సినిమాలోలా రియల్ లైఫ్ ఎప్పటికీ ఉండదు. మూడు గంటల సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవిక ప్రపంచంలో అందులోలా వర్కౌట్ అవడం అంత సులభం కాదు. అదే చాలామంది తెలుసుకోలేక..ఆ సినీ మాయలో పడి ఊహాలోకంలో తేలుతుంటారు. చివరికి హాయిగా ఉన్న లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటుంటారు. అలాంటి సంఘటనే ఈ మహిళ లైఫ్‌లో చోటుచేసుకుంది.
హర్ష్ అనే యూజర్ సోష్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓ మహిళను కలిసినట్లు చెబుతూ..ఆమె చేసిన పని గురించి వివరిస్తూ పోస్టు పెట్టడంతో ఒక్కసారిగా సినిమా ఎంత పనిచేసింది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ మహిళ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించి స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగంతో బిందాస్‌గా లైఫ్ సాగిపోయిందామెకు.
సుమారు ఆరేళ్లు ఆ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది. సరిగ్గా 2015లో తమాషా మూవీ చూడటంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఆ తమాషా మూవీని..ఆర్ట్‌కి ఉన్న పవర్, చిన్ననాటి అభిరుచులను ఎలా వదులుకుని కెరీర్‌పై ఫోకస్ పెడతాం వంటివి ఇతి వృత్తంగా తీసుకుని తీశారు. ఈ మహిళ ఆ మూవీని చూసి స్ఫూర్తి పొంది.. కార్పొరేట్ లైఫ్ అంటే టార్గెట్లు, పనిఒత్తిడి ఇదేనా జీవితం? అదే నచ్చిన అభిరుచిలో కొనసాగడంలో ఉన్న ఆనందమే వేరు అంటూ చేస్తున ఉద్యోగానికి రిజైన్ చేసింది.
చక్కగా ఆర్ట్స్ డిప్లొమా కోర్సులో చేరి, ప్రదర్శనలు నిర్వహించడం, తన పేయింటింగ్స్‌ని అమ్మడం వంటి కెరీర్‌ని నిర్మించుకోవాలని కలలు కనింది. ఆ మహిళ తాను అనుకున్నట్లుగానే క్రియేటివిటీ రంగంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పటికీ.. ఆ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు సవాలుగా మారాయి. అప్పటిదాక పొదుపు చేసిన డబ్బు అయిపోవడంతో ఆ అభిరుచి నుంచి తప్పుకోక తప్పలేదు. చివరికి రెండేళ్ల కెరీర్ విరామం తర్వాత మళ్లీ అనూహ్యంగా కార్పొరేట్ స్థిరత్వమే బెటర్ అంటూ జాబ్ సర్చింగ్ మొదలు పెట్టారామె.
అలా ఓ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చి.. తనతో ఆ మహిళ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు రాసుకొచ్చారు హర్ష్. అంతేగాదు హర్ష్ ఆమె నిర్ణయం వెనుకున్న భావోద్వేగ పరిస్థితిని ప్రస్తావిస్తూ అభిరుచి వెంట పరుగులు తీసి..కెరీర్‌ని రిస్క్‌లో పెట్టుకోకూడదని అన్నారు. మంచి విషయం ఏంటంటే తన కళా అభిరుచిని వదులుకున్నా అనే పశ్చాత్తాపం ఎప్పటికీ ఎదురవ్వద్దు కానీ ఇంకోరకంగా అది కాస్త చెడ్డ నిర్ణయం ఎలా అంటే..మళ్లీ 30 ఏళ్ల అనంతరం కార్పొరేట్ ఉద్యోగం సంపాదించటం ఈ రోజుల్లో అదెంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ పోస్ట్‌ని ముగించారు.
నిజానికి ఈ కథలో నీతి అభిరుచి కోసం ఉద్యోగ జీవితాన్నే రిస్క్‌లో పెట్టడం కంటే..అందులో సాధకబాధలు బేరీజు వేసుకుంటూ..చేస్తున్న ఉద్యోగాన్ని సాగిస్తూనే ఆ కళాత్మక రంగంలో సాగాలి. మొదట పార్ట్‌టైంగా సాగించి..బాగుంది ధైర్యంగా పూర్తి స్థాయిలో దీనిలో దిగొచ్చు అన్న నమ్మకం వచ్చాక..దిగితే ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. అన్నింట్లకంటే ఆర్థిక భద్రత ముఖ్యం అనేది గ్రహించాలి.
(చదవండి: కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..)


