ్గించడానికి, నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రైతుల విత్తన సహకార సంఘాలను ప్రోత్సహించాలి. 

  • రక్తశాలి దిగుబడి ఇతర రకాలతో పోల్చితే తక్కువ. ఈ కారణంగా, సేంద్రియ వ్యవసాయంలో అధిక శ్రమ వల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి పోషక, ఔషధ గుణాలు పోకుండా చూసుకుంటూనే దిగుబడి పెంచేందుకు పరిశోధనలు చేపట్టాలి. 

  • సేంద్రియ బియ్యం నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక రైతులతో బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చెయ్యాలి. 

  • ఎక్కువ మంది రైతులు రక్తశాలి బియ్యాన్ని సాగు చేసి విక్రయించేలా ప్రోత్సాహకాలు లేదా సబ్సిడీలను అందించాలి. కొత్త సాగుదారులకు ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. 

  • పంట ప్రాసెసింగ్,  ప్యాకేజింగ్, మార్కెటింగ్‌ పనులను సహకార సంఘాలు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అనుసంధానించడం ద్వారా సాగును విస్తరింపచేయవచ్చు. 

  • రక్తశాలి బియ్యంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు సాధారణ ప్రజలకు బాగా తెలియక΄ోవటం లేదా అర్థం చేసుకోకపోవటం వల్ల వినియోగం తక్కువగా ఉంది. సోషల్‌ మీడియా, స్థానిక ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణులను ఉపయోగించి ఔషధ పోషక ప్రయోజనాలను హైలైట్‌ చేస్తూ అవగాహన ప్రచారం ప్రారంభించడం అవసరం. 

  • వర్క్‌షాప్‌లు, సెమినార్లు లేదా స్థానిక సంతలు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం  ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

  • స్థానిక వంటకాల్లో రక్తశాలి బియ్యాన్ని వాడేలా ప్రోత్సహించేలా వంటల ఉత్సవాలు నిర్వహించాలి. ఈ బియ్యంతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించే ఆహార ఉత్సవాలను నిర్వహించాలి. 

  • మార్కెటింగ్‌ గొలుసులను, ఆన్‌లైన్‌  ప్లాట్‌ఫారమ్‌లను అన్వేషించడం ద్వారా మార్కెటింగ్‌ను మెరుగుపరచవచ్చు. 

  • రక్తశాలి బియ్యానికి సేంద్రియ ధృవీకరణ కల్పిస్తే సాగుదారులు ప్రీమియం మార్కెట్లలో అధిక ధర పొందేందుకు సహాయపడుతుంది.

మరో విశేషం ఏమిటంటే...
ఇది కండగల ఎర్ర నేలల్లో వర్షాధారంగా, సేంద్రియంగా సాగుకు అనువైనది. అయితే, దిగుబడి తక్కువ. కేవలం మహిళల ఆరోగ్యంకోసమైనా దీన్ని తిరిగి మన పంట  పొలాల్లోకి, మన వంటిళ్లలోకి, పళ్లాలోకి తెచ్చుకోవటం అత్యవసరం. దిగుబడి పెంచే పరిశోధనలు చేపట్టాలి. అయితే,  ఔషధ గుణాలు ΄ోకుండా చూడాలి. రక్తశాలి సాగును  ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పథకాల ద్వారా ప్రత్యేక  ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా నేరుగా దేశంలో మహిళలందరికీ అందేలా చెయ్యాలి!

చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిదా? కొందామా? వద్దా?

ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
విటమిన్లు: మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి) రక్తశాలి బియ్యంలో ఉన్నాయి.

అధిక ఫైబర్‌: రక్తశాలి బియ్యంలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. కడుపు నిండిన భావనను కలిగించటం ద్వారా శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు: అధిక సాంద్రతలో ఎరుపు రంగు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

తక్కువ గ్లైసెమిక్‌ సూక: ఇది తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్‌ సూకను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డయాబెటిస్‌ లేదా ఇన్సులిన్‌ నిరోధకత ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

గ్లూటెన్‌–ఫ్రీ: గ్లూటెన్‌ అసహనం లేదా సెలియాక్‌ వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇది ఒక గొప్ప వరం. సురక్షితమైన, పోషకాలతో కూడిన బియ్యం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వృద్ధాప్యపు ఛాయలు కనపడకుండా సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి: రక్తశాలి బియ్యంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో  పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.

రక్త వృద్ధి: రక్తశాలి బియ్యం రక్త వృద్ధిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్న మహిళలకు వరప్రసాదం వంటిది. రక్తం స్థాయిని స్థిరీకరించడానికి లేదా నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది. రక్తశాలి బియ్యం రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ముగింపు
రక్తశాలి అనేది స్వదేశీ వరి రకం. ఔషధగుణాలు, పోషకాంశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఇప్పటికీ సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. అందువల్ల ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయాలి. రైతులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు ఉమ్మడిగా పనిచేసి దీన్ని మళ్లీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.

రక్తశాలి అద్భుతమైన అధిక పోషక, ఔషధ గుణాలున్న పురాతన వరి వంగడం. పేరుకు తగ్గట్టే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది రక్తశాలి బియ్యపు గింజ. అంతేకాదు, రక్తహీనతను  పారదోలటంతో పాటు రక్తం తగ్గి΄పోకుండా స్థిరీకరించగలిగిన అద్భుత గుణం రక్తశాలి సొంతం. రక్తహీనతకు గురయ్యే  మహిళలకు ఇది చక్కటి ఆరోగ్యవంతమైన పరిష్కారం.  ముడి రక్తశాలి బియ్యం తింటే రక్తంలో చక్కెర స్థాయి  నియంత్రణలో ఉంటుంది. చాలా రకాల వరి బియ్యంలో ఉన్నట్లు ఇందులో గ్లుటెన్‌ లేదు. గ్లుటెన్‌ ఇన్‌టాలరెన్స్‌ / సెలియక్‌ వంటి ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది వరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement