'చ‌పాతీల కంటే బౌల‌ర్ల‌ను ఉత‌కడం మేలు' | Rajasthan Star Vaibhav Sooryavanshi Roti Making Video-Becomes-Viral | Sakshi
Sakshi News home page

‘చ‌పాతీల కంటే బౌల‌ర్ల‌ను ఉత‌కడం మేలు’.. వైభ‌వ్ వ్యాఖ్యలు!

May 12 2026 3:50 PM | Updated on May 12 2026 4:00 PM

Rajasthan Star Vaibhav Sooryavanshi Roti Making Video-Becomes-Viral

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. జ‌ట్టు వ‌రుస ఓట‌ములు చ‌విచూస్తున్న‌ప్ప‌టికీ వైభ‌వ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో ద‌నాధ‌న్ ఆట‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే గ‌ట్టి పునాది వేస్తున్నాడు. ప్ర‌స్తుతం సూర్య‌వంశీ 11 మ్యాచ్‌ల్లో 440 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

సీజ‌న్ ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన రాజ‌స్తాన్ క్ర‌మంగా  ఓట‌ములు ఎదుర్కొంది. 11 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాలు, 5 ఓట‌ములతో రాజ‌స్తాన్ పాయింట్ల పట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్తాన్ త‌న త‌ర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నుంది. మ్యాచ్‌కు వారం రోజులు గ్యాప్ రావ‌డంతో రాజ‌స్తాన్ ఆట‌గాళ్లు బ్రేక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. 

ఈ నేప‌థ్యంలోనే రాజ‌స్తాన్ యాజ‌మాన్యం తాజాగా ఆట‌గాళ్ల‌కు సంబంధించి ఫ‌న్నీ వీడియోలను త‌మ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభ‌వ్ సూర్య‌వంశీ చ‌పాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభ‌వ్ మాస్ట‌ర్ చెఫ్ అవ‌తారంలో చ‌పాతీలు కాలుస్తూ క‌నిపించాడు.

'నేను చేసే చ‌పాతీల‌తో పోలిస్తే మా అమ్మ చేసే చ‌పాతీలు భిన్నంగా ఉంటాయి. చ‌పాతీలు కాల్చ‌డం కంటే బౌల‌ర్ల‌ను ఉత‌క‌డం మేలు' అని న‌వ్వుతూ పేర్కొన్నాడు. వైభ‌వ్ చ‌పాతీలు కాలుస్తున్న‌ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

చదవండి: ఆస్ట్రేలియ‌న్ టెన్నిస్ దిగ్గ‌జం క‌న్నుమూత‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement