మండే ఎండల్లో కూల్‌ గిప్ట్‌ : ఎవరికైనా కన్నీళ్లాగవు! | House Helps Receiving Surprise Air Cooler From Employer Melts Internet | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో కూల్‌ గిప్ట్‌ : ఎవరికైనా కన్నీళ్లాగవు!

Apr 13 2026 1:10 PM | Updated on Apr 13 2026 1:13 PM

House Helps Receiving Surprise Air Cooler From Employer Melts Internet

ఇంట్లో వాడని వస్తువులను,  దుస్తులను  ఇంట్లో పనిచేసే సహాయకులకు  గిఫ్ట్‌గా ఇవ్వడం కాలా కామన్‌. కానీ తన ఓనర్ ఇచ్చిన బహుమతికి ఒక ఇంటి పనిమనిషి  ఉబ్బితబ్బిబ్బైన ఘటన నెట్టింట తెగ సందడి  చేస్తోంది. ఆ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ చూసి ఆమె మొదట చాలా ఆశ్చర్యపోయింది. ఆ తరువాత భావోద్వేగానికి లోనైంది. మనుషుల మధ్య ఉండాల్సిన అసలైన బంధానికి, మానవత్వానికి ఈ వీడియో ఒక నిదర్శనంగా నిలిచిందిఇంతకీ ఆమెకు లభించిన గిఫ్ట్‌ ఏంటి?


దేశవ్యాప్తంగా వేసవి ఎండలు తీవ్ర స్థాయికి  చేరాయి. ఏప్రిల్‌ మాసంలో ఎండలు మండిపోతున్న వేళ, ఒక కుటుంబం తమ ఇంట్లో పనిచేసే మహిళకు ఎయిర్ కూలర్ (Air Cooler) బహుమతిగా ఇచ్చింది.  ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొన్న కూలర్ అని చెప్పగానే  ఆ మహిళ ఆనందంతో పొంగిపోయింది.  ప్రేమతో ఇచ్చిన చల్లని కానుకను చూసి యజమానిని గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హృద్యమైన ఘటనకు  సంబంధించిన వీడియో  వైరల్ అవుతోంది.ఈ వీడియోకు ఇప్పటివరకు 2.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.


నెటిజన్లు స్పందన
ఈవీడియో చూసి నెటిజన్లు నిజమైన అనుబంధం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె అవసరాలను గుర్తించి,  ఆమెను సంతోషపెట్టడానికి కొంచెం కరుణ, చిరు సాయం, కొంచెం సానుభూతి ఉంటే చాలు అంటూ ప్రశంసించారు.  ప్రపంచమంతా ఇలాంటి మానవత్వం,  ప్రేమ, గౌరవంతో ఉంటే ఎంత బాగుంటుందో అని మరికొందరు వ్యాఖ్యానించారు.  

గతంలోనూ ఇలాంటి ఘటనే..
తమ ఇంట్లో సభ్యురాలిలా చూసుకుంటూ, తమ పెంపుడు కుక్కలను కూడా తన బిడ్డల్లా ప్రేమించే గృహకార్మికులకు  ఇలాంటి చిన్న చిన్న బహుమతులు  ఎంతో సంతృప్తినిస్తాయి అనడంలో సందేహం లేదు.  ఇదే తరహాలో గతంలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో జ్యోతి అనే పనిమనిషి తన పుట్టినరోజున "ఈరోజు మా అమ్మ బతికి ఉంటే నన్ను ఎంతో ప్రేమించేది" అని ఏడుస్తుంటే, ఆమె యజమాని (కృతార్థ)అతని స్నేహితులు ఐస్‌క్రీమ్ కేక్ తీసుకొచ్చి ఆమెతో పుట్టినరోజు వేడుకలు జరిపి ఆమెను ఆశ్చర్యపరిచిన ఘటన  నెటిజనులను  బాగా ఆకట్టుకుంది.

ఇదీ సంగతి: రిక్షా డ్రైవర్‌ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement