ఆ కారు అచ్చం.. సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాటే..! | A Womans Uber Ride Has Gone Viral Likening It To A 1 BHK | Sakshi
Sakshi News home page

ఇంటి వాతావరణాన్ని తలపించేలా కారు లోపల సెటప్‌..! మెచ్చుకోకుండా ఉండలేరు

Apr 28 2025 2:54 PM | Updated on Apr 28 2025 5:00 PM

A Womans Uber Ride Has Gone Viral Likening It To A 1 BHK

ఇటీవల ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌లు కూడా కేవలం కస్టమర్లను డ్రాపింగ్‌ చేసే సర్వీస్‌లకే పరిమితం కావడం లేదు. వాళ్లు కూడా సృజనాత్మకతతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేసే పని ఎలాంటిదైనా..అందరూ మెచ్చేలా ప్రజాదరణ పొందడమే ధ్యేయంగా చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. అందుకు గతంలో వార్తల్లో నిలిచిన కొన్ని ఉబర్‌ ఆటోలు, క్యాబ్‌లే నిదర్శనం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి ఇంటి వాతావరణం తలపించేలా కారుని సెట్‌ చేశాడు ఈ డ్రైవర్‌. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఒక మహిళ తన ఉబర్‌ రైడ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ కారు లోపలి విలాసవంతమైన ఇంటీరియర్‌ ఫోటోలు చూస్తే అచ్చం సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌లా ఉంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఆ ఫోటోల్లో కారు లోపల అద్భుతంగా సెటప్‌ చేసి ఉన్నట్లు కనిపిస్తోంది. 

కూల్‌డ్రింక్స్‌,వాటర్‌ బాటిల్స్‌, చిప్స్‌ వంటి స్నాక్స్‌, బొమ్మలు, ప్రాథమిక మందులు తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. వాటిన్నంటి తోపాటు డస్ట్‌బిన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఈ సౌకర్యాలన్నీ కస్టమర్లకు ఉచితమేనట. ఆ కారు డ్రైవర్‌ పేరు అబ్దుల్ ఖదీర్. ఇంకో విశేషం అంటే..ఫీడ్‌బ్యాక్‌ డైరీ తోపాటు తన అసాధారణ సేవలను ప్రశంసిస్తూ..ఉన్న ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ కూడా సీటుపై అతికించాడు. 

నిజానికి ప్రయాణికులకు ఇంతలా సేవలందించాలనే ఖధీర్‌ క్రియేటివిటీ అదుర్స్‌ అనే చెప్పాలి. నెటిజన్లను సైతం ఈ పోస్ట్‌ తెగ ఆకట్టుకుంది. ఆతిథ్య బ్రాండ్‌కి పేరుగాంచిన క్యాబ్‌ అని, ఆ సౌకర్యాన్ని అనుభవించేందుకు ప్రీమియం కూడా చెల్లిస్తామంటూ పోస్టులు పెట్టారు. కానీ మరికొందరూ మాత్రం అకస్తాత్తుగా బ్రేక్‌ వేస్తే..వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తికి ఆ సెటప్‌ గాయలపాలయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ కారు సురక్షితమైనది కాదు అని పోస్టులు పెట్టడం గమనార్హం. 

(చదవండి: ఎవరీ తేజ్‌పాల్ భాటియా..? చారిత్రాత్మక అంతరిక్ష మిషన్‌కు ముందు..)
 

Advertisement
 
Advertisement
Advertisement