
ఆధునికయుగం, స్మార్ట్ యుగం అని చెప్పుకొని పొంగిపోతున్న నేటి కాలంలో కూడా ఆడ శిశువులపై అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడబిడ్డ మహాలక్ష్మీగా భావించే సమాజమే ఆడబిడ్డను భారంగా భావిస్తుంది. అందుకే కొందరు తల్లిదండ్రులు ఆడశిశువులను భారంగా భావిస్తున్నారు. అవును మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న బాధతో పసిగుడ్డును ఆసుపత్రిలోనే వదిలివేసిన ఘటన మానవత్వానికే మచ్చగా నిలిచింది. దీనికి సంబంధించిన ఘటనను ఒక మహిళా వైద్యురాలు షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
చదవండి: అమ్మమ్మ కాంజీవరం పట్టు చీరలో ‘బుట్టబొమ్మ’లా
మహిళా డాక్టర్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో ప్రకారం, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ తన మూడవ కుమార్తెకు జన్మనిచ్చింది. మళ్లీ ఆడ శిశువు జన్మించడంతో నిరాశ చెందిన ఆ కుటుంబం, నవజాత శిశువును ఆసుపత్రిలోనే వదిలివేసింది. ప్రసవం తర్వాత శిశువు తండ్రి కూడా ఆమెను సందర్శించలేదని డాక్టర్ వెల్లడించారు.
I am shocked to see this happening in 2025.
These kinds of people don't deserve to be parents!. pic.twitter.com/0kHYhbZHTf— Anushka Gupta (@Anushqq) April 27, 2025
సోషల్ మీడియాలో డాక్టర్ భావోద్వేగ విజ్ఞప్తి
21వ శతాబ్దంలో కూడా ఇప్పటికీ కొనసాగుతున్న, లోతుగా పాతుకుపోయిన లింగ వివక్షను ఆమె హైలైట్ చేశారు. దేశ అధ్యక్షురాలు మహిళ, ఇటీవల అంతరిక్షంనుంచి ఎంతో ధైర్యంతో తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ మహిళ. ఇలాంటి వారిట భారతదేశం ఎంత గర్వపడాలి.ఆడ శిశువును ఎలా తిరస్కరించడం అన్యాయం,ఇది తనకు ఎంతో బాధను కలిగించిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది దీనిపై నెటిజనులు స్పందించారు. ఈ ఘటనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు తాము దతత్త తీసుకుంటామన్నారు. ఆమెను ప్రేమతో నిండిని గూడును అందించడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. దీంతో శిశువు కుటుంబం తమ తప్పును గ్రహించారు. తిరిగి తమ బిడ్డను తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆ డాక్టర్ తరువాత ఒక ఫాలో-అప్ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియా వల్లే ఆ ఫ్యామిలి తమ తప్పు తెలుసుకుంది అంటూ ఆమె నెటిజన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాప కుటుంబ సభ్యులను వివరాలను మాత్రం డాక్టర్ గోప్యంగా ఉంచారు.
ఇదీ చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!