స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్‌లు ఒకే బైక్‌పై స్పీడ్‌గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది.
రెండు బైక్‌లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది.
मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa
— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026
ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్‌పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది


