ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్‌లే సందడి చేస్తుంటాయి.
అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్‌పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది.
ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్‌బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్‌లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది.
ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్‌తో కేన్స్‌లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్‌లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
(చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !)


