ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో హెన్రిచ్ క్లాసెన్‌ది కీలక పాత్ర. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తూ.. కష్టాల్లో ఉన్న వేళ జట్టును ఆదుకుంటున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఫ్రాంఛైజీ తనకోసం వెచ్చించిన రూ. 23 కోట్లకు తన ఆటతో న్యాయం చేస్తున్నాడు.
414 పరుగులు
ఇప్పటికి ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి క్లాసెన్ 414 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగిన క్లాసెన్.. 30 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
తదుపరి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్ సన్నద్ధవుతున్నాడు. ఇదిలా ఉంటే.. క్లాసెన్ పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. క్లాసెన్ తన కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు.
నేను చెప్పేది జాగ్రత్తగా విను
ఇందుకు క్లాసెన్ తనదైన శైలిలో గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ‘‘ఫొటోలు, వీడియోలు తీయొద్దు సరేనా!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. రికార్డు చేయొద్దు ఒకేనా!’’ అని క్లాసెన్ హెచ్చరించాడు. ఇందుకు సదరు వ్యక్తి.. ‘‘నీ జట్టును వదిలెయ్.. నువ్వు బాగా ఆడుతున్నావు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ.. కానీ ఫొటో మాత్రం తీయొద్దు.
POV: meeting a foreign cricketer in India…. Dude just give him and his family some privacy for gods sake.
What a man Klaasy 🙏 cinema lo hero villain ki warning ela isthado ala ichadu 😂🔥 good man 🧡#SRH #IPL2026 pic.twitter.com/imwBT2c8wi— Varun Velamakanti 🦅 (@CricVarunSRH) April 30, 2026
ఒకవేళ నేను అటు తిరగగానే నన్ను, నా కుటుంబాన్ని ఫొటో తీశావనుకో.. ఒట్టేసి చెబుతున్నా.. నువ్వు ఊహించని విధంగా బుద్ధి చెప్తా! దానిని నుంచి నువ్వు కోలుకోలేవు కూడా!.. నేను వెళ్తున్నా.. మళ్లీ చెప్తున్నా.. నీ కెమెరాలన్నీ పక్కనపెట్టు.. దయచేసి మమ్మల్ని ఫొటోలు తీయొద్దు’’ అని సున్నితంగానే కొట్టినంత పనిచేశాడు క్లాసెన్.
అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!
ఈ వీడియోపై ఆరెంజ్ ఆర్మీ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘క్లాసీ క్లాసెన్... ‘చెప్పినట్లు వినకుంటే.. అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!’ అని మాస్ స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు తోపు అన్నా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సెలబ్రిటీలు కూడా మనుషులేనని.. వారి గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని సదరు వ్యక్తికి చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది.
చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?


