సంగీతానికి వయసుతో పనిలేదు..! వాహ్వా అనిపించుకున్న రిటైర్డ్‌ టీచర్‌ | Rabindra Nath Biswas singer At 71 Goes Viral | Sakshi
Sakshi News home page

సంగీతానికి వయసుతో పనిలేదు..! వాహ్వా అనిపించుకున్న రిటైర్డ్‌ టీచర్‌

May 6 2026 5:59 PM | Updated on May 6 2026 6:26 PM

Rabindra Nath Biswas singer At 71 Goes Viral

కలలను నెరవేర్చుకోవడానికి వయసు పరిమితి లేదు. జీవితంలో ఏ దశలోనైనా వాటిని సాకారం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్‌ టీచర్‌ తన గాన ప్రస్థానాన్ని లేటుగా ప్రారంభించినా ‘వాహ్వా’ అనిపిస్తున్నారు.

తాజా విషయానికి వస్తే...
రవీంద్రనాథ్‌ బిస్వాస్‌ ట్రెండింగ్‌లో ఉన్న ‘ఖత్‌’ అనే పాట పాడి వాహ్వా అనిపిస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉన్నా అదేమీ ఆయన గాన ప్రతిభకు అడ్డుగోడ కాలేదు. విశేషం ఏమిటంటే, ఈ రీల్‌ సోషల్‌ మీడియా ప్రేక్షకులనే కాదు సంగీతపరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించింది.నవజోత్‌ అహుజా ఆనంద బాష్పాలతో కూడిన ఇమోజీతో స్పందించారు.

‘దాదూ, ఆప్‌తో ఛా గయే’ (తాతా మీరు అదరగొట్టేశారు) అని జియోసావన్‌ స్పందించింది. ‘అంకుల్, మాకు మీ వీడియోలు అంటే చాలా ఇష్టం’ అన్నది అమెజాన్‌ మ్యూజిక్‌ ఇండియా. ‘ప్రతిభ విషయానికి వస్తే వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే’. ‘ఈ వయసులోనే వీరి గాత్రం ఇలా ఉందంటే... యవ్వనంలో ఇంకా ఎంత బాగుండేదో’... ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. 

 

(చదవండి: కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్‌..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement