నిరీక్షణ ఫలించింది... | US woman living in Delhi adopts abandoned girl child | Sakshi
Sakshi News home page

నిరీక్షణ ఫలించింది...

Apr 27 2025 6:10 AM | Updated on Apr 27 2025 6:10 AM

US woman living in Delhi adopts abandoned girl child

మానవత్వం

కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో కలిసి మన దేశంలో ఉంటున్న క్రిస్టెన్‌ ఫిషర్‌ అనే అమెరికన్‌ భారత్‌లో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. దిల్లీలో ఉంటున్న ఫిషర్‌ దంపతులు నిషా అనే దివ్యాంగురాలైన బాలికను దత్తత తీసుకోవాలనుకున్నారు. అయితే దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది.
‘2023లో అక్టోబర్‌లో దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా, 2024లో నిషాకు దగ్గరయ్యాం. 2025 ఏప్రిల్‌ నాటికి దత్తత పూర్తయింది. ఇప్పుడు నిషా మా అందమైన కుమార్తె’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ఫిషర్‌.

‘కౌంటింగ్‌ డౌన్‌ ది డేస్‌ అన్‌టిల్‌...’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో తాను దత్తత తీసుకున్న పాప కనిపిస్తుంది. మరో వీడియోలో చిన్నారి నిషాకు సంబంధించిన ఎమోషనల్‌ గ్లింప్స్‌ను షేర్‌ చేసింది. దివ్యాంగురాలు అనే కారణంతో నిషాను చిన్న వయసులోనే తల్లిదండ్రులు వదిలేశారు. రెండు సంవత్సరాలు అనాథాశ్రమంలో పెరిగింది నిషా. ‘స్పెషల్‌ నీడ్స్‌ చైల్డ్‌ను దత్తత తీసుకోవాలనుకోవడానికి కారణం...వారికి కొత్త జీవితం ఇవ్వాలనుకోవడం’ అంటుంది క్రిస్టెన్‌ ఫిషర్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement