viral video
-
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. అసలేం జరిగిందంటే..పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కసూర్ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్‌న్యూస్ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్ జోడించి మరి పోస్టు చేశారు. కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aaron Hutchings (@aaronhutchings77) (చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!) -
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026 -
చేతులే కాదు.. మెదడూ వాడలేదు.. యముడు పిలుస్తున్నాడా?
లక్నో: స్కూటర్‌పై పద్మాసనం వేశాడు ఓ వ్యక్తి. హ్యాండిల్ వదిలేశాడు. రోడ్డుపై రైడింగ్ కాదు.. రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. స్కూటర్‌పై సన్యాసి పోజ్‌లో అతడు జనాలకు టెన్షన్ డోస్ పెంచేశాడు. అతడికి హెల్మెట్ లేదు.. భయం లేదు.. కామన్ సెన్స్ లేదు..లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి స్కూటర్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కనిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫన్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిజీ రోడ్డుపై స్కూటర్ నడుస్తుండగానే ఆ వ్యక్తి బండిపై కాళ్లు మడిచి కూర్చున్నాడు. అలాగే హ్యాండిల్‌పై నుంచి రెండు చేతులూ తీసేసి, చుట్టూ వాహనాలు వెళ్తుండగానే ప్రయాణం కొనసాగించాడు. ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేసినట్టు కనిపించింది. దీంతో స్కూటర్ ఒకే వేగంతో ముందుకు సాగింది. స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కనిపించలేదని సమాచారం.ట్రాఫిక్ మధ్య అతడు ఈ విన్యాసం చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే వారి భద్రతకూ ప్రమాదం తెచ్చాడని మండిపడ్డారు. చాలామంది నెటిజన్లు లక్నో పోలీస్, యూపీ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఆ వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నా, నిర్లక్ష్య డ్రైవింగ్, విన్యాసాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నా ఇలాంటి ప్రమాదకర తీరుకు ఎందుకు ఫుల్స్టాప్ పడడం లేదని చాలామంది ప్రశ్నించారు.“నంబర్ లేని స్కూటర్, భద్రతా పరికరాలు లేవు, అసలు బాధ్యత అన్నదే లేదు. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తన ప్రాణాలనే కాదు, అమాయక ప్రయాణికుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నాడు. లక్నో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కఠిన గుణపాఠం చెప్పాలి” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.మరో వ్యక్తి స్పందిస్తూ.. “ఇది చక్రాలపై యోగా లాంటిదే.. కానీ, రోడ్డు జాగ్రత్త మాత్రం లేదు. ఒక్క గుంతనో, ఒక్కసారిగా బ్రేక్ వేయడమో, లేదా ఇతర వాహనం ఎదురైతే అంతే సంగతి. అతడికే కాదు, ఇతరులకూ ప్రమాదం. ఇలాంటి విన్యాసాలు చూసి ఇంకొందరు నేర్చుకోకుండా ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.क्या ऐसे स्टंट पर सख्त कार्रवाई जरूरी है?लखनऊ के गोमतीनगर इलाके में ट्रैफिक नियमों की खुलेआम धज्जियां उड़ाने का मामला सामने आया है. फन मॉल के सामने सड़क पर दौड़ रही एक बाइक पर बैठा युवक बेहद लापरवाही भरे अंदाज़ में नजर आया. युवक बाइक पर सामान्य तरीके से बैठने के बजाय पलथी मारकर… pic.twitter.com/khv81zXoox— zingabad (@zingabad) May 18, 2026 -
ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే
-
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
జిగ్నేష్ కవిరాజ్ LIVEలో డబ్బుల సంచులతో స్టేజ్ పై దూసుకొచ్చారు!
-
రైనోకు కోపం వస్తే ఇలా ఉంటది.. లక్కీగా!
-
తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్
జన్మనిచ్చేదే కాదు.. పునర్జన్మనిచ్చేదీ అమ్మే!. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన పిల్లలనే కాదు.. తన భర్త సోదరుడిని బిడ్డలను కూడా కాపాడిన ఓ తల్లి వీరోచిత త్యాగం ఇది. హృదయాలను కదిలించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలోని నైనీ బజార్లో మే 12న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల అర్చనా కేసర్వాని మృతి చెందింది. అయితే తన బిడ్డలను రక్షించుకునే క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు నిర్ధారించారు.గత మంగళవారం.. రాత్రి 9 గంటల సమయంలో క్రాకరీ వ్యాపారి అయిన సంజీవ్ కేసర్వాని(అర్చన భర్త) ఇంటి గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబం పై అంతస్తు టెర్రస్ పైకి చేరింది. పొగతో నిండిన వాతావరణంలో అర్చనా తన పిల్లలను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది. ముందుగా ఆమె ఒక ఏడాది కొడుకు రాఘవను బెడ్‌షీట్‌లో చుట్టి ఎదురింటి పొరుగువారికి అందించింది. అనంతరం పొరుగువారు ఏర్పాటు చేసిన మెట్ల సాయంతో కుమార్తెలు ప్రియాంశి (13 ఏళ్లు), శివాన్య (10 ఏళ్లు)ను సురక్షితంగా బయటకు పంపగలిగింది. చివరగా ఆమె తన భర్త సోదరుడి కొడుకు భతిజా లవ్‌ను కూడా రక్షించింది. అప్పటికే దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఆమె స్వయంగా బయటపడలేకపోయింది. సహాయక చర్యల అనంతరం గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమైంది. मां से बड़ा योद्धा कोई नहीं... बच्चों को बचाने में आग में जलकर मां की मौतप्रयागराज के नैनी बाजार इलाके में एक दर्दनाक हादसे में एक मां ने अपने बच्चों को बचाने के लिए अपनी जान कुर्बान कर दी. यह घटना 12 मई की रात की है, जब एक क्रॉकर्री कारोबारी के घर में अचानक भीषण आग लग गई.… pic.twitter.com/7M0fkMudgk— News Leader (@NewsLeaderLive) May 17, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానికులు ఆమెను "మాతృత్యాగానికి ప్రతీక"గా అభివర్ణించారు. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి నిరూపించిందనే అంటున్నారు. -
ఎనిమిదేళ్ల తర్వాత ఎయిర్‌షో.. ఢీ కొట్టి ముక్కలైన విమానాలు
అమెరికాలో ఘోరం సంభవించింది. ఎయిర్‌షోలో రెండు యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టి పేలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఐడాహో స్టేట్ మౌంటెన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ వద్ద ఈ ఘటన జరింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో రెండు అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాలు మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే విమానాలు పేలిపోయి ముక్కలైపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగసిపడగా, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బేస్‌ను తక్షణమే లాక్డౌన్ చేశారు. ఆదివారం మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.విమానాల్లో ఉన్న నాలుగు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే వారు పారా షూట్ల సహాయంతో కిందికి దిగారు. ఈ విషయాన్ని షో నిర్వాహకులు, అమెరికా నేవీ ధృవీకరించారు.Footage of the mid air collision between a pair of Navy Super Hornets/Growlers during the Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base moments ago. pic.twitter.com/yQqPavmSWk— OSINTtechnical (@Osinttechnical) May 17, 2026మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. "అత్యవసర సిబ్బంది అక్కడే ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్‌వేపై కూలి మరణించాడు. 2003లో థండర్బర్డ్స్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్లీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. -
ఆ తల్లి తన ప్రాణాల్ని పణంగా పెట్టి..
కొంచెంసేపు ఉంటే.. ఆ ఐదుగురి ప్రాణాలు పట్టాల కింద నలిగిపోయేవి. కానీ, సమయస్పూర్తితో ఆమె వ్యవహరించిన తీరు.. అదనంగా ఆ తల్లి చూపిన తెగువ.. వాళ్లను సురక్షితంగా బయటపడేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.శుక్రవారం ఉదయం బిహార్ షాహ్పూర్ పటోరీ రైల్వే స్టేషన్లో ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కాస్త ఉంటే ప్రాణాలు కోల్పోయేవారు. అయితే అందులో మమత అనే మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు బంధువులనూ రక్షించుకోగలిగింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు అయ్యాయి. వీళ్లంతా వైశాలి జిల్లా జందాహాలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రోసరా వెళ్లేందుకు టికెట్ తీసుకుని ఫ్లాట్‌ఫారమ్‌కు వెళ్తున్నారు. అయితే ఫుట్ఓవర్ బ్రిడ్జి ద్వారా కాకుండా పట్టాల ద్వారా దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫారమ్ మీద ఓ గూడ్స్ రైలు ఉంది. దాని కింద నుంచి దాటుతున్న టైంలో.. రైలు హఠాత్తుగా కదిలింది. అంతే.. ఆ దృశ్యం చూసిన అందరి గుండెలు గుభేల్మన్నాయి. వాళ్లు రైలు కింద నలిగిపోవడం ఖాయమని అంతా భావించారు. హాహాకారాలతో ఆ ప్రాంతం మారోమోగిపోయింది. కానీ, మమత సమయస్ఫూర్తి ప్రదర్శించింది. తన ఇద్దరు పిల్లలను కౌగిలించుకుని.. మిగతా వాళ్లనూ రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో సన్నని ఖాళీలో పట్టుకుని ఉండిపోయింది. అది గమనించిన కొందరు ఆమెకు చెయ్యి అందించారు. ఈలోపు గూడ్స్ వేగం పుంజుకోవడంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ క్రమంలో రైలు ఆమెను ఢీ కొట్టుకుంటూ పోవడంతో గాయాలు అయ్యాయి. ఆపై గూడ్స్ వెళ్లిపోవడంతో.. వాల్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న ప్రయాణికుల సాయంతో గాయపడిన మమతకు తక్షణ చికిత్స అందించగా.. ఆమె కోలుకుని వెళ్లిపోయింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించిన ధైర్యాన్ని ప్రజలు ప్రశంసించారు. “రెప్పపాటులో తీసుకున్న నిర్ణయం ఐదు ప్రాణాలను కాపాడింది” అని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అదే సమయంలో.. ఈ సంఘటన రైల్వే భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికులు ఎప్పుడూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడాలని అధికారులు మళ్లీ హెచ్చరించారు. షార్ట్‌కట్ ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఈ వీడియో చూశాక.. 'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు..’ అనకుండా ఉండగలరా?.. SHOCKING VISUALS 🚨A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3— Megh Updates 🚨™ (@MeghUpdates) May 15, 2026 A major accident was averted at Shahpur Patori railway station. The abductor was none other than a mother who risked her own life to save his children's #samastipur #Bihar https://t.co/vwgSvpyA1s pic.twitter.com/bQeGowUl2N— Siraj Noorani (@sirajnoorani) May 15, 2026 -
వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..
ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్‌ఫారమ్‌కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఫ్లాట్‌ఫారమ్ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. “ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఆయనను “జెంటిల్మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్ సో స్వీట్” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్ అవసరమా అంకుల్? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Indah A.L ᢉ𐭩 (@indaha.l) -
స్టూడెంట్ సాహసం..!జస్ట్ రూ. 16 వేలతో..
ఓ వ్యక్తి తలచుకుంటే అనితర సాధ్యమైనదంటూ ఉండదు అని నిరూపించాడు ఈ విద్యార్థి. విలాసవంతమైన స్పాన్సర్లు, ఎలాంటి సాహసయాత్ర చేసిన నేపథ్యం లేకుండా ఎవరెస్టుని చుట్టేయలని ఉత్సాహం మాత్రం ఆకాశమంత. ఏదైతేనేం తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతోనే ఎవరెస్టు బేస్ క్యాప్‌కు చేరుకుని ఓ చిన్నపాటి విజయం సాధించాడు పైగా తన వయసు యువకులకు జస్ట్ ఊహాలాంటి డ్రీమ్‌ని సాధ్యం చేసి..పరిమిత వనరులు, ఆర్థిక పరిస్థితి, మార్గదర్శక లేమి వంటివి ఏమీ పెద్ద అడ్డంకులు కావని ప్రూవ్ చేశాడు. కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కేశవ్ సునీష్ బీకామ్ విద్యార్ధికి ఎవరెస్టుని అధిరోహించడం అతని డ్రీమ్. అలా అని బాగా ధనవంతుల కుటుంబ నేపథ్యమా? అంటే అదీ కాదు. పోనీ సాహసయాత్రలు చేసిన చరిత్ర ఉందా ?అంటే అదీ లేదు. కానీ ఎలాగైనా ఆకోరిక నేరవేర్చుకోవాలన్న ప్రగాఢమైన కోరిక ఒక్కటే బలంగా ఉంది. అదే అతడిని ఇంత పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది. అందుకోసం అతను కూరగాయ దుకాణంలో సహాయకుడిగా, ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసిన పోదుపుతో ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ యాత్ర కోసం అతడ ఖర్చు చేసిందో ఎంతో తెలిస్తే విస్తుపోతారు. కేవలం రూ. 16 వేలతో ఈ డ్రిమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నాడు. అంత తక్కువ డబ్బుతో ఎలా సాధ్యం అంటే..మనసుంటే మార్గం ఉందని అంటాడు కేశవ్. నిజానికి ఆ స్టూడెంట్ ఆశయం సాధరణమైంది కాదు. ఎందుకంటే ఎవరెస్టు యాత్రకు అయ్యే ఖర్చు సుమారు రూ. 15 లక్షలు. అయితే ఎవరెస్టు శిఖరాగ్రం అతడి స్థోమతకు అందనిది, అందుకని చిన్న చిన్న దశలుగా విభజించుకుని ఒక్కో మైలు రాయిని చేరుకునేలా ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు కేశవ్. అలాగే తన స్థోమతకు అనుగుణంగా ఖర్చులు తగ్గించుకునేలా యాత్ర ప్లాన్ చేశాడు. సెకండ్ క్లాస్ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి సోనౌలి సరిహద్దు ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించి, కాలినడకన యాత్ర కోసం సల్లేరికి చేరుకున్నాడు.దాదాపు ఎనిమిది రోజులు పైయా, టెంగ్బోచే, డింగ్‌బోచే, లుబుచేలా గుండా ప్రయాణిస్తూ..చివరకు ఎవరెస్టుబేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. అలాగే క్యాంప్‌కు సమీపంలో ఉన్న గోరక్షెప్కు చేరుకోవడానికి 132 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. మధ్యమధ్యలో టెంట్ వేసుకుని నిద్రించాడు కూడా. అలాగే తన బడ్జెట్‌కి అనుగుణంగా స్వయంగా వండుకుని ఆహారం తినేవాడు. ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు..అతడు ఈ యాత్రను సెప్టెంబర్ 2025లో ప్రారంభించాడు. జనవరిలో తన అమ్మమ్మ మరణింతో మధ్యలోనే తిరిగి వచ్చేశాడు, కానీ సంకల్పం వదులుకోలేదు. ఆ తర్వాత చిన్న చితకా ఉద్యోగాల్లో చేరి డబ్బు ఆదా చేసి ఏప్రిల్ 7న అధిరోహణ పునః ప్రారంభించాడు. అలా రెండో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నాడు. అతడి కథ..చుట్టూ ఎలాంటి వనరులు లేకపోయినా..కనీసం మార్గనిర్దేశం లేకపోయానా..సాధించాలి అన్న తపన ఎవరెస్టు వరకు నడిపించింది. చాలా శ్రమకోర్చి సాధించిన విజయం ఇది. పైగా కేశవ్ జస్ట్ 21 ఏళ్లకే దాన్ని సాధించాడు. అయితే అతడు శిఖరాగ్రం చేరుకోకపోవచ్చు..సమీపం వరకు వెళ్లి అనుకున్నది సాధించాడు. నిజానికి ఎవరెస్టు శిఖరాగ్రం చేరుకోవడానికి బేస్‌క్యాంప్‌లో ఫిజికల్ శిక్షణ, వంటివి చాలానే ఉంటాయి. అయినా ఇంత సాధించిన కేశవ్‌కి అదేమంత కష్టమేమి కాదు. మరి అతడికి ఆల్‌ది బెస్ట్ చెబుదామా..! View this post on Instagram A post shared by Kesav Suneesh | Traveller 🇮🇳 (@kesav_on_go) (చదవండి: ట్రాక్టర్ డ్రైవర్ కుమారుడు స్పేస్ టెక్ కంపెనీ సీఈవోగా..!) -
మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్!
కంటెంట్, క్రియేటివిటీ ఉండాలేగానీ కొండల్లో కూడా మ్యాగీ అమ్మవచ్చు. భారీ ఆదాయాన్ని సంపాదించ వచ్చు. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి సక్సెస్ స్టోరీ తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. అసలేం జరిగిందంటే..కొండ ప్రాంతం.. చల్ల చల్లని గాలులు. అలాంటి టప్పుడు వేడి వేడిగా ఏదైనా తినడానికి దొరికతే, అదీ మ్యాగీ అయితే. ఇంకేముంది అద్భుతమైన కాంబినేషన్‌తో పర్యాటకులకు పండగే. ఈ ఆలోచననే క్యాష్ చేసుకున్నాడు. అలా అతని ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాలెంజింగ్ వీడియోలు చేసే దేవాన్ష్ త్యాగి అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్, కొండ ప్రాంతాలలో మ్యాగీ అమ్మితే ఒక రోజులో ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవాల నుకున్నాడు. అంతే క్షణ కోసం ఆలస్యం చేయ లేదు. చక్కటి లొకేషన్‌ను ఎంచుకున్నాడు. అక్కడ తాత్కాలికంగా ఒక బుల్లి కిచెన్ ఏర్పాటు చేశాడు. ‘‘కొండల్లో మ్యాగీ అమ్మి నేను ఎంత సంపాదించగలనో చూద్దాం" అంటూ ఒక వీడియో చేశాడు. కస్టమర్ల కోసం టేబుళ్లు, ప్లాస్టిక్ కుర్చీలతో స్టాల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.అలా దేవాన్ష్ తన స్టాల్లో రెండు రకాల మ్యాగీలను విక్రయించాడు. సాధారణ మ్యాగీ ప్లేటు రూ. 100, బటర్ మ్యాగీ ప్లేటు రూ. 120 ఇలా రెండు రకాలు అందించాడు. అంతే పర్యాటకులు, హైకర్లు మ్యాగీ లవర్స్ ఎగబడ్డారు. ఆ కొండాకోనల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వేడి వేడి మ్యాగీని ఆరగించడం ఈ వీడియోలో చూడవచ్చు. చూస్తుండగానే స్టాక్ అంతా అయిపోయింది. మొత్తానికి ఒక రోజులో దేవాన్ష్ సంపాదన అక్షరాలా రూ. 24 వేలు. కేవలం ఒక్క రోజులో ఇంత మొత్తం సంపాదించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Devansh Tyagi (@devanshtyagi_)నెటిజన్ల రియాక్షన్ఈ వీడియోకు 4.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేద్దామా?: "మేము కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి కొండల్లో మ్యాగీ కొట్టు పెట్టుకుంటాం" అని కొందరు సరదాగా కామెంట్ చేశారు. ఆ స్టాల్లో పనిచేయడానికి ఇంటర్న్స్ కావాలా? అని మరికొందరు తమాషాగా అడిగారు.అయితే, కొందరు నెటిజన్లు ఇక్కడ ఒక పాయింట్ లేవనెత్తారు. ఈ రూ. 24,000 అనేది కేవలం వచ్చిన ఆదాయం (Gross Revenue) మాత్రమేనని, అందులో ముడి పదార్థాలు, గ్యాస్, రవాణా ఖర్చులు తీసేస్తే నికర లాభం ఎంతో చెప్పాలని కోరారు. ఒక నెటిజన్ మాత్రం, "వంట చేయడానికి వాగు నీటిని వాడటం బాలేదు" అని విమర్శించారు. ఈ వైరల్ క్లిప్ ఆన్లైన్లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌లో చర్చను ఆసక్తికరంగా మారింది. -
ప్రసాదంగా నాణేలు : ఎక్కడుందీ గుడి? వీడియో వైరల్
తమిళనాడులోని ఒక ఆలయ ఉత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు ఇది కామన్. అలాగే వివిధ ఆలయాల్లో అందించే ప్రసాదాన్ని అత్యంత భక్తితో స్వీకరిస్తారు. ఇది ఇంకా సాధారణం. కానీ ఒక పూజారి భక్తులకు నాణేలను 'ప్రసాదం'గా పంపిణీ చేయడం చర్చకు దారితీసింది. దేవుడికి సమర్పించిన కానుకలనే ఇలా భక్తులకు తిరిగి పంచుతారట. దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది.@ramdevkar07 అనే యూజర్ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి, "విరాళాలు స్వీకరించడానికి బదులుగా ప్రసాదంగా డబ్బు ఇస్తున్న తమిళనాడు ఆలయం వైరల్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ఒక పూజారి భక్తులకు ప్రసాదంలా నాణేలను పంచుతుండటం విశేషం. డొనేషన్లు తీసుకోవడానికి బదులు డబ్బును ప్రసాదంగా ఇస్తున్న ఆలయం అంటూ ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే,ఆ పూజారి నోట్లో సిగరెట్ (చుట్ట) ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కల్పవృక్ష స్వామి ఆలయం; ఇక్కడ భక్తులకు ఆలయ కానుకల సొమ్మునే ప్రసాదంగా అందజేస్తారు. సనాతన హిందూ ధర్మానికి జై! అంటూ మరో వీడియో కూడా ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. Tamil Nadu temple goes viral for giving money as prasad instead of taking donations. pic.twitter.com/8Uud7gNVXv— ʀᴀᴍ (@ramdevkar07) May 12, 2026ఇలాంటి ఆలయం నిజంగా ఉందాతమిళనాడులోని శ్రీ వరం తారుమ్ మాలిగైపరై కరుప్పసామి ఆలయంలో ఒక ఉత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. అక్కడ భక్తులకు ఇచ్చే ఈ నాణేలను స్థానికంగా "పిడి కాసు" (Pidi Kasu) అని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతంలోని కొన్ని జానపద సంప్రదాయాలలో భాగంగా ఇలా నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరుప్పసామిని గ్రామ దేవతగా, శక్తివంతమైన రక్షకుడిగా (కావల్ దైవం) కొలుస్తారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం దేశవాళీ చుట్టలు, మద్యం వంటివి నైవేద్యంగా సమర్పించడం చాలాకాలంగా వస్తున్న ఆచారం. గ్రామ సరిహద్దుల్లో ఉండే ఈ ఆలయాల్లో జరిగే ఆచారాలు కూడా భిన్నంగా ఉంటాయి.ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?నెటిజన్ల స్పందనఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గుళ్లో నోట్లో సిగరెట్ పెట్టుకోవడం ఏంటి? ఇది అసహ్యంగా ఉంది, ఇలాంటి వాటిని ఆపేయాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో రకమైన బిజినెస్ అని, పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వసూలు చేసే ఎత్తుగడ అని మరికొందరు విమర్శించారు.ये तमिलनाडु की कलूपा स्वामी मंदिर है,यहां भक्त को मंदिर के चढ़ावा पैसे भी प्रसाद रूपी दिया जाता है..जय सत्य सनातन हिंदू धर्म 🙏 ॐ#सनातन_धर्म #तमिलनाडु pic.twitter.com/disGZjbrbd— Govind Jha (@Govind_Jha24) May 13, 2026 అయితే ఇక్కడి స్థానిక సంప్రదాయాల గురించి తెలిసిన వారు మాత్రం సానుకూలంగా స్పందించారు. ఇది కరుప్పసామి ఆలయం, అక్కడ చుట్టలు సమర్పించడం ఆచారం. ఆయన గ్రామ రక్షకుడు, ఆయన ఆచారాలు ఇలాగే ఉంటాయంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి, ఈ వీడియో దక్షిణ భారత జానపద సంప్రదాయాలు ఆధునిక సామాజిక విలువల మధ్య చర్చను రేకెత్తించింది.ఇదీ చదవండి : పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం -
హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? కావాలని తప్పించారా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం అయిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ఆటతీరుతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ముంబై ఆడిన గత రెండు మ్యాచ్‌లకు వెన్నునొప్పి గాయంతో పాండ్యా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా మే 14న (గురువారం) పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలని అతడిని జట్టు నుంచి తప్పించారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాండ్యా తన ప్రాక్టీస్‌లో బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ కసితీరా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పాండ్యాకు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేల జయవర్దనే మాత్రం పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు పాండ్యా త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీం ప్రయత్నాలు చేస్తుందని తెలిపాడు. పాండ్యా పూర్తిగా కోలుకునేంతవరకు రిస్క్ చేయకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. పాండ్యా తాను ఫిట్‌గా ఉన్నట్లు ఒకవైపు వీడియో రిలీజ్ చేయడం, అదే సమయంలో జయవర్దనే పాండ్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం చూస్తుంటే పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలనే జట్టు నుంచి తప్పించారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాండ్యా కూడా తన అగ్రెసివ్ ప్రవర్తనతో జట్టులో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.ఇటీవలే పాండ్యా.. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని అన్‌ఫాలో చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇదే విషయమై ముంబై ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి 'ఈ సీజన్లో పాండ్యా ముంబై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, వచ్చే సీజన్లో వేరే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటూ' కామెంట్లు చేస్తున్నారు. 'పాండ్యా జట్టులోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. అతడి రాక వల్ల ఉపయోగం లేదు' అని మరికొందరు పేర్కొన్నారు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది.Hardik pandya practicing in the nets. He just put a stop on alll the rumours 🌚 pic.twitter.com/AjG8Fg9gW9— Gagan Choudhary (@trigguuuu) May 12, 2026చదవండి: ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ! -
హాఫ్ రేట్‌కే వందే భారత్ టికెట్లు!
రేటు కాస్త ఎక్కువై అయినా.. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఎక్కుతున్నారు. అయితే ఈ ‘స్పీడ్ రైలు’లో పరిస్థితులు కొత్తలో ఉన్నట్లు కనిపించడం లేదు. కోచ్‌ల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం.. నాణ్యతలేని ఆహారం.. ఇలా ఏదో ఒక అంశంతో వివాదాలతో విమర్శల పాలవుతోంది. తాజాగా..మరో వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. వందేభారత్ టికెట్‌ను ఓ టీసీ సగం రేటుకే అమ్మే ప్రయత్నం చేయగా.. ఓ ప్రయాణికుడు ఆ తతంగాన్ని రికార్డు చేసి నెట్లో వదిలాడు. అదేంటి?.. ఆ టికెట్ ఆన్లైన్లోనే కదా దొరికేది అనుకుంటున్నారా?.. అసలేం జరిగిందో చదివేయండి.. ఫ్లాట్‌ఫారమ్ మీద కూర్చున్న కొందరు ప్రయాణికుల దగ్గరకు వెళ్లిన టీసీ.. టికెట్ చూపించడమని అడిగాడు. మిగతా వాళ్ల దగ్గర టికెట్ ఉందని.. తన దగ్గర టికెట్ లేదని ఒకతను బదులిచ్చాడు. దీంతో వందే భారత్ ఎక్కాలని ఉందా? అని అడిగాడు. రేటు ఎంత అని అడిగితే.. రూ.700 విలువైన వందే భారత్ టికెట్‌ను రూ.380కే ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు.. అదంతా రికార్డు చేశాడు.. ఇది అధికారికం కాదు, కానీ, నా చేతుల్లో పని. రైలు ప్రయాణానికి అనుమతిస్తాను అంటూ ఆ టీటీఈ వ్యాఖ్యానించాడు. అయితే వద్దని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. బీహార్ దానాపూర్ డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ రైలులో ఈ ఘటన జరిగింది. పాట్నా రైల్వే డివిజన్లో పని చేసే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఈ పని చేయబోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.Vande Bharat ₹750 ticket was being arranged by the TTE for just ₹380.⁰This guy records it and made it viral😭 pic.twitter.com/hjHH35rPAC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2026రైల్వే సేవా (Railway Seva), దానాపూర్ డీఆర్ఎం ఈ వైరల్ వీడియోపై అధికారికంగా స్పందించింది. సంబంధిత టీటీఈని విచారించి.. అతన్ని సస్పెండ్ చేసింది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ చర్యను అవినీతి, అధికార దుర్వినియోగంగా విమర్శించారు. మరికొందరు వ్యంగ్యంగా "ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి" అంటున్నారు. ఇంకొందరు మాత్రం టీటీఈ ఆ ప్రయాణికుడికి సహాయం చేయాలనుకున్నాడని.. కానీ, అతను ఇలా చేస్తాడని ఊహించలేదని అభిప్రాయపడ్డారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్లు అధికారికంగా కేవలం ఐఆర్సీటీసీ IRCTC వెబ్సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారానే లభిస్తాయి. కొన్ని రూట్లలో బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు సీట్లు(కరెంట్ బుకింగ్) లభించవచ్చు. ఆన్లైన్ బుకింగ్ తప్ప ఇతర మార్గం లేదు. -
చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు!
ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ముంబై, లక్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీ20 మ్యాచ్‌లు కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. అందుకే సీజన్లో అన్ని లీగ్ మ్యాచ్‌లు పూర్త య్యాకే ప్లేఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ రానుంది. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే అభిమానులకు, ఆటగాళ్లకు చీర్‌గర్ల్స్ తమ నృత్యాలతో అలరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఆదివారం రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన చీర్ గర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. అందులో ఒక చీర్‌గర్ల్ అక్కడే ఉన్న పోలీసులను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గర్ల్స్ నృత్యాలను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియన్స్ పంజాబ్‌తో తలపడనుంది.Raipur police enjoying watching the Mumbai Indians cheerleaders during the MI vs RCB match.😅 pic.twitter.com/xichgo4HEw— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 11, 2026చదవండి: అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా! -
దయచేసి హాస్పిటల్ కి రావద్దు .విదేశాలకు వెళ్తున్న వైరల్ డాక్టర్ ...
-
'చపాతీల కంటే బౌలర్లను ఉతకడం మేలు'
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. జట్టు వరుస ఓటములు చవిచూస్తున్నప్పటికీ వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో దనాధన్ ఆటను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి పునాది వేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ 11 మ్యాచ్‌ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన రాజస్తాన్ క్రమంగా ఓటములు ఎదుర్కొంది. 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. మ్యాచ్‌కు వారం రోజులు గ్యాప్ రావడంతో రాజస్తాన్ ఆటగాళ్లు బ్రేక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ యాజమాన్యం తాజాగా ఆటగాళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభవ్ సూర్యవంశీ చపాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభవ్ మాస్టర్ చెఫ్ అవతారంలో చపాతీలు కాలుస్తూ కనిపించాడు.'నేను చేసే చపాతీలతో పోలిస్తే మా అమ్మ చేసే చపాతీలు భిన్నంగా ఉంటాయి. చపాతీలు కాల్చడం కంటే బౌలర్లను ఉతకడం మేలు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. వైభవ్ చపాతీలు కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.𝘔𝘶𝘮𝘮𝘺 𝘬𝘦 𝘳𝘰𝘵𝘪 𝘴𝘦 𝘻𝘺𝘢𝘥𝘢 𝘨𝘰𝘭 𝘳𝘰𝘵𝘪 𝘩𝘢𝘪 😂💗 pic.twitter.com/qOqthFPWXU— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2026చదవండి: ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత! -
ఆమ్మో ఇదేం బావి అవాక్ అవుతున్న కాలనీ వాసులు
-
కనోలి చర్యకు చాహల్ పిచ్చి చూపులు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట ప్రియాన్ష్ ఆర్య మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివర్లో శ్రేయస్, కన్నోలి, సూర్యాంశ్లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో కూపర్ కన్నోలి కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చర్య సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 14.3 ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని కనోలి ఫ్రంట్ ఫుట్ వచ్చి భారీ సిక్సర్ సంధించాడు. పవర్ స్ట్రోక్ ఉపయోగించడంతో బంతి స్టేడియం అవతల పడింది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ డగౌట్లో ఉన్న చాహల్.. కనోలి కొట్టిన భారీ సిక్స్‌ను కన్నార్పకుండా చూస్తూ.. ‘పోయింది.. బంతి పోయింది’ అన్న తరహాలో చేతితో సైగలు చేయడం కెమెరా కంటికి చిక్కింది. చాహల్ చర్య అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. చాహల్ వీడియోపై మీరు ఒక లుక్కేయండి. మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
రన్‌వేపై సూసైడ్?? షాకింగ్ వీడియో వెలుగులోకి..
అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం తాలుకా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ వ్యక్తి రన్‌వేపైకి దూసుకురాగా.. విమానం అతన్ని ఢీ కొట్టి ఇంజిన్లోకి లాగేసింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే అతను ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కొలరాడో స్టేట్ డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో లాస్ ఏంజెల్స్‌కి బయల్దేరిన ఫ్రంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం(Airbus A321).. రన్‌వేపై వేగంగా దూసుకెళ్తూ హఠాత్తుగా పెద్ద శబ్దం చేస్తూ ఆగిపోయింది. దీంతో విమానంలో మంటలు వ్యాపించాయి. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఎమర్జెన్సీ స్టయిడ్స్ ద్వారా అందరినీ బయటకు తెచ్చారు. 12 మందికి స్వల్పగాయాలు కాగా.. మరో ఐదుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే..రన్‌వేను మూసేసి దర్యాప్తు ప్రారంభించారు. రన్‌వేపై దూసుకెళ్తున్న సమయంలో బిగ్గరగా శబ్దం వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. ఓ వ్యక్తిని ఢీ కొట్టినట్లు పైలట్ చెప్పాడు. దీంతో విమానం ఇంజిన్ నుంచి ఓ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రన్‌వేపై జరిగిన ప్రమాదంలోనే అతను జరిగి ఉంటాడని భావించారంతా. ఈ నేపథ్యంలో షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్ సిబ్బంది కాదని అధికారులు తేల్చేశారు. ‘‘దొడ్డిదారిన ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ దూకిన ఓ వ్యక్తి.. రన్‌వేపై ఠీవిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలోనే 180 మైళ్ల వేగంతో దూసుకొచ్చిన విమానం అతన్ని ఢీ కొట్టింది. ఆ వెంటనే అతన్ని ఇంజిన్లోకి లాగేయడంతో.. మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. రన్‌వేపై విమానం దూసుకు రావడం అతను గమనించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని.. బహుశా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే వచ్చి ఉంటాడు’’ అని డెన్వర్ పోలీసులు ప్రకటించారు.ఫెన్సింగ్ దూకిన రెండు నిమిషాల్లోనే అతని ప్రాణాలు పోయాయి. అతను ఎవరనేది తేలితేనే.. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుంది అని ఓ అధికారి చెబుతున్నారు. మరోవైపు.. ఉగ్ర దాడి, ప్రమాదవశాత్తూ మరణం కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి..ABD’de Frontier Airlines’a ait Los Angeles seferini yapan yolcu uçağı, Denver Uluslararası Havalimanı’nda kalkış sırasında pistte bulunduğu belirtilen bir kişiye çarptı.Motorun kısmen içine çekilen kişi yaşamını yitirirken, olay kısa süreli yangına neden oldu. Uçaktaki 231… pic.twitter.com/8xfpqn8shE— Dış Ses (@disseshaber) May 11, 2026 -
ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్‌కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..
ఒక బెంగళూరు వ్యక్తి తన ఎలక్ట్రిక్ యూని సైకిల్‌పై రోజూ చేసే ప్రయాణg ఓ ట్రాఫిక్ పోటీసులో కుతుహాలం రేపి, ఆ వ్యక్తిని ఆపి మరి దాని గురించి తెలసుకునేలా చేసింది. చివరికి ఆ పోలీసు ఒక సారి ఆ సైకిల్ని ట్రై చేసి చూశాడు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జెరోమ్ ఆనంద్ అనే ఆ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆయన రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికి ఆ ఎలక్ట్రిక్ యూని సైకిల్‌పై వెళ్తుంటారు. ఎప్పటిలానే ఆ రోజు కూడా సాధారణ ప్రయాణంగా ప్రారంభమైన తన రైడ్ చివర్లో అసాధారణంగా మారింది. ఆయన ఆఫీస్ నుంచి ఇల్లు జస్ట్ 25 కి.మీటర్లే కావడంతో ఆ ఒంటి చక్ర వాహనంపై రోజు వెళ్తుంటాడాయన. అందులోనూ బెంగళూరు ట్రాఫిక్‌లో ప్రయాణించడం ఎంత సాహసమో తెలియంది కాదు. ఆ రోజు కూడా ఆనంద్ ఎప్పటిలానే తన ఒంటి చక్ర వాహనంపై ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నడు. ఇంతలో తన జర్నీకి ట్రాఫిక్ పోలీసుల రూపంలో సడెన్ బ్రేక్ పడింది. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపుతారు. ఆయన ఇలా ప్రయాణించడం కూడా ఏదైన ట్రాఫిక్ ఉల్లంఘన ఏంటీ అనుకుని ఆగిపోతాడు. వాళ్లు ఈ వాహనంపై ఎలా ప్రయాణిస్తారు వంటి కుశల ప్రశ్నలు అడుగతారు. దాంతో అతను ఆ వాహనం ఫీచర్స్ గురించి సవివరంగా వివరించడమే కాదు రైడ్ చేసి చూస్తారా అని అడుగుతాడు. దాంతో ఆ ట్రాఫిక్ పోలీస్ ఆనంద్ వాహనంపై ఎక్కి సరదాగా రైడ్ చేస్తాడు కూడా. ఆ సైకిల్‌పై రైడ్ చేయడంలో ఆనంద్ పోలీస్‌కి హెల్ప్ చేస్తాడు కూడా. అయితే ఈ వాహనంతో పెట్రోల్ టెన్షన్, పార్కింగ్ హైరానా ఉండదని కూడా వివరిస్తాడు. పైగా ట్రాఫిక్ని సులభంగా నిర్వహించొచ్చు, చాలా దూరం సునాయాసంగా ప్రయాణించొచ్చు అని ఆనంద్ ఆ ట్రాఫిక్ పోలీసులకు వివరిస్తాడు. ఆయన ఆ వీడియోకి "ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు... చివరికి అతను నా ఈయూసీని నడపడంతో ముగిసింది" అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు ఆనంద్. అంతేగాదు ఏమో ఎవరు చెప్పగలరు ఏదో ఒక రోజు ట్రాఫిక్ పోలీసులు కూడా బెంగళూరు రోడ్లపై EUC తో గస్తీ కాయొచ్చేమో..అని చమత్కిరిస్తూ పోస్ట్‌ని ముగించాడు. View this post on Instagram A post shared by Jerome anand (@jro_thestreetrider) (చదవండి: అమ్మగా గర్వించే క్షణం..!) -
అమ్మగా గర్వించే క్షణం..!
పిల్లలు ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అత్యంత అపురూపమైన క్షణం కూడా. మన పెంపకానికి సార్థకత అంటే పిల్లలు మంచి స్థితిలో ఉండేటమే కదా..!. అలాంటి భావోద్వేగపు ఆనందాన్నే దక్కించుకుంది ఈ మహిళ. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గంజ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.ఆ వీడియోలో మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌కు చెందిన మహిళ తన కొడుకుని అభినందిస్తూ కనిపిస్తుంటుంది. కూరగాయలు అమ్ముకునే ఆ మహిళ అకస్మాత్తుగా తన కొడుకు రావడం చూస్తుంటుంది. అతడు చిరునవ్వుతో ఓ శుభవార్తతో వస్తూ ఆమె కాళ్లపై పడిపోతాడు. ఆ విషయం ఏంటో తన కుమారుడు నోటితో విని సంతోషంతో ఉబ్బితబ్బిబవ్వుతుంది. అంతేగాదు కొడుకుని ఆత్మీయంగా కౌగిలించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. అక్కడున్న కుమారుడి స్నేహితులు రంగులు చల్లుతు వాళ్ల వేడుకుని మరింత ఆనందభరితంగా మార్చడం స్పషంగా కనిపిస్తుంటుంది. ఆ తల్లి తన కుమారుడిని పాఠశాలకు పంపే స్థోమత లేక జీవితమంతా కాలిబాటన కూరగాయలు అమ్ముతూ ఎంతో శ్రమకోర్చి చదివించుకుంది. తన కుమారుడు గోపాల్సావంత్ చదువు కోసం ఆమె మహారాష్ట్రలో కాలిబాటన ఎండలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించింది. CRPFకు ఎంపికైన వెంటనే, గోపాల్ నేరుగా తన తల్లి పనిచేస్తున్న కూరగాయల మార్కెట్ వద్దకు కాలిబాటన వెళ్లి..ఆమె పాదాలపై పడి తాను సీఆర్పీఎఫ్గా ఎంపికయ్యానంటూ చెప్పాడు. ఒక్కసారిగా ఇద్దరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి గొప్ప విజయం వెనుక ఓ తల్లి అపారమైన త్యాగం తప్పక ఉంటుందని ఈ సంఘటన అత్యంత శక్తిమంతంగా గుర్తుచేస్తోంది కదూ..! అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేగాదు పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాక్షలు అంటూ తన పోస్ట్‌ని ముగించారు ఆనంద్ మహీంద్రా.Gopal Sawant’s mother spent every day under the sun selling vegetables on a Maharashtra sidewalk just to keep his education on track.After being selected for the CRPF, Gopal went straight to the dusty Kudal footpath where his mom was working. In front of her vegetable crates,… pic.twitter.com/e5EMNXLRXl— anand mahindra (@anandmahindra) May 10, 2026 (చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..) -
ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జూలు విదిల్చింది. లక్నో సూపర్‌జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే సీఎస్కే విజయంలో ఉర్విల్ పాత్ర కీలకం. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 8 బంతుల్లోనే 41 పరుగులు చేసిన ఉర్విల్ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్థసెంచరీ సాధిస్తాడనిపించింది. కానీ ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్స్ తీయడంతో 13 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అయితే ఉర్విల్ ఫిఫ్టీ మార్క్ చేరిన ఆనందంలో అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A record knock 🤯A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛 Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid— IndianPremierLeague (@IPL) May 10, 2026హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే ఉర్విల్ తన ప్యాంటు జేబులో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంలో ఉన్న సందేశాన్ని అభిమానులకు చూపించాడు. అందులో 'ఇది నీకోసం పప్పా' అని రాసి ఉన్న మెసేజ్ కెమెరా కంటికి చిక్కింది.👉 ఇదే మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఉర్విల్ తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. తద్వారా ఒక ఇన్నింగ్స్‌లో తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఉర్విల్ నిలిచాడు. అంతకముందు ఐపీఎల్లో తొలి 8 బంతుల్లో 33 పరుగులు రావడమే ఉత్తమంగా ఉంది. తాజాగా ఉర్విల్పటేల్ దానిని బద్దలు కొట్టాడు.6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣6️⃣❗🔥Urvil Patel is unleashing absolute carnage at Chepauk! 💥🏏Will he script the fastest fifty in #TATAIPL? 👀🔥#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvLSG | LIVE NOW 👉 https://t.co/niGR0vFDDY pic.twitter.com/86xCo1SXsh— Star Sports (@StarSportsIndia) May 10, 2026👉 సీఎస్కే తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన జాబితాలో ఉర్విల్ రెండో స్థానంలో నిలిచాడు. లక్నోతో మ్యాచ్‌లో ఉర్విల్ 282.6 స్ట్రైక్‌రేట్ 23 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సురేశ్ రైనా (348 స్ట్రైక్‌రేట్, 25 బంతుల్లో 87 పరుగులు) ఉన్నాడు. అంబటి రాయుడు (266.6 స్ట్రైక్‌రేట్, 27 బంతుల్లో 72 నాటౌట్), ఎంఎస్ ధోని (255 స్ట్రైక్‌రేట్, 20 బంతుల్లో 51 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (247.82 స్ట్రైక్‌రేట్, 23 బంతుల్లో 57 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉 మ్యాచ్ విజయం అనంతరం ఉర్విల్ మాట్లాడుతూ.. ‘నా మనసులో ఏమీ లేదు, కానీ నేను పరిస్థితికి తగినట్లుగా బ్యాటింగ్ చేయాలని భావించాను. స్థిరమైన బేస్ ఉంచుకుని బ్యాటింగ్ ఆడమని కోచ్ సలహా ఇచ్చారు. నేను అదే పాటించాను. వికెట్ పల్లంగా ఉందని, దానికి సిద్ధంగా ఉండమని రుతురాజ్ చెప్పాడు. ఇది మినహా నాకు ఏమీ చెప్పలేదు. నన్ను స్వేచ్ఛగా ఆడనిచ్చాడు. అందుకే ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: వైభవ్‌పై రబాడ సంచలన వ్యాఖ్యలు -
అప్పుడు లంచం తీసుకుంటూ దొరికి.. ఇప్పుడు సీఎంగా ప్రమాణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ఆయన పాత వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. గతంలో సువేందు అధికారి టీఎంసీలో ఉన్న సమయంలో నోట్ల కట్టలను లంచంగా తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయనపై అవినీతిపరుడంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడేమో ఆయనను ఆశీర్వదిస్తూ సీఎం కుర్చిలో కూర్చోబెట్టారని పలువురు నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.‘‘మ్యాథ్యూ శామ్యుయేల్ అనే పాత్రికేయుడు 2014లో తహల్కా పత్రిక తరఫున నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సువేందు అధికారి ఓ గదిలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని రహస్యంగా చిత్రీకరించి బయటపెట్టింది ఆ స్టింగ్ ఆపరేషన్. అందులో టీఎంసీ నేతల్లో పలువురు లంచాలు తీసుకుంటూ కనిపించారు. వారిలో సువేందు అధికారి కూడా ఉన్నారు. 2016 ఎన్నికల వేళ బీజేపీ ఈ వీడియోను బాగా ప్రచారం చేసింది. తర్వాత సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాత తమ అధికారిక ఛానల్ నుంచి ఆ వీడియోను ఆ పార్టీ తొలగించింది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఈ గొప్ప వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొత్తం బీజేపీ శ్రేణులు సువేందును పొగడటానికి ఒక్కటయ్యారు. నైతికత ఏమైంది? నైతిక సూత్రాలు ఏమయ్యాయి?’’ అంటూ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. సువేందు అధికారి లంచం తీసుకున్న వేళ తీసిన వీడియోను కూడా సంజయ్ రౌత్ పోస్ట్ చేశారు.२०१४ मध्ये तहलका मॅगझिनच्या पत्रकार मॅथ्यू सॅम्युअल यांनी नारदा स्टिंग ऑपरेशन केले.TMC चे अनेक मोठे नेते लाच घेताना पकडले गेले, त्यात सुवेंदु अधिकारी देखील होते.२०१६ च्या निवडणुकीत BJP ने या व्हिडिओला प्रचंड प्रमोट केले,पुढे जेव्हा सुवेंदु भाजपात आले, तेव्हा BJP ने आपल्या… pic.twitter.com/YQGvYYkbTC— Sanjay Raut (@rautsanjay61) May 9, 2026మీడియా సమావేశంలోనూ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం చేశారని, కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై బీజేపీ పెద్ద ఎత్తున ఓ ప్రచారం చేసిందని చెప్పారు. ఆయన అవినీతిని బయటపెట్టిందని, కెమెరా ముందు లంచాలు తీసుకుంటున్న దృశ్యాలు కూడా చూపించిందని అన్నారు. సువేందు అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాలు పోస్టులతో నిండిపోయాయని, ఈడీ దాడులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.కాగా, సువేందు అధికారి లంచాలు తీసుకుంటూ కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారంటూ గతంలో ప్రధాని మోదీ విమర్శించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘2016లో కెమెరా ముందు లంచం తీసుకున్నారని సువేందు అధికారిపై మోదీ విమర్శలు చేశారు. 2021లో సువేందు బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ వాషింగ్ మెషీన్లో శుభ్రం చేయటానికి మోదీకి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయనను మోదీ ఆశీర్వాదిస్తున్నారు. అవినీతిపై మోదీ పోరాటాన్ని ఎవరూ సందేహించకూడదు’’ అంటూ మరొకరు చురకలు అంటించారు. In 2016, Modi attacked Suvendu Adhikari for taking bribe on camera.In 2021, Suvendu joined the BJP and Modi took 5 years to wash him in the BJP washing machine.Now, Modi blesses him as he takes oath as a CM. No one should doubt Modi’s fight against corruption. pic.twitter.com/ldkTi6qvp5— Shantanu (@shaandelhite) May 9, 2026यह मोदीजी अपने ही बनाए हुए मुख्यमंत्री सुवेनदू अधिकारी की बात कर रहे हैं! pic.twitter.com/RcfS0JXASQ— Prashant Bhushan (@pbhushan1) May 9, 2026 -
మీ నీడ మాయం.. భాగ్యనగరంలో అరుదైన వింత దృశ్యం
-
కొత్త హెయిర్ స్టైల్ కోసం సెలూన్ కి వచ్చిన కోతి
-
స్వీట్ తినలేదని వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు
-
వరుడి అనూహ్య మరణం, పెద్దల షాకింగ్ నిర్ణయం
బిహార్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బంధుమిత్రులు, పెళ్లి వేడుకలతో కళకళలాడుతున్న ఉన్నట్టుండి విషాదంగా మారిపోయింది. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో అంతా నివ్వెర పోయారు. కానీ పుట్టెడు దుంఖాన్నిగుండెల్లో దాచుకుని ఆ శుభకార్యాన్ని జరిపించారు. అదేంటి.. అదెలా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాంటే ఈ కథనం చదవాల్సిందే.ఒక వైపు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకును కోల్పోయిన బాధ, మరోవైపు బాధ్యతగా జరిపించిన పెళ్లి.. ఈ సంఘటన చూస్తుంటే కాలం ఎంత క్రూరమైనదో కదా అనిపించకమానదు. దంపతులిద్దరూ సంతోషకరమైన వేడుకగా కలకాలం గుర్తుంచు కోవాల్సిన మధురమైన క్షణాలు కాస్తా జీవితకాల దుఃఖంగా మారిపోవడం విధి విచిత్రమే. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటే ఇదేనేమో!వివరాల్లోకి వెళ్తే.. ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరిపించే సందడిలో ఉన్నాయి ఇరు కుటుంబాలు. ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. మరోవైపు వరుడు తన బంధుమిత్రులు, మేళతాళాలతో కలిసి పెళ్లి వేదిక వైపు ఊరేగింపుగా బయలుదేరాడు. అందరూ ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకొంటున్న సమయంలో, వరుడు ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద తీవ్రతకు వరుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వార్త తెలియగానే అందరూ నిశ్చష్టులైపోయారు. సంతోషంతో నిండిపోవాల్సిన ఇరు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఆటపాటలతో సందడిగా ఉన్న వాతావరణం అంతా హాహాకారాలతో నిండిపోయింది. ఇక్కడే బంధవులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవంఅనూహ్య నిర్ణయంఅయితే, ఈ ఘోర విషాదం జరిగిన తర్వాత ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సామాజిక ఆచారాలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వరుడి కుటుంబ సభ్యులు గుండెలు దిటవు చేసుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన వరుడి స్థానంలో, అతని తమ్ముడికి ఇచ్చి వధువుకు వివాహం చేయాలని నిర్ణయించారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి ఆగిపోకూడదనే ఉద్దేశంతో, పెళ్లి పీటల మీద తమ్ముడిని కూర్చోబెట్టి వివాహ క్రతువును పూర్తి చేశారు. విషాద ఛాయల మధ్యే ఆ వివాహం ముగిసింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే వధూవరులు ఈ తంతును ముగించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 🚨SHOCKING | Groom died in a horrific accident while on the way to his own wedding, after which the bride was married to his younger brother with the family's consent. Both cry inconsolably pic.twitter.com/KYow2jVOJ4— The Tatva (@thetatvaindia) May 7, 2026స్థానికుల భిన్నాభిప్రాయాలుఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సామాజిక ఒత్తిడి, ఆచారాల దృష్ట్యా ఆ కుటుంబం తీసుకున్నది చాలా కష్టమైన నిర్ణయమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. -
మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్ నేత
తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ.. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.Intern: Shocking news. A newly elected young woman MLA was seen being forcibly hugged by a senior leader.Rajdeep: What is this party culture? What example are we setting? Netas don’t even know how to conduct themselves.Intern: Cherian Philip tried to forcibly hug Kollam MLA… pic.twitter.com/JqTvSKEIoI— Lala (@FabulasGuy) May 7, 2026ఒక్కసారిగా షాక్..బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఒక ఎమ్మెల్యే..ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
PMJ చోరీ కేసులో షాకింగ్ ట్విస్ట్ లాడ్జి యజమానితో దుండగుల ఫోన్ కాల్ వైరల్
-
భోరున విలపిస్తున్న మాజీ మిస్ ఇండియా : కారణం?
బాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (Celina Jaitly) ఒకపుడు అందాల ప్రపంచాన్ని ఏలిన తార. ఇపుడు అటు తీరని కడుపుశోకం, ఇటు తల్లిగా బిడ్డల్ని కలిసే పరిస్థితి లేక అల్లాడిపోతోంది. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అత్యంత బాధాకరమైన పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేయడం అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. భర్త పీటర్ హాగ్ నుండి విడాకులు తీసుకుంటున్న సమయంలో, తన పిల్లలను కలుసు కోనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, తన పిల్లలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, కనీసం వారితో మాట్లాడేందుకు కూడా అనుమతి లభించడం లేదని ఆమె ఆరోపించారు. సమాధిలో నిద్రిస్తున్న తన బిడ్డను కలుసుకోవడం తప్ప తనకు మరో గత్యంతరం లేదంటూ వాపోతున్నారు. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial)కుమారుడి సమాధి వద్ద కన్నీటి పర్యంతంసెలీనా ఆస్ట్రియాలో ఉన్న తన దివంగత కుమారుడు శంషేర్ సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడుస్తూ, దాన్ని శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. విడాకుల విచారణ కోసం ఆస్ట్రియా వెళ్లిన తనకు, జీవించి ఉన్న తన ముగ్గురుపిల్లలను కలిసే అవకాశం ఇవ్వలేదని, కేవలం మరణించిన కుమారుడిని మాత్రమే కలుసు కోగలిగానని ఆమె అత్యంత వేదనతో పేర్కొన్నారు. భర్త కెరీర్ కోసం తాను భారతదేశాన్ని, తన తల్లిదండ్రులను, సినిమా వృత్తిని వదులుకుని దుబాయ్, సింగపూర్, ఆస్ట్రియా వంటి దేశాలకు తిరిగానని గుర్తు చేసుకున్నారు. చివరికి తన ఆస్తులను కూడా పోగొట్టుకున్నానని, వేధింపులకు గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తన పిల్లలకు తనపై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా 'బ్రెయిన్ వాషింగ్' చేస్తున్నారని, మీడియాలో తనపై తప్పుడు కథనాలు వచ్చేలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సామరస్య పూర్వకంగా విడిపోవాలని తాను ప్రయత్నించినప్పటికీ, తన వద్ద ఉన్న మిగిలిన ఆస్తుల కోసం అవతలి పక్షం అహేతుకమైన డిమాండ్లు చేస్తోందని సెలీనా పేర్కొన్నారు.ఒక తల్లిగా తన బాధను ప్రపంచానికి తెలియజేయడానికే ఈ వీడియోను షేర్ చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.కాగా సెలీనా జైట్లీ ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్(Peter Haag)ను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు (ట్విన్స్ విన్స్టన్-విరాజ్ మరియు చిన్న కుమారుడు ఆర్థర్) ఉన్నారు. ఆర్థర్ జంటగా పుట్టిన శంషేర్ అనారోగ్య కారణాలతో మరణించాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత 2025 నవంబర్‌లో ముంబై కోర్టులో గృహ హింస కేసును దాఖలు చేస్తూ, తన భర్త పీటర్ హాగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నెలకు రూ.10 లక్షల భరణంతోపాటు రూ.50 కోట్ల పరిహారాన్ని పీటర్ నుంచి ఇప్పించాలన్నారు. ప్రస్తుతం తన పిల్లల కస్టడీ, న్యాయం కోసం ఆమె పోరాడుతున్నారు. పలు హిందీ చిత్రాల్లో నటించిన సెలీనా జైట్లీ 2004లో విడుదలైన తెలుగు సినిమా ‘సూర్యం’లో నటుడు మంచు విష్ణు సరసన నటించారు. -
సంగీతానికి వయసుతో పనిలేదు..! వాహ్వా అనిపించుకున్న రిటైర్డ్ టీచర్
కలలను నెరవేర్చుకోవడానికి వయసు పరిమితి లేదు. జీవితంలో ఏ దశలోనైనా వాటిని సాకారం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ టీచర్ తన గాన ప్రస్థానాన్ని లేటుగా ప్రారంభించినా ‘వాహ్వా’ అనిపిస్తున్నారు.తాజా విషయానికి వస్తే...రవీంద్రనాథ్ బిస్వాస్ ట్రెండింగ్‌లో ఉన్న ‘ఖత్’ అనే పాట పాడి వాహ్వా అనిపిస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.ఈ వీడియో క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉన్నా అదేమీ ఆయన గాన ప్రతిభకు అడ్డుగోడ కాలేదు. విశేషం ఏమిటంటే, ఈ రీల్ సోషల్ మీడియా ప్రేక్షకులనే కాదు సంగీతపరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించింది.నవజోత్ అహుజా ఆనంద బాష్పాలతో కూడిన ఇమోజీతో స్పందించారు.‘దాదూ, ఆప్‌తో ఛా గయే’ (తాతా మీరు అదరగొట్టేశారు) అని జియోసావన్ స్పందించింది. ‘అంకుల్, మాకు మీ వీడియోలు అంటే చాలా ఇష్టం’ అన్నది అమెజాన్ మ్యూజిక్ ఇండియా. ‘ప్రతిభ విషయానికి వస్తే వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే’. ‘ఈ వయసులోనే వీరి గాత్రం ఇలా ఉందంటే... యవ్వనంలో ఇంకా ఎంత బాగుండేదో’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. View this post on Instagram A post shared by Ritik Dey (@ft.ritikdey) (చదవండి: కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు) -
శాకాహార బాడీబిల్డర్‌గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్ఓ..
మన హిందూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ విదేశీయుడిని చూస్తే నిజంగా నోటమాట రాదు. అతడి విధానం, ఆహార్యం అన్ని మనల్ని మంత్రముగ్ధల్ని చేస్తాయి. వామ్మో శారీర దృఢత్వాన్ని, ఆధ్యాత్మిక భక్తితో మిళితం చేసిన ఆ వ్యక్తిని చూస్తే.. సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఖాయం. ఎందుకంటే..ఇజ్రాయెలీలో జన్మించిన తమల్ కృష్ణ కృపా దాస్ 2009లో భారతదేశానికి వలస వచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని మాయాపూర్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను భారత్‌కి వచ్చి ఇక్కడి హిందూ మతాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన వేషధారణ, ఆహారం తదితరాల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోని కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో తమల్ తనకు పోషకాహారం అంటే కేవలం స్థూల పోషకాలే కాదని స్వచ్ఛత, 'భగవంతునికి సమర్పణ' అని చెప్పారు. తాను స్వచ్ఛమైన శాకాహార బాడీబిల్డర్నని చెప్పారు. తాను సనాతన ధర్మ అనుచరుడిగా అల్పాహారంగా ఏం తీసుకుంటాడో వివరించాడు. తమల్ తన రోజులో మొదటి భోజనాన్ని శుభ్రంగా ఉంచడంతో ప్రారంభిస్తాడు. ప్రతీదీ చాలా శుభ్రంగా కడుగుతూ తయారు చేసే విధానం అత్యంత ఆకట్టుకుంటుంది. ఎందుకంటే దుకాణంలో లేదా బయటి నుంచి వచ్చే ప్రతీదానిపై ఎలా దుమ్ము, బ్యాక్టీరియాలతో నిండి ఉంటుందో సవివరంగా చెప్పాడు. పరిశుభ్రతకు మించి.. భోజనం కంటికి అందంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా కనిపించడమే ముఖ్యమని చెబుతుండటం విశేషం. మామిడి, నారింజ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్షలను చాలా అందంగా అమర్చిన విధానం గురించి వివరిస్తూ..దీనిని దేవునికి సమర్పిస్తున్నాం కాబట్టి చాలా అందంగా పరిశుభ్రంగా తయారు చేయాలని అంటున్నాడు. పెరుగుని చక్కగా తయారు చేయాలి. కప్పులలో గడ్డకట్టిన పెరుగు, పిస్తా అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. అతడు ఒక్క ముద్ద కూడా తినకముందే పూజ చేసి ఆహారానని భగవంతుడికి నివేదిస్తాడు. తాను ఏం తయారు చేసినా.. భగవంతుడు దానిని స్వీకరించాలని ప్రార్థిస్తాను. అన్నింటికన్నా..ముఖ్యమైన విషయం ఆహారాన్ని తినేముందు భగవంతునికి సమర్పిస్తే ప్రసాదమవుతుంది. అది మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేయండంలో సహాయపడుతుందని చెబుతున్నాడు. వేషధారణ..తమల్ తన మెడలో పవిత్రమైన తులసి పూసలను, ధోవతిని (నడుముకు కట్టుకునే వస్త్రం), భుజంపై చాదర్ తదితరాలను ధరిస్తాడు. ఆ వస్త్రాలపై తరచుగా సంస్కృత మంత్రాలు లేదా 'హరే కృష్ణ' ముద్రలు ఉంటాయి. అతను ఎక్కువగా గుండు చేయించుకుని చిన్న శిఖతో కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన ఆహారం వెనుకున్న శాస్త్రం..డబ్ల్యూహెచ్ఓ కూడా..తమల్ తీసుకునే పండ్లతో నిండిన అల్పాహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సమతుల్య అల్పాహారం ఒక వ్యక్తి రోజువారీ పోషకాహార అవసరాలలో దాదాపు 30 శాతాన్ని తీర్చుతుందట.WHO మార్గదర్శకాల ప్రకారం: "అల్పాహారం రోజులో మొదటి భోజనం; అందువల్ల, సమతుల్యంగా ఉండేలా కేర్ తీసుకోవలి. కనీసం రెండు రకాల పదార్థాలు అందించాలి: ఒకటి ప్రధాన ఆహార పదార్థాలు, మరొకటి ప్రోటీన్. అందువల్ల అల్పాహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా చేర్చాలి." ఇక్కడ తమల్కు, అతని ఆధ్యాత్మిక సాధనతో బలపడిన ఈ పోషకాహార పునాది, అతని ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ కెరీర్‌కు చోదక శక్తిగా పనిచేస్తోంది. View this post on Instagram A post shared by Sankalpa Mantra Sadhana (@mantra_saadhana) (చదవండి: కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు) -
వామ్మో 500 కిలోల మొసలి... ఆరుగుర్ని మింగేసిందా?!
దక్షిణాఫ్రికాలోని కోమటి నది (Komati River) తీరాన వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల వ్యాపారవేత్త ఆచూకీ కోసం వెతుకుతుండగా వెలుగులోకి వచ్చిన నిజాలు అధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. అనూహ్యమైన, అత్యంత భయంకరమైన విషాదం వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలో మొసళ్లు ఎక్కువగా ఉండే నది తీరాన విషాదం చోటు చేసుకుంది.అసలేం జరిగింది?ఒక వ్యాపారవేత్త తన కారుతో లోతట్టు వంతెన దాటుతుండగా, ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి కారు చిక్కుకుపోయింది. ఆ తర్వాత ఆయన నీటిలో కొట్టుకు పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కారు ఖాళీగా ఉంది. పోలీసులు కోమటి నది ప్రాంతంలో గాలిస్తూనే ఉన్నారు, తమకు ఏమి దొరుకుతుందో లేదా అసలు ఏమైనా దొరుకుతుందో లేదో కూడా తెలియని అయోమయం నెలకొంది.కోమటి నది ఏదో మామూలు నది కాదు, స్థానికులు చాలా ప్రమాదకరమైనదిగా భావించే నది. అత్యంత భయంకరమైన ఆ జలాల్లోకి ఒక పోలీసు అధికారిని హెలికాప్టర్ ద్వారా దించారు. డ్రోన్లను రంగంలోకి దించారు. హెలికాప్టర్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. మొదట అంతా మామూలు గానే కనిపించింది. కానీ తనిఖీల సమయంలోనదిలోని ఒక చిన్న ద్వీపం దృష్టిని ఆకర్షించింది. ఆ పరిశీలనే ఆపరేషన్ దిశను పూర్తిగా మార్చేసింది. NEW: Police airlift a crocodile with the body of a 59-year-old businessman inside.Local police in South Africa say they suspected the crocodile ate the man after observing it from drones. They then shot it and airlifted it off.When they landed back on the ground, the… pic.twitter.com/12NBTQbmis— Collin Rugg (@CollinRugg) May 4, 2026fy"> అనుమానం తెప్పించిన మొసలి ప్రవర్తనగాలింపు సమయంలో నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంపై కొన్ని మొసళ్లు ఎండకు కాచుకుంటూ కనిపించాయి. అయితే, అక్కడ ఉన్న ఒక 4.5 మీటర్ల పొడవు, సుమారు 500 కిలోల బరువున్న భారీ మొసలి మాత్రం వింతగా ప్రవర్తించింది. హెలికాప్టర్ల శబ్దం వస్తున్నా అది కదలలేదు. సాధారణంగా భారీ ఆహారాన్ని తీసుకున్న తర్వాత మొసళ్లు నిశ్చలంగా ఉంటాయని గుర్తించిన అధికారులు, ఆ మొసలిని చంపి పరీక్షల కోసం క్రూగర్ నేషనల్ పార్క్‌కు తరలించారు.భయంకరమైన నిజాలుమొసలి కడుపును కోసి చూడగా అధికారులకు గుండె ఆగిపోయే దృశ్యాలు కనిపించాయి మొసలి ప్రేవులలో మానవ అవశేషాలు లభించాయి. ఆ అవశేషాలు గతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల గాబ్రియేల్ బాటిస్టావిగా అనుమానిస్తున్నారు.అంతేకాదు మొసలి కడుపులో 6 రకాల వేర్వేరు బూట్లు లభించాయి. అయితే మొసళ్లు ఏది పడితే అది మింగుతాయి కాబట్టి, ఇతర బాధితులు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.కానీ గతంలో కూడా ఆ మొసలికి గతంలో కూడా బాధితులు ఉన్నారేమోనన్న ఆందోళన తలెత్తుతోంది.ప్రాణాలకు తెగించి డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ఈ ఆపరేషన్‌లో అత్యంత సాహసోపేతమైన ఘట్టం కెప్టెన్ జోహన్ పాట్గీటర్ చేసిన రెస్క్యూ. మొసళ్లు నిండి ఉన్న ఆ ప్రమాదకర నదిలోకి హెలికాప్టర్ నుండి ఆయన కిందకు దిగారు. మొసలి అప్పటికే చనిపోయి నప్పటికీ, ఆ నది ప్రవాహం, చుట్టుపక్కల ఉన్న ఇతర మొసళ్ల వల్ల, ఎంతో ఒత్తిడి మధ్య అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ అవశేషాలను DNA పరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాతే అధికారికంగా అవి ఎవరివో నిర్ధారిస్తారు. అయితే, నిపుణులు తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ, అనేక బూట్లు లభించడం ఆందోళనకు తావిచ్చింది. దొరికిన అదనపు బూట్ల ఆధారంగా, ఈ మొసలికి గతంలో మరేవైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నది ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన అధికారులను సౌత్ ఆఫ్రికా పోలీస్ చీఫ్ అభినందించారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనలను మిగిల్చింది.ఇదీ చదవండి: టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు -
హృదయ విదారకం : పట్టాలు దాటుతూండగా!వైరల్ వీడియో
బీహార్‌లోని పాట్నా పరిధిలోని బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అటు నుంచి శరవేగంగా దూసుకొస్తున్న రైలు. మరోవైపు పట్టాలు దాటుతున్న జనం. అంతే క్షణాల్లో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటిదాకి తమ చేయి పట్టుఉన్న వారు, కళ్లముందే ఛిద్రం కావడంతో బంధువులు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.ఢిల్లీ నుంచి మాల్దాకు వెళ్తున్న ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫాం నంబర్ 1 వద్దకు వస్తుండగా ఈ దిగ్భ్రాంతి కర ఘటన జరిగింది. బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో అతివేగంగా దూసుకొస్తోంది. ఇంతలో కొంతమంది పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. కొంతమంది వేగంగా ముందుకెళ్లిపోగా, ఇద్దరు మహిళలు బ్యాగులతో ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ వెనుక బడిపోయారు. అంతే క్షణాల్లో వారు రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయారు. వారి తొందరపాటును గమనించిన ఇద్దరు ప్రయాణికులు సహాయానికి వచ్చారు కానీ వారిని పైకి లాగలేకపోయారు. ఒక వ్యక్తి మహిళల్లో ఒకరిని ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కించే ప్రయత్నంలో కింద పడియాడు. మరొక వ్యక్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు వారిపై నుండి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. దీంతో ప్లాట్‌ఫాంపైన ఉన్నవారితో పాటు వీక్షకులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన మే 4వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు జరిగింది. ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్ వైరల్, విజయ్ విద్యార్హత ఏంటి? <मित्रों ये वीडियो देखकर मेरा कलेजा फट गया बख़्तियारपुर रेलवे स्टेशन प्लेटफार्म पार करते समय दो महिलाओं की ट्रेन से कटकर दर्दनाक मौत हो गईयह घटना उस समय घटी जब दिल्ली से मालदा जाने वाली फरक्का एक्सप्रेस प्लेटफार्म नंबर 1 पर आ रही थीउसी समय दो महिलाएं पटरी क्रॉस करके प्लेटफार्म… pic.twitter.com/VRd6sPZ3Je— Jitendra Verma (@jeetusp) May 5, 2026దీంతో కొద్ది సేపు స్టేషన్లో రైలు సేవలు కొద్దిసేపు నిలిపివేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.మృతుల వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల బంధువులకు సమాచారం అందించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జవహర్ లాల్ ధృవీకరించారు. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! నోట్ : దయచేసి వేగంగా వెళ్లాలనే తొందరలో ప్లాట్‌ఫాం చేరుకోవడానికి పట్టాలు దాటొద్దు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. కాస్త నిదానించండి. ఫుట్‌బ్రిడ్జ్‌ను ఉపయోగించండి. -
కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు
ఓ టెకీ తల్లిదండ్రులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చి నెటిజన్ల మనసును దోచుకున్నాడు. ఎప్పుడు పిల్లల కోసం అన్ని త్యాగం చేసే తల్లిదండ్రుల కోసం ఏం చేసినా అతి తక్కువే. కానీ మనకు చేతనైనంతలో ఏది ఇచ్చినా..వాళ్లకు అత్యంత అపురూపం. పైగా తమ పిల్లలు ఇంత పెద్ద వాళ్లైపోయారా అన్న ఆనందానికి మించింది మరొకటి లేదు. ఆ విషయాన్ని ఈ టెకీ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.సిద్ధార్థ్ భదౌరియా అనే కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తల్లిదండ్రులను ఏవిధంగా సర్ప్రైజ్ చేశానో షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించని వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో తాను స్కూటర్ మాత్రమే కొంటున్నానని చెప్పి ఎలా బీఎండబ్ల్యూ ఎక్స్ 1 కారుని గిఫ్ట్‌గా ఇచ్చానో వివరించాడు. ముందుగా తన తల్లికి నాన్నకి కొత్త టూ వీలర్ కొంటున్నట్టు కలరింగ్ ఇచ్చాడు. అయితే అంత డబ్బు ఖర్చు చేసి స్కూటర్ కొంటున్నందుకు కచ్చితంగా నీకు తిట్టు తప్పవని కొడుకుని హెచ్చరించిందామె. కానీ కొడుకు అంతకు మించిన ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నాడని ఆ క్షణం ఆమె ఊహించలేదు. పాపం ఆమె కొడుకు ఏ లక్షో లేదా ఒకటిన్నర లక్షలు ఖర్చు పెట్టాడనుకుందా ఆ పిచ్చితల్లి. అయితే కుమారుడు సిద్ధార్థ్ తన తల్లిదండ్రులను పార్కింగ్ ప్రదేశానికి తీసుకెవెళ్లి తండ్రికి తాళాలు అందించాడు. అంతే ఒక్కక్షణంపాటు అయోమయానికి గురైన ఆ తల్లిదండ్రులు అంతలోనే తేరుకుని తమ కుమారుడు ఇచ్చింది అత్యంత లగ్జరీ ఎస్‌యూవీని తెలిసి ఉప్పొంగి పోయారు. అంతేగాదు ఇది నిజమా కలా అన్ని సందిగ్ధానికి లోనవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు అతడి పేరెంట్స్. ఆ తర్వాత తండ్రి ఇంత ఖరీదైన కారు ఎవరైనా కొంటార్రా అని కుమారుడిని నవ్వుతూ ప్రశ్నించారు. నాన్న ధర గురించి మర్చిపోండి, మీరు హాయిగా కూర్చోని ప్రయాణం ఆస్వాదించండిని బదులిచ్చాడు. పైగా ఆ కారు తనకు ఉచితంగా వచ్చిందని చెప్పాడు టెకీ. కానీ అతడి తల్లి ఇంకా సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ..ఓరి దేవుడా..! నేను నిజంగా ఇంత లగ్జరీ కారులో కూర్చొన్నానా..!..అస్సలు నమ్మలేకపోతున్నా కన్నా..అంటూ మురిసిపోయిందామె. ఆ టెకీ ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసును హత్తుకుంది. "వాళ్లు నాకు అన్ని ఇచ్చారు. ఈ రోజు నావంతు" అనే క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పంచుకున్నాడు ఆ టెకీ. View this post on Instagram A post shared by SiddhaRth BhadauRia (@siddharthbhadauria) (చదవండి: ఐదు పదుల వయసులో నీట్ పరీక్ష..! ఐతే..) -
పవన్ సార్.. మమ్మల్ని బానిసలుగా మార్చకండి!
సాక్షి ప్రతినిధి, కడప: తమిళనాడుకి కాబోయే సీఎం విజయ్‌కు శుభాకాంక్షలంటూనే, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై జనసేన నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘‘విజయ్ వెనుక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25శాతం ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నప్పటికీ మీరెందుకు పోరాటం చేయలేకున్నారు. మీరెందుకు సీఎం కాలేకున్నారు. మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు’’ అంటూ నిలదీస్తున్నారు. తాజాగా రాజంపేట జనసేన ఇన్చార్జి కొనిశెట్టి హరి రాయల్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరి రాయల్ వీడియో సారాంశం ఇలా ఉంది. పవన్ సార్ విజయ్ను చూడండి.. ''పవన్‌కళ్యాణ్ సార్ మిమ్మల్ని తప్పుబట్టట్లేదు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. ఈ జనసేన బిళ్లను చూడండి. 2014లో పార్టీ పెట్టారు. ఆరోజు నుంచి బిళ్లను మోస్తున్నాం. కానీ మా బతుకులు చూడండి, కుక్కల్లాగా బతుకున్నాం. మాది కూడా ఒక బతుకేనా! మాకు ఆత్మగౌరవం లేదు. అధికారంలో ఉన్నా గుర్తింపు లేదు. పార్టీ గెలవకపోయినా వందేళ్లు మీతో నడుస్తాం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కడప జిల్లాకు వస్తే, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. అలాంటిది మీరు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టుకోరు. పార్టీ కోసం కష్టపడే నాయకులను ఎందుకు కలవరు? నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బందేమిటీ? పార్టీని నిర్మాణం చేసుకుని జనాల్లోకి తీసుకు వెళ్లకుండా ఇలా ఎందుకు సార్! జనాల్లో నమ్మకం పోయింది.ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేసి కమిటీలు, ఇన్చార్జీలను వేయండి సార్. పార్టీ పెట్టి 15 ఏళ్లు అయింది. ఎందుకు ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెడుతున్నారు? తమిళనాడులో విజయ్ వెనుక ఎలాంటి కులం లేదు. కానీ మీ వెనుక 25 శాతం ఓట్లు ఉన్న కులం ఉంది. విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి వచ్చారు. విజయ్ మాలాంటి వారికి నమ్మకం కలిగించారు. ఇప్పటికైనా పార్టీని ముందుకు నడిపించి మీరు సీఎం అవ్వండి సార్. మీ కాళ్లు పట్టుకుంటాం. మా జీవితాలను నాశనం చేయవద్దు. మాట్లాడితే సస్పెన్షన్లు తగవు. జనసేన పార్టీ మాది. మెగా ఫ్యామిలీతో మాది పేగు బంధం. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోతాం. మీరు ముంచినా మునిగేందుకు మీ వెంట నడుస్తున్నాం. కష్టపడే వారికి అవకాశం ఇవ్వండి సార్..'' అంటూ హరిరాయల్ పవన్‌ను వేడుకుంటూ వీడియోను ముగించారు. -
నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ వీరోచిత పోరాటం.. ప్రాణాలకు తెగించి..
హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్‌ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్‌కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్‌ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్‌ను గుర్తించారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి. ✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేతనేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026 -
జై శ్రీరామ్.. 15 ఏళ్ల బాధ నేటితో తీరింది: రఘు శర్మ
ఐపీఎల్లో పద్నాలుగేళ్లకే సంచలనాలు సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో గుజరాత్‌పై) నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఐపీఎల్-2026 సందర్భంగా తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) వైభవం ఇలా ఉంటే.. రఘు శర్మ (Raghu Sharma)ది మరో కథ.33 ఏళ్ల వయసులో...పంజాబ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ రఘు శర్మ. అతడి వయసు ఇప్పుడు 33 ఏళ్లు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఐపీఎల్లో అరంగేట్రం కోసం అతడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చింది. రఘును తొలుత నెట్‌బౌలర్‌గా చేర్చుకున్న ముంబై ఇండియన్స్.. గతేడాది వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అరంగేట్ర మ్యాచ్‌లో అలాకానీ.. 2025లో రఘు శర్మకే బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఈ ఏడాది ఎట్టకేలకు అతడిని ముంబై యాజమాన్యం కరుణించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా రఘు ముంబై తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో పూర్తి నాలుగు ఓవర్ల కోటా వేసిన రఘు శర్మ.. 24 పరుగులే ఇచ్చాడు.ఇప్పుడిలా..పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ చెన్నైతో మ్యాచ్‌లో రఘు వికెట్లు తీయలేకపోయాడు. అయితే, తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడి కల నెరవేరింది. లక్నో అరంగేట్ర బ్యాటర్ అక్షత్ రఘువన్షి (11) రూపంలో రఘు శర్మ ఐపీఎల్లో తన తొలి వికెట్ తీశాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో 36 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. #RaghuSharma makes a statement with that wicket 🔥Years of hard work and belief are finally paying off. 💙🙌🏻#TATAIPL Revenge Week 2026 ➡️ #MIvLSG | LIVE NOW 👉https://t.co/hc4PVkY1Pc pic.twitter.com/QFbQB1OeRg— Star Sports (@StarSportsIndia) May 4, 2026ఈ నేపథ్యంలో రఘు శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, దూకుడుగా సెలబ్రేట్ చేసుకోకుండా.. తన జేబులో నుంచి ఓ పేపర్ తీసి డ్రెసింగ్‌రూమ్ వైపు చూపించాడు ఈ లెగ్ స్పిన్నర్. అందులో..ఆ బాధ నేటితో తీరిపోయింది‘‘రాధే రాధే. గత పదిహేనేళ్లు ఎంతో బాధగా గడిచాయి. అయితే, ఆ గురుదేవుడి దయ వల్ల ఆ బాధ నేటితో తీరిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్‌కు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. జై శ్రీరామ్’’ అని రఘు శర్మ రాశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో సోమవారం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్నోను ఆరు వికెట్ల తేడాతో ఓడించి సీజన్లో పదింట తమ మూడో విజయాన్ని నమోదు చేసింది.చదవండి: నువ్వసలు ఏం చేశావు బుమ్రా?.. గావస్కర్ ఫైర్! -
తన పరువు తానే తీసుకున్న బాబర్ ఆజం!
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం కల ఎట్టకేలకు నెరవేరింది. అతడి సారథ్యంలో పెషావర్ జెల్మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2026 టైటిల్ గెలిచింది. హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో ఆదివారం జరిగిన పోరులో పెషావర్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.తద్వారా తొలిసారి పీఎస్ఎల్లో చాంపియన్‌గా అవతరించింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam).. ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రాణించిన ఆరోన్ హార్డీఅయినప్పటికీ హైదరాబాద్ విధించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పెషావర్ విజయవంతంగా ఛేదించింది. ఆరోన్ హార్డీ (39 బంతుల్లో 56 నాటౌట్), అబ్దుల్ సమద్ (34 బంతుల్లో 48) రాణించి జట్టును గెలిపించారు.దీంతో తొలిసారి పీఎస్ఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో బాబర్ ఆజం ఎగిరి గంతేశాడు. ముఖ్యంగా ట్రోఫీ అందుకునే సమయంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ శైలిని అనుకరించబోయి నెటిజన్ల చేతికి చిక్కాడు. రోబో మాదిరి నడిచి వెళ్లి..కాగా 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపిన సారథి రోహిత్.. రోబో మాదిరి నడుచుకుంటూ వెళ్లి ట్రోఫీ అందుకుని సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే, ఇప్పుడు బాబర్ కూడా అదే స్టైల్లో వెళ్లి ట్రోఫీ తీసుకోవాలనుకున్నాడు. కానీ రోబో మాదిరి కాకుండా వెనుక నుంచి ఎవరో తరిమినట్లుగా చిన్న పిల్లాడిలా పరిగెత్తుకు వచ్చి ట్రోఫీ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Babar Azam tried to copy Rohit Sharma’s ICC Men's T20 World Cup celebration but turned a legendary moment into a meme 😭😭😭 pic.twitter.com/xrxjxsRI55— Ankur (@flick_class) May 4, 2026రోహిత్‌ను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడుదీంతో.. ‘‘రోహిత్ శర్మను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడు. మీమర్లకు పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు’’ అంటూ బాబర్ ఆజంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా పీఎస్ఎల్ తాజా సీజన్లో బాబర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. పదకొండు మ్యాచ్‌లలో కలిపి 588 పరుగులు సాధించి.. టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్‌లో పీఎస్ఎల్ మ్యాచ్‌లు నిర్వహించింది. ప్లే ఆఫ్స్‌నకు ప్రేక్షకులను అనుమతించినా ప్రజా రవాణా ద్వారానే స్టేడియానికి చేరుకోవాలనే షరతు పెట్టింది. ఏదేమైనా మరోసారి ఐపీఎల్‌కు పోటీగా వచ్చి బొక్కబోర్లా పడింది. కాగా మార్చి 26 నుంచి మే 3 వరకు పీఎస్ఎల్ తాజా ఎడిషన్ నడించింది.చదవండి: ఐపీఎల్లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీలాగే..! -
46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!
భారతదేశ పర్యటన గురించి ఓ విదేశీ యాత్రికుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఎన్నో దేశాలను పర్యటించానని, కానీ భారత్ పర్యటన తన ప్రయాణ అనుభవాన్నే మార్చేసిందంటూ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో the_globedigger గా ప్రసిద్ధి చెందిన జెఫ్ జోసీకి భారతదేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ పర్యటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వెల్లడించారు. తాను మొత్తం 46 దేశాలను పర్యటించానని, ఒక యాత్రికుడికి విజయవంతమైన పర్యటన అంటే..ఎలాంటి ఆటంకాలు లేని ఏర్పాట్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు అని అర్థం. కానీ భారతదేశంలో చేసే ప్రయాణం ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుందని అన్నారు. అంతేగాదు ఇక్కడ ప్రయాణం చాలా అరుదుగా సులభంగా ఉంటుందన్నారు. ఇక్కడ పర్యటన సౌకర్యానికి చాలా దూరంగా ఉంటుందని అన్నారు. అయినప్పటికీ ఆ సవాళ్లే..ఆ గమ్యస్థానాన్ని అత్యంత అపురూపమైనదిగా మార్చేస్తాయని నొక్కి చెప్పారు. అలాగే భారత్‌లో ప్రపంచంలోని అత్యుత్తమమైన వీధి ఆహారాలు, ప్రపంచస్థాయి బీచ్‌లు ఉన్నాయిన పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆయన గోల్డెన్ టెంపుల్‌తో సహా "ప్రముఖ" దేవాలయాలను సందర్శించడం చూపించారు. ఆయన జైపూర్‌లోని హవా మహల్, ఆగ్రాలోని తాజ్ మహల్, ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలోని ఇండియా గేట్‌ను కూడా సందర్శించారు. 46 దేశాలు పర్యటించిన తర్వాత భారత్ తనకు ప్రయాణం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చేసింది అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేశారు. అంతేగాదు ఇక్కడ పర్యటన అంత సులభమైన గమ్యస్థానం కాదు, సౌకర్యవంతంగా ఉండకపోయినా..మదిలో నిలిచపోతుంది అంటూ భారత్ పర్యటనపై పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే భారత్ మనల్ని నెమ్మదించేలా, పరిస్థితులకు అలవాటు పడేలా చేయడమే గాక ప్రపంచాన్ని విభిన్నంగా చూపించేలా చేస్తుందని, ఓ పర్యాటకుడు చవి చూడాల్సింది కూడా ఇదేనంటూ భారత్‌పై ప్రశంసంల వర్షం కురిపించారు. నెటిజన్ల కూడా ఆయనతో ఏకీభవిస్తూనే..ఈ నేలపై మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు చూడాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by Geoff Josey (@the_globedigger) (చదవండి: ఆ ట్రైన్స్ జర్నీ జస్ట్ ట్రావెల్ కాదు ..అదొక ఎక్స్‌పీరియెన్స్) -
ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..?
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్ఫైర్" (టెహ్రాన్‌లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్‌లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.టెహ్రాన్ మెుత్తం కలియతిరుగుతూ...రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్‌పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్లోని లాంజ్‌కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.వైరల్‌గా వీడియోఅయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Estelle W (@estelleeats__) -
ఒక్క హగ్‌కు ఇంత రాద్ధాంతమా!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్లో గురువారం హైదరాబాద్ కింగ్స్‌మెన్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా, ఆసీస్ మహిళా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్ కామేంటేటర్లుగా వ్యవహరించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లీసా స్తాలేకర్ మాటల సందర్భంగా రమీజ్ రాజాను హగ్ చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇది సరదాగా చేసినప్పటికీ బహిరంగంగా ఇలా ప్రవర్తించడం పట్ల క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు రమీజ్ రాజా, లీసా స్తాలేకర్ హగ్ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. ఏఐ పుణ్యమా అని లీసా హగ్ ఇవ్వగానే రమీజ్ రాజా ఆమె నుదుటిపై ముద్దు పెట్టినట్లుగా వీడియో, ఫొటోలు బయటికి వచ్చాయి. అయితే ఇవన్నీ నకిలీ ఫొటోలని కాసేపటికే తేలిపోయింది. ఎందుకంటే వీరిద్దరు హగ్ చేసుకున్న అనంతరం రమీజ్ రాజా ముద్దు పెట్టినట్లుగా వీడియోలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అది ఏఐతో రూపొందించిన వీడియో అని క్లియర్‌గా అర్థమైంది. అయితే రమీజ్ రాజాకు హగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారడంతో లీసా స్తాలేకర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘ఒక చిన్న కౌగిలింత ఇంత చర్చకు దారి తీయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఇందులో తప్పేముంది. ఏదో సరదాగా హగ్ చేసుకున్నా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా’ అంటూ స్టోరీ షేర్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో పెషావర్ జాల్మితో హైదరాబాద్ కింగ్స్‌మెన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (69 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నవాజ్ 18 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ 15.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మాజ్ సదాఖత్ (64 నాటౌట్), ఉస్మాన్ ఖాన్ (64) జట్టును గెలిపించారు.ఇక లీసా స్తాలేకర్ ఆస్ట్రేలియా తరఫున 2001 నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా సేవ లందించిన ఈ ఆల్‌రౌండర్ 125 వన్డేల్లో 2,728 పరుగులు చేయడంతో పాటు 146 వికెట్లు పడగొట్టింది. ఇక 8 టెస్టు మ్యాచ్‌లు ఆడి 416 పరుగులతో పాటు 23 వికెట్లు తీసింది.Lisa Sthalekar's Instagram story. pic.twitter.com/N7C4JVOBtq— Sheri. (@CallMeSheri1_) May 2, 2026WTFFFF pic.twitter.com/293RiGywFW— Invader🇵🇸- (@sshayaannn) April 29, 2026 -
‘చైల్డ్ లేబర్.. FIR వేయిస్తా.. వైభవ్ చదువుకోవాలి’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గత కొన్నాళ్లుగా అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. భారత్ అండర్-19 జట్టుతో పాటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున దుమ్ములేపుతున్నాడు. గతేడాది ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతక్కొటిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడి (14 ఏళ్లు)గా నిలిచాడు.సంచలనాలకు కేంద్రంనిజానికి అంతకంటే ముందే అంటే పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టుకు ఎంపికై.. ఆసియా రైజింగ్ స్టార్స్‌తో టోర్నీ పాటు ఇటీవలే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆడాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించి భారత్‌కు ట్రోఫీ అందించాడు.ఆరెంజ్ క్యాప్ రేసులోఇక ఇటీవలే పదిహేనో వసంతంలోకి అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో భాగంగా ఈ టోర్నీలో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 404 పరుగులు పూర్తి చేసుకుని.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-4లో నిలిచాడు.ఈ నేపథ్యంలో అలెన్ బోర్డర్, బ్రియాన్ లారా, సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే అతడిని టీమిండియాకు ఆడించాలని మరికొందరు మాజీ క్రికెటర్లు సైతం సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.యాక్టివిస్ట్ సంచలన వ్యాఖ్యలుఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ టీవీ చానెల్లో యాక్టివిస్ట్‌గా పరిచయమైన ఓ వ్యక్తి.. వైభవ్‌ను తక్షణమే ఇంటికి పంపాలని రాజస్తాన్ యాజమాన్యానికి సూచించాడు. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేసి.. FIR వేయిస్తానని హెచ్చరించాడు.చైల్డ్ లేబర్.. చదువుకోనివ్వండిఈ మేరకు.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడకూడదు. ఇలా చేయడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుంది. ఈ పిల్లాడిని ఐపీఎల్ క్రికెట్ ఆడనివ్వద్దు. క్రికెట్ ఆడే బదులు అతడు చదువుకోవాలి’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కాగా.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.This activist appeared on a Kannada TV channel and said he plans to file a police case or legal complaint against Rajasthan Royals. He said - Don't let this 15-year-old boy "Vaibhav Suryavanshi " play IPL cricket — it's child labour, he should study! pic.twitter.com/zEwVJQseGR— ExtraOrdinary (@Extreo_) May 2, 2026క్రీడాకారులకు వర్తిస్తుందా?కాగా భారత బాల కార్మిక నిరోధక సవరణ చట్టం 2016 ప్రకారం.. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో పని చేయించకూడదు. అయితే, సాధారణంగా బాల క్రీడాకారులను చైల్డ్ లేబర్‌గా పరిగణించరు. ప్రతిభకు పట్టం కడుతూ వారిని ప్రోత్సహిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు.. చెస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో చాలా మంది పదేళ్లలోపు వయసులోనే ప్రవేశిస్తారు.ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్నిజానికి వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గతేడాది డిసెంబరులో అతడు ఈ అవార్డు అందుకున్నాడు. అయితే, సదరు యాక్టివిస్టు మాత్రం వైభవ్‌ను ఐపీఎల్లో ఆడించడం సరికాదని.. ఇది చైల్డ్ లేబర్ కిందకు వస్తుందంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చాడు.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చికాగా వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కుమారుడిని ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా కుమారుడు లక్ష్యాన్ని చేరుకునేలా చేశారు. అయితే, చదువులోనూ వైభవ్ ముందే ఉంటాడని ఇటీవలే అతడి స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాకపోతే ఈసారి ఐపీఎల్ కారణంగా అతడు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయాడు. ఇక గతేడాది మెగా వేలంలో 1.10 కోట్లకు వైభవ్‌ను కొన్న రాజస్తాన్ రాయల్స్.. ఈసారి పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దించింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు' -
బట్టలు ఆరేసాక, సడెన్‌గా వర్షం వస్తే : అమ్మడి ఐడియా అదుర్స్!
బట్టలు ఆరేయడం, మడతపెట్టడం, వాటిని జాగ్రత్తగా అల్మరాలలో సర్దడం ఒక పెద్ద పని. దీనికి చాలా ఓపిక శ్రద్ధ ఉండాలి. అందుకే చాలామంది ఇళ్లల్లో ఏ సోఫాలోనో, కుర్చీల్లోనో లేదంటే దీవాన్ బెడ్స్మీదో ఉతికిన బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇ పోతే బట్టలను ఆరబెట్టడం ఎండాకాలంలో అయితే పెద్దగా సమస్య ఉండదు కానీ, మిగతా సీజన్లలో కొంచెం కష్టమే... ఎంతో కష్టపడి ఉతికి (వాషింగ్ మెషీన్‌లోనే అనుకోండి) ఆరేసినపుడు, ఉన్నట్టుండి వర్షం వస్తే... గోవిందా.. గోవిందా. ఆ కష్టం పగోడికి రావద్దు అనిపిస్తుంది. అయితే దీనికోసం ఒక అమ్మడు మంచి ఆలోచన చేసింది.చిన్న బాల్కనీలున్న ఇళ్లలో, సరైన ప్లేస్ దొరకనపుడు బట్టల రాక్లను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. బాత్రూంలో గోడకు, బాల్కనీలో,బాత్రూంలో, పడకగదుల్లోనూ బట్టల రాక్లు అమర్చుకుంటాం. ఇంకా వాష్స్టాండ్, సీలింగ్ డ్రాయర్ ర్యాక్ ట్రైపాడ్ డ్రైయింగ్ ర్యాక్స్ లాంటివి వాడతాం. అయితే ఆరు బయట తీగల మీద ఆరేసిన బట్టల్ని వర్షం వచ్చినపుడు పరుగెట్టాల్సిన అవసరం లేకుండానే ఒక వినూత్న టెక్నిక్‌ను వాడింది. దీనికి జస్ట్ అలా వీల్ అమర్చిన స్టాండ్‌ను లోపలికి జరిపింది. అంతే ఆకస్మిక వర్షాల నుండి రక్షణగా, బట్టలు ఆరబెట్టే సొంత అమరికను ఏర్పాటు చేసుకుందో మహిళ.Aniden basan yağmurlara karşı kendi imkanlarıyla raylı çamaşır asma düzeneği kuran bir kadın; pic.twitter.com/APFfTHUbFk— Gezegen ve İnsan (@gezegenveinsan) May 1, 2026నెటిజన్ల స్పందన గుడ్ ఐడియా అంటూ కొంతమంది నెటిజన్లు అభినందించారు. మరి కొంతమంది మాత్రం టేం వేస్ట్, స్పేస్ వేస్ట్ అంటూ పెదవి విరిచారు. మంచి ఆలోచనే! కాకపోతే, ఎంత స్థలం వృధా అవుతుందో! ఆ మొత్తంలో బట్టలను, దీని పరిమాణంలో సగం ఉండే ప్లేస్లోనే నేను ఆరేయగలను. పైగా వర్షం గురించి కూడా చింతించాల్సిన పనే లేకుండా ఆ షెడ్డు కిందనే, సూర్యరశ్మి వేడి , గాలి వల్ల బట్టలు చక్కగా ఆరిపోతాయి. ఇది పూర్తిగా వృధా! అని ఒకరు కామెంట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
పోరా పోకిరీ.. వైరల్ లవ్ ప్రపోజ్, ప్రియురాలు ఫిదా
-
ORR కారు ప్రమాదానికి కారణాలు..?
-
ఆలయంలో ఏనుగు బీభత్సం, ఒకరి మృతి
కేరళలోనిఒక దేవాలయంలో ఏనుగు ఉన్నట్టుండి హింసాత్మకంగా మారిపోయింది.అంగమాలిలో ఉన్న కిడంగూర్ మహావిష్ణు ఆలయంలోకి తీసుకొచ్చిన ఏనుగు అకస్మాత్తుగా దాడిచేయడంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఏనుగు ఆగ్రహం కొనసాగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనయ్యారు. శుక్రవారం (మే 1) ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో, 'మయ్యానాడ్ పార్థసారథి' అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణు (40)గా గుర్తించారు. కొల్లంనుంచి లారీలో ఈ గజరాజును ఈయనే తరలించినట్టు సమాచారం.https://t.co/U4Fc8bGCAp https://t.co/PSIgJrW4fP— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 2, 2026పోలీసుల కథనం ప్రకారం, భక్తులు,స్థానికులలో భయాందోళనలు వ్యాపించడంతో, ఆ ఏనుగు ప్రజలపై దాడి చేసి, ఆలయ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలను ధ్వంసం చేసింది. కార్లను పల్టీ కొట్టించింది. ద్విచక్ర వాహనాలను నుజ్జునుజ్జు చేసింది, అలాగే ఆలయ ప్రాకార కుడ్యాన్ని ధ్వంసం చేసింది. దాదాపు రెండు గంటల తర్వాత, అటవీ అధికారులు పోలీసులు మత్తు మందు (tranquilizers) ఉపయోగించి దానిని అదుపులోకి తీసుకువచ్చారు.ఆలయ కార్యక్రమానికి ముందు స్నానం చేయిస్తున్నప్పుడు కర్రతో కొట్టడం వల్లే ఏనుగు దూకుడుగా ప్రవర్తించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇదీ చదవండి : Yoga సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్ -
బోట్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు : సంచలన వీడియో
మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక క్రూయిజ్ బోట్ జబల్పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యామ్ (Bargi Dam బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు కొన్ని క్షణాల ముందుసంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రాజేష్ సాహూ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘జబల్పూర్లో క్రూయిజ్ బోల్తా పడటానికి ముందు తీసిన వీడియో ఇది. వాతావరణం అకస్మాత్తుగా మారి, బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. ఆ సమయంలో ప్రజలు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎవరూ లైఫ్ సపోర్ట్ జాకెట్ ధరించలేదు. అయితే, తరువాత ప్రజలు వాటిని ధరించారు. దీనివల్ల సుమారు 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.जबलपुर में क्रूज के पलटने से पहले का वीडियो है। अचानक मौसम खराब हुआ और तेज हवाएं चलने लगी। लोग इस वक्त को इंज्वॉय कर रहे थे। किसी ने लाइफ सपोर्ट जैकेट नहीं पहना था। हालांकि बाद में लोगों ने पहना। इस वजह से करीब 25 लोगों की जान बच पाई। अभी तक 9 लाशें मिली हैं। कुछ लोग लापता हैं। pic.twitter.com/jQFOWfsRTH— Rajesh Sahu (@askrajeshsahu) May 1, 2026 పడవ బోల్తా పడటానికి ముందు చివరి క్షణాలను చూపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వెలుగులోకి వచ్చింది. బలమైన గాలులను ఎదుర్కొంటూ, కల్లోలభరితమైన నీరు దానిని తీవ్రంగా కుదిపేస్తుండగా, ఆ పడవ తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దృశ్యాలు ఆ ఫుటేజీలో ఉన్నాయి. క్షణాల్లోనే అది అదుపు తప్పి బోల్తా పడటంతో, ప్రయాణికులు నీటిలో పడిపోయిన దృశ్యాలు కలకలంరేపాయి. A cruise boat capsized in the Narmada River near Jabalpur, India with around 30 people on board. Four bodies recovered so far. Several still missing. pic.twitter.com/Psfw3BYo18— Open Source Intel (@Osint613) April 30, 2026 మరోవైపు సకాలంలో హెచ్చరికలను పాటించి, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటనజరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే కాకుండా, మానవ తప్పిదాల వల్ల కూడా జరిగిందని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. -
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం గుజరాత్- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, విరాట్ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్‌లు పట్టిన జేసన్ హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్ కోహ్లి- గుజరాత్ కెప్టెన్, ప్రిన్స్ గిల్ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో గిల్ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్ చేశాడు. ఇందుకు గిల్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకోగా.. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్!ఇందుకు గిల్.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్ వేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్ హోల్డర్.. ప్లే హోల్డ్ బోల్డ్.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను హోల్డర్ పట్టాడు.అయితే, ఇది క్లీన్ క్యాచ్ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్‌కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026 -
కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్!
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో హెన్రిచ్ క్లాసెన్‌ది కీలక పాత్ర. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తూ.. కష్టాల్లో ఉన్న వేళ జట్టును ఆదుకుంటున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఫ్రాంఛైజీ తనకోసం వెచ్చించిన రూ. 23 కోట్లకు తన ఆటతో న్యాయం చేస్తున్నాడు.414 పరుగులుఇప్పటికి ఈ సీజన్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి క్లాసెన్ 414 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగిన క్లాసెన్.. 30 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.తదుపరి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్ సన్నద్ధవుతున్నాడు. ఇదిలా ఉంటే.. క్లాసెన్ పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. క్లాసెన్ తన కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు.నేను చెప్పేది జాగ్రత్తగా వినుఇందుకు క్లాసెన్ తనదైన శైలిలో గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ‘‘ఫొటోలు, వీడియోలు తీయొద్దు సరేనా!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. రికార్డు చేయొద్దు ఒకేనా!’’ అని క్లాసెన్ హెచ్చరించాడు. ఇందుకు సదరు వ్యక్తి.. ‘‘నీ జట్టును వదిలెయ్.. నువ్వు బాగా ఆడుతున్నావు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ.. కానీ ఫొటో మాత్రం తీయొద్దు.POV: meeting a foreign cricketer in India…. Dude just give him and his family some privacy for gods sake.What a man Klaasy 🙏 cinema lo hero villain ki warning ela isthado ala ichadu 😂🔥 good man 🧡#SRH #IPL2026 pic.twitter.com/imwBT2c8wi— Varun Velamakanti 🦅 (@CricVarunSRH) April 30, 2026ఒకవేళ నేను అటు తిరగగానే నన్ను, నా కుటుంబాన్ని ఫొటో తీశావనుకో.. ఒట్టేసి చెబుతున్నా.. నువ్వు ఊహించని విధంగా బుద్ధి చెప్తా! దానిని నుంచి నువ్వు కోలుకోలేవు కూడా!.. నేను వెళ్తున్నా.. మళ్లీ చెప్తున్నా.. నీ కెమెరాలన్నీ పక్కనపెట్టు.. దయచేసి మమ్మల్ని ఫొటోలు తీయొద్దు’’ అని సున్నితంగానే కొట్టినంత పనిచేశాడు క్లాసెన్.అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!ఈ వీడియోపై ఆరెంజ్ ఆర్మీ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘క్లాసీ క్లాసెన్... ‘చెప్పినట్లు వినకుంటే.. అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!’ అని మాస్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు తోపు అన్నా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని.. వారి గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని సదరు వ్యక్తికి చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
76 ఏళ్ల వయసులో జోరుగా ట్రైసెప్ డిప్స్ : ఈ యాక్టర్‌కి ఫ్యాన్స్ ఫిదా!
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తన ఫిట్నెస్ మంత్రాతో అందర్నీ అశ్చర్య పరుస్తున్నారు. 76 ఏళ్ల వయసులో కూడా చాలా సునాయాసంగా ట్రైసెప్ డిప్స్ (Tricep Dips) చేస్తూ అటు ఫిట్నెస్ ఇండస్ట్రీని, ఇటు ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. దీనికి వీడియో ఒకటి వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోందిప్రముఖ ఫోటోగ్రాఫర్ అండ్ ప్రొడ్యూసర్ అతుల్ కస్బేకర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "నానా సాహెబ్.. మీరు నా ఫిట్నెస్ లక్ష్యాలను మార్చుకునేలా చేశారు. ఆయన వయసు 76 ఏళ్లు. ఆయన 15 రెప్స్ చేశారు, నేను రికార్డింగ్ ఆలస్యంగా మొదలుపెట్టాను" అంటూ అతుల్ ఈవీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నానా పటేకర్ తెల్లటి బనియన్, షార్ట్స్ ధరించి, మెడలో గమ్చా వేసుకుని బార్‌పై ఎంతో అలవోకగా ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించారు. దీనిపై నటీమణులు శిల్పా శెట్టి, రాహుల్ దేవ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోను చూసి ప్రశంసలు కురిపించడం విశేషం.నెటిజన్లు ఫిదాఈ వయసులో కూడా నానా పటేకర్ తన క్రమశిక్షణ, ఫిట్నెస్, పవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "నానా సార్.. మీరు ఒక స్ఫూర్తి" అని కొందరు, "నిజమైన బలం అంటే ఇదే" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, క్రమశిక్షణ ఉంటే ఏ వయసులోనైనా ఫిట్‌గా ఉండవచ్చని నానా పటేకర్ మరోసారి నిరూపించారు.ఇక నానా పటేకర్ వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'ఓ రోమియో' (O'Romeo) సినిమాలో నానా పటేకర్ కనిపించారు. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ఆయన ఒక పోలీసు అధికారి పాత్రను పోషించారు. View this post on Instagram A post shared by Atul Kasbekar (@atulkasbekar) -
స్ట్రాను ఎంగిలి చేసి, వెండింగ్ మెషీన్లో పెట్టి..
సింగపూర్‌లో ఉన్న ఓ ఫ్రెంచ్ కుర్రాడు (18) ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్ వద్ద చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అతడు వెండింగ్ మెషీన్ నుంచి స్ట్రాను తీసి నాకి, ఎంగిలి చేసి తిరిగి ఆ మెషీన్‌లోనే పెట్టాడు. తదుపరి వచ్చే కస్టమర్లరో ఒకరు ఆ స్ట్రాతోనే ఆరెంజ్ జ్యూస్ తాగే అవకాశం ఉంది.వెండింగ్ మెషీన్ వద్ద ఆ కుర్రాడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇతరుల ఆస్తికి సంబంధించి ఉద్దేశపూర్వక నష్టం కలిగించే చర్య, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.ఆ కుర్రాడి పేరు డిడియర్ గాస్పార్డ్ ఓవెన్ మాక్సిమిలియన్. ఏప్రిల్ 24న అభియోగాలు ఎదుర్కొన్నాడు. మార్చి 12న షాపింగ్ మాల్లో అతడు ఆ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. వీడియో బయటకు వచ్చిన అది వేగంగా వైరల్ అయింది.అతడు క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగపూర్ నుంచి వేరే ఏ దేశానికి వెళ్లాలన్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మే 2 నుంచి 25 వరకు సర్టిఫికెట్ కోసం పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో మనీలా వెళ్లేందుకు ఆ కుర్రాడికి కోర్టు అనుమతి ఇచ్చినట్లు ది స్ట్రైట్స్ టైమ్స్ తెలిపింది.మే 29న మళ్లీ కోర్టులో అతడు హాజరు కావాల్సి ఉంది. వెండింగ్ మెషీన్ వద్ద అతడు పాల్పడ్డ నేరానికి గరిష్ఠంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. జ్యూస్ వెండింగ్ మెషీన్ నిర్వహించే సంస్థ ఐజూజ్.. ఆ మెషీన్‌ను శుభ్రపరిచి, అందులో ఉన్న 500 స్ట్రాలను మార్చింది. -
ట్రవిస్ హెడ్‌పై విమర్శలు.. ఎందుకిలా చేశావు?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రవిస్ హెడ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో హెడ్ ప్రవర్తించిన తీరు ఇందుకు కారణం.తొలి హాఫ్ సెంచరీతాజా ఎడిషన్‌లో ట్రవిస్ హెడ్ (Travis Head) ఎట్టకేలకు తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ (24 బంతుల్లో 45)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 129 పరుగులు జోడించాడు.మొత్తంగా ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. మరోవైపు.. హెన్రిచ్ క్లాసెన్ (30 బంతుల్లో 65 నాటౌట్) రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్) వేగంగా ఆడాడు. ఫలితంగా 18.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించి.. వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిదింట ఆరో గెలుపును ఖాతాలో వేసుకుంది.రొబోటిక్ డాగ్‌ను కాలితో తన్నిన హెడ్ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మతో కలిసి హెడ్ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో.. ఐపీఎల్ రొబోటిక్ మస్కట్ ‘చంపక్’ అతడికి అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి లోనైన హెడ్.. ఆ రొబోటిక్ డాగ్‌ను కాలితో తన్నాడు. అంతేకాదు బ్యాట్‌తో కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రాపర్టీని తన్నిన కారణంగా హెడ్‌పై చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇటు ఐపీఎల్ పాలక మండలి గానీ.. అటు సన్‌రైజర్స్ కానీ స్పందించలేదు. కాగా ఐపీఎల్ ప్రవర్తనా నియావళి ప్రకారం.. క్రికెట్‌కు సంబంధించిన పరికరాలు, క్లాతింగ్, ఇతర వస్తువులకు మ్యాచ్ సమయంలో హాని చేస్తే జరిమానా విధిస్తారు.చంపక్ ఏం చేస్తుందంటే?ఇదిలా ఉంటే.. రోబో కుక్క ‘చంపక్’ను ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టారు. ఇదొక కదిలే బ్రాడ్కాస్ట్ కెమెరా. మైదానంలో లో-యాంగిల్లో క్రికెట్ షాట్లు, ఆటగాళ్ల కదలికలను రికార్డు చేస్తుంది. అంతేకాదు అంపైర్లు, ప్లేయర్లకు సరదాగా షేక్హ్యాండ్లు ఇస్తూ సందడి చేస్తుంది. హెడ్ సైతం సరదాగానే చంపక్‌ను తన్ని ఉంటాడని అతడి అభిమానులు అంటున్నారు.చదవండి: IPL 2026: క్లాసెన్ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?Travis Head Reaction 🤣 pic.twitter.com/4JGHZNz4GA— 𝗠𝗮𝗻𝗶𝘀𝗵 (@ManishSRH) April 30, 2026 -
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
-
ఎరక్కబోయి పెట్టుకుంటే..ఇరుక్కుపోయింది, వైరల్ వీడియో!
సోషల్ మీడియా రీల్స్ స్టంటా లేక ఎండవేడిని తట్టుకోవడానికి చేసిన ప్రయత్నమో గానీ ఒక యువకుడికి చుక్కలు కనిపించాయి. ఎరక్క బోయి చేసిన ఒక్క పనితో దాదాపు ప్రాణం పోయినంత పనైంది. గంటల తరబడి నరక యాతన అనుభవించాడు. అల్వార్ జిల్లా అక్బర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధోగఢ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఎడారి రాష్ట్రం రాజస్థాన్ అంటేనే మండించే ఎండలు. 40 డిగ్రీల ఎండ వేడిమి నుండి తప్పించుకోవడానికి కాలూరామ్ అనే యువకుడు పాల డబ్బాను తలపై రక్షణగా పెట్టుకున్నాడు. 15 లీటర్ల పాల డబ్బాను తలపై హెల్మెట్‌లా పెట్టుకున్నాడు. కానీ, అనూహ్యంగా ఆ అల్యూమినియం పాల క్యాన్‌లో తల ఇరుక్కు పోయింది. ఎంతకూ బయటకు రాలేదు. ఈ వీడియోలో తలకు పాల డబ్బా ఇరుక్కుపోయి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.ఎంతో కష్టపడి కాపాడారుకొందరు ఇది ఎండ వేడిని తట్టుకోవడానికి చేసిన 'నింజా టెక్నిక్' అంటుండగా, మరికొందరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమే ఇలా చేశాడని అంటున్నారు. కారణం ఏదైనా, ఎంత ప్రయత్నించినా డబ్బా రాకపోవడంతో కాలూరామ్ ఆందోళనతో కేకలు వేశాడు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. దాన్ని తీయడానికి నానా కష్టాలుపడ్డారు. అయినా రాలేదు. చివరికి గ్రైండర్తో కట్ చేసి అతడికి విముక్తి కల్పించారు. ఎంతో శ్రమ, చాకచక్యం తర్వాత, బాధితుడికి ఎలాంటి గాయం కాకుండా, ఆ డబ్బాను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత! A man’s head got stuck in milk can! Don’t know why he put his head there!? pic.twitter.com/oOlTKcOTfS— Aparajite (@amshilparaghu) April 25, 2026నెటిజన్ల స్పందనఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో , నెటిజన్ల మీమ్స్ వెల్లువెత్తాయి. "ఇతనే మన ఇండియన్ ఐరన్ మ్యాన్" అని ఒకరు చమత్కరించారు. రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వేడికి ఆ డబ్బా కొలిమిలా మారకపోవడం మంచిదైంది అని ఒకరు, వేడి నుండి తప్పించుకోవాలనుకుంటే,చుట్టూ ఒక టవల్ చుట్టుకోవాలి గానీ, ఈ పాల డబ్బా ఏంటి బ్రో అని మరొకరు కామెంట్ చేశారు.నోట్: ఈ వీడియో చూడటానికి హాస్యంగా అనిపించినప్పటికీ, ఇదొక తీవ్ర హెచ్చరిక. సోషల్ మీడియాను ఆకర్షించేందుకు ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పకనే చెప్పింది. ఇలాంటి విన్యాసాలు చేసేముందు ఒకటిరి రెండు సార్లు ఆలోచించు కోవాల్సిందే. ఇదీ చదవండి: శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక -
ఓరి బుడ్డోడా... టీచర్‌కే వార్నింగా?
-
పోలీస్ డ్రెస్ లో సచివాలయంలో రీల్ చేసిన కానిస్టేబుల్ అరెస్ట్
-
వైభవ్ సూర్యవంశీ పొరపాటు.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం సీజన్లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్‌పెట్టిన రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా జైస్వాల్, వైభవ్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివర్లో ఫెరీరా, శుభమ్ దూబే ఫినిషింగ్ టచ్‌తో రాజస్తాన్‌ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్‌కు వెళ్లే సమయంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వచ్చాడు. అయితే పొరపాటును గ్రహించిన వైభవ్ వెంటనే తన షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్‌కు సైగలు చేయడం కనిపించింది. పక్కనే ఉన్న రోమి భిందర్ కూడా వైభవ్‌కు సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.Vaibhav Sooryavanshi forgot to wear his shoes and then asked someone to bring them onto the ground 😭Romi Bhinder is literally taking care of him like a father 🫡 pic.twitter.com/3TayVsGf78— TEJASH (@Tejashyyyyy) April 29, 2026చదవండి: లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా! -
జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు
ఇరాన్ వార్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇండియాలో వంటగ్యాస్ సరఫరాపై ఆందోళన తీవ్రంగానే ఉంది. దీనికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన నిదర్శనం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు, విందులో లేదా ఇతర డిమాండ్ల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఒక వింత సంఘటన జరిగింది.రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క పక్క పెళ్లి తతంగం జరుగుతుండగానే గ్యాస్ ధరలు పెరగడం లేదాకొరత ఏర్పడటం వంటి పరిస్థితులువస్తే, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కొడుకు అశోక్‌కు వచ్చిన సందేహం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. వరుడు అందరి ముందూ వధువుని పట్టుకుని ఒక ఊహించని ప్రశ్న వేశాడు.అసలు ఏం జరిగింది?అందరూ పెళ్లి సంబరాల్లో మునిగితేలుతుండగా, అకస్మాత్తుగా "ఒకవేళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేయగలవా?" అని అడిగాడు పెళ్లి కూతుర్ని కాబోయే భర్త. ఈ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లి సమయంలో ఇలాంటి ప్రశ్న ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.దీనికి వధువు సమాధానం విని అందరూ సంతోషంగా తెగ నవ్వు కున్నారు.వధువు సమాధానంవధువు ఏమాత్రం తడబడకుండా చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. తనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వచ్చని, అలా వండటానికి తనకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వధువు ఇచ్చిన ఈ సమాధానంతో వరుడు సంతోషించి, పెళ్లి తంతును ముందుకు సాగించాడు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ కారులో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి కెమెరాతో వారి వద్దకు వెళ్తాడు. ముందు ముందు ఇబ్బంది రాకూడదనే ఈ ప్రశ్న అడిగానని వరుడు వివరణ ఇచ్చాడు. దీంతో వధువు ముసిముసిగా నవ్వుకుంది.నెటిజన్ల స్పందనఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన అని మెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో పెళ్లి కూతురు దొరకడమే కష్టమంటే, ఇప్పుడు 'పొయ్యి టెస్ట్' కూడా మొదలుపెట్టారా?" అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. మొత్తానికి, ఈ "కట్టెల పొయ్యి" ప్రశ్నదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్ సెంటర్లో అమానుషం -
వైభవ్ సూర్యవంశీపై విద్వేష విషం.. వీడియో వైరల్
వైభవ్ సూర్యవంశీ.. గతేడాది కాలంగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న పేరు. దేశీ క్రికెట్, భారత్ అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్-2026లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్లు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా రాణించిన వైభవ్.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.36 బంతుల్లోనే శతకంఇక తాజాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మరోసారి అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.ఆరెంజ్ క్యాప్తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు వైభవ్. తద్వారా అత్యధిక పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ చేతులు మారి ఈ లెఫ్టాండర్‌కు చేరింది. దీంతో మరోసారి వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.అదే సమయంలో కొంతమంది ‘అభిమానుల’ ముసుగులో వైభవ్ సూర్యవంశీని తిట్టిపోయడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో... టీమ్ బస్సులో వెళ్తున్న సమయంలో వైభవ్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నట్లు కనిపిస్తోంది.విద్వేష విషంఆ సమయంలో కొంతమంది బస్సు బయట నిల్చుని వైభవ్‌ను ఫొటోలు, వీడియోలు తీయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే, వైభవ్ మాత్రం వారి వైపు చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు. దీంతో.. ‘‘చాలా ఎక్కువైంది. ఒక్కసారైనా చూడవచ్చు కదా! ఇంత ఓవరాక్షన్ ఎందుకు?’’ అంటూ వైభవ్‌పై విద్వేష విషం చిమ్మారు.Shameless how grown men are mocking a 15-year-old for 'attitude.' He’s just a kid trying to process the pressure of being a professional athlete. Let him breathe.💔 pic.twitter.com/HrDY6uY33D— CSK Xtra (@Im_Kushall) April 28, 2026సిగ్గులేకుండా..అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తూ.. అక్కడున్న వాళ్లపై మండిపడుతున్నారు. ‘‘సిగ్గులేకుండా పదిహేనేళ్ల పిల్లాడిపై ఈ ‘పెద్ద మనుషులు’ విషం చిమ్ముతున్నారు. ఆటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ పిల్లాడిని ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తున్నారు.ప్రపంచంలోనే భారీ క్రేజ్ ఉన్న ఐపీఎల్లో ఈ పిల్లాడు ఆడుతున్నాడు. వరల్డ్‌క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ చితక్కొడుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కాస్త సేద తీరితే.. తమవైపు చూడలేదంటూ ఇంతకు దిగజారుతారా? మీకిదో వ్యసనంగా మారింది. పాపం పిల్లాడిని కాస్త ఊపిరిపీల్చుకోనివ్వండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
అస్తిపంజరంతో బ్యాంక్‌కు.. అసలు జరిగింది ఇదే!
ఓ గిరిజనుడు తన సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు అధికారుల ముందు ప్రదర్శించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఇది బాగా వైరల్ అయ్యింది కూడా. ఈ ఘటన కలచి వేసిందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నియంత్రణ శాఖల మంత్రి సురేష్ పూజారి అనడం.. విపక్షాల విమర్శలకూ తావిచ్చింది. అయితే.. ఘటన వైరల్ అయిన నేపథ్యంలో జీతూ ముండాకే ఎక్కువ మంది సపోర్ట్‌గా నిలిచారు. వ్యవస్థలోని లోపాలు, అవగాహన లోపం, పేదరికం.. అంశాలతో పెద్ద చర్చే నడిచింది. ఏదైతేనేం బాధిత కుటుంబానికి అందాల్సిన డబ్బు అందింది. అయితే సంబంధిత బ్యాంకు మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా సగం సగం సమాచారంతో తమను తొట్టిపోయడం సరికాదని అంటోంది. ఫ్యాక్ట్ చెక్ పేరిట అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసింది. కేంఝర్ జిల్లా దియానలి గ్రామానికి కల్రా ముండాకు (56) ఒడిశా గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్యాంకులో ఖాతా ఉంది. పశువులు అమ్మేయగా వచ్చిన సొమ్మును ఆమె ఆ ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసింది. దీంతో ఆ సొమ్ము కోసం ఆమె సోదరుడు జీతూ ముండా (50) బ్యాంకు అధికారుల్ని సంప్రదించాడు. ఆమె వస్తేనే ఆ డబ్బు ఇవ్వడం కుదరుతుందని బ్యాంకు అధికారులు అతనితో చెప్పారు. ఆమె చనిపోయిందన్నా వినలేదు. దీంతో సాక్ష్యం కోసం ఆమె సమాధి తవ్వి ఎర్రటి ఎండలో భుజాన వేసుకుని బ్యాంకు దగ్గరికి వచ్చాడు. కంగారుపడిపోయిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం.. ఈలోపు అతన్ని కొందరు వీడియోలు తీసి నెట్లో పెట్టారు. ఈలోపు పోలీసులు కలగజేసుకుని అతనికి న్యాయం చేస్తామని సర్దిచెప్పి.. ఆ అస్తిపంజరాన్ని తిరిగి సమాధిలోకి చేర్చారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ภาพถึงหน้าแบงค์แล้ว Jitu Munda พยายามถอนเงินประมาณ 20,000 รูปี (6,877.64 บาท) จากบัญชีของพี่สาวผู้ล่วงลับ ธนาคารในรัฐโอดีชา ปฏิเสธ (ให้พาเจ้าของบัญชีมาด้วย) pic.twitter.com/TEi3evavxn— R here (@UvgtdERt4PWmcjF) April 28, 2026ఈ ఘటన వైరల్ కావడంతో.. మంగళవారం అధికారులు స్పందించారు. కల్రా ముండా డెత్ సర్టిఫికెట్తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు కూడా జీతూ ముండా, మిగతా సోదరీమణుల చేతికి అప్పగించారు. ఆ వెంటనే గ్రామీణ బ్యాంక్ అధికారులు కదిలారు. వాళ్లకు రావాల్సిన రూ.19, 402 సొమ్మును అందజేశారు. అదే సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీ వాళ్లకు ఆ కుటుంబ దీనావస్థ గురించి తెలిసి మరో రూ.30 వేలను అందించింది. అయితే.. బ్యాంకు మాత్రం జరిగింది వేరని చెబుతోంది. విత్‌డ్రా సొమ్ము కోసం జీతూ ముండా బ్యాంకుకు వచ్చిన మాట వాస్తవమే. కానీ, అప్పటికే ఆయన మద్యం సేవించి ఉన్నాడు. ఆ మత్తులో ఉండడం, పైగా నిరక్షరాస్యుడు కావడంతో మా సిబ్బంది చెప్పింది అతనికి అర్థం కాలేదు. చనిపోయిన వ్యక్తి ఖాతాలో ఎమౌంట్‌ను విత్‌డ్రా చేసే అధికారం.. నామినీకి తప్ప మూడో వ్యక్తికి ఉండదు. అందుకే డబ్బు ఇవ్వడం కుదరదని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. ఆమె చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకురావాలని.. అదీ కుదరకుంటే నామీనిని అయినా తీసుకు రమ్మని చెప్పారు. అప్పటికే మత్తులో ఉన్న ఆయనకు అదేదీ అర్థం కాలేదు.. మా ఉద్దేశం డిపాజిటర్ డబ్బును రక్షించడం, నియమాలను పాటించడం మాత్రమే. బ్యాంకు సిబ్బంది ఖాతాదారులను వేధింపులకు గురి చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఒడిషా గ్రామీణ బ్యాంకుకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక ట్వీట్ చేసింది. Reported Incident at Odisha Grameen Bank of claimant bringing sister’s skeleton for death claim process.We would like to submit that, today the Government Authorities have issued the Death Certificate and Legal Heir Certificate. Immediately on receipt of these documents, Bank…— Indian Overseas Bank (@IOBIndia) April 28, 2026 ఎవరేమంటున్నారు.. ‘నా సోదరి మరణించిందని చెప్పినా బ్యాంకు సిబ్బంది వినలేదు. ఆమెను తీసుకొని వస్తేనే డబ్బు ఇస్తామన్నారు. ఏం చేయాలో పాలుపోక నా సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చి ఆమె మరణించిన విషయాన్ని రుజువు చేయాలనుకున్నా’.. జీతూ ముండామా సోదరుడు డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగాడు. అక్కడి సిబ్బంది ఇవ్వకుండా అతన్ని వేధించారు. ఏం చేయాలో సరిగా వివరించలేదు. భరించలేకే ఆ పని చేశాడు. అందుకే అధికారులు దిగొచ్చి మా డబ్బు మాకు ఇచ్చారు .. జీతూ మిగిలిన ఇద్దరు సోదరీమణులుమరణించిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకురావాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. అవసరమైన పత్రాలు అందించమని మాత్రమే కోరాం. అవి అందిన వెంటనే రూ.19,402 మొత్తాన్ని ముగ్గురికీ అందించాం.. బ్యాంకు అధికారులుజీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు.. స్థానిక పోలీసులుడబ్బు ఎలా తీసుకోవాలో జీతూ ముండా కుటుంబానికి అవగాహన లేకుండా పోయింది. అదే సమయంలో వాళ్లకు అర్థమయ్యేలా వివరించడంలో బ్యాంకు సిబ్బంది కూడా విఫలమయ్యారు.. గ్రామస్తులుబ్యాంకు అధికారులకు ఆ పెద్దాయన భలే బుద్ధి చెప్పారు అని కొందరు.. ఇలాంటి విషయాల్లో ఖాతాదారులకు కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. -
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్‌ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్‌కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
వైరల్‌గా మారిన జితేశ్ శర్మ చర్య!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కనబరుస్తోంది. సీజన్లో 8 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడి చేతిలో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జెండా గాలిలో ఎగురుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీనిని గమనించిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆ జెండాను అందుకొని తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. The way Jitesh shows respect towards DC flag he is pure soul 🥺❤️ pic.twitter.com/1nyd5XpPN3— Ankur (@flick_class) April 28, 2026చదవండి: ‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మడం ఆపండి!’ -
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!
క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగబడడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ రూం వద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్‌తో అతడి వద్దకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్రయత్నించినప్పటికీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో కోహ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడన్న కోపంతో తన చేతిలోని బ్యాట్‌ను విసిరేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన మ్యాచ్‌కు ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ బుడ్డోడు మాత్రం తన చర్యతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? -
సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..!
న్యాయం కోసం హీరోలు సినిమాల్లో పోరాడడం చూస్తుంటాం. భావోద్వేగంతో విజిల్స్ వేస్తుంటాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అయితే ఈ కథలో బాధితుడే ఓ హీరో. ఆ వ్యక్తి సహనానికి అధికారులు పరీక్ష పెట్టారు. ఓపిక నశించిన ఆ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.50 ఏళ్ల జీతు ముండాది ఒడిషా కియోంజర్ జిల్లా డియానాలి గ్రామం. అతని అక్క కల్రా ముండా(56) ఈ జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. మరణించే ముందు ఆమె తన పశువుల్ని అమ్మింది. అలా వచ్చిన సొమ్ము రూ.20 వేలను ఒడిశా గ్రామీణ బ్యాంక్‌లో జమ చేసింది. అయితే ఆ సొమ్ము కోసం జీతు ఒజీవీ బ్యాంక్ మలిపోసి బ్రాంచ్‌కు వెళ్లాడు.కల్రా తన సోదరి అని, ఆమె మరణించిందని.. ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము తనకు ఇవ్వమంటూ బ్యాంక్ అధికారుల్ని కోరాడు. అయితే సిబ్బంది అది వినిపించుకోలేదు. అకౌంట్ హోల్డర్‌ను తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అలా పదులసార్లు బ్యాంకుకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనేజర్ కూడా చేతులెత్తయడంతో జీతూకి మండిపోయింది.సరాసరి అక్క సమాధి దగ్గరికి వెళ్లి.. ఆ అస్తిపంజరాన్ని ఓ సంచిలో మూటగట్టకున్నాడు. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ సంచి మోసుకుంటూ బ్యాంకుకు వచ్చాడు. దారిన స్థానికులు కొందరు ఆ చర్యను చూసి షాక్‌కు గురయ్యారు. తమ మొబైల్స్‌లో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అస్థిపంజరాన్ని చూపించి.. తన సోదరి చనిపోయిందని ఆధారాలు చూపించాడు. జీతూ చేసిన పనితో బ్యాంకు అధికారులు హడలి పోయారు. పోలీసులకు సమాచారం అందించారు.A man in Odisha dug up his deceased sister’s grave and brought her skeleton to the bank Just to prove she had died.He had been trying to withdraw ₹20,000 from her account, but bank officials kept insisting he bring the account holder in person. Despite repeatedly telling them… pic.twitter.com/hICEqwvPFu— Woke Eminent (@WokePandemic) April 28, 2026అనుమతి లేకుండా పాతిన శవాన్ని బయటకు తీయడం నేరమని.. జీతూ మీద కేసు పెట్టమని బ్యాంకు అధికారులు పోలీసుల మీద ఒత్తిడి చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ పెద్దాయనకే సపోర్ట్‌గా నిలిచారు. వాళ్ల జోక్యంతో బ్యాంకు అధికారులు దిగి వచ్చారు. జీతు ముండాకి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చే ఏర్పాటు చేశారు. ‘‘జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు’’ అని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. తనకు తెలియకుండానే చేసిన ఈ నిరసన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భలే పని చేశాడని.. బ్యాంకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకుల్లో కోట్లాది డబ్బులు మూలుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో క్లైమ్ చేయని డిపాజిట్లు, టీడీఎస్ రీఫండ్లు కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.బ్యాంకుల్లో క్లయిమ్ చేయని డిపాజిట్లుజనవరి 2026 నాటికి మొత్తం రూ.72,454 కోట్లుపబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో: రూ.60,571 కోట్లుప్రైవేట్ బ్యాంకుల్లో: రూ.9,608 కోట్లువిదేశీ బ్యాంకుల్లో: రూ.2,275 కోట్లు.. ఈ మొత్తాన్ని RBI నిర్వహించే Depositor Education and Awareness (DEA) Fundకి బదిలీ చేశారు.టీడీఎస్ రీఫండ్లుక్లైమ్ చేయని TDS రీఫండ్లు: సుమారు రూ3,000 కోట్లు. ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, కానీ పన్ను చెల్లించిన వ్యక్తులు ITR ఫైలింగ్ ద్వారా తిరిగి పొందవచ్చు.ఎందుకు క్లయిమ్ చేయబడటం లేదు?అకౌంట్ హోల్డర్ మరణం, నామినీ లేకపోవడంప్రజల్లో అవగాహన లోపంక్లిష్టమైన పేపర్‌వర్క్, ప్రక్రియలు -
వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ పదిహేనేళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ జోరు కొనసాగుతోంది.36 బంతుల్లోనే శతక్కొట్టి.. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మ్యాచ్‌లో వైభవ్ 36 బంతుల్లోనే శతక్కొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్‌కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తున్నారు.వయసు అసలు లెక్కలోకే రాదుఈ నేపథ్యంలో ఒలింపిక్ పతకాల విజేత, భారత షూటర్ మనూ భాకర్‌కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడి చుట్టూ ఉన్న వాళ్లు.. మార్గదర్శనం చేసే వాళ్లు గొప్పగా ఉంటే.. వయసు అసలు లెక్కలోకే రాదు.అయినా ప్రతిభకు వయసుతో పనిలేదు. కొంతమంది అరవై ఏళ్లలో అద్భుతాలు చేస్తే.. మరికొందరికి ఆరేళ్లకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కాస్త సులువు అవుతుంది. టీమిండియా తదుపరి బిగ్ స్టార్ అతడే’’ అని పేర్కొంది.VIDEO | India's double Olympic medallist shooter Manu Bhaker says, “With the right mentorship, Vaibhav (Sooryavanshi) can be the next big star of Indian cricket.”(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UZwA8iZwSk— Press Trust of India (@PTI_News) April 27, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మనూ భాకర్‌ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.ఆమె ఒలింపిక్ పతకాల విజేత‘‘ఆమె ఒలింపిక్ పతకాల విజేత. ఆమె క్రీడ, విజయాల గురించి కాకుండా వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకు? మన దేశంలో క్రికెట్‌నే సర్వస్వంగా భావించేవాళ్లు ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్ ఎడిటర్లకు తెలియదా?సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది?.. హెడ్లైన్ కోసమే కదా ఇదంతా!.. ఒకవేళ మీరు వైభవ్ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మనూ భాకర్ గురించి అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిగ్గుపడండిమరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మనూ భాకర్ వైభవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ ద్వంద్వ ప్రమాణాలకు సిగ్గుపడండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో మనూ భాకర్ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది.చదవండి: సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త -
అంబులెన్స్‌లో రోగి వాంతి : భార్యతో కడిగించిన వైనం, వీడియోవైరల్
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.గాయపడిన రోగిని తరలించేందుకు అతని భార్యతో అంబులెన్స్‌ను శుభ్రం చేయించిన అమానుష ఘటనపై అంబులెన్స్ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శుక్రవారం సాయంత్రం ఉమరియా-బర్హి రోడ్డులోని ఖితౌలి సమీపంలో ఉన్న కరేలా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాహుల్ బర్మన్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాహుల్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. డయల్ 112 సహాయంతో అతడిని మొదట బర్హి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కానీ రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని కట్నీ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. బర్హి నుంచి కట్నీకి తీసుకువస్తుండగా, నొప్పి, గాయం కారణంగా రోగి రాహుల్ అంబులెన్స్ కిటికీలోంచి వాంతి చేసుకున్నాడు.దీంతో ఉద్యోగి మోహిత్ నాయక్ రోగి భార్యపై అంబులెన్స్‌ను శుభ్రం చేయమని ఒత్తిడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రోగి భార్య నీళ్లు పోస్తూ అంబులెన్స్‌ను శుభ్రం చేస్తూ కనిపిస్తుంది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం,ఈ సమయంలో అంబులెన్స్ సిబ్బంది సున్నితత్వం లేకుండా ప్రవర్తించారు. ఆ మహిళకు ఏమాత్రం సహాయం చేయలేదు.ఆ తర్వాత జబల్పూర్కు తరలించారు: కట్నీ జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, రాహుల్ పరిస్థితి మరింత విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. View this post on Instagram A post shared by The Trending India 🇮🇳 (@thetrendingindian) ఈ మొత్తం విషయంపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఓ) డాక్టర్ రాజ్ సింగ్ ఠాకూర్ చేసిన ప్రాథమిక ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అంబులెన్స్‌లో రక్తస్రావం జరిగి ఉండవచ్చని, దానిని ఆ మహిళ శుభ్రం చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. అంబులెన్స్ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత సమగ్ర విచారణ జరిపి తెలిపారు. -
అమ్మాయి చేసిన పనికి అభిషేక్ శర్మ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్న అభిషేక్ సెంచరీతో పాటు మూడు అర్థశతకాలు సాధించాడు. ఇక శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు హోటల్ రూంకు చేరుకునే సమయంలో అభిషేక్ శర్మకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఒక అమ్మాయి చేయి పట్టుకుని లాగింది. ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందిగానే అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.Abhishek Sharma getting pulled by a girl at team hotel. Imagine if roles are reversed? pic.twitter.com/GCqMI05G4f— Deepu (@deepu_drops) April 26, 2026 చదవండి: ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే? -
వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా?
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్న సూర్యవంశీ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు. ఈ సీజన్లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తోన్న వైభవ్ తాజాగా తనతో ఫొటో దిగాలని వచ్చిన ఇద్దరు చిన్న పిల్లలను ఆటపట్టించడం ఆసక్తికరంగా మారింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్తాన్ రాయల్స్ జట్టు తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడేందుకు ముల్లన్‌పూర్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగిన వైభవ్ వద్దకు ఇద్దరు పిల్లలు వచ్చి ఫొటో దిగాలని అడిగారు. తాను ఫొటో దిగేందుకు రెడీనే అని, కానీ తాను ఏదీ ఉచితంగా చేయనని పేర్కొన్నాడు. వైభవ్ మాట్లాడుతూ.. ‘బ్రదర్.. నేను మీతో ఫొటో దిగాలంటే మీరు ఒక్కో ఫొటోకు నాకు వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నాడు. దీంతో పిల్లలు 200 రూపాయలు తీసుకొచ్చి వైభవ్ చేతిలో పెట్టారు. అయితే డబ్బులు పిల్లలకు తిరిగి ఇచ్చిన వైభవ్..‘ ఇది కేవలం ప్రాంక్ మాత్రమే.. మీ డబ్బులు మీరు తీసుకోండి’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులను దగ్గరికి తీసుకొని వారితో ఫొటో దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. ఇందులో 31 బౌండరీలు, 32 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026చదవండి: గిల్‌పై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు! -
తీవ్ర పదజాలంతో పేరెంట్‌పై ప్రిన్సిపాల్ వీరంగం!? వీడియో వైరల్
యూపీలో ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అనుచిత వైఖరి సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వీడియోను @NewsAlgebraINDతో సహా ట్విటర్లో పలువురు యూజర్లు ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం షట్ అప్, షట్ అప్ గెట్లాస్ట్ అంటూ ఒక విద్యార్థి తల్లిపై సన్‌బీమ్ పాఠశాల ప్రిన్సిపాల్ మమతా మిశ్రా విచక్షణా రహితంగా విరుచుకుపడింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.పాఠశాల పుస్తకాల కొనుగోలు నిబంధనలను పాటించనందుకు, వారి పిల్లల పేరును తొలగించమని ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను కోరినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది.బయటి విక్రేతల నుండి పుస్తకాలు కొనడంపై పాఠశాల విధానాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై "నోరు మూయండి! ఇక్కడి నుండి వెళ్ళిపోండి!" అని అరుస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతో హర్దోయ్‌లో పెద్ద వివాదం చెలరేగింది. తల్లిదండ్రులు, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పాఠశాల యాజమాన్యాల వైఖరి, సిబ్బంది ప్రవర్తన, జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.School Principal lost her cool at mother for not purchasing books from the school.PRINCIPAL : "You shut up! Get lost. I am going to remove the children's name from the Register" 🤯pic.twitter.com/OWt5cvk5hZ— News Algebra (@NewsAlgebraIND) April 26, 2026దీనిపై వివాదం మరింత ముదరడంతో ప్రిన్సిపాల్ మమతా మిశ్రా ఆ రోజు ఏం జరిగిందో, తాను తల్లిదండ్రులపై ఎందుకు అరిచానో వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.Sunbeam School Hardoi Principal Mamta Mishra’s clarification: Parents were pressuring to reduce ₹1300 monthly fee, so she lost her cool. Questions how much lower it should go. (2/3) pic.twitter.com/osbgnXuAOS— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026 హర్దోయ్‌లోని సన్‌బీమ్ స్కూల్ ప్రిన్సిపాల్ మమతా మిశ్రా తన వివరణలో పేర్కొన్న దాని ప్రకారం నెలకు రూ.1,300 ఫీజును తగ్గించాలని తల్లిదండ్రులు తనపై ఒత్తిడి తీసుకురావడంతో సహనం కోల్పోయింది. ఫీజును ఇంకా ఎంత తగ్గించాలని ఆశిస్తున్నారని ప్రశ్నించింది. సంఘటన జరిగిన రోజున, పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో టీకా కార్యక్రమం జరుగుతోందని, ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు అప్పటికే తెలియజేశామనిన్నారు. సాధారణంగా, టీకాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఉంటారు, కానీ ఇది పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో, పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.సరిగ్గా ఆసమయంలో తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అదే రోజు తమ ఆందోళనలను వ్యక్తం చేసి, ప్రక్రియకు అంతరాయం కలిగించారనేది ఆమె అయితే. అంతేకాదు తమ పాఠశాల ఎల్లప్పుడూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, ఏళ్లుగా వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. చాలా మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.వైరల్ వీడియోలో సంఘటనలోని కొంత భాగాన్ని మాత్రమే చూపించారని, పూర్తి సందర్భం అందులో లేదని ఆమె అన్నారు. ఒక చిన్న క్లిప్ ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు Sunbeam School Hardoi Principal Mamta Mishra harshly scolded mother Neelam Verma just for requesting a 15-day fee extension.⁰Neelam has now accused the principal of extreme misbehavior. pic.twitter.com/zOJX3DlTr2— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026బాధిత మహిళ వాదనతల్లి నీలం వర్మ ప్రకారం, కేవలం 15 రోజుల గడువు పొడిగింపు కోరినందుకే తనపై దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అప్పటికే నోట్‌బుక్‌లతో సహా పూర్తి కోర్సును కొనుగోలు చేశాను, కానీ భర్త ప్రస్తుతం ఊళ్లోలేని కారణంగా 15 రోజుల సమయం కోరానని, అయినా కనీస మర్యాద లేకుండా, దుర్బాషలాడుతూ పిల్లల వస్తువులను రోడ్డుపై విసిరేశారని వాపోయింది.ఇదీ చదవండి : రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ -
‘మా మామ గారికి అంకితం’
చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్-2026లో కోల్‌కతా రైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ యూపీ ఆటగాడు అదరగొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.కోల్‌కతా విజయంలో అంతా తానే..రింకూ ప్రదర్శన కారణంగానే కోల్‌కతా 155 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా కోల్‌కతా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు.. ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... జట్టు విజయంలో రింకూనే కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మా మామ గారికే అంకితంఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రింకూ సింగ్ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj) లక్నోలోని ఏకనా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా రింకూ ప్రదర్శన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రింకూ మా మామ గారి కోసం ఆడాడు. ఈరోజు ఆయనను మేము ఎంతగానో మిస్సవుతున్నాము. రింకూ ప్రదర్శన మా మామ గారికే అంకితం’’ అని ప్రియా సరోజ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)చిన్న పిల్లలా గంతులేశారుకాగా రింకూ సిక్సర్లు బాదుతున్న వేళ ప్రియా సరోజ్ చిన్న పిల్లలా గంతులేశారు. నవ్వులు చిందిస్తూ కాబోయే భర్త విజయాన్ని సెలబ్రేట చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిచహర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున లోక్‌సభకు ఎంపికయ్యారు. రింకూతో పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రింకూ తండ్రి మరణించిన విషయం విదితమే. చదవండి: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!
చిన్న ఆటో అయినా..దాన్ని కస్టమర్లకు విభిన్నంగా పరిచయం చేసేలా సెట్ చేసే తీరు ఎవ్వరినైనా..ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంతకు మునుపు వరకు చల్లదనం కోసం మొక్కలతో, పర్యావరణ అనుకూలంగా మార్చిన అందమైన ఆటోలను చూశాం. కానీ ఈ ఆటో డ్రైవర్ అంతకు మించి అన్నట్లుగా.. ఆటో జర్నీని అందిస్తున్నాడు ప్రయాణికులకు. అందుకోసం ఏం చేస్తున్నాడంటే..అందుకు సంబంధించిన వీడియోని వర్ష అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఒక సాధారణ ఆటో ప్రయాణంలా కనిపించేదాన్ని చిత్రీకరించినట్లు ఉంటుందే తప్ప, అందులో విభిన్నంగా ఏమీ కనిపించదు. కానీ కెమెరా లోపలికి మారినప్పుడు, మొత్తం ఆటోజర్నీనే మంచి అనుభూతిగా మార్చేస్తోంది. ఆ వీడియోలో సాధారణ ఆటో ప్రయాణంలా మొదట్లో కనిపించినా..ఆ తర్వాత డ్రైవర్ సీటు వెనుక, పుస్తకాలతో నిండిన ఒక చిన్న అర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దొరికిన ఆ కొద్ది సమయం ఫోన్‌కి అంకితమవ్వకుండా కాసేపయినా పుస్తకాలు తెరిచేలా చేసే ప్రయత్నం ముచ్చటగొలుపుతుంది. వాటి తోపాటు ఆ ఆటోలో ప్రయాణికుల కోసం ఒక చిన్న క్యాండీల డబ్బా కూడా ఉంది. చిన్నపాటి ఆలోచన అయినా..ప్రయాణికులకు తమ జర్నీ సమయాన్ని విలువైనదిగా మార్చుకునేలా చేస్తోంది. పైగా ఫోన్‌ని స్క్రోల్ చేసే బదులు కొన్ని నిమిషాల పాటు చదువుకునేలా చేస్తుంది. మాములు ప్రయాణం అనుకున్నాం కానీ ఒక చిన్న లైబ్రరీగా మారింది అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ షేర్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని సైతం “ఈ ఆటో సీఎన్జీతో గానీ, పెట్రోల్‌తో గానీ నడవడం లేదు, ఇది కేవలం కరుణతో నడుస్తోంది. అతడు అందిస్తున్న ప్రతిదానికి అంతకుమించిన ఆశీస్సులు అందాలి అని దీవిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _np_ (@by.nanthithaparkavi) (చదవండి: సమానత్వానికి కేరాఫ్‌గా ఆ వివాహం..!) -
హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ ఉండదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షితమనుకున్నా. కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’’ అంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్‌కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. హైదరాబాద్ సైకిల్ ట్రాక్‌లో ఓ మహిళా రన్నర్‌కు వేధింపులు ఎదరయ్యాయి. ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరించబోయాడు. అయితే అప్రమత్తమైన ఆ యువతి అతన్ని వీడియో తీయబోగా.. నిక్కరు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్! మహిళలకు సురక్షితంగా ఉండకూడదా?. సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్‌కు రాలేదు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తా.. రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారు. ఆఖరికి ఐదు పదుల వయసున్న అంకుల్స్ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె వ్యాఖ్యానించింది. భయంతో, బాధతో ఆ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాకు చేరింది. పలువురు ఆమెకు మద్ధతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్ ట్రాక్‌పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. This Is Hyderabad! Isn’t This Supposed To Be Safe?? A very agitated runner was seen asking in this video. She was running on the Hyderabad Cycle Track at 6am and a random sicko was behaving disgustingly. So, so, so…horrible!! Yes! Hyderabad is supposed to be a safe space… pic.twitter.com/TblHVLAM37— Revathi (@revathitweets) April 27, 2026 -
వరల్డ్ రిచెస్ట్ సిటీ.. అట్ట పెట్టెల్లో నివాసం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం.. అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసించే ప్రపంచ ఆర్థిక కేంద్రం హాంకాంగ్. అయితే, ఇక్కడ నివసిస్తున్న గృహ కార్మికులు, సామాన్య ఉద్యోగుల సంబంధించిన జీవన శైలి తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీకెండ్స్‌లో కార్మికులు, ఉద్యోగులు అట్ట పెట్టెల్లో నివాసం ఉండటం, అండర్‌పాస్‌ల కింద సేద తీరడం వంటికి వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ విషయం చర్చకు దారి తీసింది. ఇంతకీ వాళ్లంతా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే..సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు హాంకాంగ్‌లో కార్మికుల జీవన శైలి, అక్కడి పరిస్థితులను వివరించారు. హాంకాంగ్‌లో గృహ నిర్మాణ కార్మికులు, సాధారణ ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలను తెలియజేశారు. పలువురు కార్మికులు అండర్‌పాస్‌లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో “కాఫిన్ హోమ్స్” (అట్ట పెట్టెల్లాంటి గదులు) నివసించడం ఆ వీడియోలో చూపించారు. ఈ సందర్బంగా వారందరికీ నివాసం ఉండేందుకు సొంత ఇళ్లు లేదని చెప్పుకొచ్చారు. కార్డ్బోర్డ్ పెట్టెలతో తాత్కాలిక "గదులను" నిర్మించుకుంటారు. ఈ క్రమంలో.. హాంకాంగ్ ధనికులకు నివాసం కల్పించడానికి నిరాకరించే శ్రమశక్తిపైనే హాంకాంగ్ ఆధారపడి నడుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Rapha | Travel Tips & Itineraries 🌏 (@the.tale.of.travel) అయితే, “కాఫిన్ హోమ్స్” అనేవి అత్యంత చిన్న, కిక్కిరిసిన నివాస స్థలాలు. వీటిలో కార్మికులు మరియు తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు నిద్రించాల్సి వస్తుంది. ఎందుకంటే హాంకాంగ్‌లో గృహ ధరలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. దీంతో, ప్రతీ ఆదివారం(సెలవు రోజున) ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాకు చెందిన వేలాది మంది మహిళలు తాము శుభ్రపరిచే విలాసవంతమైన అపార్ట్మెంట్ల నుండి, నగరంలోని ఉన్నత వర్గాల వారిని చూసుకునే కేర్ సెంటర్ల నుండి బలవంతంగా బయటకు పంపించేయబడుతున్నారు. వారికి సెలవు రోజున నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. సొంత నివాసాలు లేకపోవడంతో ఇలా అండర్‌పాస్‌లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో సేద తీరుతున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి కూడా వీటిని “మానవ గౌరవానికి అవమానం”గా పేర్కొంది.ప్రధాన కారణం.. హాంకాంగ్‌లో గృహ సంక్షోభానికి ప్రధాన కారణం భూమి కొరత, అధిక గృహ ధరలు, మరియు ప్రభుత్వ విధానాలే కారణం. హాంకాంగ్‌లో భూమి పరిమితంగా ఉండటం, ఎక్కువ భాగం పర్వతాలు లేదా రక్షిత ప్రాంతాలు కావడం ప్రధాన కారణం. మరోవైపు.. 2004–2021 మధ్య గృహ ధరలు 239% పెరిగాయి, కానీ వేతనాలు కేవలం 7.1% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం భూమి అమ్మకాలపై ఆధారపడటం వల్ల, అధిక విలువ గల ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ధరలను మరింత పెంచాయి. దీంతో, సామాన్యులు, కార్మికులు ఇళ్లు కొనే పరిస్థితి లేదు. Hong Kong’da pazar izni gerçeği: Binlerce ev işçisi, çalıştıkları evden çıkmak zorunda kaldığı için köprü altlarında karton kutularla kendine “oda” yapıyor.Modern şehir dediğimiz şey bazen sadece pahalı binalardan ibaret. pic.twitter.com/ZTz9OvrB6M— 🐺Özet Geç 🦅 (@_OzetGec_) April 26, 2026కాఫిన్ హోమ్స్ అంటే ఏమిటి?.పరిమాణం: 11–25 sq ft (సాధారణంగా ఒక పార్కింగ్ స్థలం లేదా జైలు గది పరిమాణం).రూపకల్పన: పాత అపార్ట్మెంట్లను విభజించి, లోపల పెట్టెల్లాంటి గదులు తయారు చేస్తారు.సౌకర్యాలు: కిటికీలు లేకపోవడం, గాలి ప్రసరణ తక్కువగా ఉండటం, ప్రైవసీ లేకపోవడం.నివాసులు: తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు, డెలివరీ వర్కర్లు, వృద్ధులు, కొంతమంది విద్యార్థులు.సవాళ్లు..అద్దెలు పెరగడం: కొత్త నియమాలు గృహ ప్రమాణాలను మెరుగుపరుస్తాయి కానీ అద్దెలు పెరిగే అవకాశం ఉంది.సామాజిక అసమానత: తక్కువ ఆదాయం గల కార్మికులు ఇంకా “కాఫిన్ హోమ్స్” లేదా subdivided flatsలోనే ఉండే ప్రమాదం ఉంది.రాజకీయ ప్రభావం: డెవలపర్లు మరియు ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాలు ప్రజా గృహాల విస్తరణను అడ్డుకుంటాయి.సమస్యలు, పరిష్కారాలుసమస్య: హాంకాంగ్‌లో గృహ ధరలు అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల కార్మికులు ఇలాంటి “కాఫిన్ హోమ్స్”లో నివసించాల్సి వస్తోంది.ప్రభుత్వ చర్యలు: తాత్కాలిక గృహాలు (transitional housing) అందిస్తున్నారు, కానీ 2 సంవత్సరాలకే పరిమితం.సామాజిక ప్రభావం: ఇది హాంకాంగ్‌లోని ఆర్థిక అసమానతకు స్పష్టమైన ఉదాహరణ. -
100 మందిని ఒకేసారి మోసం చేసిన బిచ్చగాడు
అంగవైకల్యం ఉన్నప్పటికీ చాలా మంది కష్టపడి పనిచేసుకుని జీవిస్తుంటారు. కొందరు మాత్రం ఏ సమస్య లేకపోయినా అంగవైకల్యం ఉన్నట్లు నటిస్తూ అడుక్కుతింటుంటారు. అటువంటి వ్యక్తే నడిరోడ్డుపై ఓ కెమెరాకు దొరికిపోయాడు. ఘర్ కే కాలేశ్ అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను తాజాగా పోస్ట్ చేశారు. దీంతో, ఇది పాత వీడియోనా? లేదా కొత్త వీడియోనా? అన్నది తెలియకయినప్పటికీ ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతోంది.ఈ దృశ్యాలు ఒక కార్ డ్యాష్క్యామ్లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో ఒక భిక్షగాడు నడిరోడ్డుపై కర్రల సాయంతో కుంటుతూ ముందుకు వస్తూ జనాల వద్దకు వెళ్లి తన కాలు బాగోలేదని చెప్పి భిక్ష అడుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రోడ్డుపై దాదాపు 100 మంది ఉంటారు. వాళ్లంతా అతడిని చూసి నిజంగానే ఒక కాలు లేదేమోనని అనుకుంటారు. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడడంతో అతను స్కూటీపై ఉన్న జంట దగ్గరకు వెళ్లి భిక్ష అడుగుతాడు. వారు డబ్బులు ఇచ్చేదాక అక్కడే ఉంటాడు. చివరకు స్కూటీపై ఉన్నవారు డబ్బు ఇస్తారు. గ్రీన్ పడగానే వాహనదారులు అందరూ అక్కడి నుంచి వెళ్లడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ భిక్షగాడి నిజస్వరూపం బయటపడుతుంది. అందరూ వెళ్లిన తర్వాత అతడు కర్రల సాయంతో కాకుండా సాధారణంగా నడుస్తూ వెళ్లడం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను వేలాది మంది చూశారు. ఇలాంటి బిచ్చగాళ్లు ప్రతి రెడ్ లైట్ దగ్గర కనిపిస్తారని నెటిజన్లు అంటున్నారు. వికలాంగులుగా నటిస్తూ చాలా మంది భిక్ష అడుగుతారని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా కాలు సమస్య ఉన్నట్టు నటించి, కుంటుతూ జనాల్ని మోసం చేయడం చాలా తప్పని కొందరు కామెంట్లు చేశారు. బిచ్చగాళ్లపై ప్రజల నమ్మకాన్ని అతడు దెబ్బతీస్తున్నాడని చెప్పారు. Fake injury scam caught on dashcam A man was seen dramatically limping on the road, using a stick and pretending to have a badly injured leg while begging for money. Sympathetic people gave him cash, feeling sorry for him.Moments later, after collecting the money, he dropped… pic.twitter.com/owIrs6dRa3— Ghar Ke Kalesh (@gharkekalesh) April 25, 2026 -
కుటుంబ జీవితం, కెరీర్ ప్లాన్‌పై సింగపూర్ మాజీ ప్రధాని సలహా!
వివాహం, పిల్లలు కనడం గురించి ఇటీవల కొందరు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు యువత కెరీర్, మంచిగా సెటిల్ అవ్వడమే ప్రధానం అనుకునేవాళ్లను ప్లీజ్ అలా ఆలోచించద్దు అని బతిమాలుతున్నారు. ఫ్యామిలీ లైఫ్‌కే ప్రాధాన్యత ఇవ్వండని వేడుకుంటున్నారు. ఆ దిశగా ఆలోచించేలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు సింగపూర్ మాజీ ప్రధాని సైతం సలహలిస్తుండటం విశేషం. అందుకు సంబధించిన వీడియోని షేర్ చేస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కూడా ఆయన మాటలకే మద్దతిస్తూ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు.శ్రీధర్ వెంబు షేర్ చేసిన ఎక్స్ పోస్ట్‌లో సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ యువతకు సలహాలిస్తున్నారు. ప్లీజ్ వివాహాన్ని, కుటుంబాన్ని ప్రారంభించడాన్ని ఆలస్యం చెయ్యొద్దు అని ఒక పీహెచ్డీ విద్యార్థికి సలహా ఇస్తున్నారు. ఆ వీడియోలో లీ ఆమె విద్యా ప్రణాళికలను ప్రశ్నిస్తూ, కుటుంబ నిర్ణయాలను వాయిదా వేయకూడదని సూచిస్తున్నారు. మాజీ ప్రధాని లీ ఆ విద్యార్థిని వ్యక్తిగత విద్యా జీవితం గురించి వరుసగా ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. ఆమెకు పెళ్లయిందా, బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా, పీహెచ్డీ ఎప్పుడు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా అంటే ప్రశ్నిస్తారు. ఆమె సుమారు రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేస్తుందని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ విద్యార్తి నేరుగా సలహా ఇచ్చారు. “దయచేసి సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ జీవితం మీ పీహెచ్డీ కంటే ముఖ్యమైనది. సంతృప్తినిచ్చే జీవితం కూడా. మీకు ఇదే నా శుభాకాంక్షలు నీకు పీహెచ్డీ, మంచి బాయ్‌ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తున్నా అంటూ లీ ముగించారు. ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూ..శ్రీధర్ వెంబు తన ప్రారంభ సంవత్సరాల నుంచి లీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించానని అన్నారు. ఆయనపై తనకు ప్రగాఢమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. తాను ఇటీవల సంభాషణలలో ఇలాంటి సలహానే ఇచ్చానని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన, ఎలాన్ మస్క్ తరచుగా పంచుకునే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు. ఉన్నత ఆశయాలున్న మహిళలు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే, పిల్లలను కనేలా ప్లాన్ చేసుకోవలని చెబుతున్నారు శ్రీధర్వెంబు. మన సమాజ సాంస్కృతిక, ఆర్థిక నిర్మాణాలు సర్దుబాటు కావాలంటే కుటుంబ వ్యవస్థ ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. కాగా, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక ప్రాధాన్యతల కారణంగా చాలామంది వ్యక్తులు వివాహాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆలస్యం చేస్తున్నారు. తీరా కెరీర్లో సెటిల్ అయ్యాక..సంతానం కలుగక నరకం చూస్తున్నారు. అదే సమయంలో గతకాలంటే గణనీయంగా జననరేటు తగ్గిపోతోంది. దాంతో పలువురు వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తరాలను ఆ దిశగా ఆలోచించేలా సలహాలు సూచనలతో మేల్కొలుపుతున్నారు. I studied the life and work of Lee Kuan Yew, the Founder-Prime Minister of Singapore intensely during my early 20s. Immense respect for him.In this video clip, he advises a young woman pursuing a PhD not to neglect marriage and kids. I recently gave very similar advice. Elon… https://t.co/BVlUSDsBnP— Sridhar Vembu (@svembu) April 24, 2026 (చదవండి: ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్ అవ్వాల్సిందే!) -
గేటుకి వేలాడిన గజదొంగ.. గ్రేట్ ఎస్కేప్ ఫెయిల్!
ఘజియాబాద్: ఆ దొంగ ఒక ఇంట్లో చోరీ చేద్దామని ఎంతో పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. అయితే కీలక సమయంలో అతగాడి ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది! ఇల్లు దోచుకోవడం పక్కనపెడితే.. కనీసం అక్కడి నుంచి ప్రాణాలతో పారిపోలేక, గేటుకే వేలాడుతూ అందరిముందూ నవ్వులపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా, ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.దొంగతనం చేద్దామని వెళ్లి..ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఒక ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని ఓ దొంగ గమనించాడు. ఆ ఇంటిలోనికి చొరబడి అయినకాడికి దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. గోడకు, గేటుకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్ సందులో నుంచి అతికష్టం మీద ఇంటి లోపలికి దూరాడు. కానీ, అప్పటికే వీధిలో ఎవరో నడుస్తున్న అలికిడి వినిపించడంతో భయపడిపోయాడు. ఎవరైనా చూస్తారనే కంగారులో, తాను వచ్చిన సందులో నుంచే వెంటనే పారిపోవాలని భావించాడు.గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి..ఎంత వేగంగా బయట పడాలని ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. ఆ ఇనుప కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం బయటకు, ఇంకో సగం లోపల ఉండిపోయి గేటుపైనే ఇబ్బంది పడుతూ ఉండిపోయాడు. ఈ వింత దృశ్యాన్ని చూసిన స్థానికులు గుమిగూడి, ఆ తతంగాన్ని తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. కిందకు దిగమని అడుగుతున్నా అతను రాలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RVCJ Media (@rvcjinsta) అసలు ట్విస్ట్ ఏంటంటే..స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని బయటకు తీసుకువచ్చి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని, ఇంటి యజమానులు కూడా ఫిర్యాదు చేయడానికి నిరాకరించారని అధికారులు తెలిపారు. పైగా ఆ కుర్రాడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. నెటిజన్లు మాత్రం ‘ఉద్యోగం’లో మొదటి రోజే ఇలా ఇరుక్కున్నాడేంటి? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కేజ్రీవాల్‌కు అన్నా హజారే చురకలు -
రెండేళ్లుగా నరకం : పెళ్లంటేనే భయం భయ్యా, వైరల్ వీడియో
గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్‌టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయిఏం జరిగింది అంటే?ఒక వ్యక్తి తన భార్య చేతిలో దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన ల్యాప్‌టాప్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్‌టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది. దీంతో హాట్ టాపిక్‌గా మారింది.నెటిజన్ల స్పందనఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు. అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్నోట్ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్‌తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి వ్యతిరేకంగా సంబంధిత చట్ట వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం. After being abused for the past two years bro recorded these clips on his laptop Think twice before getting married 🙏 pic.twitter.com/1AQLGWjooU— Vishal (@VishalMalvi_) April 23, 2026 -
ఆకాశ్ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 99 పరుగుల తేడాతో గెలిచిన హార్దిక్ సేన.. అదే జోరు కొనసాగించలేకపోయింది. సొంత మైదానం వాంఖడే వేదికగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సీజన్లో ఏడింట ఐదో పరాజయాన్ని నమోదు చేసింది.సంజూ సెంచరీతో గెలిపించాడుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అడపాదడపా వికెట్లు తీసినా.. ఓపెనర్ సంజూ శాంసన్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆచితూచి ఆడుతూనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ (29 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యకుమార్ (30 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించారు. అకీల్ హొసీన్‌కు 4 వికెట్లు దక్కాయి.ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆది నుంచే తడబడటం తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (0), క్వింటన్ డికాక్ (7).. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. సూర్య, తిలక్ కాసేపు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మిగిలిన వారిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, రూథర్‌ఫర్డ్ 0, శార్దూల్ ఠాకూర్ 6, క్రిష్ భగత్ 7, జస్ప్రీత్ బుమ్రా 2 పరుగులు చేశారు.ఆకాశ్ అంబానీ ఆగ్రహంఈ క్రమంలో వరుసగా వికెట్లు పడుతూ.. ఓటమి దిశగా ముంబై వెళ్తున్న వేళ.. ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబానీ తీవ్రంగా స్పందించారు. బ్లూ సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చేస్తూ స్టేడియాన్ని వీడారు. There is absolutely nothing going right for Mumbai Indians right now. Just look at Akash Ambani walking off mid-game and he walked right in front of the dugout and didn’t even look at the players. He literally asked the fans to leave the stadium as well. The lack of unity is… pic.twitter.com/8nplMjRYLN— OldMonkOfCricket (@OldMonkOfCric) April 24, 2026ఆ సమయంలో మైదానంలోని ఆటగాళ్ల వైపు ఆకాశ్ అంబానీ కోపంగా చూసినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి. అందుకే ఆకాశ్ అంబానీ ఎన్నడూ లేని విధంగా అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.చదవండి: PSL: పీసీబీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్ -
జేమీపై తిలక్ వర్మ ఫైర్.. మధ్యలో సూర్య.. ఆఖరికి!
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ప్రత్యేక అభిమానులు ఉంటారు. చెరో ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ జట్ల మధ్య పోటీ అంటే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. ఐపీఎల్-2026లో భాగంగా గురువారం నాటి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై ముంబైపై ఏకపక్ష విజయం సాధించింది. సొంతమైదానం వాంఖడేలో హార్దిక్ సేనను రుతురాజ్ బృందం ఏకంగా 103 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐపీఎల్లో పరుగుల పరంగా ముంబైకి ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.జేమీతో గొడవపడ్డ తిలక్ వర్మఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై బ్యాటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్- చెన్నై బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా తిలక్ జేమీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంతలో సూర్య కూడా జోక్యం చేసుకుని జేమీని నిందించగా.. అతడు గట్టిగానే బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. చెన్నై విధించిన 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కుదేలైంది. ఈ క్రమంలో తిలక్ వర్మ- సూర్య ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.ఫీల్డర్‌ను చూడనివ్వవా?ఇక ముంబై ఇన్నింగ్స్ పదో ఓవర్లో జేమీ ఓవర్టన్ బంతితో రంగంలోకి దిగి స్లో బాల్ సంధించగా.. తిలక్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సూర్య- తిలక్ కలిసి సింగిల్ పూర్తి చేసుకోగా.. తిలక్ ఇంకో రన్ కోసం పిలుపునిచ్చాడు. అయితే, సూర్య ఇందుకు నిరాకరించగా.. తిలక్ వేగంగా నాన్-స్ట్రైకర్ ఎండ్‌వైపు చేరుకున్నాడు.అయితే, అదే సమయంలో ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న జేమీ.. తిలక్‌కు అడ్డుగా వచ్చి రనౌట్ చేయాలని చూశాడు. దీంతో తిలక్ వర్మ సీరియస్ అయ్యాడు. తనను కావాలనే జేమీ అటకాయించాడని.. ఫీల్డర్‌ను చూడకుండా చేశాడని ఫైరయ్యాడు. దీంతో జేమీ కూడా ధీటుగా బదులివ్వగా సూర్య జోక్యం చేసుకున్నాడు.Heat. Pressure. Drama 😤This rivalry never disappoints 🔥#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/hETDJPFFK3— Star Sports (@StarSportsIndia) April 23, 2026సూర్య కూడా ఫైర్.. అంపైర్ల జోక్యంతోఅయితే, సూర్యకు కూడా జేమీ కౌంటర్ ఇవ్వగా పరిస్థితి విషమిస్తుందని భావించిన అంపైర్లు వీరిని విడదీశారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జేమీని తిలక్ వర్మ హత్తుకున్నాడు. దీంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోయినట్లు అయింది.ఈ మ్యాచ్‌లో తిలక్ 29 బంతుల్లో 37 పరుగులు చేయగా.. సూర్య 30 బంతుల్లో 36 రన్స్ చేశాడు. అయితే, సీఎస్కే బౌలర్ల దూకుడు ముందు వీరు నిలవలేకపోయారు. ఫలితంగా 19 ఓవర్లలో కేవలం 104 పరుగులు చేసి ముంబై ఆలౌట్ అయింది.చదవండి: Hardik pandya: బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా? -
ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!
కేరళంలో ఒక బుడ్డోడు చేసిన పని తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. అటు పోలీసులకు కూడా ముచ్చెమటలు పట్టించింది. చివరికి కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఎలా చేశావురా బుడ్డోడా అంటూ అందరూ నవ్వులు పువ్వులయ్యారు. ఇంతకీ అసలేమైంది అంటే..ఇంట్లో ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక బాలుడు అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయాడు. ఇక ఆ పాత్రలోంచి బయటికి రాలేక నానా కష్టాలు పడ్డాడు. తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసెస్ బృందం ఆ బాలుడిని విజయవంతంగా రక్షించింది. చాలా అప్రమత్తంగా, కట్టర్ ద్వారా ఆ పాత్రను కట్ చేసి బాలుడికి విముక్తి ప్రసాదించారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఆ బాలుడు ఏడ్చి గోల చేయకుండా, ప్రశాంతంగా పోలీసులకు సహకరించడం విశేషం. దీంతో నెటిజన్లు జాగ్రత్తలను గుర్తు చేస్తూనే ఫన్నీగా స్పందించారు. ఇట్లాంటి అల్లరి పిడుగులు చాలామంది ఉన్నారు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కమెంట్స్ చేశారు. తల్లిదండ్రులారా, దయచేసి ఇంట్లోని వస్తువుల విషయంలో మీ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. వారిపై ఒక కన్నేసి ఉంచండి! అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. A child in Kerala got stuck inside an aluminium cooking pot while playing at home. Fire and Rescue Services team successfully rescued the kid.Parents, please be extra careful and keep an eye on your children around household items!#Kerala #ChildSafety pic.twitter.com/DMG3ydxdJd— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) April 23, 2026 -
హవ్వ..! మతపైత్యం అదుపులో ఉంచుకోలేరా?
మతాలు, కులాలు మనుషుల మధ్య అడ్డుగోడలుగా నిలవడం ఇవాళ్టి వ్యవహారం కాదు. ఈ గీతలు దాటిన ప్రేమలు ఎన్ని మొగ్గ తొడుగుతున్నప్పటికీ, పెళ్లిళ్లు ఎన్ని జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులోనైనా ఏదో ఒకనాటికి సమసిపోతాయని అనుకునే వాతావరణం మాత్రం లేదు. ఎందుకంటే.. ఎంతగా ఆధునిక సమాజం ఈ అడ్డుగోడల్ని దాటి వికసిస్తున్నదో.. అంతకంటే ఎక్కువగా మనుషుల్లో కుల జాడ్యం, మతమౌఢ్యం మరింతగా వేళ్లూనుకుంటున్న ఉదాహరణలు మనకు సర్వత్రా కనిపిస్తుంటాయి. సున్నితమైన ఈ అంశాల్లో ఎదుటివారి మనోభావాల్ని గాయపరచడం మాత్రమే కాదు.. దారుణంగా రెచ్చగొట్టే భయావహ వాతావరణానికి గురిచేసే ఘటనలు మనకు నిత్యం అనేకం తారసపడుతుంటాయి. బెంగుళూరు నగరంలో కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.అబ్బిగెరె ప్రాంతంలో ఓ దంపతులు.. ఒక ముస్లిం వ్యక్తిని అభ్యంతరకరమైన మాటలతో నిందించారు. ‘నువ్వు ముస్లింవి. నువ్వు పాకిస్తానీవి. నువ్వొక టెర్రరిస్టువి’ అంటూ వారు అతడిని తూలనాడారు. ఇలాంటి మాటలు ఒక సాధారణ ముస్లింను ఎంతగా గాయపరుస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీరి నిందల పర్యవసానంగా స్థానికంగా ఒక సంస్థకు చెందిన వారు.. ఆ దంపతులకు సదవగాహన కల్పించి, బుద్ధిమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వారి ఇంటికి వచ్చి.. ఇలా ముస్లిం పేరుతో ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడడం, టెర్రరిస్టుగా అభివర్ణించడం తప్పు అని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ సంస్థ తరఫున వచ్చిన వారిలో కేవలం ముస్లిములే కాదు. అన్ని మతాల వారూ ఉన్నారు. ముస్లిం అయిన ప్రతీ వ్యక్తిని టెర్రరిస్టుగా చిత్రీకరించి.. సభ్యసమాజంలో అశాంతికి, అపోహలకు బీజం వేసే ఇలాంటి బుద్ధులను ఎండగట్టారు. ఆ దంపతులకు వీరు బుద్ధి మాటలు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.ప్రత్యేకించి ఈ సంఘటనలో మరో సంగతి చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఆ దంపతుల్లో భర్త తమను గురించి తాము ఘనంగా చెప్పుకుంటూ.. నేను డిఫెన్సులో పనిచేస్తున్న వాడినే అంటూ గంభీరంగా సెలవిచ్చారు. డిఫెన్సులో పనిచేస్తున్న వ్యక్తివే అయితే గనుక.. నీలో మరింతగా దేశభక్తి ఉండాలి. ఈ దేశం అన్ని మతాలు, అన్ని ధర్మాల సమ్మేళనం అనే స్పృహ నీకు ఎక్కువగా ఉండాలి. పరమతసహనం కూడా నీలో ఎక్కువగా ఉండాలి.. కనిపించిన ప్రతి ముస్లింను పాకిస్తానీగా, టెర్రరిస్టుగా చిత్రీకరిస్తూ ఎలా మాట్లాడతావు? అంటూ వాళ్లు నిలదీశారు. చివరికి ఆ దంపతులు క్షమాపణ చెప్పబోయినప్పుడు కూడా.. మీరు క్షమాపణ చెప్పడం కాదు.. మీ ఆలోచన మార్చుకోవాలి.. అంటూ వారు హితవు చెప్పి వెళ్లడం గమనించాల్సిన సంగతి.Abbigere, BengaluruA woman and her husband (a former army officer) have been accused of making derogatory remarks to a Muslim man, saying, "You are Muslim, you are Pakistani, you are a terrorist." Subsequently, members of an organization arrived at the scene, protested. pic.twitter.com/5YwFlPieHg— The Muslim (@TheMuslim786) April 22, 2026మనం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం. ఇళ్లు అద్దెకు తీసుకునేందుకు తిరిగేవారిని మీరు శాకాహారులైతేనే ఇస్తాం’ అని చెప్పే వాళ్లు మనకు పురాతన కాలం నుంచి ఇవాళ్టికీ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మనుషుల్ని తప్పుబట్టే వాళ్లూ ఉంటారు. అయితే అలాంటి వారి బాధల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం అయిన వ్యక్తి కనిపిస్తే చాలు.. ‘మీరంతా పాకిస్తానీలు.. మీరంతా టెర్రరిస్టులు..’ అని నిందించే వారిని ఏమనాలి? పాకిస్తాన్ మీద ఉన్న ద్వేషాన్ని ఒక మతానికి ఆపాదించడమూ, ఆ మతానికి చెందిన అందరి మీదా టెర్రరిజం ముద్ర వేసేయడమూ ఎంత అనైతికం అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.దుర్మార్గాలు కులాల్ని బట్టి, మతాల్ని బట్టి ఉండవు. కేవలం మనుషుల్లో ఉండే బుద్ధుల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి తప్పుడు మనుషులు ఒకే మతంలో లేదా ఒకే కులంలో ఉంటారని అనడం, ఆపాదించడం సుహృద్భావ సమాజ ఆవిష్కరణకు పెనుద్రోహం అవుతుంది. ఆ సత్యం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే.. ఏ ఇద్దరు మనుషుల మధ్య కూడా ఎలాంటి అపోహలూ ఉండని మంచి రోజులు తప్పకుండా వస్తాయి.-యం.రాజేశ్వరి. -
ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. మంత్రికే షాకిచ్చిన మహిళ
ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్‌తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.Mumbai woman, who taught Maharashtra minister Girish Mahajan a lesson in civics sense, also lashed out at a cop who tried to shut her down. In reply, a chilling "Shut up" reverberated. https://t.co/fHwlntCQoJ pic.twitter.com/Dr4ZXX8YJl— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్ అమ్మ..!
రైలు ప్రయాణం అనగానే సర్వసాధారణంగా చిన్న బాక్స్‌లో భోజనం పెట్టుకుని తెచ్చుకుంటారు. ఓవర్‌నైట్ ప్రయాణమైతే సాధ్యమైనంత వరకు చాలామంది ప్రయాణికులు ఇలానే తెచ్చుకుంటారు. మరికొందరు ట్రైన్లో అమ్మే ఆహారాలతో పనికానిస్తారు. కానీ ఈ అమ్మ అంతకు మించి ఆలోచించింది తన పిల్లలు గురించి. వాళ్ల ఆరోగ్యం బేషుగా ఉండాలని ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆగదు.అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాత్రిపూట రైలు ప్రయాణం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పాపం ఆ తల్లి సామాన్లు సర్దడంలో ఎంత శ్రమపడిందో ఆమె ఆహారం సర్వ్ చేసిన విధం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ వీడియో ఒక అమ్మాయ్ ప్రెషర్ కుక్కర్‌ను బ్యాలెన్స్ చేస్తూ నవ్వడంతో మొదలవుతుంది. తన తల్లి బ్యాగ్ నుంచి కుక్కర్ బయటకు తీసి..రైలులోనే తన కుటుంబ సభ్యులకు వేడి వేడి పలావ్‌ను చాలా మామూలుగా వడ్డించడం మొదలుపెట్టింది. ఆ వీడియోకి “అమ్మకు ఇది రాత్రిపూట రైలు ప్రయాణం అని చెప్పాను... ఆమె కుక్కర్ సర్దింది.” అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మా కుటుంబంతో కలిసి ప్రయాణించిన రోజులు గుర్తొస్తున్నాయని కొందరు, ఇంకొందురు వేడిగా పెట్టాలన్న ఆత్రం, ఆ తల్లి ప్రేమ రెండు కనిపిస్తున్నాయ్ అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ashritha & Hanish | Couple Reels | Hyderabad (@ashshaniii) (చదవండి: గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్ ఇచ్చిందిగా..!) -
హార్దిక్‌తో విభేదాలు నిజమే!.. కృనాల్ రిప్లై వైరల్
భారత స్టార్ క్రికెటర్లు కృనాల్ పాండ్యా- హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు తలెత్తినట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రాణంగా మెదిలిన ఈ అన్నదమ్ములు.. తాజాగా పరస్పరం ఎదురుపడినా పెద్దగా పలకరించుకోకపోవడం ఇందుకు కారణం. ఐపీఎల్-2026లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కృనాల్ పాండ్యా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఒకప్పటి ఆ ప్రేమ కనబడటం లేదుమరోవైపు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్నా.. ఇరుజట్లు ముఖాముఖి తలపడినపుడు అన్నదమ్ములు ఆప్యాయంగా మెలగడం గతంలో కనిపించేది. అయితే తాజా ఎడిషన్‌లో ఇటీవల ముంబైతో ఆర్సీబీ తలపడగా.. హార్దిక్ అవుటైన సమయంలో కృనాల్ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.ఆమె విషయంలోనే విభేదాలు? అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ తోబుట్టువులు ఎడముఖం- పెడముఖంగానే కనిపించారు. ఇక హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ఇటీవల వీరి తల్లిని కలిసింది. ఆ సమయంలో కృనాల్ కుటుంబం కూడా ఆమెతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హార్దిక్ నటాషా నుంచి విడిపోయిన కొన్నాళ్లకే మహీక శర్మ అనే మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు నటాషాతో తనకు కలిగిన కుమారుడు అగస్త్యను కూడా మహీకకే అప్పగించినట్లుగా వదంతులు వస్తున్నాయి.ఈ పరిణామాలే పాండ్యా బ్రదర్స్ మధ్య విభేదాలకు కారణమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహీక విషయంలో కృనాల్ హార్దిక్‌పై సీరియస్‌గా ఉన్నాడని వాటి సారాంశం. ఈ విషయం గురించి తాజాగా కృనాల్ పాండ్యా నర్మగర్భంగా స్పందించాడు.విభేదాలు నిజమే? కృనాల్ రిప్లై వైరల్‌ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో భాగంగా హోస్ట్ డానిష్ సైత్ కృనాల్ పాండ్యాను పరోక్షంగా హార్దిక్ గురించి అడిగాడు. ‘‘అంతా ఒకేనా? ఏదైనా యుద్ధం జరుగుతోందా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు కృనాల్ గట్టిగా నవ్వేశాడు తప్ప బదులివ్వలేదు. ఇక ‘‘కుటుంబ సభ్యుడినైన నన్ను కలవలేదు’’ అని డానిష్ జోక్ చేయగా.. ‘‘కొన్నిసార్లు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నపుడు ఒక్కోసారి కొందరిని మిస్ అవడం సహజమే’’ అని కృనాల్ బదులిచ్చాడు.𝗔𝘂𝗿𝗮 + 𝗩𝗶𝗯𝗲𝘀: 𝗞𝗿𝘂𝗻𝗮𝗹 𝗣𝗮𝗻𝗱𝘆𝗮 🤝 𝗠𝗿. 𝗡𝗮𝗴𝘀 😂🥶✌️Krunal’s hairstyles, business ventures, on field tactics & antics, and some personal life secrets - Mr. Nags bowls bouncers to Krunal Pandya on this latest episode of @bigbasket_com presents RCB Insider.… pic.twitter.com/iI4U3KofMI— Royal Challengers Bengaluru (@RCBTweets) April 22, 2026ఇందుకు సమాధానంగా.. ‘‘మీ తమ్ముడిలాగా’’ అని డానిష్ అనడంతో.. కృనాల్ నవ్వుతూ ముఖం దాచేసుకున్నాడు. అంతే తప్ప మధ్య విభేదాలు లేవని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విజయం తర్వాత హార్దిక్‌కు కృనాల్ శుభాకాంక్షలు చెప్పలేదు. అదే విధంగా కృనాల్ బర్త్‌డేకు హార్దిక్ విష్ చేయలేదు.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు -
పిచ్చి పట్టినట్లుగా పిచ్ తొక్కించేశాడు.. మ్యాచ్ రద్దు!
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్ పిచ్ మొత్తాన్ని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్లో జరిగింది. జలగావ్ రూరల్ ఎంఎల్ఏ కప్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్‌పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.నిస్సహాయంగాఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్‌తో పిచ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్ మ్యాచ్‌కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్ రద్దైపోగా.. పిచ్‌ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఎవరిది బాధ్యత‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్నే మ్యాచ్‌కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్‌తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు. Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026 -
తిలక్ వర్మపై హార్దిక్ పాండ్యా సీరియస్.. స్పందించిన స్టార్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ తిలక్ వర్మ అదరగొట్టాడు. విధ్వంసకర అజేయ సెంచరీ (45 బంతుల్లో 101)తో రాణించి తమ జట్టుకు విజయం అందించాడు. అయితే, అహ్మదాబాద్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో పేలవ ఆరంభం... పవర్‌ప్లేలో సాధారణ స్కోరు... గత మ్యాచ్‌ల తరహాలోనే మరోసారి ముంబై ఇన్నింగ్స్ పతనం దిశగా సాగిపోతున్నట్లుగా అనిపించింది... ఇలాంటి స్థితిలో తిలక్ వర్మ ఒక్కసారిగా ఆటను మార్చేశాడు.తీవ్ర ఒత్తిడి మధ్య నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ తొలి సెంచరీతో కదం తొక్కాడు. 19 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని రీతిలో చివరి 6 ఓవర్లలో ఒక్కడే 82 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అనంతరం ఛేదనలో మొదటి బంతికే వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో తిలక్ స్కోరును కూడా అందుకోలేక మూడు వరుస విజయాల తర్వాత ఓటమిని ఆహ్వానించింది.తిలక్ వర్మపై హార్దిక్ సీరియస్ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో ఈ మ్యాచ్‌ను కూడా జాగ్రత్తగా మొదలు పెట్టిన తిలక్ వర్మ వేగంగా ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డాడు. 14వ ఓవర్ ముగిసేసరికి అతను 22 బంతులు ఆడితే చేసింది 19 పరుగులే... ఒక్క బౌండరీ కూడా లేదు!.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎండ్‌లో ఉన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. Tilak Varma-ಗೆ ಹುರಿದುಂಬಿಸುತ್ತಿರುವ Hardik Pandya! 🗣️🤝🏻ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #GTvsMI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0TDzA1kNzM— Star Sports Kannada (@StarSportsKan) April 20, 2026‘‘ఇలా ఆడితే ఎలా? అసలేం ఏం చేస్తున్నావు? ఇలా ఆడితే గెలుపు సాధ్యమేనా?’’ అన్నట్లుగా హార్దిక్ బాగా సీరియస్ అయినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఎంతో సంయమనం పాటించిన తిలక్ వర్మ.. ప్రసిధ్ వేసిన 15వ ఓవర్‌తో గేమ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదిన తిలక్... రషీద్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు.దంచికొట్టిన తిలక్ఆ తర్వాత యువ పేస్ అశోక్ శర్మ ఓవర్లో తిలక్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్ తొలి బంతికి సిక్స్ బాది 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను... ఇదే ఓవర్ తర్వాతి నాలుగు బంతుల్లో వరుసగా 4, 4, 6, 6తో ఆధిపత్యం ప్రదర్శించాడు. 19వ ఓవర్ ముగిసేసరికి అతను 80 పరుగుల వద్ద ఉన్నాడు. ఐపీఎల్లో తిలక్ మొదటి సెంచరీ సాధిస్తాడా అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో దూకుడైన బ్యాటింగ్‌తో తిలక్ దానిని చేసి చూపించాడు.ప్రసిధ్ వేసిన చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో 4, 6 కొట్టిన అతను ఆఖరి రెండు బంతుల్లో కూడా మళ్లీ 6, 4 బాదాడు. షార్ట్ బంతికి స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించడంతో తిలక్ శతకం పూర్తయింది. ఒక్క ప్రసిధ్ బౌలింగ్‌లోనే అతను 43 పరుగులు రాబట్టాడు. తాను ఆడిన చివరి 23 బంతుల్లో తిలక్ ఏకంగా 82 పరుగులు బాదడం విశేషం.నాలో కసి పెంచేందుకే అలాఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తనతో వ్యవహరించిన తీరుపై తిలక్ వర్మ తాజాగా స్పందించాడు. ఐపీఎల్ వైబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ భాయ్ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరోవైపు.. నేనేమో ప్రశాంతంగా పనిచేసుకుపోయే రకం.అందుకే భాయ్ అప్పుడు నాలో కసిని పెంచాలని అలా చేశాడు. ‘నువ్వు చేయగలవు. నువ్విది చేస్తేనే మనం గెలుస్తాము’ అని నన్ను ఉత్సాహపరిచాడు. అందుకు నేనేమో.. ‘పర్లేదు.. ఇది జరిగితీరుతుంది. జట్టు కోసం చేయగలిగినదంతా చేస్తాను.. కచ్చితంగా చేస్తాను’ అని భాయ్‌కు చెప్పాను’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026లో తొలి ఐదు మ్యాచ్‌లలో తిలక్ వర్మ వరుసగా 20, 0, 14, 1, 8 స్కోర్లు చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సమష్టి వైఫల్యంలో భాగంగా ఉన్న తిలక్‌పై కూడా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సెంచరీ ఇన్నింగ్స్‌తో తిలక్ బదులిచ్చినట్లు అయింది.చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్ బౌలర్ -
కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?
-
లెన్స్‌కార్ట్ వివాదం : బీజేపీ మహిళా నేత హల్చల్
సాక్షి, ముంబై: మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ ఐవేర్ బ్రాండ్ 'లెన్స్‌కార్ట్' ఆంక్షల వివాదం నేపథ్యంలో ముస్లిం బీజేపీ నాయకురాలు నాజియా ఇలాహి ఖాన్ హిందూ సంస్థల సభ్యులతో కలిసి హల్చల్ చేశారు. ముంబైలోని స్టోర్లలో ఒకదానిలోకి ఆమె దూసుకెళ్లారు. తిలకం దిద్ది, స్టోర్ మేనేజర్ మోహ్సిన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయాలపై ఉన్న ఆంక్షల గురించి ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.తమ ఉద్యోగుల కోసం లెన్స్‌కార్ట్ జారీ చేసినట్లుగా చెబుతున్న ఒక డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీని ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో బొట్టు (బిందీ), తిలకం ధరించకూడదని ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి.అదే సమయంలో, హిజాబ్ ధరించడానికి అనుమతి ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో, బీజేపీ నేతనాజియా ఇలాహి ఖాన్, హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ముంబైలోని ఒక లెన్స్‌కార్ట్ స్టోర్‌లోకి ప్రవేశించారు.మతపరమైన చిహ్నాలను ధరించడానికి సిగ్గుపడకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులకు చెప్పారు. అక్కడి సిబ్బందికి బలవంతంగా తిలకం దిద్ది, చేతులకు కంకణాలు (కాల్వా) కట్టారు. ఇది హిందూ దేశం. లెన్స్‌కార్ట్ యజమాని క్షమాపణ చెప్పకపోతే స్టోర్లను మూసివేస్తాం లేదంటే బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు.లెన్స్‌కార్ట్ వివరణసోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత , 'బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్' తీవ్రం కావడంతో , లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. సర్క్యులేట్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం పాతదని, అది ప్రస్తుతం అమలులో లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఉద్యోగులు తమ మతపరమైన నమ్మకాలను, సంస్కృతిని ప్రతిబింబించే గుర్తులను (తిలకం, బిందీ, హిజాబ్, క్రాస్ మొదలైనవి) ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన పొరపాటును సరిదిద్దుకున్నట్లు ప్రకటించినప్పటికీ,హిందూ సంప్రదాయాలను విస్మరిస్తూ ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. Mohsin Khan is the main operator of the Lenskart Shop in Andheri, Mumbai!No Hindu staff member can wear the Tilak!Kalaava!This is strictly prohibited!All Lenskart Shops in India should be banned immediately!Gazwa-e-hind strategy are operational from #lensekart ?… pic.twitter.com/q6bClZvrLL— Nazia Elahi Khan (सनातनी) (@ElahiNazia1) April 19, 2026 -
గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్ ఇచ్చిందిగా..!
ఎప్పుడైన గెలవాలని అనుకున్నప్పుడు చివరవరకు ఓపికతో పోరాడాలి. గెలిచాక సంబరాలు చేసుకోవాలి. అప్పటి వరకు సంయమనంతో ఉండాలి లేదంటే ఘోరంగా అవమానపాలు కావాల్సిందే. అందుకు నిదర్శనం ఈ ఘటన. డెలావేర్ మారథాన్ రన్నింగ్ కాంపిటీషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫినిష్ చేయాల్సిన గీతకు కొన్ని అంగుళాల ముందే యాహు గెలిచేశా అంటూ సంబరాలు చేసుకుటూ చేతులు పైకెత్తాడు. కొద్ది దూరంలోనే వేగాన్ని తగ్గించి ఆనందంగా గెంతులేస్తూ వస్తున్నాడు. ఇంతలో అతడి ప్రత్యర్థి 24 ఏళ్ల జాషువా జాక్సన్ అనూహ్యంగా వెనుక నుంచి దూసుకొచ్చి..అతడిని ఓడించేటప్పటికీ..అతన ఒక్కసారిగి కంగుతింటాడు. గెలిచానన్న ఆనందం క్షణాల్లో చూస్తుండగానే ఆవిరైపోయిందా అని షాక్‌లో ఉండిపోయాడు. అందుకే అంటారు పెద్దలు గెలుపుని పాదాక్రాంతం చేసుకునేంత వరకు చప్పుడు చేయకూడదు అనేది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారంది. జాక్సన్ అనే వ్యక్తి మారథాన్ రేసు గెలిచి..అద్భుతమైన 2:43:11 సమయాన్ని నమోదు చేశాడు. ఈ ఘటన అందరికి అద్భుతమైన గుణపాఠం కదూ..!.(చదవండి: అరుదైన ఘటన: కూతురిని చితకబాదిన అమ్మ..!) -
హెలికాప్టర్ దిగగానే జీవన్ రెడ్డిని కేసీఆర్ చూడగానే..
-
అత్తారింట్లో కూతురి నిర్వాకం..చితకబాదిన అమ్మ
ఇటీవల కాలంలో కోడళ్లు ఎలా ఉంటున్నారో తెలిసిందే. ఆధునిక కాలం అత్తలకు కోడళ్లు దడవడం లేదు. కోడళ్లే అత్తలను భయపెట్టే రేంజ్లో ఉంటున్నారు. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా..వేరు కాపురం, ఆస్తులు కావాలని డిమాండ్ ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. అత్తలకు భయపడే కోడళ్ల కాలం చెల్లినదిగా మారిపోయింది. అంత వరకు ఓకేగానీ కనీసం అత్తమామలను స్నేహితుల్లా లేదా సాటి మనిషిగా చూడకుండా నానాయాతను పెడుతున్నారు నేటితరం కొందరు కోడళ్లు. దానికి పుట్టింటివాళ్లు వత్తాసు పలికి పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటలా మార్చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి కాలంలో నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటన అత్యంత అరుదైనది , రికార్డు ఘటనగా చెప్పొచ్చు.ఇంతకీ ఏం జరిగిందంటే..కోడలు తన అత్తమామల కోసం వంట చేయలేదు. ఆ విషయం తెలుసుకున్న తల్లి అక్కడకు చేరుకుని నేరుగా కూతరు వద్దకు పోయి చితకబాదింది. అంతేగాదు అత్తమామలకు భోజనం వడ్డించమని ఆదేశించింది. ఇటీవలకాలంలో ఇది అత్యంత అరుదైన ఘటన అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.The daughter in-law did not cook food for her in- laws. Her mother arrived at the scene, gave her daughter a thrashing, and immediately instructed her to serve her in lawsThis is rarest of rare case in India in recent history, you know what i mean. pic.twitter.com/5h1VdYtYh1— Woke Eminent (@WokePandemic) April 19, 2026 (చదవండి: కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్‌చేస్తే..) -
విజయ్ ఎన్నికల ర్యాలీలో అనూహ్య ఘటన
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీల నేతల ప్రచారంలో మరింత జోరు కనపడుతోంది. అన్ని పార్టీల ప్రధాన నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే, టీవీకే అధినేత విజయ్ సోమవారం పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం పంచట్టి సహా పలు ప్రాంతాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు.ప్రచారం సమయంలో ఓ కొత్త జంట విజయ్ వద్దకు వచ్చింది. వారిని విజయ్ తన వాహనం మీదకు ఎక్కించుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక పెళ్లికూతురు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురిని విజయ్ ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొత్త దంపతులు విజయ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విజయ్ తన జేబు నుంచి ఒక బహుమతిని తీసి ఆ జంటకు ఇచ్చారు. వధువు-వరుడు విజయ్ చేతులను ముద్దుపెట్టుకొని, ఆయన పాదాలను తాకుతూ కనిపించారు. వరుడు విజయ్ను ఆలింగనం చేసుకున్నాడు. విజయ్ ఆ జంట చేతులను పైకి ఎత్తి విజయం మనదే అనే సంకేతం చూపించారు. పరమానందంలో ఉత్సాహంతో ఉన్న వధువు జన సమూహాన్ని అభినందిస్తూ విజిల్ వేసింది. తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. ఓట్ల కౌంటింగ్ మే 4న జరుగుతుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో నేతలు దూకుడుగా పాల్గొంటున్నారు. #ThalapathyVijay Blessed a Newly Married couple during today's campaign..❣️🤝pic.twitter.com/FPHWZqd4oO— Laxmi Kanth (@iammoviebuff007) April 20, 2026 -
కదులుతున్న రైల్లో అర్థరాత్రి అలజడి..! కట్ చేస్తే
-
ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..
ఎన్నో కేఫ్‌లు చూసుంటాం. ఇలాంటి కేఫ్ చూసే ఛాన్సే లేదు. ఎందుకంటే..మనసుకి హాయినిచ్చే ఆధ్యాత్మికత, కడుపు నింపే కమ్మని భోజనం ఒకే చోట లభించే హోటల్ లేదా రెస్టారెంట్ గురించి ఇంతవరకు చూడలేదు. అలాంటి అపురూపమైన దృశ్యం ఆ కేఫ్‌లో చూడొచ్చు. ఆలయానికి వెళ్తున్నామా లేక కేఫ్‌కి వెళ్తున్నామా అనే గందరగోళానికి గురి చేసే అద్భుతమైన కేఫ్ ఇది. ఎక్కడ ఉందంటే..బొమ్మసంద్రలోని బెంగళూరు కొత్త రామేశ్వరం కేఫ్, 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో 'ప్రపంచంలోనే అతిపెద్ద కేఫ్'గా అలరారుతోంది. ఇందులో 600 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. ఆదియోగి విగ్రహంతో కూడిన ఒక జలాశయం కూడా ఉంది. బొమ్మసంద్రలో రామేశ్వరం కేఫ్ సరికొత్త అతిపెద్ద అవుట్లెట్తో బెంగళూరు పాక ప్రపంచాన్ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆలయ ప్రాంగణాన్ని తలపించే ప్రవేశ ద్వారం అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. అతిథులు రాగానే, మధ్యలో ఆదియోగి విగ్రహం, ఫౌంటెన్‌తో కూడిన ప్రశాంతమైన జలాశయం వారికి స్వాగతం పలుకుతుంది. దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పాన్ని ఆధునికతను జోడించి..భోజనాన్ని కేవలం ఒక పూట భోజనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ఆచారంగా అందంగా మార్చారు. 'దైవ స్పర్శ' అనే థీమ్‌తో ఈ కేఫ్‌ని నిర్మించారట. ఈ కేఫ్‌లో హైలెట్‌గా దేవి లింగ భైరవి ఆలయం, అలాగే కర్ణాటక వారసత్వానికి ప్రతీక అయిన భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు, వీణా కచేరీలతో సహా సంగీత ప్రదర్శనల కోసం రూపొందించిన ఒక యాంఫీథియేటర్ కూడా ఉంది. అలాగే అక్కడ సేవ కౌంటర్ల వద్ద విత్ర చిహ్నాల క్లిష్టమైన చెక్క శిల్పాలు చూపురులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఒక ప్రత్యేక గోశాల కూడా ఉంది. ఆధ్యాత్మిక దృశ్యాలను ప్రదర్శించే హై-టెక్ డిజిటల్ స్క్రీన్లు, పురాతన రాతి విగ్రహాల వైభవంతో చాలా అందంగా తీర్చిదిద్దారు. 'ది రామేశ్వరం కేఫ్' వ్యవస్థాపకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న తత్వాన్ని గురించి వెల్లడించారు. ఇది సంస్కృతి, నమ్మకం, ఆహారం ఏకమై ఉండే ఒక ప్రదేశాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఇలా కేఫ్‌ని తీర్చిదిద్దామని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతేగాదు పోస్ట్‌లో రామేశ్వరం కేఫ్ ఇలా పేర్కొంది. ఇక్కడ ప్రతి దేవాలయం, ప్రతి విగ్రహం, ప్రతి వివరం ఒక ఉద్దేశ్యంతోనే ఉంచాం. కేవలం సర్వీస్ మాత్రమే కాదు సంస్కృతి, నమ్మకం, ఆహారం కలగలిసిన అనుభూతికి కేంద్రబిందువుగా ఒక దేవాలయ అనుభూతిని తీసుకొచ్చే.. ఒక దివ్యమైన భోజన అనుభవం అని ప్రకటించింది. View this post on Instagram A post shared by Aditya Raj | Dev & Creator (@addywithlens) (చదవండి: లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..) -
న్యూడ్ గా వచ్చి.. మా మమ్మి మీద చేయి వేశాడు
-
అనుష్క పోస్ట్‌కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్ చార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్‌లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్ చేశాడతను.దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
సునామీ ముప్పు, అంతరిక్షం నుంచి హై-రిజల్యూషన్ హెచ్చరిక!
-
విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు
విమానం ప్రయాణం ఎంత సౌకర్యవంతమో, ఎంత విలాసవంతమో అంత భయానకం కూడా. విమానం టేక్ ఆఫ్ అయింది మొదలు ల్యాండ్ అయ్యేదాకా మన ప్రాణాలు గాల్లోనే. ఏదైనా తేడా వచ్చిందా అంతే సంగతులు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఫ్లై91 ప్రయాణీకులకు ఎదురైంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ గాలిలో 4 గంటల పాటు గడపాల్సి వచ్చింది.ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానం IC3401 (ATR టర్బోప్రాప్ AT7), సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం హుబ్బళ్లిని సమీపిస్తుండగా, అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు ల్యాండింగ్‌ను నిలిపి వేసి నాలుగు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. View this post on Instagram A post shared by NEWS9 (@news9live)సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపు తప్పడంతో, ప్రయాణికులు భయంతో వణికిపోయారు, చాలామంది ఇష్టదైవాలకు ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దేవుడా, కాపాడు దేవుడా అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. రెండు చేతులు జోడించి, నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక మహిళ తీవ్ర ఆవేదన చెందింది. కంటి ధారగా కన్నీరు కారుస్తూ మౌనంగా ప్రార్థించిన ఘటన ఎవ్వరి హృదయాన్నైనా కరిగించకమానదు. ఇంకా, భయంతోవణికిపోతూ, "ఓరి దేవుడా...ఇతను ఎందుకిలా చేస్తున్నాడు," అని ఒకరు, "ఏడవకు, ఏడవకు-ఏమీ కాదు. ఆగు," అని మరొకరు ఓదార్చడం ఈ వీడియోలో గమించనవచ్చు. గాలిలో ఊహించని పరిణామంతో గందరగోళానికి గురైన దృశ్యాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఆ విమానం ముండ్‌గోడ్, దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాలపై దాదాపు నాలుగు గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది.మరోవైపు ‘‘పరిస్థితిని అదుపులోనే ఉంచుతున్నాం. మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాము. ఓపికగా ఉండండి, దయచేసి సూచనలను పాటించండి," అని పైలట్ ప్రయాణికులకు సూచిస్తున్నట్లు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వలేదని, నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపించారు. ఉద్రిక్త క్షణాలు, పలు ప్రయత్నాల తర్వాత, విమానాన్ని చివరికి దారి మళ్లించి, రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. -
కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..
సల్మాన్‌లాంటి శరీరాకృతి, కండలు తిరిగిన దేహం కోసం యువత ఎంతలా పరితపిస్తూ జిమ్‌లో కష్టపడుతుంటారో చూస్తుంటాం. కొందరు స్టెరాయిడ్ల వంటి షార్టకట్లను ఆశ్రయిస్తుంటారు. అలా ఉంటేనే తమకు క్రేజ్, స్టార్డమ్ అన్నట్లుగా ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. కానీ ఓ సాధారణ భవన నిర్మాణ కూలీ కండలతిరిగి దేహంతో ఉండటం అనేది అత్యంత అరుదు. పైగా అంత పోషకాహారంతో కూడిన భోజనం తినే అవకాశం, వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు. కానీ ఆ కార్మికుడిని చూస్తే మన ఆలోచన తీరు మారుతుంది. తనకున్న వనరుల రీత్యా..తన బాడీని ఎలా ఫిట్‌గా ఉంచాలో కేర్ తీసుకుంటూ కండలు తిరిగిన దేహంతో అబ్బురపరుస్తున్నాడు. అతడి అనుసరిస్తున్న డైటింగ్ విధానం, వర్కౌట్లు గురించి తెలిస్తే విస్తుపోతారు. అన్నింట్లకంటే ఆశ్చర్యకరమైనది అతడు జిమ్‌కే వెళ్లడట. అలాంటప్పడు అతడికి ఇంతలా కండలు పెంచడం ఎలా సాధ్యమైంది అంటే ..కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఇటీవల ఓ చెన్నై కార్మికుడి శరీర సౌష్టవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తమ మధ్య జరిగిన సంభాషణ మొత్తం వీడియో రూపంలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో భవన నిర్మాణ పనులు చేసే అతడికి ఇలాంటి దేహం ఎలా సాధ్యమైందని కుతూహలంతో అడుగడం సష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన శరీరాకృతికి సహాయపడిని వ్యాయామ దినచర్య, ఆహారపు అలవాట్లు గురించి కూడా ప్రశ్నిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్. తాను నిర్మాణ కార్మికుడుగా మండుటెండలో తీవ్రమైన శ్రమతో కూడిన పనలు చేస్తుంటానని తెలిపాడు. తనకు రోజు కఠినమైన దినచర్య, ఎక్కువ పనిగంటలు ఉన్నప్పటికీ..వారానికి కనీసం ఐదుసార్లు వ్యాయామం చేసేలా చూసుకుంటానని చెప్పాడు. సోమవారం ఛాతీ వ్యాయామం, మంగళవారం భుజాల వ్యాయామం, బుధవారం వీపు వ్యాయామం, గురువారం బైసెప్స్, ట్రైసెప్స్ కోసం కేటాయిస్తుంటానని అన్నారు. శుక్రవారం కాళ్ల వ్యాయామం చేస్తుంటానని చెప్పారు. అతడు చేసేది శ్రమతో కూడిన పని కాబట్టి తీవ్రమైన కాళ్ల వ్యాయమాలు చేయనని అన్నారు. తన పనిలో కష్టపడ్డాక తన బాడీ కోసం ఎలా కేర్ తీసుకువాలో అలాగే దాన్ని ఎలా అమలు చేయాలో అనే దానిపై అతనికి ఉన్న స్పష్టత స్ఫూర్తిని కలిగిస్తోంది. డైటింగ్..కండలు తిరిగిన దేహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అధిక కార్బోహైడ్రేట్ల ఆహారం సాధారణంగా ప్రతికూల ఫలితాలనిస్తుందని భావిస్తారు. అందుకే వాళ్లంతా తరుచుగా ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చెన్నైకి చెందిన ఈ నిర్మాణ కార్మికుడు అందుకు భిన్నంగా ఎంచుకోవడం విశేషం. అతడికి వృత్తిపరంగా అధిక కార్బోహైడ్రేట్లు అవసరం. అందుకే రోజుకు మూడుసార్లు అధిక కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాన్ని ఎంచుకుంటాడు. అందులో అన్నం, అరటిపండ్లు, గంజి ఉంటాయి. పండ్లు తినడం కూడా అరుదని చెప్పాడు. అయితే వారానికి ఒకసారి మాంసాహారం తింటానని చెప్పాడు. తాను చికెన్ లేదా చేపలు మాత్రం తీసుకోనని చెప్పుకొచ్చాడు. అలాగే తాను కండలు కోసం ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోలేదని వెల్లడించాడు. అలాగే ఎలాంటి వాణిజ్య డైట్‌ప్లాన్‌లు లేదా వే ప్రోటీన్లు గానీ తీసుకోనని, కేవలం శుభ్రమైన ఆహారమే తీసుకుంటానని అన్నారు. ప్రతిరాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోయేలా చూసుకుంటానని చెప్పారు. తాను ఇంట్లో వండిన ఆహారమే తింటానని అన్నాడు. చివరగా అందర్నీ జండ్ ఫుడ్ తినొద్దని, మధ్యం, ధూమపానానికి దూరంగా ఉండమని సూచించాడు. ఆ కార్మికుడు నిబద్ధత ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, పైగా అతడిని చూస్తే..ఏ పనైనా నూటికి నూరు శాతం కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఉండదు అని చెబుతోంది కదూ అంటూ వీడియోని ముగిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ ..!. View this post on Instagram A post shared by Jayachandran Tamilarasan (@fit.blog.by.jc) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్‌పై స్పీడ్‌గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్‌లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్‌పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
తెనాలిలో న్యూడ్ కాల్స్ దందా
-
మలక్ పేట్లో అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతూ వ్యక్తి హల్ చల్..
-
లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..
లండన్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ బెంగళూరులో ఉండగా మన వంటకాలు నేర్చుకోవడమే గాక తయారు చేసి చూపించి ఔరా..! అనిపించుకున్నాడు. పైగా మన వంటకాల రుచులను మెచ్చకుంటూ వాటి గుణగణాల గురించి చెప్పేస్తున్నాడు కడా. మరి ఎవరా వ్లాగర్?, అతడి మనసుని దోచిన వంటకం ఏంటి?..అంటే..యూకేకు చెందని వ్లాగర్ జూలియస్ ఫ్లీడర్ బెంగళూరులో వంటకం నేర్చుకున్న తర్వాత ఇంట్లో వంటకాన్ని తయారు చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆవికి మీద వండే ఆ వంటకం వివిధ పప్పుల మిశ్రమాలను కలపడం, నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బి పులిబయెట్టడం వరకు వివిద ప్రక్రియలను పంచుకున్నారు. కొన్ని ఆహారాలు మన మనసుని తాకుతాయి. వాటి రుచి నాలుకపై అలా నిలిచిపోతుంది. మెత్తగా దూదిలా ఉండే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పటికీ విసుగు చెందని ఆహారం. వేడి వేడి సాంబార్ లేదా చట్నీతో తింటే అబ్బా ప్రాణం లేచవచ్చినట్లుగా అనిపిస్తుంది, సంతృప్తిగా అనిపిస్తుంది.జూలియస్ ఫీడ్లర్ బియ్యం, మిన పప్పుల పిండిని పులియబెట్టడంతో తన వంట ప్రక్రియను ప్రారంభించారు. సరైన మెత్తదనం కోసం ఈ రెండు పదార్థాలను విడివిడిగా కొన్ని గంటల పాటు నానబెట్టాలని ఆయన సూచించారు. ఆ తర్వాత, నానబెట్టిన నీటిలో కొంత భాగాన్ని బియ్యంతో కలిపి గరుకైన పిండిలా రుబ్బుకోవాలి, అదే సమయంలో మినప పప్పును నీటిలో తేలేంత మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం, అతను ఆ పిండిని కలిపి చేతితో కలపడం ద్వారా పులియబెట్టే ప్రక్రియను ప్రారంభించారు.ఆ వంట నిపుణుడు పిండి పరిమాణం పెరిగి, బుడగలు వచ్చినట్లు పులిసేంత వరకు ఉంచి, చివరగా చిటికెడు ఉప్పు చల్లారు. ఇడ్లీలకు సరైన అండాకారపు ఆకారం రావడానికి, సాంప్రదాయక ఇడ్లీ మేకర్లో వేసి, మరుగుతున్న నీటిపై ఆవిరి మీద ఉడికించి, అవి చక్కగా ఉబ్బేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేశారు. ఇడ్లీ వద్దనుకుంటే మీడియం మంటపై పెనం పెట్టుకుని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చని చెప్పారు. .పులియబెట్టడం వల్ల కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలు పెరుగుతాయి. ఆ వీడియో చివరలో, ఆ ఇన్ఫ్లుయెన్సర్ వేడి వేడి ఇడ్లీలను సాంప్రదాయ అరటి ఆకులో అమర్చి, వాటితో పాటు చల్లని కొబ్బరి చట్నీతో జతచేశారు. వాటిని చూస్తే కచ్చితంగా నోరూరుతుంది. మన లండన్ వ్లాగర జూలియస్ మాత్రం ఆ అల్పాహారానికి అద్భుతం అని కితాబిచ్చాడు. View this post on Instagram A post shared by Julius Fiedler (@hermann) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
సడెన్ షాక్ అంటే ఇదేనేమో.. అర్ధరాత్రి వింత అనుభవం..
Viral Video.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు థార్ వాహనంపైన కూర్చుని ఉన్నారు. మద్యం మత్తులో రాత్రి వేళ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కారు పైన ఉన్న ఒక యువతి సరిగా కూర్చునేందుకు ప్రయత్నించింది. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు.సదరు యువతి అలర్ట్‌గా లేకపోవడం.. సడెన్‌గా వాహనం ముందుకు కదలడం ఒక్కసారిగా జరిగిపోవడంతో యువతి రోడ్డుపై వెనక్కి పడిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. ఈమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియోలో కనిపించింది. అనంతరం, ఏం జరిగింది అనే విషయం తెలియలేదు.लड़की पूरी तरह से दारू के नशे में धुत्त है वह थार की छत पर बैठ जाती और ड्राइवर स्टंट कराने की कोशिश करता है लड़की तुरंत नीचे जाकर गिरती है।ऐसे शराबियों के साथ में ऐसा होना बहुत जरूरी होता है ,अब आगे से ये कभी ऊपर नहीं बैठेगी 😂 pic.twitter.com/HisY39UjXy— Pradeep Chaudhary (@pradeepgr63) April 16, 2026ఇక, ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ.. సదరు యువతి, డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు. -
దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం
మనం సాధించే గెలింపు మనొక్కరిదే కాదు. అందుకు సహకరించి కుటుంబసభ్యులది కూడా. అయితే వారి క్రెడిట్ కనబడదు. కానీ ఈ మహిళ తన సక్సెస్ వెనుక తన తండ్రి ఉన్నాడంటూ..అందరికీ తెలియజేసేలా ఆమె చేసిన పని..అక్కడున్న వారి కళ్లలో నీళ్లుగిర్రున తిరిగేలా చేశాయ్. ఆ కమనీయ దృశ్యం ఓ ప్రేరణ కూడా.అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో, సుమేధా షేక్ ఇంటిని చక్కబెడుతూ, ఇద్దరు పిల్లల భాద్యత, దివ్యాంగుడైన తండ్రి బాగోగులు చూసుకుంటూ పోలీస్ అధికారిణి అయ్యారు. ఆమె తన విజయాన్ని జరుపుకున్న విధానం అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. తండ్రిని భుజాలపై ఎత్తుకుని ఆ క్షణాన్ని ఒక హృదయపూర్వక నివాళిగా మార్చారు. ఈ భావోద్వేగభరితమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారి అందరి హృదయాలను గెలుచుకుంది. తల్లిదండ్రుల త్యాగం ఎప్పుడూ పెద్దగా వినిపించకపోవచ్చు. కానీ మన జీవితాంతం ప్రతిధ్వనిస్తుందని అని చెప్పేలే ఈ మహిళ సెలబ్రేషన్ చేసుకుంది తన సక్సెస్‌ని. ఈ మేరకు కొత్తగా పోలీసు అధికారిణిగా నియమితురాలైన సుమేధా మట్లాడుతూ..తన కష్టసుఖాల్లో అండగా నిలిచి, తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడిన తండ్రికి ఇలా కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. ఆయన రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఆ వీడియోలో సుమేధా దివ్యాంగుడైన తన తండ్రిని భుజాలపై మోస్తూ ఆనందంగా నృత్యం చేస్తూ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. అక్కడున్న వారు కూడా ఆమె సంతోషంలో భాగమయ్యారు. కొందరు ఆమె తన అసాధారణ విజయాన్ని తన తండ్రికే అంకితం చేస్తూ.. వేడుకగా చేసుకున్న తీరుని చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి ఇది 'ఉత్తమ తండ్రీ-కూతుళ్ల బంధం' అని అభివర్ణించగా మరికొందరు విజయం అనేది కేవలం వ్యక్తిగత విజయంగానే కాకుండా..ఆ ప్రయాణానికి సహకరించి బంధాలది కూడా అని చెప్పే ఘటన అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా 66 ఏళ్ల రిటైర్డ్ క్లర్క్..! కారణం తెలిస్తే అవాక్కవుతారు) -
మొగుడుపై అలిగి, రూ. కోటిన్నర నోట్లను బాల్కనీలోంచి విసిరేసింది!
చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతం, శాంతౌ (Shantou) నగరంలో జరిగిన ఈ విస్తుపోయే సంఘటన ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఒక చిన్న గొడవ రోడ్డు మీద ఉన్న సామాన్యులకు కాసుల వర్షం కురిపించి నంత పని చేసింది. అతి పెద్ద విలాసవంతమైన భవనం ఫ్లాట్‌నుంచి ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది. శాంతౌలోని లాంగ్‌హు జిల్లాలో ఉన్న 'స్టార్ లేక్ సిటీ' అనే నివాస సముదాయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎక్కడిదీ నగదు? వీటిని ఎవరు విసిరేశారు? హై రేంజ్ భవనం బాల్కనీ నుంచి అనూహ్యంగా రూ. 1.5 కోట్లను విసిరి పారేసిందో మహిళ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే దీనికి కారణమని సమాచారం. అంతే ఆ కోపంతో ఆమె ఇంట్లోని డబ్బును బయటకు విసిరేసింది. సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన (సుమారు 162,000డాలర్లు) హాంకాంగ్ డాలర్ నోట్లను కిందకు విసిరేసింది.గాల్లోంచి నోట్లు ఎగిరి పడటంతో ఒక్కసారి జనం పోగయ్యారు. ఆ నగదును దక్కించుకునేందుకు ఎగబడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీ మేనేజ్మెంట్ కార్యాలయం ఆ నోట్లు అసలైనవేనని ధృవీకరించింది. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని కోరింది. కొందరు నివాసితులు ఇప్పటికే ఆ నగదును తిరిగి అప్పగించారు.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిThis Chinese woman is going viral after she threw over $162,000 out onto the streets from her balcony after an argument with her husband. 🙆♂️ pic.twitter.com/rWiLFu9Rrj— Erimus (@HeDontMakeNoise) April 15, 2026నెటిజన్ల స్పందన ఈవీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు "మనం కష్టపడి సంపాదించిన డబ్బును పన్నుల నుండి కాపాడు కోవడానికి పోరాడుతుంటే, ఈమె ఇలా గాలిలో కలిపేస్తోంది"అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా మనేది చూసుకోవడం అవసరం. ఇదే అతిపెద్ద ఆర్థిక సలహా" అంటూ మరొకరు చురకలు వేశారు. "గాలిలో ఆనందాన్ని (డబ్బు) విసరడం గురించి ఊహించలేక పోతున్నాను" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు -
మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయ మీటింగ్‌లో జరిగిన అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో ఒక అనుకోని అతిథి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అధికారులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తరువాత విషయం తెలిసి అంతా సరదాగా నవ్వుకున్నారు. ఈ సంఘటన బాఘ్‌పత్‌లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందీ అంటే..బాఘ్‌పత్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో, జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ కుమార్ రాయ్ రైతుల సమస్యలను వింటున్నారు. ఈ సమయంలో కోతి ఆడిటోరియంలోకి ప్రవేశించి, నేరుగా డీఎం టేబుల్ వద్దకు నడుచుకుంటూ వెళ్లి, అక్కడున్న పత్రాలను లాగడం చూసి అధికారులు భయాందోళనకు గురయ్యారు. కోతి ఆకస్మిక చర్యలతో అవాక్కైన కొంతమంది ఆఫీసర్లు సీట్లు వదిలి పారిపోయారు. View this post on Instagram A post shared by NDTV India (@ndtvindia)ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్ ఇంతకీ ఈ కోతి ఎవరో తెలుసా? జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ పెంపుడు కోతి. దీని పేరు 'మాత్రు'. మాతృను చూడగానే జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్ తన కుర్చీలోంచి లేచారు. అధికారులు, రైతుల ముందు ప్రశాంతంగా ,అస్మితా లాల్ చిరునవ్వు నవ్వి, మాతృను తన కుర్చీలో కూర్చోమని ఆహ్వానించారు. అది పోయి అక్కడ పొందికగా కూర్చంది. ఆ తర్వాత అధికారులు మాతృని మెల్లగా కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో వాతావరణం సద్దు మణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
మెలోనీ బుగ్గలపై మాక్రాన్ ముద్దుల వర్షం..
హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు పారిస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.పారిస్‌లో ఈ సమావేశం కంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) మధ్య జరిగిన ఒక అనూహ్య పలకరింపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమం సందర్భంగా మాక్రాన్ అకస్మాత్తుగా మెలోనీని ఆలింగనం చేసుకుని, ఆమె బుగ్గపై ముద్దు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.అయితే, ఈ సమావేశం కోసం పారిస్ చేరుకున్న మెలోనికి ఎదురెళ్లి మాక్రాన్ స్వాగతం పలికారు. ఈ క్రమంలో మెలోనిని హత్తుకుని ఆమె బుగ్గలపై ముద్దుపెట్టడం చేశాడు. దీంతో, మెలోనీ ఒక్కసారిగా షాకయ్యారు. మాక్రాన్ చేసిన పనికి అసౌకర్యంగా ఫీలయ్యారు. అనంతరం, కొంత దూరం వెళ్లాక మళ్లీ ఆమెను ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేయగా.. మెలోనీ మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు దీనిని అసౌకర్యంగా అభివర్ణిస్తూ, అధికారిక వేదికలపై వ్యక్తిగత హద్దులను గౌరవించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు, కొందరు ఇది యూరోపియన్ సంస్కృతిలో సాధారణ అభివాదమని, ఇందులో పెద్దగా వివాదం లేదని చెబుతున్నారు.French President Emmanuel Macron and Italian Prime Minister Giorgia Meloni shared a rather awkward and unusual hug right in front of the cameras. The video quickly went viral online. pic.twitter.com/NQHnhRmDEt— NEXTA (@nexta_tv) April 17, 2026 మాక్రాన్, స్టార్మర్ నాయకత్వం..మరోవైపు ఇరాన్‌పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సమావేశానికి సుమారు 40 దేశాల నాయకులు హాజరు అయ్యారు. -
మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు..
ఛండీగఢ్: హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై గన్ గురిపెట్టారని చౌతాలా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల మేరకు.. హర్యానాలోని గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనకు సంబంధించి జేజేపీతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్ధాంత్ జైన్‌ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్బంగా ఒక పోలీసు అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించారని, కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని చౌతాలా ఆరోపించారు. సదరు అధికారి అంతటితో ఆగకుండా.. తనపై పిస్టల్ గురిపెట్టినట్టు ఆరోపించారు.BJP ka Nayab HaryanaPolice ke besh main Gunde.....@PMOIndia @NayabSainiBJP pic.twitter.com/uVCBOFyyVf— Dushyant Chautala (@Dchautala) April 17, 2026దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఈ వీడియోలో ఒక పోలీసు వాహనం తన కారును అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది. మరో వీడియోలో, చౌతాలా తన వాహనం దిగి పోలీసులను నిలదీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత, కదులుతున్న ఆ వాహనాన్ని ఆపడానికి ఆయన అందులోకి ఎక్కడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది, కానీ ఆ వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అనంతరం, ఈ వీడియోను చౌతాలా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్బంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నాయబ్ హర్యానా పోలీసులతో దాడి చేస్తున్నాడు. రక్షకుడే వేటగాడిగా మారినప్పుడు, వ్యవస్థను ప్రశ్నించడం అనివార్యమవుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఘటనను పోలీసుల రౌడీయిజంగా అభివర్ణించారు. ఇదే బీజేపీ వారి నయా హర్యానా.. పోలీసు యూనిఫాంలో ఉన్న రౌడీలు అని వ్యాఖ్యానించారు.जब रक्षक ही भक्षक बन जाए, तो व्यवस्था पर सवाल उठना तय है। pic.twitter.com/UGvYm7qEJx— Dushyant Chautala (@Dchautala) April 17, 2026 -
కళ్లు చెమర్చే దృశ్యం.. హృదయాన్ని తాకిన చిన్నారి వీడియో
సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో కదిలిస్తోంది. తోటి స్నేహితులు ఆడుతుంటే చూసి మురిసిపోయిన ఓ దివ్యాంగ చిన్నారి నెటిజన్ల మనసు గెలుచుకుంది. హృదయాలను తాకిన ఈ దృశ్యానికి ఎమోషనల్‌గా కనెక్టయిపోతున్నారు. పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహానికి సంబంధించిన ఈ సంఘటన కళ్లు చెమర్చేలా చేస్తోంది. మనం స్వయంగా ఆటల్లో పాల్గొనకపోయినా.. ఇతరుల ఆనందాన్ని చూస్తూ కూడా సంతోషాన్ని పొందవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. ఒక దివ్యాంగ చిన్నారి తన స్నేహితులు ఆడుకుంటుంటే చూసి.. వారితో పాటు నవ్వుతూ ఆనందాన్ని పంచుకుంది. ఆమె శారీరక స్థితి వల్ల వారితో కలిసి పరిగెత్తలేకపోయినా.. ఆమె ముఖంలోని చిరునవ్వు నెటిజన్లను ఒకేసారి భావోద్వేగానికి, ఆనందానికి గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి మెట్ల వద్ద కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆమె దగ్గర్లోనే ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు తరుముకుంటూ.. కుస్తీ పడుతూ ఆడుకుంటున్నారు. వారు అటు ఇటు పరిగెడుతూ నవ్వుతుంటే.. ఆ చిన్నారి అక్కడే కూర్చుని వారిని గమనిస్తూ.. వారితో పాటు కేరింతలు కొడుతూ ఆ క్షణాలను ఆస్వాదించింది.ఈ వీడియో నిడివి తక్కువైనా.. అది పంచిన భావోద్వేగం మాత్రం చాలా పెద్దది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ.. తన చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించడం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ చిన్నారి తన బాధను మర్చిపోయి.. కేవలం తన స్నేహితుల ఆటను చూస్తూ వారితో కలిసి నవ్వుతోందని ఆ వీడియో వివరించింది. ఇది ఆ దృశ్యానికి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ఆమె చిరునవ్వు చూస్తుంటే ఒక పక్కన మనసు నిండిపోతోంది. మరోపక్క కళ్లు చెమర్చుతున్నాయి. చాలా ధైర్యవంతురాలైన అమ్మాయి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి’’ అంటూ నెటిజన్లు దీవెనలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by diva choudhary (@deeva_2024) -
ఆ నవవధువు ధైర్యానికి..అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్..!
ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శారీరక లోపం పైకే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా చులకనగా చూసేస్తాం. ఎక్కడో కొందరే మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి వాళ్లు పక్కనే ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఇట్టే జయించగలరు. ముఖ్యంగా తమలోని లోపాన్ని ఆనందంగా స్వీకరించి ధైర్యంగా నిలబడగలుగుతారు, స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకు నిదర్శనం ఈ నవవధువే. ఆమె కథ వింటే అందం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయే మహిమా ఘాయ్. ముంబైకి చెందిన మహిమ తన పెళ్లి రోజున జుట్టు లేకుండా వేడుకలోకి అడుగుపెట్టి..అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా అక్కడ ఎవ్వరు నవవధువు బట్టతలను చూడలేదు. ఆమె స్థైర్యం, ఆత్మవిశ్వాసం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. సహజత్వం గొప్పతనాన్ని చాటుతున్నట్లుగా అనిపించింది. అందం ప్రమాణాలకు అతీతమైనదని నిరూపించిన గొప్ప దృశ్యం అది. హుందాతనం, ఆత్మవిశ్వాసానికి మించిన సౌందర్యం ఇంకొకటి లేదని ఆ ఘటన నిరూపించింది. పెళ్లికూతురు అంటే ఇలానే ఉండాలనే అభిప్రాయాల్ని బేఖాతురు చేస్తూ వచ్చిన విధం అందర్నీ కట్టిపడేసింది. మహిమ అంత ధైర్యంగా అంత ముఖ్యమైన ఘట్టంలో అలా ఎలా కనిపించిందంటే..మహిమ కథేంటో తెలుసుకోవాల్సిందే..!.అంగీకరించక తప్పని పరిస్థితి..మహిమ చిన్నతనంలో అలోపేసియా బారిన పడింది. దాంతో జుట్టు ఊడిపోతుండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ తలపై జుట్టపెరగక మచ్చలు ఎక్కువవుతుండేవి. మళ్లీ జుట్టురావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఇంటి చికిత్సలు, వైద్య చికిత్సలు ఎన్నో చేయించుకుంది. ఏవి ఫలితం ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆమె కుటుంబం. చివరికి వైద్యులు ఆమె వ్యాధిని నిర్థారించారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. నవ్వు మాయమైన క్షణం..పెద్దయ్యే కొద్ది ఆత్మనూన్యత భావంతో తీవ్ర క్షోభని అనుభవించింది. తనలో తాను కుంగిపోవడం, తరచుగా ఎవరు పట్టించుకోవడం లేదనే భావన వంటి అభద్రతాభావం ఎక్కువైపు తుండేవి. తన పరిస్థితిని దాచేందుకు, అందరి దృష్టిని మరల్చడానికి విగ్గులు ధరిస్తుండేది. ఇది కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వకపోగా ఆభద్రతా భావాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసేవి. ఒక రోజు కాలేజ్‌లో చేసిన చిలిపి పని అందరి ముందు ఆమె నిజరూపం భయటపడంతో అలా గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. సరిగ్గా ఆ కష్టసమయంలో తాను చేసే కళాకృతులే మహిమకు కొండంత బలాన్ని ఇచ్చేవి. మహిమ స్వతహగా విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలేయడంలో దిట్ట.అతడి రాకతో వచ్చిన మార్పు..ఆ క్రమంలో ఆన్లైన్ ఆర్డర్లపై ప్రాజెక్టులు తీసుకోవడంతో..శశాంక్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వృత్తిపరమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఆలోచనాత్మక ప్రవర్తన, నిజాయితీ ఆమెను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. అతడితో ఉంటే మహిమకు అభ్రతభావం మొత్తం తొలిగిపోయేది. అయితే తన గురించి శశాంక్‌కి పూర్తిగా తెలియాలని విగ్గు తీసి చూపింది. తన నిజ స్వరూపాన్ని చూసినప్పుడు కూడా శశాంక్ ఆమెతో మెలిగిన తీరు మహిమను మరింతగా ఆకట్టుకున్నాయి. అది శారీరక లోపం కంటే మంచి మనసుని చూసే అతడి విధానం మహిమలో ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. ఆ తర్వాత ఇద్దరు 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. అయితే శశాంక్ కుటుంబ తనను ఎలా చూస్తుందో అని ఆందోళన చెందింది. వాళ్లు కూడా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించారు. ఆ నేపథ్యంలోనే మహిమ ఇక ఎప్పటికి ముసుగు వెనుక దాగుడు మూతలు వద్దు అనుకుని ఇలా జుట్టు లేకుండానే నవ వధువుగా పెళ్లిపందిరిలోకి వచ్చింది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్లు సైతం ఆమె బట్టతలను చూడలేదు, పెళ్లి కూతురు ఆత్మవిశ్వాసం, స్థైర్యం అందరి మనసులను కదిలించాయి. తన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ వధువుని అంతా గౌరవప్రదంగా చూశారు. మన లోపాన్ని(స్థితిని) మనం అంగీకరించడంతోనే గుర్తింపు మొదలవ్వుతుందని ఈ వధువు మహిమ నిరూపించింది. తనను తాను యథావిధిగా స్వీకరించడమే అందం అని అంటోంది మహిమ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: సైకిల్‌పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!) -
"రాయల్ చాయ్"..! ఆ ఐడియాకు మాటల్లేవ్ అంతే..
కార్యాలయాల్లో లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్లినా..కాసింతా వేడివేడి చాయ్ తాగితే దెబ్బకు రిలీఫ్‌గా ఉంటుంది. మళ్లీ నూతనోత్సాహంతో మన పనిలో పడిపోతాం. అందుకే చాయ్ప్రియులకు ఇదంటే అంత మక్కువ. అలాంటి చాయ్‌ని అత్యంత లగ్జరీయస్ అందించే ప్రయత్నం చేశాడు. ఆ ఆలోచనే కనీవినీ ఎరుగని అద్భుతం. మరి ఆ వెరైటీ సర్వింగ్ స్టైల్ ప్రజలకు నచ్చిందా అంటే..ఎన్నో టీ స్టాల్స్ చూశారు గానీ ఇలాంటి వినూత్న చాయ్ స్టాల్‌ని మాత్రం చూసే ఛాన్సేలేదు. తన టీ స్టాల్ కోసం లక్ష రూపాయల రోల్స్రాయ్స్ను అద్దెకు తీసుకున్నాడు. చిన్నిచాయ్ స్టాల్‌కి అంత లగ్జరీ కారు దేనికి అనుకోకండి మనోడు ఆలోచన ఏ రేంజ్లో చూద్దాం రండి. అతడు తాను విలావంతమైన కారులో టీ సర్వీస్‌ని అందివ్వాలనుకున్నాడట. అందుకు రోల్స్‌రాయ్స్ కారుని అద్దెకు తీసుకున్నారు. ఈ ఆలోచను టీ స్టాల్ యజమానితో పంచుకోగా వాళ్లు కూడా అంగీకరించారు. అందుకోసం వాళ్లు బోర్డును ప్రింట్ చేసి కస్టమర్ల కోసం రెడ్‌కార్పెట్ పరిచాడు. 'టీ' తోపాటు కుకీలు, బిస్కెట్లు ఏర్పాటు చేసి..అమ్మకాలు ప్రారంభించాడు. ఇది చూసిన అక్కడున్న జనాలకు భలే ఆసక్తిగా అనిపించింది. ఒక్కసారి ఆ అనుభవం పొందాలనే ఉద్దేశ్యంతో అందరు ఆ లగ్జరీ కారులో జర్నీ చేస్తూ టీ తాగే అనుభవాన్ని పొందారు. ఈ లగ్జరీ చాయ్ స్టాల్‌కి అయిన ఖర్చు రూ. 1,08,000 అయితే అతను సంపాదించింది రూ. 88,400. పాపం అతనికి నష్టమే అయినా..చాలామంది జీవితంలో ఇలాంటి కారు కొనగలమో లేదో తెలియకపోయినా..తమ కుటుంబాలతో టీ తాగుతూ ఆనందించారు అదే చాలు అని అంటున్నాడు. ఏ వ్యాపారమైన మొదట్లోనే లాభాలు వచ్చేయవు కదా..రాను రాను ఊపందుకోవచ్చు కూడా. ఏదీఏమైనా ఈ ఐడియా అదుర్స్ కదూ..!. అతడి ఆలోచన అలా ఇలా లేదు బ్రో..ఇలా మరెవ్వరకీ సాధ్యం కాదేమో అని ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by deluxe (@deluxebhaiyaji) (చదవండి: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
LIVE Video: కదిరి పేలుడు లైవ్ వీడియో
-
డోంట్ వర్రీ..ప్రశాంతంగా కూర్చోండి..!
ప్రజా రవాణాలలో ఆటో, క్యాబ్లనగానే కాస్త భయం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేటప్పుడు చాలా భయం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి వెళ్తుంటే ఎలాంటి భయం ఆందోళన ఉండదు. కానీ ఈ ఆటో అంకుల్ అలాంటి భయలేం వద్దు అంటూ చక్కగా తన సీటు వెనుక రాసిన సందేశం ఎంతలా ఉందంటే..బ్రో నువ్వు గ్రేట్ అని మెచ్చుకోకుండా ఉండలేరు.అసలేం జరిగిందంటే..ఉన్నతి దేవాలియా అనే మహిళ తన ముంబైలో ఒక ఆటో రైడ్ బుక్ చేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారామె. ఆ డ్రైవర్ వెనుక సీటుపై ఉన్న సందేశం చూడగానే ప్రజా రవాణాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని పేర్కొంది పోస్ట్‌లో. ఒక చిన్న సానుభూతి చర్య ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పే ఘటన ఇది అని అంటోందామె. ఇంతకీ ఆ డ్రైవర్ సీటు వెనుకు ఏం ఉందంటే.."నేను కూడా ఒకరి తండ్రిని , సోదరుడిని. మీ భద్రతే నాకు ముఖ్యం. ఎలాంటి ఆందోళన లేకుండా కూర్చోండి. అలాగే ప్రతి వ్యక్తి ప్రమాదకారి కాదు. కొందరు మీకు సురక్షితమైన ఆశ్రయం ఇస్తారని గుర్తించండి." అని రాసి ఉంది. నిజంగా ఆ చిన్న పని ఆ డ్రైవర్ మంచి మనుసుని, ఉదారతను తెలియజేస్తుంది. అందరు అతడిలా ఉంటే బావుండేది కదూ..ఈ రోజు రైడ్‌లో వెళ్లడం నా రోజుని ఆనందమయంగా మారించి అంటూ తన పోస్ట్‌ని ముగించింది ఉన్నతి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ఆడ్రైవర్ని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు.(చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..) -
గుండెల్ని హత్తుకునే ఘటన, ఆ తల్లి ప్రేమ ముందు విధి కూడా ఓడిపోయింది..
-
'నాన్న'గా గర్వించే క్షణం..!
పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా.. అంతకు మించి కావాల్సింది ఏముంటుంది. అలాంటి క్షణం ఏ నాన్న అంత తేలిగ్గా మర్చిపోలేని జ్ఞాపకం కూడా. అలాంటి అనుభూతినే ఓ టెకీ తండ్రి పొందాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ తన తండ్రికి అమెజాన్ ఆఫర్ లెటర్ చూపిస్తూన్న వీడియో ఇది. అది అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడమే గాక ప్రతితల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించేది ఇదే కదా అని నెటిజన్లు అంటుడంటం విశేషం. ఆ వీడియోని శైలేంద్ర యాదవ్ అనే టెకీ పంచుకున్నారు. ఆయన ఆ వీడియోకి మా నాన్న నా ఆఫర్ లెటర్ చదవుతున్నారు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టెకీ తండ్రి ఆఫర్ లెటర్ చదువుతూ కనిపిస్తారు. ఇది నాన్నగా గర్వించే క్షణం, హృదయానికి హత్తుకునే ఘటన కూడా అని నెటిజన్లు అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు. ఇక టెకీ శైలేంద్ర పోస్ట్‌లో తాను రైతు కుటంబం నుంచి వచ్చాననని. సరైన విద్యకు అవకాశాలు పరిమితులుగా ఉండే మా కుటుంబంలో ఇంజనీర్ అయిన మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. తన చదువు కోసం తన తండ్రి ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేశారో కూడా చెప్పాడు. తనకు ఉత్తమ అవకాశాలు రావడం కోసం చాలా కష్టపడ్డారని అన్నారు. చివరికి అమెజాన్ నుంచి ఎస్డిఇ-2 ఆఫర్‌ను సంపాదించాను. అయితే ఈ విషయాన్ని మాములుగా చెప్పకూడదనిపించి వాలెంటైన్స్ డే రోజున చాల సర్ప్రైజ్ ఇచేలా చెప్పాను. ఈ గుడ్‌న్యూస్ చెప్పడం కోసమే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లానని అన్నాడు. ఆయన నాకోసం చేసిన వాటన్నింటిలో చాలా చిన్న మొత్తంలో ఇలా తిరిగి ఇచ్చినట్లుగా నాకనపించిందన్నారు. (చదవండి: జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్‌కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!) -
బైక్ ను 100 స్పీడ్ లో నడుపుతూ రీల్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. రికార్డైన వీడియోలో..!
-
ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్!
సమయం: ఉదయం 10 గంటలు.. స్థలం: మన దేశంలోనే కానీ కచ్చితంగా తెలియదు.. కనుచూపు మేర నుంచి తమవైపే కదలి వస్తున్న ఓ మరమనిషిని చూసి కోళ్లు ‘‘కొకొక్కొ..’’ అంటూ చెల్లాచెదురయ్యాయి. దూరంగా వీధి కుక్కలు.. ఇదేందయ్యా ఇది అన్నట్లు ఓ చూపు చూసి దౌడు అందుకున్నాయి. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు.. అంటూ వీధుల వెంట జనం ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు...ఇదేదో కొత్త గేమ్ క్యారెక్టర్లా ఉందే అంటూ ఓ చిన్నారి తన తల్లితో చెబుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోతోంది. కాస్త దూరంలో ఉన్న అధికారులు, సిబ్బంది.. ‘హమ్మయ్యా.. వీధుల్లో, గల్లీల్లో తిరిగే జంతువుల్ని కంట్రోల్ చేయడానికి మేం రోడ్డెక్కాల్సిన రావాల్సిన అవసరం లేదు’ అంటూ తెగ సంబరపడిపోయ్యారు. అధికారుల్లో ఒకరు మైక్ అందుకుని.. ‘‘ఇది ఒక రోబో. పేరు ఎడ్వర్డ్.. ఇక నుంచి వీధుల్లో, రోడ్ల మీద జంతువుల్ని తరమి కొడుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’’ అంటూ అనౌన్స్ చేశారు. ఇది ఇంకా ఏం చేస్తుందా? అని స్థానికులు గుమిగూడి చూస్తున్నారు. ఈలోపు.. నడిరోడ్డులో డివైడర్‌కు కాస్త పక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటూ నెమరేస్తున్న ఆవు దగ్గరికి వెళ్లింది ఆ రోబో. ఆవు మాత్రం కదలకుండా ‘‘ఇప్పుడు నిన్ను చూసి భయపడలా?’’ అన్నట్టుగా ఓ చూపు చూసి తన పనిలో తాను ఉండిపోయింది. పాపం ఆ పిచ్చి యంత్రుడు ‘‘ఉషూ.. ఉషూ.. చో’’ అన్నట్లు ఎన్ని సైగలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోపు పారిపోతున్న కోళ్లు, వీధి కుక్కలు ఆ సీన్ చూసి ఆగిపోయాయి. పైకి నిలబడిన ఆ ఆవును చూసి కేజీఎఫ్‌లో రాకీభాయ్‌లా ఊహించేసుకున్నాయి. ఆవు వెంట కలిసిన ఆ జంతువులు ఆ రోబోను, తమను తరిమేందుకు వచ్చిన అధికారులను రోడ్ల వెంట పరుగులు పెట్టించాయి. ‘‘ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్’’ అంటూ అధికారులు.. ‘‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అంటూ ఎడ్వర్డ్ చెరో వైపు పారిపోయారు. పాపం ఎడ్వర్డ్ వార్చోకి(Edward Warchocki).. పోలాండ్లోని వార్సా నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్(Unitree G1 humanoid robot). వీడు ఈ మధ్యే అడవి పందుల గుంపును వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినోదం కోసం చేసిన ప్రదర్శన మాత్రమే అయినా స్థానికులు దీనిని ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యం "సై-ఫై సినిమా"లా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.zaganiam dziki do lasu pic.twitter.com/Pjxkn0kfob— Edward Warchocki (@edwardwarchocki) April 12, 2026కొందరు దీనిని కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, మరికొందరు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతం అని భావిస్తున్నారు. మన దేశానికి వస్తే మాత్రం ఎడ్వర్డ్గాడి పరిస్థితి పైన చెప్పుకున్నట్లే ఉంటుందని కొందరు సెటైర్ల రూపంలో కామెంట్లు చేస్తున్నారు. -
'అచ్చం చిన్ని కృష్ణుడిలానే'..!
పసిపిల్లలు సహజంగానే ముద్దుగా అనిపిస్తారు. వారి అమాయకపు మోము ఎవ్వరినైనా.. ఇట్టే కట్టిపడేస్తుంది. కొందరు చిన్నారులను చూడంగానే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంటుంది కూడా. కానీ ఈ చిన్నారిని చూడగానే వాసుదేవ నందనుడు, ఆ నందగోపాలుడే గుర్తుకొస్తాడు. చిన్ని కృష్టుడిలా ముద్దుగా ఆకర్షిస్తున్న ఈ చిన్నారిని చూసి ఎవ్వరూ కళ్లు తిప్పుకోలేరు. అంత అందంగా ముగ్ధమనోహరంగా ఉందా ఆ పాపాయి. ఆ జగన్నాథుడే మళ్లీ ఈ భువిపై ఇలా చిన్ని కృష్ణుడిలా అవతరించాడా అన్నంతగా అందంగా ఉంది ఆ చిన్నారి. ఆ చిన్నారి చిరునవ్వు నుంచి ఆడుకుంటున్న విధానం అన్ని చూస్తే..ఒక్కసారిగా మన కళ్లముందు శ్రీకృష్ణుడి బాల్య జ్ఞాపకాలు కదలాడతాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి “అచ్చం చిన్ని కృష్ణుడిలాగే ఉన్నాడు!” అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. అంతేగాదు ఈ వీడియోకి వేలల్లో లైక్‌లు, వ్యూస్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి మరి..!.Looks just like little Krishna!🥰 pic.twitter.com/XrTWBV8gwV— 𝑺𝒂𝒏𝒅𝒉𝒚𝒂𝒂'𝒗 (@vedicvenus_) April 10, 2026 (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!) -
బావి నుంచి సింహ గర్జన.. చివరికి జరిగింది ఇదే..!
‘పదిహేను అడుగుల లోతు బావిలో పడ్డ సింహం.. గంటపాటు సాగిన సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్..’ గుజరాత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బావిలో చిక్కుకున్న ఒక సింహాన్ని అటవీ శాఖ అధికారులు దాదాపు గంటసేపు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఏప్రిల్ 13న నవబందర్ అటవీ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది.అటవీ అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ సింహం ఆహారం వేటలో తన నివాసం నుండి బయటకు వచ్చి.. ప్రమాదవశాత్తు నీటి బావిలో పడిపోయింది. బయటకు రాలేక.. తీవ్రంగా పోరాడింది. సింహం గర్జనలు చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై.. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జసాధర్ అటవీ శాఖ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ చౌహాన్ నేతృత్వంలో రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దిగింది. సింహం బావిలో పడిందన్న వార్త తెలియగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.అటవీ సిబ్బంది బలమైన తాళ్లను బావిలోకి దించారు. సింహం వాటిని పట్టుకుంటుందని పైకి లాగడానికి వీలుగా ఉంటుందని భావించారు. అయితే, భయపడిపోయిన ఆ సింహం దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఆ తాళ్లను పళ్లతో కొరికేసింది. దాదాపు 30 నిమిషాల పాటు రక్షణ సిబ్బందికి, సింహానికి మధ్య ఉత్కంఠభరిత పోరాటం సాగింది.A wild chase turned into a rescue mission in Gujarat.Near the forested stretch of Navabandar in Una taluka, a majestic lion, likely in search of prey, accidentally fell into an open farm well.What followed was a race against time.With swift coordination and remarkable… pic.twitter.com/Ssj7if76Hz— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2026చివరకు శ్రమ, సమన్వయంతో అధికారులు ఒక తాడు ఉచ్చును ఉపయోగించి సింహాన్ని బంధించగలిగారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి.. బావి అంచున ఒక బోనును సిద్ధంగా ఉంచారు. ఆపై సిబ్బంది మొత్తం కలిసి సింహాన్ని పైకి లాగడం ప్రారంభించారు. బావి నుంచి పైకి రాగానే.. సింహం సహజంగానే పక్కనే ఉన్న బోనులోకి వెళ్లింది. వెంటనే సిబ్బంది బోను తలుపులు వేశారు. సింహం సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ రెస్క్యూ వీడియోను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘‘సమన్వయం, అసాధారణమైన ధైర్యంతో, అటవీ శాఖ బృందం గంటపాటు అవిశ్రాంతంగా శ్రమించింది. వారి ప్రయత్నాలు ఫలించాయి. సింహానికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా రక్షించారు’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. -
పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్
వివాహ వేడుక అనగానే పూలపందిరి, పట్టుబట్టలు, బాజీ భజంత్రీలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీచాలా కామన్.అలాగే పెళ్ళి పెళ్లి కారును రకరకాల పూలతో అందంగా అలంకరించుకోవడం కూడా సాధారణం. కానీ ఒక పెళ్లి కారును వెరైటీగా అలంకరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది. అందరిలాగా మనమూ చేస్తే, మన స్పెషల్ ఏమిటి అనుకున్నారో ఏమోగానీ సాంప్రదాయ పూల అలంకరణలకు భిన్నంగా, ఒడిశాకు చెందిన ఒక వరుడు తమ పెళ్లి కారు అలంకరణలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. పూలతో పాటు తన కారును రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్, పైనాపిల్, ఆపిల్స్ ఇలా రకరకాల పండ్లతో రంగు రంగులతో అదిరిపోయేలా ఎంతో శ్రద్ధగా అలంకరించారు. కారు విండ్‌షీల్డ్, బాడీ అంతా పండ్లతో నింపేశారు. రొటీన్‌గా పూలతో కాకుండా పళ్లతో అలంకరించిన పెళ్లి కారు ముస్తాబు చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by FeelKarkeDekho (@feel_karkedekho) ఒక మేరకు పళ్లు వరకు ఒకే.. కానీ ఏకంగా స్నాక్స్ ప్యాకెట్లతో డెకరేట్ చేసిన వైనం కూడా మళ్లీ నెట్టింట సందడి చేస్తోంది. 2019లో ఒడిశాకు చెందిన వరుడు తన కారును వందలాది చిప్స్, కుర్కురే ప్యాకెట్లతో అలంకరించాడు. ఏదో పచారీ షాపులో వేలాడదీసినట్లుగా ఈ ప్యాకెట్లను వరుసగా అతికించారు. ఈ వీడియోలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఫన్నీ కామెంట్స్ చేయగా, వెర్రి వేయిరకాలు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. -
కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో
సిలిగురి: దేశ ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక సామాన్య కొత్త జంటకు స్వయంగా క్షమాపణలు చెప్పడం ఎప్పుడైనా చూశారా? పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక వైపు కట్టుదిట్టమైన భద్రత, మరోవైపు పెళ్లి సందడి.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.రిసార్ట్‌లో అనూహ్య ఘటనపశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిలిగురిలోని మయ్‌ఫెయిర్ టీ రిసార్ట్‌కు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ శ్రేయ, అక్షయ్ అనే యువజంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా ఆ పెళ్లి సందడికి కొంత అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన మోదీ, ఊహించని విధంగా ఆ కొత్త జంట వద్దకు వెళ్లి, వారికి కలిగిన అసౌకర్యానికి స్వయంగా క్షమాపణలు తెలియజేశారు. A heartfelt moment from PM Shri @narendramodi ji in Siliguri.He personally apologised to newlyweds Shreya and Akshay, whose wedding celebrations at Mayfair Tea Resort were affected due to heightened security during his visit.𝐀 𝐬𝐦𝐚𝐥𝐥 𝐠𝐞𝐬𝐭𝐮𝐫𝐞, 𝐛𝐮𝐭 𝐢𝐭… pic.twitter.com/JjJGUE86ru— BJP (@BJP4India) April 13, 2026నెట్టింట వైరల్‌గా మారిన వీడియోదేశ అత్యున్నత నేత తమ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ జంటతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ తమ అధికారిక ‘ఎక్స్’ఖాతాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న రెండు దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సిలిగురిలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. -
‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్ టిమ్ డేవిడ్ చేసిన ఒక పని చర్చనీయాంశమైంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే డేవిడ్ బలంగా బాదడంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయడం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాలని పదే పదే అడిగినప్పటికీ టిమ్ డేవిడ్ అతడిని పట్టించుకోకుండా అదే పనిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేందర్ శర్మ వచ్చి ఇలా చేయడం తగదని వార్నింగ్ ఇవ్వడం, ఇంతలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్నీ మోడ్‌లోనే చేసినప్పటికీ చూసేవాళ్లకు మాత్రం అతడి ప్రవర్తన విసుగు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు టిమ్ డేవిడ్‌ను ఏకిపారేశారు. ‘అంతర్జాతీయ క్రికెటర్ అయ్యుండి ఒక ఫీల్డ్ అంపైర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా?’ అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. ‘అందుకే క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు ప్రవేశపెట్టాల్సిన అవసరముంది’ అని మరొక అభిమాని కామెంట్ చేశాడు. ‘ఇలాంటి చిల్లర చేష్టలు చేయకుండా డీమెరిట్ పాయింట్ లేదా మ్యాచ్ నిషేధం విధిస్తే దారికొస్తాడని’ మరికొంతమంది కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిదార్లు అర్థసెంచరీలతో మెరిశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులకు పరిమితమైంది.Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF— Star Sports (@StarSportsIndia) April 12, 2026చదవండి: ఈ లెక్కన ఎస్ఆర్హెచ్కు మూడినట్లే! -
గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!
విదేశాల్లో ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్. మా అబ్బాయి ఫారెన్‌లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ వాస్తవ జీతంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంతగూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్లో వెంటాడతాయి. చాలామంది అక్కడ కొత్త లైఫ్‌స్టైల్‌కి అడ్జెస్ట్ కాలేక మరోపక్క తమవాళ్లను వదిలేసి వచ్చేశామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక..తిరిగి సొంత గడ్డకి పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్టూ అలానే భారత్‌కి గోడకు కొట్టి బంతిలా తిరిగొచ్చేశాడు. తాను ఎందుకలో వచ్చేశాడో చెబుతుంటే..అమ్మో విదేశాలకా అని అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే. ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తానెలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్‌ని మధ్యలో వదిలేసి భారత్‌కి వచ్చాశాడో సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు. ఆ పోస్ట్‌లో మానవ్ షా..తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నట్లు చెప్పాడు. అంతేగాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్ బిందాస్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అవేమి అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తాను నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పనిచేస్తుండేవాడినని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 టు 5 ఉద్యోగ సంస్కృతికి బంధీ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా..స్వేచ్ఛలేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్‌గా చెప్పాలంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే..అప్పటికే చక్కగా సెటిల్ అయిన లైఫ్, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. తాను తన ఇంటికి దూరంగా ఉండటంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్ వచ్చేదని అన్నాడు. వాటన్నింటిని ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకుని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంలో సంపాదించినంత కాకపోయినా..తన వాళ్లతో హాయిగా గడపగలనన్నా ఆ ఆలోచనే సంతోషంలో ముంచెత్తుందని చెబుతున్నాడు. అలాగే తక్కువ జీతమే అయినా..చక్కగా పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందివ్వగలనని అన్నాడు. అన్నింటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకుతానని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయానికి మద్దతిస్తూ..వెస్ట్రన్ డ్రీమ్ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లు ఉంటుందే తప్ప..ఎన్నో ఆనందాల క్షణాలను కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలానే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లు చెప్పడం విశేషం. View this post on Instagram A post shared by Manav Shah (@physiomanav) (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..) -
రైలు బోగినే దేవాలయం, బెర్త్‌పైనే పూజలు, వైరల్ వీడియో
రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్‌లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్ పూజా మందిరంగా మార్చేసి, కాషాయ వస్త్రాలు, పూలమాలలు, దేవతా విగ్రహాలతో అలంకరించి, కదులుతున్న రైలులోనే హారతుల్విడం ఈ వీడియోలో చూడవచ్చు.భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'భారత్ గౌరవ్' అనే థీమ్డ్ రైల్వే రైలులో ఈ సంఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణికులంతా గుమిగూడి పూజాకార్యక్రమాలు భక్తి గీతాలు పాడుతూ, ఆచారాలలో నిర్వహించడం గమనార్హం. భారత్ గౌరవ్ రైళ్లు సాధారణంగా భారతదేశం అంతటా తీర్థయాత్రలకుద్దేశించినవేఅయినప్పటికీ కానీ ఈ వీడియో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన ఆచారాలపై చర్చను రేకెత్తించింది. View this post on Instagram A post shared by TUBELIGHT (@the_tubelight)సోషల్ మీడియా స్పందనఈ వీడియో ఇంటర్నెట్లో భారీ వ్యూస్‌ను సంపాదంచుకుంది. కొంతమంది వినియోగదారులు ప్రజా రవాణాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు రైల్వే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలామంది ఈ చర్యను సమర్థించారు. ఇది భారతదేశపు లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మికతలో భాగమని పేర్కొన్నారు. “ఒక ముస్లిం వ్యక్తి రైలులో నమాజ్ చేస్తే అది తప్పా... మరి దీని సంగతేంటి... నేను హిందువునే, కానీ అన్నిటికంటే ముందు నేను భారతీయుడిని.” అని ఒకరు వ్యాఖ్యానించారు. “సందర్భం ముఖ్యం! ఇది తీర్థయాత్రల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ రైలు. ఈ భక్తి కార్యక్రమాలకు సిబ్బంది అధికారికంగా మద్దతు ఇస్తున్నారు, ఇవి థీమ్ ఆధారిత ప్రయాణ అనుభవంలో భాగం. ప్రజలు వివరణ చదవకుండా లేదా ఇది ఒక సాధారణ పబ్లిక్ కోచ్ కాదని అర్థం చేసుకోకుండా స్పందిస్తున్నారు.” ఇంకొకరు ఆగ్రహం ప్రకటించారు. “వారిని ఇప్పటికే జైల్లో ఎందుకు పెట్టలేదు? బహిరంగ ప్రదేశంలో ఇలాంటి అర్థంలేని పనులను ఎలా సహిస్తున్నారు? ఇది కేవలం వైరల్ రీల్స్ కోసమా లేక ఏంటి?” ఒకరు, “ పనీ పాటా, జ్ఞానం లేని ప్రజలు, ఇలా తయారవుతున్నారు.” అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. హితవు చెప్పిన NCIBఈ వీడియో బాగా వైరల్‌గా మారడంతో, NCIB అధికారిక ఖాతా ద్వారా స్పందించింది. బహిరంగ ప్రదేశాల నిబంధనలను గౌరవించాలని ప్రయాణికులను కోరింది. -
సామాజిక బాధ్యత అంటే ఇదే..!
రోడ్డుపై అనునిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఇది సర్వసాధారణ. కానీ క్షణంలో స్పందించి చేతనైన సాయం అందిస్తే..ప్రాణాలను రక్షించిన వాళ్లం అవుతాం. అయితే అందుకు ఎవ్వరూ ముందుకురారు. పోలీసు కేసులని, రిస్క్ అని భయంతో దూరంగా ఉండిపోతారు. కొందరు ముందుకొచ్చినా..మిగతా వాళ్లు సహకరించకపోవడంతో వెనకడుగువేస్తుంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం దీనిపై అవగాహన కార్యక్రమాలతో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది కూడా. కానీ ఈ అమ్మాయి దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించి ఘెర ప్రమాదాన్ని తప్పించింది.ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో అందుకు సంబంధించిన ఘటన రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోని గమనించకపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఆ మహిళను తప్పించబోయి ఆ ఆటోనే ఆమెపై బోర్లపడింది. స్కూల్ నుంచి వస్తున్న ఆ చిన్నారి రెప్పపాటులో స్పందించి ఒక్కసారిగా ఆ ఆటోని ఎత్తేసింది. అదంతా సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యింది. దాన్ని చూసిన సిటీ కమిషనర్ ఆ విద్యార్థిని పిలిపించి మరి ఆమె సాహసాన్ని మెచ్చుకోవడమే గాక సన్మానం చేసి అభినందించారు. ఇదీ సామాజిక బాధ్యతంటే అని నొక్కి చెప్పారు సిటీ కమిషనర్. *కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది ✊ అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన… pic.twitter.com/MqTuaqpGKh— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 12, 2026 (చదవండి: Asha Bhosle and Lata Mangeshkar: తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!) -
మండే ఎండల్లో కూల్ గిప్ట్ : ఎవరికైనా కన్నీళ్లాగవు!
ఇంట్లో వాడని వస్తువులను, దుస్తులను ఇంట్లో పనిచేసే సహాయకులకు గిఫ్ట్‌గా ఇవ్వడం కాలా కామన్. కానీ తన ఓనర్ ఇచ్చిన బహుమతికి ఒక ఇంటి పనిమనిషి ఉబ్బితబ్బిబ్బైన ఘటన నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సర్ప్రైజ్ గిప్ట్ చూసి ఆమె మొదట చాలా ఆశ్చర్యపోయింది. ఆ తరువాత భావోద్వేగానికి లోనైంది. మనుషుల మధ్య ఉండాల్సిన అసలైన బంధానికి, మానవత్వానికి ఈ వీడియో ఒక నిదర్శనంగా నిలిచిందిఇంతకీ ఆమెకు లభించిన గిఫ్ట్ ఏంటి?దేశవ్యాప్తంగా వేసవి ఎండలు తీవ్ర స్థాయికి చేరాయి. ఏప్రిల్ మాసంలో ఎండలు మండిపోతున్న వేళ, ఒక కుటుంబం తమ ఇంట్లో పనిచేసే మహిళకు ఎయిర్ కూలర్ (Air Cooler) బహుమతిగా ఇచ్చింది. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొన్న కూలర్ అని చెప్పగానే ఆ మహిళ ఆనందంతో పొంగిపోయింది. ప్రేమతో ఇచ్చిన చల్లని కానుకను చూసి యజమానిని గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హృద్యమైన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోకు ఇప్పటివరకు 2.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Coco & Chico 🐾 (@lifeofcocoandchico)నెటిజన్లు స్పందనఈవీడియో చూసి నెటిజన్లు నిజమైన అనుబంధం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె అవసరాలను గుర్తించి, ఆమెను సంతోషపెట్టడానికి కొంచెం కరుణ, చిరు సాయం, కొంచెం సానుభూతి ఉంటే చాలు అంటూ ప్రశంసించారు. ప్రపంచమంతా ఇలాంటి మానవత్వం, ప్రేమ, గౌరవంతో ఉంటే ఎంత బాగుంటుందో అని మరికొందరు వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇలాంటి ఘటనే..తమ ఇంట్లో సభ్యురాలిలా చూసుకుంటూ, తమ పెంపుడు కుక్కలను కూడా తన బిడ్డల్లా ప్రేమించే గృహకార్మికులకు ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఎంతో సంతృప్తినిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇదే తరహాలో గతంలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో జ్యోతి అనే పనిమనిషి తన పుట్టినరోజున "ఈరోజు మా అమ్మ బతికి ఉంటే నన్ను ఎంతో ప్రేమించేది" అని ఏడుస్తుంటే, ఆమె యజమాని (కృతార్థ)అతని స్నేహితులు ఐస్‌క్రీమ్ కేక్ తీసుకొచ్చి ఆమెతో పుట్టినరోజు వేడుకలు జరిపి ఆమెను ఆశ్చర్యపరిచిన ఘటన నెటిజనులను బాగా ఆకట్టుకుంది.ఇదీ సంగతి: రిక్షా డ్రైవర్ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం -
యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’
కోల్‌కతా: రాజకీయ వేదికలపై కనిపించే కొన్ని దృశ్యాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విషయంలో బెంగాల్ ఫైర్ బ్రాండ్ నేత సువేందు అధికారి చూపిన అనూహ్య భక్తిభావం, అణకువ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.పశ్చిమబెంగాల్లోని కొంటాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ ఈ ఆసక్తికర ఘట్టానికి వేదికైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఇక్కడకు వచ్చారు. ఆయన వేదిక పైకి అడుగుపెట్టగానే సువేందు అధికారి వేగంగా వెళ్లి, కాషాయ కండువాతో స్వాగతం పలికారు. అంతేకాదు, ఏమాత్రం సంకోచించకుండా వేదికపైనే యోగి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే స్పందించిన యోగి ఆయనను ఆప్యాయంగా పైకి లేపి, చేయి పట్టుకుని అక్కడున్న ప్రజల వైపు తిరిగి అభివాదం చేశారు. ఈ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఎంత భక్తో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Beautiful video ♥️Kanthi, West Bengal : Bengal LoP Suvendu Adhikari seeks blessings from UP CM Yogi Adityanath by prostrating in-front him and touching his feet.#BengalElections #BJP4Bengal pic.twitter.com/eUj1lPdOe9— Amitabh Chaudhary (@MithilaWaaala) April 12, 2026ఈ సభలో యోగి ఆదిత్యనాథ్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్ సంస్కృతిని, శాంతిభద్రతలను కాపాడటంలో టీఎంసీ సర్కార్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, భద్రత కోసం ఇక్కడ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్ వంటి ప్రాంతాల్లో హిందువుల జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బెంగాల్లో దుర్గాపూజ, రామ నవమి ఊరేగింపులను అడ్డుకోవడాన్ని యోగి తప్పుబట్టారు. బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: Noida: కార్మికుల తిరుగుబాటు.. కలెక్టర్ కీలక నిర్ణయం! -
ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్.. కేటుగాడి మాయ వైరల్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కారు నంబర్ ప్లేట్ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
రేంజ్ మారినా.. మారిపోని ఫ్రెండే ఇతడు..!
స్నేహానికి ఉన్న శక్తి మరొకటి లేదు. ట్రెండ్ మారినా..స్టేటస్ మారినా..ఫ్రెండ్ మారడు అనేందుకు ఈ వ్యక్తే నిదర్శనం. ఎంత పెద్ద హోదాలో చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నా.. కేవలం తన స్నేహితుడి కోసం నిస్వార్థంగా చేస్తున్న అతడి సాయం చూస్తే..కళ్లల్లో నీళ్లు తిరుగతాయ్..!. ఇంతకీ అతడేం చేశాడంటే..గురుగ్రామ్‌లో ఒక విలాసవంతమైన కారు డిక్కీలో బేకరీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో అంత ఆసక్తికరమైనది ఏం ఉందంటే.. హర్ష్ చౌహన్ అనే అకౌంట్ నుంచి షేర్ అయిన ఆ వీడియోలో ఆ వ్యక్తి తన ఖరీదైన కారు డిక్కీని తెరిచి, అమ్మకానికి ఉంచిన బేకరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. నీద్గగర రూ. 37 లక్షల ఖరీదు చేసే కారు ఉంది మరి ఇదేంటన్ యూజర్ చౌహన్ అడగ్గా..తాను జర్మనీలో మెడికల్ రీసెర్చ్ సైంటిస్టునని బాంబు పేలుస్తాడు. ఇదంతా కేవలం తన స్నేహితుడికి మద్దతు ఇచ్చేందుకని కూల్‌గా చెబుతాడు. వైరల్ అవుతున్న వీడియోలోని కథ నిజమేనా కాదా అని పలువురు మీడియా ఔత్సాహికులు ఆరా తీయగా..అతడు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన రీసెర్చ్ సైంటిస్ట్ అవధేష్ అని తేలింది. అతడితో మాట్లాడగా..తాను జర్మనీలో మూడేళ్లుగా మెడికల్ రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తున్నాని, ప్రస్తుతం ఉద్యోగానికి బ్రేక్ తీసుకున్నట్లు అవధేష్ పేర్కొన్నాడు.ఆ నేపథ్యంలోనే తన కారుని తాత్కాలిక చట్కారా ఆన్ వీల్స్' అనే స్టాల్‌గా ఉపయోగించి బేకర్ ఉత్పత్తులు అమ్ముతూ.. స్నేహితుడికి ఫుడ్ వ్యాపారంలో సాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక్కడ భారత్‌లో తన స్నేహితుడు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక..తాను తిరిగి జర్మనీకి వెళ్లిపోతానని చెబుతుండటం విశేషం. అందుకు సుమారు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపాడు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా..మారిపోని ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. స్నేహం కోసం కొందరు ఎంత దూరమైన వెళ్తారు. అలాంటి వ్యక్తులను పొందడం అనేది కొన్ని కోట్ల కన్నా విలువైన సంపద అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు అతడి నిస్వార్థ సేవకు మాటల్లేవ్ బ్రో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Harsh Chauhan • Raw Life (@otherharsh) (చదవండి: ఫేస్ పౌడర్' వెనుక ఇంత స్టోరీ ఉందా..!) -
దేశ ప్రజలను అవమానించిన పాక్ క్రికెటర్!
పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూపర్‌లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న హసన్ అలీ అసభ్యకరమైన సంజ్ఞతో సైగలు చేయడం వివాదానికి దారి తీసింది. విషయంలోకి వెళితే.. శనివారం కరాచీ కింగ్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య మ్యాచ్ జరిగింది.కింగ్స్‌మెన్ ఇన్నింగ్స్ సమయంలో అబ్బాస్ అఫ్రిది వేసిన 8వ ఓవర్లో ఉస్మాన్‌ఖాన్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే నిల్చున్న హసన్ అలీ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. అయితే క్యాచ్ తీసుకున్న వెంటనే పెవిలియ్ స్టాండ్ వైపు తిరిగి ‘నోరు మూయండి’ అన్నట్లు సైగ చేసి ఆ తర్వాత గాల్లోకి పంచ్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రస్తుతం పీఎస్ఎల్ ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్ తమ సొంత గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా ఉండడం ప్రేక్షకులు లేకుండానే మాకు హాయిగా ఉంది అన్నట్లుగా అర్థం వచ్చేలా సైగలు ఉండడం వివాదంగా మారింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో పీఎస్ఎల్ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అంతకముందు ఇన్నింగ్స్ 7.3 ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ జారవిడిచాడు. మళ్లీ హసన్ అలీనే ఉస్మాన్ ఖాన్ క్యాచ్ తీసుకున్నాడు. చేసిన తప్పుకు ప్రాయచిత్తం చేసుకునేందుకే హసన్ అలీ ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ కింగ్స్‌మెన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకొని విజయం సాధించింది.- @RealHa55an signalling this to whom? 🤔 pic.twitter.com/FGOJ1TaWIP— HAMAS 🇵🇰 (@HamasulGhani) April 11, 2026చదవండి: ట్విస్ట్ అదుర్స్.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే! -
అంపైర్‌తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోతూ హెల్మెట్‌ను నేలకేసి కొట్టడంతో పాటు గ్లోవ్స్‌ను విసిరేయడం కెమెరాలకు చిక్కింది. మరి స్టబ్స్ కోపానికి కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టబ్స్ తన గ్లోవ్స్‌ను మార్చుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే గ్లోవ్స్ మొత్తం చెమటతో తడిసిపోవడంతో స్టబ్స్ పదే పదే బ్యాట్ గ్రిప్‌ను కోల్పోయాడు. దీంతో గ్లోవ్స్‌ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అంపైర్‌ను కోరాడు. కానీ అంపైర్ ససేమీరా అనడంతో చేసేదేం లేక స్టబ్స్ అదే గ్లోవ్స్‌తో కంటిన్యూ అయ్యాడు. అయితే 19వ ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడే యత్నంలో మిడాఫ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కాడు. దీంతో పెవిలియన్ చేరిన స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా కోపంతో ఊగిపోతూ బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేయడంతో పాటు గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టబ్స్ ఔటైన తర్వాత డగౌట్లో ఉన్న ఢిల్లీ ఆటగాడు నితీశ్ రానా స్టబ్స్‌ను సమర్థించాడు. తడిగా ఉన్న గ్లోవ్స్‌తో ఆడడం వల్ల బ్యాటింగ్‌కు ఆటంకం కలుగుతుందని, స్టబ్స్‌కు గ్లోవ్స్ మార్చుకునేందుకు అవకాశమెందుకు ఇవ్వలేదంటూ థర్డ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోచ్ హేమంగ్ బదాని కూడా అంపైర్‌తో ఇదే విషయమై వాదనకు దిగడం కనిపించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.Stubbs asked to change his gloves just before the wicket ball and Umpire didn't allow it, now DC management is furious and ofcourse CSK is involved in another spooky decision. pic.twitter.com/jkkImLB5Bq— Avay Sha (@avay_69) April 11, 2026🚨 DC Camp Angry on Umpire Decision 🚨DC coach Hemang Badani and Nitish Rana were angry on umpire after Tristan Stubbs was not allowed to change his gloves during the over.The decision upset the DC camp, and on the very next ball, Stubbs got out. pic.twitter.com/qGHdCe6tQL— Cricket Vaira (@ramgaming242) April 11, 2026Stubs wanted to change his gloves, but the umpire did not allow it, and he got out on the very next ball.#CSKvsDC pic.twitter.com/BAHX9zhURM— Vivek Gupta (@VIVEK1888) April 12, 2026చదవండి: ‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’ -
నడిరోడ్డుపై చాహల్ హల్చల్!
పంజాబ్ కింగ్స్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చిక్కుల్లో పడ్డాడు. పబ్లిక్ ప్లేస్‌లో అతడు ప్రవర్తించిన తీరును తప్పుబట్టిన క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమం వేదికగా ట్రోల్స్‌కు దిగారు. నడిరోడ్డుపై లగ్జరీ కారులో రయ్యిమని దూసుకెళ్లడం తప్పుకాకపోవచ్చు కానీ కాల్చిన సిగరేట్‌ను కనీసం ఆర్పాలనే సోయి లేకుండా దానిని రోడ్డు మీద పడేయడమేంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటే దానికి చాహల్ బాధ్యత వహించేవాడా అని మండిపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘సివిక్ సెన్స్ లేని క్రికెటర్‌ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం.. అతడే యజ్వేంద్ర చాహల్. బహిరంగ ప్రదేశాల్లో కాల్చిన సిగరేట్‌ను ఆర్పి పడేయాలన్న సోయి అతడికి లేదు.’అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ‘డబ్బులు సంపాదించడం కాదు ముందు బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలనే బేసిక్ సెన్స్ నేర్చుకో’ అంటూ మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే ఇటీవలే డివిలియర్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తాను మందు మానేసి ఆరు నెలలకు పైనే అయినట్లు పేర్కొన్నాడు. ఫిట్నెస్, ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండడం కోసమే ఈ చర్యకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్ మూడు మ్యాచ్‌లు కలిపి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉంది. కేకేఆర్‌తో జరిగిన మూడో మ్యాచ్ వర్షార్పణం కావడంతో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముల్లన్పూర్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.Yuzvendra Chahal spotted smoking and throwing a lit cigarette on the road while driving on highways in Chandigarh 🤯 pic.twitter.com/V3gcYTK5n0— Deepu (@deepu_drops) April 11, 2026🚨 YUZVENDRA CHAHAL EXPOSED 🚨Yuzvendra Chahal recently went on a podcast claiming he’s “quit everything” for his body and career longevity at 35. Fast forward to today: a viral video shows him smoking while driving. 🚭🏎️ pic.twitter.com/jgngkg5Wdd— Cricket Central (@CricketCentrl) April 10, 2026చదవండి: సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్! -
అమ్మ ఆశీర్వాదంతో బరిలోకి.. ఆపై దంచికొట్టి !
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగా టాపార్డర్‌లో ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్లో ఎవరో ఒకరు ఇన్నింగ్స్ కడదాకా నిలిచి జట్టును గెలిపిస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 266 స్ట్రైక్‌రేట్‌తో 200 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లోనూ వైభవ్ విధ్వంసం కొనసాగింది. కేవలం 26 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. సీజన్లో అతడికి ఇది రెండో అర్థసెంచరీ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగుతూ పోతే ఆరెంజ్ క్యాప్ గెలవడంతో పాటు రాజస్తాన్‌కు కప్ అందించినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వైభవ్ మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూమ్ నుంచి బయల్దేరిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తల్లి బయట నిలబడింది. పరాగ్ తల్లిని గమనించిన వైభవ్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే పరాగ్ తల్లి మాత్రం వైభవ్‌ను వద్దంటూ వారించి హగ్ చేసుకొని ‘ఆల్ ది బెస్ట్’ చెప్పడం వీడియోలో కనిపించింది. వైభవ్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకున్నారు . ‘అమ్మ ఎవరికైనా అమ్మే’.. ‘పరాగ్ తల్లి పెద్ద మనసుతో వైభవ్‌ను ఆశీర్వదించడం గొప్ప విషయం’ అంటూ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: ‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’ Vaibhav Sooryavanshi touched the feet of Riyan Parag's mother and took her blessings before the RCB vs RR match. ❤Vaibhav Sooryavanshi is a down-to-earth, pure desi boy. pic.twitter.com/Djgqn5mUiY— Sonu (@Cricket_live247) April 10, 2026 -
బెంజ్ కారు, నడిరోడ్డులో తలస్నానం, తిట్టిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో క్రేజ్‌కోసం ఎ లాంటి పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించు కోవడం లేదు. తాజాగా రష్యన్ మహిళ నిర్వాకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.రష్యాకు చెందిన ఒక మహిళ లగ్జరీ కారునే బాత్రూమ్గా మార్చేసింది. మార్పులు చేర్పులు చేసిన మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తూ జుట్టును వాష్ చేసుకుంది. నడిరోడ్డుపై పోతూ పొడవాటి తన జుట్టుకు షాంపూ పూసుకోవడం, నీళ్లతో కడుక్కోవడం,టవల్ చుట్టుకోవడం లాంటి తతంగాన్నంతా పూర్తి చేసింది. కార్లో వెడుతూనే జుట్టు కడుక్కున్న వైనం నెట్టింట దుమారాన్ని రేపుతోంది. ⚡️🚨 شابة روسية تقوم بغسل شعرها اثناء مرور سياره مرسيدس محوله السياره إلى حمام منزلي مما أثارت جدل واسع جداً بطريقتها الغريبة . pic.twitter.com/KILM9cZgzp— موسكو | 🇷🇺 MOSCOW NEWS (@M0SC0W0) April 9, 2026 ; ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేలం వెర్రి అని తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద జుట్టునుఅలా వాష్ చేసుకుంటోంది...పొరపాటున ఆ జుట్టు టైర్ల కింద పడితే పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే! -
బ్లింకిట్‌లో ఐస్‌క్రీం ఆర్డర్ చేశారా? ఈ షాకింగ్ వీడియో మీ కోసమే!
ఎండ వేడికి తట్టుకోలేక ఐస్‌క్రీం తినాలనింపించడం, ఆన్లైన్లోఆర్డర్ పెట్టుకోవడం ఈ సమ్మర్ సీజన్లో చాలా కామన్. అయితే ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. జమ్మూకి చెందిన ఒక వ్యక్తి బ్లింకిట్ నుండి ఐస్ క్రీమ్‌లను ఆర్డర్ చేశాడు. రాత్రి భోజనం తరువాత తిందామని తీరిగ్గా ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. అసలు ఏమైంది అంటే..తేజిందర్ సింగ్ సోధి అనే యూజర్ తన కెదురైన అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు. దీని ప్రకారం ఇటీవల జమ్మూలోని బ్లింకిట్ నుంచి కోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు. డెలీవరీ తీసుకున్నాక దాన్ని జాగ్రత్తగా ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. రాత్రి భోజనం తర్వాత హాయిగా ఐస్ క్రీం ను ఆస్వాదిద్దామని ప్యాకెట్ ఓపెన్ చేశాడు. తీరా చూస్తే లోపల సగం తిన్న ఐస్ క్రీమ్ కనిపించడంతో షాక్అయ్యానని తెలిపాడు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, ఇది పొరపాటుగా జరిగిన సంఘటన కాదని కూడా పేర్కొన్నాడు. అయితే దీనికి స్పందించిన బ్లింకిట్ రీఫండ్ ఆఫర్ చేసినప్పటికీ,తేజిందర్ దానిని తిరస్కరిస్తూ, పారేయడానికి కాదు. జవాబుదారీతనం ముఖ్యం, కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.Ordered ice creams from @letsblinkit in Jammu. Stored them properly, opened the pack after dinner — and found a HALF-CONSUMED ice cream inside the Blinkit pack.This is not negligence. This is a serious health risk.Refund offered. Refused.I will be taking this to consumer… pic.twitter.com/ujrWBfTnWo— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) April 8, 2026> ఈ విషయాన్ని వినియోగదారుల కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు చెబుతూ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా , జాగో గ్రాహక్ జాగో వంటి అధికారులను కూడా ట్యాగ్ చేశాడు. అంతేకాదు ఈ సంఘటనను చూసిన తర్వాత తన కుమార్తె ఎంతగానో కలత చెందిందని, ఇకపై బ్లింకిట్‌ను ఎప్పటికీ నమ్మనని చెప్పిందని అతను పంచుకున్నాడు.ఈ పోస్ట్ వైరల్ కావడంతో బ్లింకిట్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి, ఈ సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించడానికి వీలుగా అతని ఆర్డర్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంచుకోమని కోరింది. నెటిజన్ల స్పందనదీనిపై చాలామంది వినియోగదారులు స్పందించారు. ఇందులో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిం దేమీ లేదని కమెంట్స్ చేయడం విశేషం. “నాకు కూడా ఇలాగే జరిగింది. నేను అముల్ చాక్లెట్ ఆర్డర్ చేశాను, అది సగం తిన్నది, కానీ దానికి నాకు రీఫండ్ వచ్చింది.” ఒక యూజర్ పేర్కొన్నారు. అలాగే కోన్లు లేదా కుల్ఫీలను ఆర్డర్ చేయవద్దని మరొకరు ప్రజలను హెచ్చరించారు. ఆర్డర్లలో వస్తువులు మిస్ అవ్వడం సర్వసాధారణమని,పూర్తి మొత్తంపై జీఎస్టీ వసూలు చేయడం వల్ల రీఫండ్స్‌తో న్యాయంజరగదని మరికొందరు విమర్శించారు. మరికొంతమంది డెలివరీ ఏజెంట్లపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా? -
కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఉత్కంఠ సమరంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించేందుకు డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి విఫలమయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్ సింగిల్‌కు నిరాకరించడం కీలక తప్పిదంగా మారింది. Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026ఆఖరి బంతిని మిస్ చేయడంతో కుల్దీప్ యాదవ్ రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు ఓవర్లో (19) 23 పరుగులు బాది ఢిల్లీని గెలుపుకు చేరువ చేసింది కూడా మిల్లరే. ఇంత చేసి చివరికి మ్యాచ్ గెలిపించలేకపోవడంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. బాధపడుతున్న మిల్లర్‌ను కెప్టెన్ అక్షర్ పటేల్, హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ ఓదార్చారు. మిల్లర్ భావోద్వేగ క్షణాలను డీసీ తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. “Backing our Tiger, always 💙” అంటూ మిల్లర్‌కు మద్దతు తెలిపింది. ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు, కొందరు సొంత అభిమానులే మిల్లర్‌ను తిట్టిపోశారు. 19వ ఓవర్ ఐదో బంతిలో సింగిల్ తీసుంటే కనీసం సూపర్ ఓవర్‌కి అవకాశం ఉండేది. తప్పంతా మిల్లర్‌దే అంటూ సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోశారు. అంత అతి విశ్వాసం పనికి రాదంటూ మిల్లర్‌కు చీవాట్లు పెట్టారు.నాణేనికి అటు ఇటు ఉన్న విషయాలను పక్కన పెడితే, మిల్లర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ సందర్భంలో అనుభవమున్న ఏ బ్యాటర్ అయినా అలాగే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇలా మిస్ ఫైర్ అవడం సహజమే. ఇందులో మిల్లర్‌ను నిందించాల్సిన అవసరం లేదు.ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ సీజన్లో ఢిల్లీ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమి మినహా, ఈ సీజన్లో ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. వరుసగా లక్నో, ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా ఓటమి తర్వాత కూడా మెరుగైన రన్‌రేట్ కలిగి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ హైలైట్స్ - GT 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.- గిల్ (70), బట్లర్ (52), సుందర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు. - ఛేదనలో DC ఓపెనర్లు కేఎల్ రాహుల్ (92), నిస్సంక (41) చెలరేగి ఆడారు. - గాయపడిన చేతితో డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) చివరి బంతి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీని గెలిపించలేకపోయాడు. - రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 3/17తో DC మిడిలార్డర్‌ను కుదిపేశాడు. -
నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్‌చేస్తే..
ఏ వ్యాపారమైన ప్రారంభంలో ఒడిదుడుకులు సాధారణం. ఇక్కడ వాటిని అధిగమిస్తు ముందుకు సాగేవారు ఏదో ఒకరోజు తప్పక గెలుస్తారు. అందుకు ఉదాహరణ ఈ వ్యక్తి. ఒకప్పుడు సాదాసీదా తోపుడు బండిపై పండ్ల వ్యాపారం. ఒక్కోసారి ఒక్కటి కూడా అమ్ముడు అవ్వక వద్దురా ఈ వ్యాపారం అనేలా నిరాశను కలుగజేసింది. అయినా ఎలాగైనా ఏదో సాధించాలన్న కసి, పట్టుదల మళ్లీ మళ్లీ అదే వ్యాపారం చేసి నిలదొక్కుకోవడమే గాక పదిమందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరాడు, పైగా కోట్లలో లాభాలు ఆర్జించడం మొదలైంది. ఎలా ఆ వ్యక్తి ఆ స్థాయిలో పండ్ల వ్యాపారంలో సక్సెస్‌ని అందుకున్నాడంటే..ఆ వ్యక్తే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్కి చెందిన అబ్దుల్ రైస్. దాదాపు 30 ఏళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఒక సాధారణ బండిపై పండ్లు అమ్ముతూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభరోజుల్లో అతడి వ్యాపారం ఎంత దారుణంగా ఉండేదంటే..సరిగా అమ్మకాలు సాగాక రోజంతా వేచి చూడాల్సి వచ్చేది. ఆ తోపుడు బండి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోక ఇక వదిలేద్దాం రా బాబు అని అనుకునేవాడు. మరోవైపు వర్షాకాలంలో ఆ కొద్దిపాటి అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయేవి. ఈ ఇబ్బందులతో ఆయన ఛీ ఈ వ్యాపారం నాకొద్దు అంటూ విలపించేవాడు. అయితే బంధువులు, కుటుంబ సభ్యుల మద్దతుతో అబ్దుల్ సుమారు రూ. 5 లక్షల రుణం తీసుకుని మళ్లీ అదే వ్యాపారం ప్రారంభించారు. ఈసారి ఆయనకు గతంలో చూసిన సవాళ్లు అన్ని పాఠాలుగా మారి, ఎలా వ్యాపారం నిర్వహించాలో తెలిసొచ్చింది. నిరంతర శ్రమ, పట్టుదలతో లాభాల పట్టేంచేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆ చిన్న వ్యాపారం కాస్త కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కాలక్రమేణ తన చిన్న తోపుడు బండి వ్యాపారం ఒక అభివృద్ధి చెందుతున్న సంస్థగా మారింది. అలా అతని సంస్థ ఏకంగా రూ. 3 కోట్ల వార్షిక టర్నోవర్‌తో దూసుకుపోవడమే గాక దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఒకప్పుడు మనుగడ కోసం పడిన పోరాటం ఇప్పుడు చాలామందికి ఉపాధి అందించే రేంజ్‌కు చేరడం విశేషం. అతడి సంస్థ బుర్హాన్పూర్లో నీలం ఫ్రూట్’గా ప్రసిద్ధి చెందింది. నాణ్యత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి అక్కడందరి మన్ననలకు అందుకుంది. అతడి దుకాణం నుంచి పండ్లు కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం గమనార్షం. అతడి సంస్థ వద్దకు సుమారు రెండు నుంచి మూడు వాహానాలు వస్తాయట. చిల్లర వినియోగదారులే కాకుండా, చాలా మంది చిరు వ్యాపారులు కూడా అతని వద్ద పండ్లు కొని స్థానిక మార్కెట్లలో అమ్ముతారు. తద్వారా అతడి వ్యాపార విస్తరణ మరింత పెరుగుతూ వచ్చింది. పట్లుదల, నిరంతర కృషి ఉంటే ఎంతటి భయాంకరమైన సవాళ్లనైనా దాటగలుగతాం, విజయం సాధించగలం అని అబ్దుల్ రైస్.(చదవండి: కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..! గులాబీ కుర్తా..) -
కలిసిపోయిన స్మృతి- పలాష్ కుటుంబాలు?.. త్వరలోనే పెళ్లి?!
భారత మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది స్మృతి మంధాన. టీమిండియా ఓపెనర్‌గా, వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన ఈ ముంబైకర్ ఖాతాలో గతేడాది ప్రపంచకప్ కూడా చేరింది. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ గెలవడంతో స్మృతి చిరకాల కోరిక నెరవేరింది.ఘనంగా హల్దీ, మెహందీఆ ఆనందంలోనే మెగా టోర్నీ ముగిసిన కొన్నిరోజులకే పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్‌తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టేందుకు ఆమె కుటుంబం ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి హల్దీ, మెహందీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.చిరకాల స్నేహితులు, భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పటేల్, రాధా యాదవ్ తదితరులు స్మృతి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. అంతా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.వివాహం రద్దైనట్లు ప్రకటనలుపెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కాగా.. పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. అయితే, ఆ వెంటనే పలాష్ తనతో అసభ్యకరంగా చాటింగ్ చేశాడని.. అందులో స్మృతిని కించపరిచేలా మాట్లాడినట్లు ఉన్న స్క్రీన్షాట్లను ఓ అమ్మాయి షేర్ చేయడం కలకలం రేపింది.ఈ పరిణామాల క్రమంలో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ తమ వివాహం రద్దైనట్లు విడివిడిగా అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా స్మృతి- పలాష్‌ల వివాహానికి మార్గం సుగమమైందనే ఊహాగానాలకు ఊతమిచ్చింది.కలిసిపోయిన కుటుంబాలు?పలాష్ సోదరి, బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ ముంబైలోని ఓ రెస్టారెంట్ బయటకు రాగా.. అక్కడే స్మృతి తండ్రి శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెంటనే పాలక్.. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత తన భర్త మిథున్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో స్మృతి- పలాష్‌ల పెళ్లి జరుగబోతుందనే వదంతులు పుట్టుకొచ్చాయి.అయితే, చాలా మంది నెటిజన్లు మాత్రం ఇది పాత వీడియో అయి ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. ఇంత జరిగిన తర్వాత స్మృతి అతడిని క్షమించే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు. అయితే, స్మృతి అభిమానులు మాత్రం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంతోషంగా ఉంటే చాలని కామెంట్లు చేస్తున్నారు.కాగా పలాష్ నిజస్వరూపం తెలిసిన తర్వాత స్మృతి స్నేహితురాళ్లు అతడికి చితక్కొట్టారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పలాష్ మాత్రం తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మరోవైపు.. పెళ్లి రద్దైన తర్వాత స్మృతి ఆటపై దృష్టి పెట్టి.. వుమెన్ ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది. తద్వారా ఆర్సీబీకి రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా ఘనత సాధించింది.చదవండి: పాపం.. గర్ల్‌ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో! View this post on Instagram A post shared by Bollywood pap king (@bollywoodpapking) -
ఇది అందరూ చూడగలిగే పువ్వు కాదు..!
ఈ ప్రకృతి ఎన్నో అద్భుతాలకు ఆలవాలం. తనలో ఇముడ్చుకున్న కొన్ని విచిత్రాలు మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తాయి. అలాంటి అరుదైన పుష్పమే ఈ మంచుతామర లేదా మంచు కమలం. అందరికీ దీన్ని చూడటం సాధ్యం కాదు. ఈ మంచు కమలం ఎక్కడ వికసిస్తుందో తెలుసా..!.ఈ మంచు పుష్పం ఐదు నుంచి ఎనమిదేళ్లు పెరిగి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వికసిస్తుందట ఈ పర్వత పుష్పం. 'అరుదైన అందం', 'జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే క్షణం' వంటి పదాలు సరిపోతాయేమో ఈ మొక్కను వర్ణించడానికి. దీనిని సాసురియా ఇన్వోలుక్రాటా లేదా సాసురియా లానిసెప్స్ అని కూడా పిలుస్తారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే ఇది అందరు చూగలిగే పువ్వు కాదని అంటుంటారు. చాలా ఏళ్లకు వికసించడం వల్లనే కాకుండా హిమాలయాలు, టియాన్షాన్ పర్వతాల్లో నివశించే కొద్దిమందికే ఈ మంచు కమలం గురించి తెలుస్తుందట. ఈ పుష్పం దాదాపు 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పెరుగుతుంది కాబట్టి ఇది తీవ్రమైన చలిలో కూడా జీవించగలదు. అరుదైనది అందమైనది మాత్రమే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాపు వంటి సమస్యల చికిత్సలో ఉపయోగపడే ఔషధ గుణాలు కూడా ఉన్నాయట. నిజానికి పదివేల కంటే ఎక్కువ ఎత్తులో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, పలుచని గాలి, తీవ్రమైన సూర్యరశ్మి వంటివి దీని మనుగడను కష్టతరం చేస్తాయి. ఆ సవాళ్లన్నింటిని తట్టుకుని పెరుగుతుంది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకం. పైగా ఈ మొక్క తన మనుగడతో గొప్ప జీవన పాఠమే గాక ఈ ప్రకృతిలో ప్రతిది కష్టాలను ఓర్చుకునే తన మనగడను చాటుకోవాల్సిందే అనే విషయం నొక్కి చెబుతోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి...!. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: ఆ రోడ్డు ప్రమాదమే ఆమెను రక్షించింది..!) -
చిన్న వయసులోనే.. ఖతర్నాక్ దొంగతనం
-
ట్రంప్ అనారోగ్యం ఇవే ఆధారాలు
-
'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!
మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య మైత్రి బంధం చూడగానే షోలో మూవీలోని స్నేహితుల్లా కనిపిస్తారు. అచ్చం అందులో జై, వీరుల (ధర్మేంద్ర, అమితా బచ్చన్) మధ్య సాగే పాటలోని సీన్ గుర్తుకొస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ఒక డిపొ నుంచి షేర్ చేసి ఒక వీడియో అందరి మనసులను హత్తుకుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర రవాణా డ్రైవర్‌కు భావోద్వేగభరితమైన వీడ్కోలు చిత్రీకరించంది. ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య చోటు చేసుకున్న దృశ్యం. అచ్చం యువకుల మాదిరిగా ఆ సహోద్యోగి పదవీవిరమణ చేస్తున్న తన స్నేహితుడైన బస్సు డ్రైవర్ని భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యం అందర్నీ కదిలిస్తుంది. వృద్ధాప్యం మనసుకే గానీ..ఆప్యాయతను వ్యక్తం చేయడానికి కాదు అన్నట్లుగా తన సహోద్యోగిని ఎత్తుకుని వీడ్కోలు పలుకుతున్న కమనీయ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. అది పనిలో తన చివరి రోజు కావడంతో, ఆ వీడ్కోలు అతను అక్కడ నిర్మించుకున్న జీవితానికి ఒక వేడుకగా మారింది. చూడటానికి చిన్న పనే అయినే ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహబంధాన్ని, గౌరవాన్ని పంచుకున్న జ్ఞాపకాలను ప్రతిబింబించింది. అది సరిగ్గా షోలో మూవీలోని జై వీరుల ఐకానిక్ స్నేహం గుర్తు చేసింది. ముఖ్యంగా దోస్తీ పాటలో ధర్మేంద్ర అమితా బచ్చన్ భుజాలపై కూర్చునే ప్రసిద్ధ సన్నివేశం గుర్తుకు వస్తుంది. రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ, ఏర్పడిన స్నేహాలు, జ్ఞాపకాలు జీవితాంతం నిలిచిపోతాయని ఈ సన్నివేశం చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by _VED_46_..!!❤️ (@__ved_46__) (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!) -
కిడ్నీ రాకెట్ నిందితుల బెడ్ రూమ్ వీడియో వైరల్
-
ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!
విడాకులు అనగానే మహిళల పరంగా ఒక కళంకంగా చూస్తుంది ఈ సమాజం. అటు అబ్బాయి తరుఫు వాళ్ల నుంచి సమస్యలే వచ్చినా..కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా, అభాగ్యురాలిగా చులకనగా చూస్తుంటుంది. దాని తోడు చుట్టపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు సైతం అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ ఈ తండ్రి కూడా అలానే కూతురికి అండగా నిలబడటమే గాదు ఆ క్షణాన్ని ఒక సంబరంలా సెలబ్రేట్ చేశాడు.ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ప్రణిత అనే మహిళకు కుటుంబ న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి రిటైర్డ్ జడ్జి కోర్టు ప్రాంగణం వెలుపల డబ్బులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు ప్రణిత ఫోటో తోపాటు "నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె హృదయం, ఆమెనా సర్వస్వం " అని సందేశం ముద్రించిన నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. ప్రణిత కూడా "నా కుటుంబం, నా జీవితం" అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. ఇక ప్రణిత మీరట్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..తాను తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. ఆమెకు 2018లో పంజాబ్‌లోని జలంధర్‌లో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన భారత సైన్యంలో మేజర్ అయిన గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాలక్రమేణా, ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం కుటుంబ న్యాయస్థానానికి చేరగా, ఆ తర్వాత కోర్టు ఆ విడాకులను ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే డాక్టర్ శర్మ ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, మిఠాయిలు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ వింత ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, శర్మ కుటుంబం ఇప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణిత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ప్రణిత తన అత్తగారి ఇంట్లో రోజూ వేధింపులను ఎదుర్కొంటుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తండ్రి అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు. విడాకులు మంజూరైన తర్వాత ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా గడపకుండా, వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.సెలబ్రేషన్స్ ఎందుకంటే..ప్రణిత తండ్రి, రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, ఈ వేడుక వెనుక గల కారణాన్ని వివరించారు. "మా కూతురు పుట్టినప్పుడు డప్పులు వాయించారు. ఒక కూతురి జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె విలువ మారదని చూపించడానికి, ఈ రోజున మళ్ళీ ఇలా డప్పులతో సెలబ్రేట్ చేశాం. అని చెప్పారు.मेरठ: तलाक के बाद बेटी को ढोल-नगाड़ों के साथ घर लाए रिटायर्ड जज#Meerut pic.twitter.com/LpPhkU8aSg— NDTV India (@ndtvindia) April 5, 2026 (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక) -
కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్-రాధిక
అనంత్, రాధికా అంబానీ హెలికాప్టర్లో మహారాష్ట్రలోని నేరల్‌కు చేరుకుని అక్కడ కృష్ణ కాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన పుట్టిన రోజు వేడుకులకు ముందు అనంత్ రాధికలు ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 10న అనంత్‌కు 31 ఏళ్లు నిండనున్నాయి. పూజ అనంతరం ఆలయంలో ఆవులకు అన్నదనం చేసి, గోసేవ కూడా చేశారు. ఆ తర్వాతక రాధిక అంబానీ భక్తులను పలకరిస్తూ..మిఠాయిల, దుస్తులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ కాళి అమ్మవారి ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Deepender Thakur (@deepender_thakur)కృష్ణుడు, కాళి మాత ఒక్కరేనా..బృందావనంలో ఉండే కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరేనా అంటే..ఒక్కరేనే చెబుతున్నాయి పురాణాలు. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది కలకత్తా, పశ్చిమబెంగాల్లో బాగా కనిపిస్తుంది. అందుకు ఒక పురాణ గాధ కూడా ఉంది. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది. ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు. అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.(చదవండి: ఈ తాత అందరికీ స్ఫూర్తి..! 90 ఏళ్ల వయసులో అంత ఫిట్‌గానా..)


