ఇరాన్‌పై మిత్రదేశాలతో అమెరికా
ఇద్దరు దౌత్యవేత్తల వెల్లడి
మధ్యంతర ఎన్నికల తరువాత ముహూర్తం?
వాషింగ్టన్: మధ్యంతర ఎన్నికలు ముగియగానే అమెరికా ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడనుందా? తాజా వార్తలను బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. అమెరికా అధికారులు ఇప్పటికే పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలకు ఈ మేరకు సందేశాలు పంపినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు దౌత్యవేత్తల ద్వారా తెలిసింది. ఈసారి కొన్ని రోజులపాటు దాడులు కొనసాగవచ్చునని మిత్రదేశాలకు సమాచారం వెళ్లిందని, ప్రతిగా ఇరాన్ ఇంధన, కీలక మౌలిక సదుపాయాలపై ప్రతిదాడులకు దిగే అవకాశమున్నందున జాగ్రత్త పడాలని సూచించినట్లు తెలిపింది.
అయితే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయడంపై అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకూ నిర్ణయం ఏదీ తీసుకోలేదని కూడా వీరు స్పష్టం చేవారు. కాకపోతే ఈ దిశగా ఆయన పలుమార్లు ప్రకటనలు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మిత్రదేశాలకు అమెరికా సమాచారం పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడులు మళ్లీ మొదలవుతాయన్న అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు అమెరికా నిరాకరించింది కూడా.
ఇదిలా ఉంటే ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్బాస్ అరగాచీ ఎక్స్‌లో ఒక పోస్టు చేçస్తూ... తాము దౌత్యమార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఇవ్వాలనినుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మధ్యవర్తుల ద్వారా గత నెలలో ట్రంప్ పూర్తిగా తిరస్కరించిన ప్రతిపాదనను మరోసారి అమెరికా ముందు ఉంచేందుకు ఇరాన్ ప్రయ తి్నస్తున్నట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం ఇరుపక్షాలు విజ్ఞతతో వ్యవహరించాలని, ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు రాజకీయ మార్గాలను అన్వేíÙంచాలని సూచించింది.
అమెరికా సిద్ధంగానే ఉందా?
అమెరికా ఇరాన్‌పై చివరిసారి దాడులు జరిపింది సెపె్టంబర్ నెలలో. ఆ తరువాత ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు అమెరికా మిత్రదేశాలపై తమ దాడులు ముమ్మరం చేశాయి. వీటికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సాయుధ దళాలు స్పందిస్తున్నాయి. కాకపోతే.. మధ్యంతర ఎన్నికల తేదీ తరువాత ఎంత వేగంగా అమెరికా సరికొత్త దాడులకు సిద్ధం కాగలదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత నెలలో అమెరికా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సైనిక బలగాలను భారీగా మోహరించింది. యూఎస్‌ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ యుద్ధనౌకతో పాటు వేలాది మంది నౌకాదళ, మెరైన్ సిబ్బందిని అక్కడికి పంపింది. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల అమెరికాలో ఇంధన ధరలు పెరగడంతో పాటు ప్రభుత్వ ఖజానాపై సుమారు 47.1 బిలియన్ డాలర్ల భారం పడింది.


