పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? | Why Rajat Patidar was adjudged out in GT vs RCB match | Sakshi
Sakshi News home page

IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

May 1 2026 9:32 AM | Updated on May 1 2026 11:23 AM

Why Rajat Patidar was adjudged out in GT vs RCB match

ఐపీఎల్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓట‌మిని చూవిచూసింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ ఔటైన తీరు వివాద‌స్పదమైంది. 

ఆర్సీబీ ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్ వేసిన అర్ష‌ద్ ఖాన్ బౌలింగ్‌లో పాటిదార్ పుల్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. ఈ స‌మ‌యంలో డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ నుండి పరుగెత్తుకుంటూ వచ్చిన జేసన్ హోల్డర్ ఒక అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

అయితే అదే క్యాచ్‌ను అందుకునేందుకు ర‌బాడ కూడా ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాడు. అయిన‌ప్ప‌టికి హోల్డ‌ర్.. త‌న‌ను ర‌బాడ ఢీకొనే ప్రమాదం ఉన్నా లెక్కచేయకుండా డైవ్ చేసి తన ఎడమ చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో గుజ‌రాత్ ఆట‌గాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే ఫీల్డ్ అంపైర్‌లు అది క్లీన్ క్యాచ్ అవునా? కాదా? థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశారు. 

అయితే హోల్డర్ డైవ్ చేసే క్రమంలో బంతి నేలకు తగిలినట్లు రిప్లేలో కనిపించింది. దీంతో పాటిదార్ త‌నది నాటౌట్ అని బౌండ‌రీ లైన్ వ‌ద్ద అగిపోయాడు. కానీ థ‌ర్డ్ అంపైర్ మాత్రం అది క్లీన్ క్యాచ్ అంటూ ఔట్‌గా ప్ర‌కటించాడు. ఇది చూసిన పాటిదార్ షాక్‌కు గుర‌య్యాడు. డగౌట్‌లో ఉన్న విరాట్ కోహ్లి, కోచ్ ఆండీ ఫ్లవర్ ఫోర్త్ అంపైర్‌తో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. 

ఆఖ‌రికి 19 ప‌రుగులు చేసిన పాటిదార్ నిరాశ‌తో మైదానాన్ని వీడాల్సి వ‌చ్చింది. అయితే బంతి నేలకు తగిలినట్లు క‌న్పించిన థ‌ర్డ్ అంపైర్ ఔట్ ఇలా ఇచ్చాడ‌ని ఆర్సీబీ ఫ్యాన్స్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి ప‌రిశీలిద్దాం.

రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?
మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియ‌మం 33.2.2.1 ప్రకారం..  ఫీల్డ‌ర్ బంతిని అందుకున్న‌ప్పుడు, అత‌డి చేతి వేళ్ల మ‌ధ్య నుంచి బంతికి నేలకు తాకినట్లయితే దాన్ని ఔట్‌గానే ప‌రిగణిస్తారు. ఇప్పుడు పాటిదార్ విష‌యంలో కూడా అదే జ‌రిగింది. బంతి హోల్డర్ వేళ్ల మధ్య ఉండగానే నేలను తాకిందని భావించిన థర్డ్ అంపైర్ అభిజిత్ భట్టాచార్య త‌న నిర్ణ‌యాన్ని ఔట్‌గా ప్ర‌కటించాడు.
చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement