రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్‌లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్ పూజా మందిరంగా మార్చేసి, కాషాయ వస్త్రాలు, పూలమాలలు, దేవతా విగ్రహాలతో అలంకరించి, కదులుతున్న రైలులోనే హారతుల్విడం ఈ వీడియోలో చూడవచ్చు.
భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'భారత్ గౌరవ్' అనే థీమ్డ్ రైల్వే రైలులో ఈ సంఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణికులంతా గుమిగూడి పూజాకార్యక్రమాలు భక్తి గీతాలు పాడుతూ, ఆచారాలలో నిర్వహించడం గమనార్హం. భారత్ గౌరవ్ రైళ్లు సాధారణంగా భారతదేశం అంతటా తీర్థయాత్రలకుద్దేశించినవేఅయినప్పటికీ కానీ ఈ వీడియో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన ఆచారాలపై చర్చను రేకెత్తించింది.
సోషల్ మీడియా స్పందన
ఈ వీడియో ఇంటర్నెట్‌లో భారీ వ్యూస్‌ను సంపాదంచుకుంది. కొంతమంది వినియోగదారులు ప్రజా రవాణాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు రైల్వే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలామంది ఈ చర్యను సమర్థించారు. ఇది భారతదేశపు లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మికతలో భాగమని పేర్కొన్నారు. “ఒక ముస్లిం వ్యక్తి రైలులో నమాజ్ చేస్తే అది తప్పా... మరి దీని సంగతేంటి... నేను హిందువునే, కానీ అన్నిటికంటే ముందు నేను భారతీయుడిని.” అని ఒకరు వ్యాఖ్యానించారు. “సందర్భం ముఖ్యం! ఇది తీర్థయాత్రల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ రైలు. ఈ భక్తి కార్యక్రమాలకు సిబ్బంది అధికారికంగా మద్దతు ఇస్తున్నారు, ఇవి థీమ్ ఆధారిత ప్రయాణ అనుభవంలో భాగం. ప్రజలు వివరణ చదవకుండా లేదా ఇది ఒక సాధారణ పబ్లిక్ కోచ్ కాదని అర్థం చేసుకోకుండా స్పందిస్తున్నారు.” ఇంకొకరు ఆగ్రహం ప్రకటించారు. “వారిని ఇప్పటికే జైల్లో ఎందుకు పెట్టలేదు? బహిరంగ ప్రదేశంలో ఇలాంటి అర్థంలేని పనులను ఎలా సహిస్తున్నారు? ఇది కేవలం వైరల్ రీల్స్ కోసమా లేక ఏంటి?” ఒకరు, “ పనీ పాటా, జ్ఞానం లేని ప్రజలు, ఇలా తయారవుతున్నారు.” అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హితవు చెప్పిన NCIB
ఈ వీడియో బాగా వైరల్‌గా మారడంతో, NCIB అధికారిక ఖాతా ద్వారా స్పందించింది. బహిరంగ ప్రదేశాల నిబంధనలను గౌరవించాలని ప్రయాణికులను కోరింది.


